< యెహెజ్కేలు 32 >

1 బబులోను చెరలో ఉన్న కాలంలో, పన్నెండవ నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
Opet dvanaeste godine, dvanaestoga mjeseca, prvoga dana, doðe mi rijeè Gospodnja govoreæi:
2 నరపుత్రుడా, ఐగుప్తురాజు ఫరో గురించి ఏడుపు పాట ఎత్తి అతనికి ఈ మాట చెప్పు. “రాజ్యాల్లో నువ్వు కొదమ సింహం వంటి వాడివి. నదిలో మొసలివంటి వాడివి. నీ కాళ్లతో నీళ్లు కలియబెడుతూ వాటిని బురదగా చేశావు.”
Sine èovjeèji, narièi za Faraonom carem Misirskim, i reci mu: ti si kao laviæ meðu narodima i kao zmaj u moru, i prolaziš rijeke svoje i mutiš vodu nogama svojim i gaziš po rijekama njezinijem.
3 యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, “నేను, నా వల నీ మీద వేస్తే వాళ్ళు నిన్ను నా వలలో నుంచి అనేక ప్రజల మధ్య బయటికి లాగుతారు.
Ovako veli Gospod Gospod: razapeæu ti mrežu svoju sa zborom mnogih naroda, i izvuæi æe te u mojoj mreži.
4 నేను నిన్ను నేల మీద పడేస్తాను. బయటి పొలంలో పారేస్తాను. గాలిలో ఎగిరే అన్ని రకాల పిట్టలు నీ మీద వాలేలా చేస్తాను. భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు నీ మాంసాన్ని కడుపారా తింటాయి.
I ostaviæu te na zemlji, i baciæu te u polje, i pustiæu sve ptice nebeske da sjedaju na te, i nasitiæu tobom zvijeri sa sve zemlje.
5 నీ మాంసాన్ని పర్వతాల మీద వేస్తాను. పురుగులు పట్టిన నీ కళేబరంతో లోయలను నింపుతాను.
I razmetnuæu meso tvoje po gorama i napuniæu doline gomilama od tebe.
6 నీ రక్తాన్ని పర్వతాల మీద పోస్తాను. వాగులు రక్తంతో నిండుతాయి.
I zemlju gdje plivaš napojiæu krvlju tvojom do vrh gora, i potoci æe biti puni tebe.
7 నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను. సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు.
I kad te ugasim, zastrijeæu nebo, i zvijezde na njemu pomraèiti, sunce æu zakloniti oblakom, i mjesec neæe svijetliti svjetlošæu svojom.
8 నిన్నుబట్టి ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటి చేస్తాను. నీ దేశం మీద చీకటి కమ్ముతుంది.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Sva æu svijetla vidjela na nebu pomraèiti za tobom, i pustiæu tamu na tvoju zemlju, govori Gospod Gospod.
9 “నువ్వు ఎరగని దేశాల్లోకి నేను నిన్ను వెళ్లగొట్టి, నిన్ను నాశనం చేసేటప్పుడు అనేక మందికి కోపం పుట్టిస్తాను.
I ustrašiæu srce mnogih naroda kad objavim propast tvoju meðu narodima, po zemljama kojih ne znaš.
10 ౧౦ నా కత్తి రాజుల ఎదుట ఆడించేటప్పుడు నీ కారణంగా చాలామంది దిగ్భ్రాంతి చెందుతారు. నువ్వు పడిపోయే రోజున వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా ప్రాణభయంతో వణకుతారు.”
I udiviæu tobom mnoge narode, i carevi æe se njihovi zgroziti od tebe, kad mahnem maèem svojim pred njima, i drktaæe svaki èas svaki za dušu svoju u dan kad padneš.
11 ౧౧ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “బబులోను రాజు కత్తి నీ మీదికి వస్తుంది!
Jer ovako veli Gospod Gospod: maè cara Vavilonskoga doæi æe na te.
12 ౧౨ శూరుల కత్తితో నేను నీ సేనను కూలుస్తాను. వాళ్ళలో ప్రతి శూరుడూ రాజ్యాలను వణికిస్తాడు. వాళ్ళు ఐగుప్తీయుల గర్వం అణచివేస్తారు. దాని సైన్యాన్నంతా నాశనం చేస్తారు.
Maèevima junaèkim povaljaæu mnoštvo tvoje, maèevima najljuæih izmeðu naroda; oni æe razoriti ponos Misiru, i sve æe se mnoštvo njegovo potrti.
13 ౧౩ సమృద్ధిగా ఉన్న నీళ్ల దగ్గరున్న పశువులన్నిటినీ నేను నాశనం చేస్తాను. ప్రజల కాళ్ళు గానీ పశువుల కాళ్ళు గానీ ఆ నీటిని కదిలించలేవు.
I potræu svu stoku njegovu pokraj velikih voda, te ih neæe više mutiti noga èovjeèija niti æe ih papak od kake životinje mutiti.
14 ౧౪ అప్పుడు నేను వాటి నీళ్లు ఆపి, నూనె పారేలా వాళ్ళ నదులు పారేలా చేస్తాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Tada æu stišati vodu njihovu, i uèiniæu da potoci njihovi teku kao ulje, govori Gospod Gospod.
15 ౧౫ “నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేసి అందులో ఉన్నదంతా నాశనం చేసి దాని నివాసులందరినీ నిర్మూలం చేస్తుంటే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
Kad opustim zemlju Misirsku i ona bude bez svega što je u njoj, i pobijem sve koji žive u njoj, tada æe poznati da sam ja Gospod.
16 ౧౬ ఇది శోకగీతం. రాజ్యాల కూతుర్లు ఈ పాట ఎత్తి పాడతారు. వాళ్ళు ఐగుప్తు మీదా, దాని సమూహమంతటి మీదా ఆ పాట పాడతారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Ovo je naricanje što æe se naricati; tako æe naricati kæeri narodne, za Misirom i za svijem mnoštvom njegovijem naricaæe, govori Gospod Gospod.
17 ౧౭ పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు.
Potom dvanaeste godine, petnaesti dan istoga mjeseca, doðe mi rijeè Gospodnja govoreæi:
18 ౧౮ నరపుత్రుడా, ఐగుప్తీయుల సమూహం గురించి విలపించు. భూమి కిందికి పాతాళానికి దిగిపోయిన వాళ్ళ దగ్గరికి, ఆమెనూ గొప్ప రాజ్యాల కూతుళ్ళనూ తోసి వెయ్యి.
Sine èovjeèji, narièi za mnoštvom Misirskim, i svali njih i kæeri jakih naroda u najdonji kraj zemlje s onima koji slaze u jamu.
19 ౧౯ వాళ్ళతో ఇలా అను, ‘మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో’
Od koga si ljepši? siði i lezi s neobrezanima.
20 ౨౦ కత్తితో చచ్చిన వాళ్ళతోబాటు వాళ్ళు కూలుతారు. అది కత్తిపాలవుతుంది. ఆమె విరోధులు ఆమెనూ ఆమె సేవకులనూ ఈడ్చుకుపోతారు.
Pašæe posred pobijenijeh maèem, maè je dat, vucite ga i sve mnoštvo njegovo.
21 ౨౧ పాతాళంలోని గొప్ప యోధులు ఐగుప్తు గురించీ దాని మిత్రుల గురించీ ఇలా చెబుతారు, ‘వీళ్లిక్కడికి దిగి వచ్చేశారు! కత్తితో చచ్చిన సున్నతిలేని వాళ్ళ దగ్గర వీరు పడుకుంటారు’ (Sheol h7585)
Govoriæe mu najhrabriji junaci isred groba s pomoænicima njegovijem, koji sidoše i leže neobrezani, pobijeni maèem. (Sheol h7585)
22 ౨౨ అష్షూరు, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు.
Ondje je Asirac i sav zbor njegov, grobovi su mu oko njega, svi su pobijeni, pali od maèa.
23 ౨౩ దాని సమాధులు పాతాళాగాధంలో ఉన్నాయి. దాని గుంపులు దాని సమాధి చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కత్తితో చచ్చిన వాళ్ళు.
Grobovi su mu u dnu jame, a zbor mu je oko njegova groba; svi su pobijeni, pali od maèa, koji zadavahu strah zemlji živijeh.
24 ౨౪ ఏలాము, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు. వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళు సున్నతి లేకుండా పాతాళంలోకి దిగిపోయారు. వాళ్ళు సిగ్గు పాలవుతారు.
Ondje je Elam i sve mnoštvo njegovo oko njegova groba; svi su pobijeni, pali od maèa, koji sidoše neobrezani na najdonji kraj zemlje, koji zadavahu strah zemlji živijeh; i nose sramotu svoju s onima koji slaze u jamu.
25 ౨౫ చచ్చిన వాళ్ళ మధ్య దానికీ దాని సమూహానికీ ఒక పరుపు సిద్ధం చేశారు. దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా సున్నతి లేకుండా చచ్చారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. పాతాళం లోకి దిగిపోయిన వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సిగ్గు పాలవుతారు. చచ్చిన వాళ్ళ మధ్య ఏలాము ఉంది.
Meðu pobijenima namjestiše postelju njemu i svemu mnoštvu njegovu, grobovi su mu oko njega, svi su neobrezani pobijeni maèem, koji zadavahu strah zemlji živijeh; i nose sramotu svoju s onima koji slaze u jamu, metnuti su meðu pobijene.
26 ౨౬ అక్కడ మెషెకు తుబాలు దాని గుంపంతా ఉన్నాయి. దాని సమాధులు దాని చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కత్తిపాలయ్యారు.
Ondje je Meseh, Tuval i sve mnoštvo njegovo, grobovi su mu oko njega, svi su neobrezani pobijeni maèem, koji zadavahu strah zemlji živijeh.
27 ౨౭ వీళ్ళు సున్నతి లేని వాళ్ళలో పడిపోయిన శూరుల దగ్గర పడుకోరు. వాళ్ళు తమ యుద్ధాయుధాలన్నిటితో పాతాళంలోకి దిగిపోయి, తమ కత్తులను తమ తలల కింద ఉంచుకుని పడుకుంటారు. తమ డాళ్ళను తమతో ఉంచుకుంటారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. (Sheol h7585)
Ali ne leže meðu junacima koji padoše izmeðu neobrezanijeh, koji sidoše u grob s oružjem svojim, i metnuše maèeve pod glave svoje, i bezakonje njihovo leži na kostima njihovijem, ako i bijahu junaci strašni na zemlji živijeh. (Sheol h7585)
28 ౨౮ కాబట్టి, ఐగుప్తు, నువ్వు సున్నతి లేని వాళ్ళ మధ్య నాశనమై, కత్తి పాలైన వాళ్ళ దగ్గర పడుకుంటావు.
I ti æeš se satrti meðu neobrezanima, i ležaæeš kod pobijenijeh maèem.
29 ౨౯ అక్కడ ఎదోము, దాని రాజులు దాని అధిపతులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులైనా కత్తి పాలైన వాళ్ళ దగ్గర ఉన్నారు. సున్నతి లేని వాళ్ళ దగ్గర పాతాళంలోకి దిగిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా పడుకున్నారు.
Ondje je Edom, carevi njegovi i svi knezovi njegovi, koji su sa silom svojom metnuti meðu pobijene maèem; leže meðu neobrezanima i s onima koji sidoše u jamu.
30 ౩౦ అక్కడ ఉత్తర దేశపు అధిపతులంతా, చచ్చిన వాళ్ళతో దిగిపోయిన సీదోనీయులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులై భయం పుట్టించినా సిగ్గు పాలయ్యారు. సున్నతి లేకుండా కత్తి పాలైన వాళ్ళ మధ్య పడుకున్నారు. గోతిలోకి దిగిపోయిన వాళ్ళతో పాటు సిగ్గుపాలయ్యారు.
Ondje su svi knezovi sjeverni i svi Sidonci, koji sidoše k pobijenima sa strahom svojim, stideæi se sile svoje; i leže neobrezani s onima koji su pobijeni maèem, i nose sramotu svoju s onima koji sidoše u jamu.
31 ౩౧ కత్తి పాలైన ఫరో, అతని వాళ్ళంతా వాళ్ళను చూచి తమ సమూహమంతటిని గురించి ఓదార్పు తెచ్చుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Njih æe vidjeti Faraon, i utješiæe se za svijem mnoštvom svojim, Faraon i sva vojska njegova, pobijeni maèem, govori Gospod Gospod.
32 ౩౨ “సజీవుల లోకంలో వాళ్ళతో నేను ఉగ్రత తెప్పించాను. అయితే సున్నతి లేనివాళ్ళతో కత్తి పాలైనవాళ్ళతో పడుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Jer zadadoh svoj strah zemlji živijeh, i Faraon æe i sve mnoštvo njegovo ležati meðu neobrezanima s onima koji su pobijeni maèem, govori Gospod Gospod.

< యెహెజ్కేలు 32 >