< సమూయేలు~ రెండవ~ గ్రంథము 13 >

1 దావీదు కొడుకు, అబ్షాలోముకు తామారు అనే ఒక అందమైన సోదరి ఉంది. దావీదు కొడుకు, అమ్నోను ఆమెపై కోరిక పెంచుకున్నాడు.
ויהי אחרי כן ולאבשלום בן דוד אחות יפה ושמה תמר ויאהבה אמנון בן דוד׃
2 తామారు అవివాహిత కావడంవల్ల ఆమెను ఏమీ చేయలేని స్థితిలో ఉన్న అమ్నోను దిగులు పెంచుకుని తామారును బట్టి చిక్కిపోసాగాడు.
ויצר לאמנון להתחלות בעבור תמר אחתו כי בתולה היא ויפלא בעיני אמנון לעשות לה מאומה׃
3 అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు దావీదు సోదరుడు షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఎంతో కుటిలమైన బుద్ది గలవాడు. అతడు అమ్నోనుతో,
ולאמנון רע ושמו יונדב בן שמעה אחי דוד ויונדב איש חכם מאד׃
4 “రాజ కుమారుడవైన నువ్వు రోజురోజుకీ చిక్కిపోడానికి కారణం ఏమిటి? విషయం ఏమిటో నాకు చెప్పవా?” అని అడిగాడు. అమ్నోను “నా సోదరుడైన అబ్షాలోము సోదరి తామారుపై కోరిక కలిగి ఉన్నాను” అని చెప్పాడు.
ויאמר לו מדוע אתה ככה דל בן המלך בבקר בבקר הלוא תגיד לי ויאמר לו אמנון את תמר אחות אבשלם אחי אני אהב׃
5 అప్పుడు యెహోనాదాబు­ “నీకు జబ్బు చేసినట్టు నటించి నీ మంచం మీద పండుకుని ఉండు. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నువ్వు, ‘నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా వండి నాకు పెట్టేలా ఆమెతో చెప్పు’ అని రాజును అడుగు” అని సలహా ఇచ్చాడు. అమ్నోను జబ్బు చేసినట్టు నటిస్తూ పడక మీద పండుకున్నాడు.
ויאמר לו יהונדב שכב על משכבך והתחל ובא אביך לראותך ואמרת אליו תבא נא תמר אחותי ותברני לחם ועשתה לעיני את הבריה למען אשר אראה ואכלתי מידה׃
6 అమ్నోను జబ్బు పడ్డాడని రాజుకు తెలిసి, అతణ్ణి పరామర్శించేందుకు వచ్చాడు. అప్పుడు అమ్నోను “నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం రెండు రొట్టెలు చేయమని చెప్పు” అని రాజును అడిగాడు.
וישכב אמנון ויתחל ויבא המלך לראתו ויאמר אמנון אל המלך תבוא נא תמר אחתי ותלבב לעיני שתי לבבות ואברה מידה׃
7 దావీదు “నీ సోదరుడు అమ్నోను ఇంటికి వెళ్లి అతని కోసం భోజనం తయారుచెయ్యి” అని తామారు ఇంటికి కబురు పంపాడు.
וישלח דוד אל תמר הביתה לאמר לכי נא בית אמנון אחיך ועשי לו הבריה׃
8 తామారు, అమ్నోను ఇంటికి వెళ్ళింది.
ותלך תמר בית אמנון אחיה והוא שכב ותקח את הבצק ותלוש ותלבב לעיניו ותבשל את הלבבות׃
9 అతడు పండుకుని ఉన్నప్పుడు ఆమె పిండి తీసుకు కలిపి అతని ముందు రొట్టెలు చేసి వాటిని కాల్చి గిన్నెలో పెట్టి వాటిని అతనికి వడ్డించబోయింది. అతడు “నాకు వద్దు” అని చెప్పి, అక్కడ ఉన్నవారితో “ఇక్కడున్న వారంతా నా దగ్గర నుండి బయటకు వెళ్ళండి” అని చెప్పాడు.
ותקח את המשרת ותצק לפניו וימאן לאכול ויאמר אמנון הוציאו כל איש מעלי ויצאו כל איש מעליו׃
10 ౧౦ వారంతా బయటికి వెళ్ళిన తరువాత అమ్నోను “నీ చేతి వంటకం నేను తినేలా దాన్ని నా గదిలోకి తీసుకురా” అని చెప్పాడు. తామారు తాను చేసిన రొట్టెలను తీసుకు గదిలో ఉన్న అమ్నోను దగ్గరికి వచ్చింది.
ויאמר אמנון אל תמר הביאי הבריה החדר ואברה מידך ותקח תמר את הלבבות אשר עשתה ותבא לאמנון אחיה החדרה׃
11 ౧౧ అయితే అతడు ఆమెను పట్టుకుని “నా సోదరీ, రా, నాతో శయనించు” అన్నాడు.
ותגש אליו לאכל ויחזק בה ויאמר לה בואי שכבי עמי אחותי׃
12 ౧౨ ఆమె “అన్నయ్యా, నన్నిలా అవమానపరచొద్దు. ఇలా చేయడం ఇశ్రాయేలీయులకు న్యాయం కాదు. ఇలాంటి జారత్వం లోకి పడిపోవద్దు. ఈ అవమానం నేనెక్కడ దాచుకోగలను?
ותאמר לו אל אחי אל תענני כי לא יעשה כן בישראל אל תעשה את הנבלה הזאת׃
13 ౧౩ నువ్వు కూడా ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గుడిగా మారతావు. దీని గూర్చి రాజుతో మాట్లాడు. అతడు నన్ను నీకిచ్చి వివాహం చేయవచ్చు” అని చెప్పింది.
ואני אנה אוליך את חרפתי ואתה תהיה כאחד הנבלים בישראל ועתה דבר נא אל המלך כי לא ימנעני ממך׃
14 ౧౪ అయినా అతడు ఆమె మాట వినలేదు. పశుబలంతో ఆమెను మానభంగం చేసి అవమానించాడు.
ולא אבה לשמע בקולה ויחזק ממנה ויענה וישכב אתה׃
15 ౧౫ అమ్నోను ఇలా చేసిన తరువాత ఆమెను ప్రేమించినంతకంటే ఎక్కువ ద్వేషం ఆమెపై పుట్టింది. ఆమెను “లేచి వెళ్ళిపో” అని చెప్పాడు.
וישנאה אמנון שנאה גדולה מאד כי גדולה השנאה אשר שנאה מאהבה אשר אהבה ויאמר לה אמנון קומי לכי׃
16 ౧౬ ఆమె “నన్ను బయటకు తోసివేయడం ద్వారా నాకు ఇప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేసినవాడివి అవుతావు” అని చెప్పింది.
ותאמר לו אל אודת הרעה הגדולה הזאת מאחרת אשר עשית עמי לשלחני ולא אבה לשמע לה׃
17 ౧౭ అతడు ఆమె మాట వినిపించుకోలేదు. తన పనివాళ్ళలో ఒకణ్ణి పిలిచి “ఈమెను నా దగ్గర నుండి పంపివేసి తలుపులు వెయ్యి” అని చెప్పాడు.
ויקרא את נערו משרתו ויאמר שלחו נא את זאת מעלי החוצה ונעל הדלת אחריה׃
18 ౧౮ వివాహం కాని రాజకుమార్తెలు రకరకాల రంగుల చీరలు ధరించేవారు. ఆమె అలాంటి చీర కట్టుకుని ఉన్నప్పటికీ ఆ పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మళ్ళీ రాకుండా ఉండేలా తలుపుకు గడియ పెట్టాడు.
ועליה כתנת פסים כי כן תלבשן בנות המלך הבתולת מעילים ויצא אותה משרתו החוץ ונעל הדלת אחריה׃
19 ౧౯ అప్పుడు తామారు తలమీద బూడిద పోసుకుని, కట్టుకొన్న రంగు రంగుల చీర చింపివేసి తలపై చేతులు పెట్టుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది.
ותקח תמר אפר על ראשה וכתנת הפסים אשר עליה קרעה ותשם ידה על ראשה ותלך הלוך וזעקה׃
20 ౨౦ ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి “నీ అన్న అమ్నోను నీతో తన వాంఛ తీర్చుకున్నాడు గదా? నా సోదరీ, నువ్వు నెమ్మదిగా ఉండు. అతడు నీ అన్నే గదా, దీని విషయంలో బాధపడకు” అన్నాడు. మానం కోల్పోయిన తామారు అప్పటినుండి అబ్షాలోము ఇంట్లోనే ఉండిపోయింది.
ויאמר אליה אבשלום אחיה האמינון אחיך היה עמך ועתה אחותי החרישי אחיך הוא אל תשיתי את לבך לדבר הזה ותשב תמר ושממה בית אבשלום אחיה׃
21 ౨౧ ఈ సంగతి రాజైన దావీదుకు తెలిసింది. అతడు తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు.
והמלך דוד שמע את כל הדברים האלה ויחר לו מאד׃
22 ౨౨ అబ్షాలోము తన సోదరుడైన అమ్నోనుతో మంచిచెడ్డలేమీ మాటలాడకుండా మౌనంగా ఉన్నాడు. అయితే తన సోదరి తామారును మానభంగం చేసినందుకు అతనిపై పగ పెంచుకున్నాడు.
ולא דבר אבשלום עם אמנון למרע ועד טוב כי שנא אבשלום את אמנון על דבר אשר ענה את תמר אחתו׃
23 ౨౩ రెండేళ్ళ తరువాత అబ్షాలోముకు గొర్రెలబొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. ఎఫ్రాయిముకు దగ్గర బయల్హాసోరులో అబ్షాలోము రాజకుమారులనందరినీ విందుకు పిలిచాడు.
ויהי לשנתים ימים ויהיו גזזים לאבשלום בבעל חצור אשר עם אפרים ויקרא אבשלום לכל בני המלך׃
24 ౨౪ అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి “రాజా, వినండి. నీ దాసుడనైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజవైన నువ్వూ నీ సేవకులూ విందుకు రావాలని నీ దాసుడనైన నేను కోరుతున్నాను” అని మనవి చేసుకున్నాడు.
ויבא אבשלום אל המלך ויאמר הנה נא גזזים לעבדך ילך נא המלך ועבדיו עם עבדך׃
25 ౨౫ అప్పుడు రాజు “నా కుమారా, మమ్మల్ని పిలవొద్దు. మేము రాకూడదు. మేమంతా వస్తే అదనపు భారంగా ఉంటాం” అని చెప్పాడు. రాజు అలా చెప్పినప్పటికీ అబ్షాలోము తప్పకుండా రావాలని రాజును బలవంతపెట్టాడు.
ויאמר המלך אל אבשלום אל בני אל נא נלך כלנו ולא נכבד עליך ויפרץ בו ולא אבה ללכת ויברכהו׃
26 ౨౬ అయితే దావీదు వెళ్లకుండా అబ్షాలోమును దీవించి పంపాడు. అప్పుడు అబ్షాలోము “నువ్వు రాలేకపోతే నా సోదరుడు అమ్నోను మాతో కలసి బయలుదేరేలా అనుమతి ఇవ్వు” అని రాజుకు మనవి చేశాడు. “అతడు నీ దగ్గరికి ఎందుకు రావాలి?” అని దావీదు అడిగాడు.
ויאמר אבשלום ולא ילך נא אתנו אמנון אחי ויאמר לו המלך למה ילך עמך׃
27 ౨౭ అబ్షాలోము అతణ్ణి బతిమిలాడాడు. రాజు అమ్నోను, తన కొడుకులంతా అబ్షాలోము దగ్గరకు వెళ్ళవచ్చని అనుమతి ఇచ్చాడు.
ויפרץ בו אבשלום וישלח אתו את אמנון ואת כל בני המלך׃
28 ౨౮ ఈలోగా అబ్షాలోము తన పనివాళ్ళను పిలిచి “నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అమ్నోను బాగా ద్రాక్షారసం తాగి మత్తెక్కి ఉన్న సమయంలో అతణ్ణి చంపమని నేను మీకు చెప్పినప్పుడు మీరు భయపడకుండా అతణ్ణి చంపివేయండి. ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపించండి” అని చెప్పాడు.
ויצו אבשלום את נעריו לאמר ראו נא כטוב לב אמנון ביין ואמרתי אליכם הכו את אמנון והמתם אתו אל תיראו הלוא כי אנכי צויתי אתכם חזקו והיו לבני חיל׃
29 ౨౯ అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అమ్నోనును చంపేశారు. రాజకుమారులంతా భయపడి లేచి తమ కంచరగాడిదెలు ఎక్కి పారిపోయారు.
ויעשו נערי אבשלום לאמנון כאשר צוה אבשלום ויקמו כל בני המלך וירכבו איש על פרדו וינסו׃
30 ౩౦ వారు దారిలో ఉండగానే “ఒక్కడు కూడా మిగలకుండా రాజకుమారులందరినీ అబ్షాలోము చంపివేశాడు” అన్న వార్త దావీదుకు అందింది.
ויהי המה בדרך והשמעה באה אל דוד לאמר הכה אבשלום את כל בני המלך ולא נותר מהם אחד׃
31 ౩౧ అతడు లేచి తన బట్టలు చించుకుని నేలపై పడి ఉన్నాడు. అతని సేవకులంతా తన బట్టలు చించుకుని రాజు దగ్గర నిలబడి ఉన్నారు.
ויקם המלך ויקרע את בגדיו וישכב ארצה וכל עבדיו נצבים קרעי בגדים׃
32 ౩౨ దీని చూసిన దావీదు సోదరుడు షిమ్యా కొడుకు యెహోనాదాబు “రాజా, రాజకుమారులైన యువకులందరినీ వారు చంపారని నువ్వు అనుకోవద్దు. అమ్నోను ఒక్కడినే చంపారు. ఎందుకంటే, అతడు అబ్షాలోము సహోదరి తామారును మానభంగం చేసినప్పటి నుండి అతడు అమ్నోనును చంపాలన్న పగతో ఉన్నాడని అతని మాటలనుబట్టి గ్రహించవచ్చు.
ויען יונדב בן שמעה אחי דוד ויאמר אל יאמר אדני את כל הנערים בני המלך המיתו כי אמנון לבדו מת כי על פי אבשלום היתה שימה מיום ענתו את תמר אחתו׃
33 ౩౩ కాబట్టి మా రాజువైన నువ్వు నీ కొడుకులంతా చనిపోయారని భావించి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే చనిపోయాడు” అని చెప్పాడు.
ועתה אל ישם אדני המלך אל לבו דבר לאמר כל בני המלך מתו כי אם אמנון לבדו מת׃
34 ౩౪ కాపలా కాసేవాడు ఎదురుచూస్తూ ఉన్నప్పుడు అతని వెనక, కొండ పక్కన దారిలో నుండి వస్తున్న చాలమంది కనబడ్డారు.
ויברח אבשלום וישא הנער הצפה את עינו וירא והנה עם רב הלכים מדרך אחריו מצד ההר׃
35 ౩౫ వారు పట్టణంలోకి రాగానే యెహోనాదాబు “అదిగో రాజకుమారులు వచ్చారు. నీ దాసుడనైన నేను చెప్పినట్టుగానే జరిగింది” అని రాజుతో అన్నాడు.
ויאמר יונדב אל המלך הנה בני המלך באו כדבר עבדך כן היה׃
36 ౩౬ అతడు తన మాటలు ముగించగానే రాజకుమారులు వచ్చి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఇది చూసి రాజు, అతని సేవకులంతా కూడా ఏడ్చారు.
ויהי ככלתו לדבר והנה בני המלך באו וישאו קולם ויבכו וגם המלך וכל עבדיו בכו בכי גדול מאד׃
37 ౩౭ ఇది జరిగిన తరువాత అబ్షాలోము అక్కడినుంచి పారిపోయి గెషూరు రాజు అమీహూదు కొడుకు తల్మయి దగ్గరికి చేరుకున్నాడు. దావీదు ప్రతిరోజూ తన కొడుకు కోసం శోకిస్తూ ఉండిపోయాడు.
ואבשלום ברח וילך אל תלמי בן עמיחור מלך גשור ויתאבל על בנו כל הימים׃
38 ౩౮ అబ్షాలోము పారిపోయి గెషూరు వచ్చి అక్కడ మూడేళ్ళు గడిపాడు.
ואבשלום ברח וילך גשור ויהי שם שלש שנים׃
39 ౩౯ అమ్నోను ఇక చనిపోయాడు గదా అని రాజైన దావీదు అతని గూర్చి ఓదార్పు పొంది అబ్షాలోమును చంపాలన్న ఆలోచన మానుకున్నాడు.
ותכל דוד המלך לצאת אל אבשלום כי נחם על אמנון כי מת׃

< సమూయేలు~ రెండవ~ గ్రంథము 13 >