< 2 థెస్సలొనీకయులకు 1 >

1 మన తండ్రి అయిన దేవునిలో ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలూ, సిల్వానూ, తిమోతీ రాస్తున్న సంగతులు.
Paweł, Sylwan i Tymoteusz do kościoła Tesaloniczan, [który jest] w Bogu, naszym Ojcu, i Panu Jezusie Chrystusie.
2 తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృపాసమాధానాలు మీకు కలుగు గాక.
Łaska wam i pokój od Boga, naszego Ojca, i Pana Jezusa Chrystusa.
3 సోదరులారా, మేము ఎప్పుడూ మీ విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది సముచితం. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీలో ఒకరి పట్ల మరొకరు చూపే ప్రేమ అత్యధికం అవుతూ ఉంది.
Bracia, powinniśmy zawsze dziękować Bogu za was, co jest rzeczą słuszną, bo bardzo wzrasta wasza wiara i u każdego z was pomnaża się wzajemna miłość;
4 అందుకే మీరు పొందుతున్న హింసలన్నిటిలోనూ, మీరు సహిస్తున్న యాతనల్లోనూ, మీ సహనాన్నీ, విశ్వాసాన్నీ చూసి దేవుని సంఘాల్లో మీ గురించి మేమే గర్వంగా చెబుతున్నాం.
Tak że i my sami chlubimy się wami w kościołach Bożych z [powodu] waszej cierpliwości i wiary we wszystkich waszych prześladowaniach i uciskach, które znosicie.
5 ఇది దేవుని న్యాయమైన తీర్పుకు ఒక స్పష్టమైన సూచనగా ఉంది. దీని ఫలితం ఏమిటంటే మీరు దేవుని రాజ్యానికి తగిన వారుగా లెక్కలోకి వస్తారు. దేవుని రాజ్యం కోసమే మీరీ కష్టాలన్నీ సహిస్తున్నారు.
[Są one] dowodem sprawiedliwego sądu Boga, abyście byli uznani za godnych królestwa Bożego, za które też cierpicie.
6 ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.
Ponieważ jest [rzeczą] sprawiedliwą u Boga, żeby odpłacić uciskiem tym, którzy was uciskają;
7
A wam, uciśnionym, [dać] odpoczynek wraz z nami, gdy z nieba objawi się Pan Jezus z aniołami swojej mocy;
8 దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు.
W ogniu płomienistym wywierając zemstę na tych, którzy Boga nie znają i nie są posłuszni ewangelii naszego Pana Jezusa Chrystusa.
9 ఆ రోజున తన పరిశుద్ధులు ఆయనను మహిమ పరచడానికీ, విశ్వసించిన వారికి ఆశ్చర్య కారకంగా ఉండటానికీ ఆయన వచ్చినప్పుడు అవిశ్వాసులు ప్రభువు సన్నిధి నుండీ, ఆయన ప్రభావ తేజస్సు నుండీ వేరై శాశ్వత నాశనం అనే దండన పొందుతారు. (aiōnios g166)
Poniosą oni karę, wieczne zatracenie od oblicza Pana i od chwały jego mocy; (aiōnios g166)
10 ౧౦ ఆ పరిశుద్ధుల్లో మీరూ ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు.
Gdy przyjdzie, aby był uwielbiony w swoich świętych i podziwiany w tym dniu przez wszystkich wierzących, ponieważ wśród was uwierzono naszemu świadectwu.
11 ౧౧ ఈ కారణం చేత మీకు అందిన పిలుపుకి తగిన వారిగా మిమ్మల్ని దేవుడు ఎంచాలనీ, మేలు చేయాలనే మీ ప్రతి ఆలోచననూ విశ్వాస మూలమైన ప్రతి పనినీ ఆయన తన బల ప్రభావాలతో నెరవేర్చాలనీ మేము మీ కోసం అనునిత్యం ప్రార్ధిస్తున్నాము.
Dlatego też nieustannie modlimy się za was, aby nasz Bóg uznał was za godnych tego powołania i wypełnił wszelkie upodobanie [swojej] dobroci i dzieła wiary w mocy;
12 ౧౨ తద్వారా మన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రసాదించే కృప మూలంగా మీలో మన ప్రభువైన యేసు నామం మహిమ పొందుతుంది. మీరు ఆయనలో మహిమ పొందుతారు.
Aby imię naszego Pana Jezusa Chrystusa zostało uwielbione w was, a wy w nim, według łaski naszego Boga i Pana Jezusa Chrystusa.

< 2 థెస్సలొనీకయులకు 1 >