< యెహెజ్కేలు 14 >

1 తరువాత ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో కొందరు నా దగ్గరకి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
Israel mpanimfoɔ no mu bi baa me nkyɛn bɛtenatena mʼanim.
2 యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
Afei Awurade asɛm baa me nkyɛn sɛ:
3 “నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్నారు. వీళ్ళని నా దగ్గర విచారణ చేయనియ్యాలా?
“Onipa ba, saa mmarimma yi de ahoni ahyɛ wɔn akoma mu na wɔde amumuyɛ suntidua asisi wɔn anim. Ɛsɛ sɛ mema wɔbisa mʼase koraa anaa?
4 కాబట్టి నువ్వు ప్రకటన చేసి వాళ్లకి ఈ సంగతి చెప్పు. కాబట్టి నీవు వాళ్లకి సంగతి తెలియజేసి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో విగ్రహాలను హృదయంలో ప్రతిష్టించుకున్న వారెవరైనా, లేదా తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్న ఎవరైనా, ఆ తరువాత ప్రవక్త దగ్గరికి వస్తే యెహోవానైన నేను వాడు పెట్టుకున్న విగ్రహాల సంఖ్యను బట్టి వాడికి జవాబిస్తాను.
Enti kasa kyerɛ wɔn na ka sɛ, ‘Yei ne deɛ Otumfoɔ Awurade seɛ: Sɛ Israelni biara de ahoni hyehyɛ nʼakoma mu na ɔde amumuyɛ suntidua sisi nʼanim, na afei ɔkɔ odiyifoɔ nkyɛn a, me Awurade, mɛma no mmuaeɛ a ɛfata nʼahonisom no kɛseyɛ.
5 వాళ్ళు పెట్టుకున్న విగ్రహాల కారణంగా నాకు దూరమయ్యారు కాబట్టి తిరిగి వాళ్ళ హృదయాలను వశం చేసుకోడానికి నేనలా చేస్తాను.
Mɛyɛ yei de atwe Israelfoɔ a wɔagya me akɔdi wɔn abosom akyi no akoma aba bio.’
6 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట చెప్పు. ‘పశ్చాత్తాప పడండి. విగ్రహాలను విడిచిపెట్టండి. మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మాని వేయండి.’
“Enti ka kyerɛ Israel efie sɛ, ‘Yei ne deɛ Otumfoɔ Awurade seɛ: Monsakra mo adwene. Momfiri mo ahoni ho na monnyae mo nneyɛeɛ a ɛyɛ akyiwadeɛ no!
7 ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా, వాళ్ళ మధ్య నివసించే విదేశీయుల్లో ఎవరైనా నన్ను విడిచి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్టించుకుని, తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకుని ప్రవక్త దగ్గరికి వస్తే నేనే సూటిగా వాళ్ళకి జవాబిస్తాను.
“‘Sɛ Israelni bi anaa ɔnanani a ɔte Israel twe ne ho firi me nkyɛn na ɔde ahoni hyɛ nʼakoma mu de amumuyɛ suntidua si nʼanim, na afei ɔkɔ odiyifoɔ nkyɛn kɔbisa mʼase a, me, Awurade ankasa bɛbua no.
8 అలాంటి వ్యక్తికి నేను విరోధంగా ఉండి అతణ్ణి సూచనగానో, సామెతగానో మారుస్తాను. ఎందుకంటే నేను అతణ్ణి నా ప్రజల్లో నుండి కొట్టివేస్తాను. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
Mɛtu mʼani asa onipa no na mede no ayɛ nhwɛsoɔ ne akasabɛbuo. Mɛyi no afiri me nkurɔfoɔ mu. Afei mobɛhunu sɛ mene Awurade no.
9 ఒకవేళ ఎవరన్నా ఒక ప్రవక్త మోసపోయి ఒక సందేశం పలికితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి విరోధంగా నా చెయ్యి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలు నుండి అతణ్ణి నాశనం చేస్తాను.
“‘Na sɛ odiyifoɔ no ma wɔdaadaa no ma ɔhyɛ nkɔm a, me Awurade na madaadaa odiyifoɔ no, mɛtene me nsa wɔ ne so na matwa no afiri me nkurɔfoɔ Israelfoɔ mu.
10 ౧౦ ఇశ్రాయేలు ప్రజలు తమ అతిక్రమాల్లో కొనసాగుతారు. ఎందుకంటే ప్రవక్త దోషం ఎంతో అతడి దగ్గర ఆలోచన కోసం వచ్చేవాడిదీ అంతే దోషం అవుతుంది.
Wɔbɛsoa wɔn afɔdie; odiyifoɔ no ne deɛ ɔkɔhunuu no no nyinaa bɛdi fɔ.
11 ౧౧ దీని కారణంగా ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట నాకు దూరంగా వెళ్ళరు. తమ అతిక్రమాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వాళ్ళు నా ప్రజలై ఉంటారు. నేను వాళ్ళ దేవుడినై ఉంటాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
Na Israelfoɔ renkwati me bio, na wɔremfa wɔn nnebɔne no ngu wɔn ho fi bio. Wɔbɛyɛ me nkurɔfoɔ na mɛyɛ wɔn Onyankopɔn, Otumfoɔ Awurade asɛm nie.’”
12 ౧౨ యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
Awurade asɛm baa me nkyɛn sɛ:
13 ౧౩ “నరపుత్రుడా, ఒక దేశం నాకు విరోధంగా పాపం చేసినప్పుడు నేను దాన్ని శిక్షించడానికి నా హస్తం చాపి దాని ఆహార వనరులను నాశనం చేసి, దానిపై కరువు పంపి, దేశంలో మనుషులనూ పశువులనూ నిర్మూలం చేస్తాను.
“Onipa ba, sɛ ɔman bi anni me nokorɛ na enti wɔyɛ bɔne de tia me, na metene me nsa wɔ wɔn so na megyae wɔn aduane ma, na mema ɛkɔm ba bɛkunkum emu nnipa ne wɔn mmoa a,
14 ౧౪ అప్పుడు ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు-ఈ ముగ్గురూ ఉన్నప్పటికీ వాళ్ళు తమ నీతి చేత తమను తాము మాత్రమే రక్షించుకోగలుగుతారు. ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
mpo sɛ saa nnipa baasa a wɔyɛ Noa, Daniel ne Hiob wɔ ɔman no mu a, wɔn tenenee bɛgye wɔn nko ara nkwa, Otumfoɔ Awurade asɛm nie.
15 ౧౫ బాటసారులెవ్వరూ దానిగుండా ప్రయాణం చేయలేకుండా దేశాన్ని బంజరుగానూ నిర్జనం గానూ చేయడానికి అడవి మృగాలను నేను రప్పిస్తే
“Anaa sɛ mema wiram mmoa kɔ saa asase no so na wɔkunkum ɛso nnipa nyinaa na asase no sɛe a obiara ntumi mfa so ɛsiane wiram mmoa no enti a,
16 ౧౬ నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులనూ కూతుళ్ళనూ కూడా రక్షించుకోలేరు. వాళ్ళ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. దేశం వ్యర్ధమై పోతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
sɛ mete ase yi, Otumfoɔ Awurade asɛm nie, mpo sɛ saa mmarima baasa yi wɔ asase no so a, wɔrentumi nnye wɔn ankasa mmammarima ne mmammaa nkwa. Wɔn nko ara na wɔbɛgye wɔn nkwa na asase no bɛsɛe.
17 ౧౭ నేను దేశానికి విరోధంగా ఖడ్గాన్ని పంపి ‘ఖడ్గమా, దేశమంతా సంచరించి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చెయ్యి’ అని ఆజ్ఞ ఇస్తే
“Sɛ nso metwe akofena wɔ asase no so, na meka sɛ, ‘Ma akofena no nkɔ asase no so nyinaa,’ na mekunkum ɛso nnipa ne wɔn mmoa,
18 ౧౮ నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
sɛ mete ase yi, Otumfoɔ Awurade asɛm nie, mpo sɛ saa mmarima baasa yi wɔ asase no so a, wɔrentumi nnye wɔn ankasa mmammarima ne mmammaa nkwa. Wɔn nko ara na wɔbɛnya nkwa.
19 ౧౯ రక్తపాతం జరిగించడం ద్వారా నేను నా క్రోధాన్ని దేశంపై కుమ్మరించడానికి తెగులు పంపి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయాలని చూస్తే
“Sɛ nso mesoma ɔyaredɔm kɔ asase no so na menam mʼabufuhyeɛ so hwie mogya gu wɔ asase no so, kunkum ɛso nnipa ne wɔn mmoa a,
20 ౨౦ అప్పుడు నోవహు, దానియేలు, యోబు అనే ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. వాళ్ళు తమ నీతి వల్ల తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు.
sɛ mete ase yi, Otumfoɔ Awurade asɛm nie, sɛ Noa, Daniel ne Hiob mpo wɔ hɔ a, wɔrentumi nye ɔbabarima anaa ɔbabaa nkwa. Wɔn tenenee enti wɔbɛgye wɔn ho nkwa.
21 ౨౧ ఎందుకంటే ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. యెరూషలేముకు విరోధంగా దానిలోని మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయడానికి నేను కరువు, ఖడ్గం, క్రూర మృగాలు, తెగులు అనే నాలుగు శిక్షలను కచ్చితంగా పంపుతాను. మరింత గడ్డు పరిస్థితి కలిగిస్తాను.
“Na sei na Otumfoɔ Awurade seɛ: Ɛbɛyɛ hu mmorosoɔ sɛ mɛma mʼatemmuo huuhuuhu ɛnan, a ɛyɛ akofena, ɔkɔm, wiram mmoa ne ɔyaredɔm akɔ Yerusalem so akɔkunkum ne mmarima ne wɔn mmoa!
22 ౨౨ అయినా, వినండి! తమ కొడుకులతో కూతుళ్ళతో బయటకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా దానిలో కొంత ‘శేషం’ మిగిలిపోతుంది. చూడండి! వాళ్ళ కొడుకులూ కూతుళ్ళూ తిరిగి నీ దగ్గరికి వస్తారు. నువ్వు వాళ్ళ ప్రవర్తననూ, పనులనూ చూస్తావు. అప్పుడు యెరూషలేముకు వ్యతిరేకంగా నేను పంపిన శిక్షల విషయంలోనూ, దేశానికి విరోధంగా నేను పంపిన వాటన్నిటి విషయంలోనూ నీకు ఆదరణ కలుగుతుంది.
Nanso ebinom bɛka, mmammarima ne mmammaa a wɔbɛyi wɔn afiri mu no. Wɔbɛba mo nkyɛn wɔ Babilon, na sɛ mohunu wɔn su ne wɔn nneyɛɛ a, mo bo bɛtɔ mo yam wɔ amanehunu a me de aba Yerusalem so no ho.
23 ౨౩ మిగిలి ఉన్న వాళ్ళ ప్రవర్తన, పనులు చూసినప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది. వాళ్ళు నిన్ను ఆదరిస్తారు. నేను ఆమెకి వ్యతిరేకంగా చేసినదేదీ నిష్కారణంగా చేయలేదని మీరు తెలుసుకుంటారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.”
Sɛ mohunu wɔn su ne wɔn nneyɛɛ a, mo bo bɛtɔ mo yam, ɛfiri sɛ mobɛhunu sɛ, menyɛɛ biribiara wɔ hɔ a ɛnni farebae, Otumfoɔ Awurade asɛm nie.”

< యెహెజ్కేలు 14 >