< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 35 >

1 యోషీయా యెరూషలేములో యెహోవాకు పస్కాపండగ ఆచరించాడు. మొదటి నెల 14 వ రోజున ప్రజలు పస్కా పశువును వధించారు.
Potem Jozjasz obchodził w Jerozolimie święto Paschy dla PANA. I zabito baranka paschalnego czternastego [dnia] pierwszego miesiąca.
2 అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి, యెహోవా మందిరసేవను జరిగించడానికి వారిని ధైర్యపరచి
Ustanowił też kapłanów na swoich urzędach i zachęcił ich do służby w domu PANA.
3 ఇశ్రాయేలీయులందరికి బోధిస్తూ, యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలా ఆజ్ఞాపించాడు “పరిశుద్ధ మందసాన్ని మీరిక మీ భుజాల మీద మోయకుండా, ఇశ్రాయేలీయుల రాజు దావీదు కొడుకు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచండి. మీ దేవుడైన యెహోవాకు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సేవ చేయండి.
I powiedział Lewitom, którzy nauczali całego Izraela i byli poświęceni PANU: Ustawcie świętą arkę w domu, który zbudował syn Dawida Salomon, król Izraela. Nie będziecie już jej dźwigać na swoich ramionach. Teraz służcie PANU, swojemu Bogu, i jego ludowi Izraela;
4 ఇశ్రాయేలీయుల రాజు దావీదు రాసి ఇచ్చిన క్రమం ప్రకారం, అతని కొడుకు సొలొమోను రాసి ఇచ్చిన క్రమం ప్రకారం మీ మీ పూర్వీకుల కుటుంబాలకు ఏర్పాటైన వరసలనుబట్టి మిమ్మల్ని సిద్ధం చేసుకోండి.”
Przygotujcie się według waszych rodów i według waszych zmian, jak napisał Dawid, król Izraela, i jak napisał jego syn Salomon;
5 మీరు పరిశుద్ధ స్థలం లో నిలిచి, ప్రజల, పూర్వీకుల కుటుంబాల వరసలను బట్టి లేవీయుల పూర్వీకుల కుటుంబాల్లో ఉన్న వంతుల ప్రకారం సేవకు నిలబడండి.
I stójcie w świątyni według podziału na rody waszych braci, którzy są z ludu, i według podziału na rody Lewitów.
6 పస్కా గొర్రె పిల్లను వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకొనండి. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం దాన్ని మీ సోదరుల కోసం సిద్ధపరచండి.
Wtedy zabijcie baranka paschalnego, poświęćcie się i przygotujcie waszych braci, by wszystko czynić według słowa PANA [przekazanego] przez Mojżesza.
7 యోషీయా తన సొంత మందలో 30,000 గొర్రెపిల్లలనూ మేకపిల్లలనూ 3,000 కోడెదూడలనూ అక్కడ ఉన్న ప్రజలందరికీ పస్కాబలికోసం ఇచ్చాడు.
Potem Jozjasz dał ludowi jagnięta i koźlęta z trzody, wszystkie na ofiary święta Paschy dla wszystkich obecnych w liczbie trzydziestu tysięcy, oraz trzy tysiące wołów. To [wszystko] pochodziło z dóbr króla.
8 అతని అధికారులు ప్రజలకూ, యాజకులకూ, లేవీయులకూ మనసారా ఇచ్చారు. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయా, జెకర్యా, యెహీయేలూ పస్కాబలి కోసం యాజకులకు 2, 600 చిన్న పశువులనూ 300 కోడెదూడలనూ ఇచ్చారు.
Jego książęta złożyli dobrowolne dary ludowi, kapłanom i Lewitom: Chilkiasz, Zachariasz, Jechiel, przełożeni domu Bożego, dali kapłanom na ofiary święta Paschy dwa tysiące sześćset [jagniąt] i trzysta wołów.
9 కొనన్యా, అతని సోదరులైన షెమయా, నెతనేలూ, లేవీయుల్లో ముఖ్యులు హషబ్యా యెహీయేలూ యోజాబాదూ పస్కాబలి కోసం లేవీయులకు 5,000 గొర్రెలనూ 500 కోడెదూడలనూ ఇచ్చారు.
Ponadto Konaniasz i jego bracia Szemejasz i Netaneel oraz Chaszabiasz, Jejel i Jozabad, naczelnicy z Lewitów, dali [innym] Lewitom na ofiary święta Paschy pięć tysięcy [jagniąt] i pięćset wołów.
10 ౧౦ సేవకు అంతా సిద్ధంగా ఉన్నప్పుడు రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలం లోనూ, లేవీయులు తమ వరసల్లోనూ నిలబడ్డారు.
Wszystko więc zostało przygotowane do służby, kapłani stanęli na swoich miejscach, a Lewici w swoich zmianach według rozkazu króla.
11 ౧౧ లేవీయులు పస్కాపశువులను వధించి రక్తాన్ని యాజకులకిచ్చారు. వారు దాన్ని చల్లారు. లేవీయులు జంతువుల చర్మాలను ఒలిచారు.
I zabili baranki paschalne, kapłani kropili [ich] krwią, a Lewici obdzierali [je] ze skóry.
12 ౧౨ మోషే గ్రంథంలో రాసినట్టు ప్రజల వంశాల ప్రకారం పంచిపెట్టడానికీ యెహోవాకు అర్పణగా ఇవ్వడానికీ దహనబలి మాంసాన్ని యాజకులు పక్కన ఉంచారు. వారు ఎడ్లను కూడా అలాగే చేశారు.
Następnie oddzielili [część] z nich na całopalenie, aby dać [je] ludowi według podziału na rody jako ofiarę dla PANA, tak jak jest napisane w księdze Mojżesza. Podobnie też [uczyniono] z wołami.
13 ౧౩ వారు యధావిధిగా పస్కా గొర్రెపిల్లలను నిప్పుమీద కాల్చారు. ఇతర ప్రతిష్ఠార్పణలను కుండల్లో భాండీల్లో పెద్ద బిందెల్లో ఉడికించి ప్రజలందరికీ త్వరగా వడ్డించారు.
I piekli baranki paschalne na ogniu według zwyczaju, inne zaś [ofiary] święte gotowali w garnkach, kotłach i rondlach, po czym rozdawali szybko całemu ludowi.
14 ౧౪ తరువాత లేవీయులు తమ కోసం, యాజకుల కోసం అర్పణ సిద్ధం చేశారు. అహరోను సంతతివారైన యాజకులు దహనబలి అర్పణలనూ కొవ్వునూ రాత్రి వరకూ అర్పించ వలసి వచ్చింది కాబట్టి లేవీయులు తమ కోసం అహరోను సంతతివారైన యాజకుల కోసం అర్పణలను సిద్ధపరిచారు.
Potem też przygotowali [posiłek] dla siebie i kapłanów. Kapłani bowiem, synowie Aarona, byli [zajęci] składaniem całopaleń i tłuszczu aż do nocy. Lewici więc przygotowali [posiłek] dla siebie i dla kapłanów, synów Aarona.
15 ౧౫ ఆసాపు సంతతివారైన గాయకులు, తమ స్థలాల్లో ఉన్నారు. ఆసాపూ, హేమానూ, రాజుకు దార్శనికుడైన యెదూతూనూ దావీదు నియమించినట్టుగా తమ స్థలం లో ఉన్నారు. ప్రతి గుమ్మం దగ్గరా ద్వారపాలకులున్నారు. వారు తమ పని విడిచి రాకుండా వారి సోదరులైన లేవీయులు వారి కోసం అర్పణ సిద్ధపరిచారు.
Śpiewacy, synowie Asafa, [stali] na swoich stanowiskach według rozkazu Dawida, Asafa, Hemana i Jedutuna, widzącego króla. Odźwierni też [stali] przy każdej bramie. Nie musieli opuszczać swojej służby, ponieważ ich bracia Lewici przygotowywali dla nich [posiłki].
16 ౧౬ కాబట్టి రాజైన యోషీయా ఆజ్ఞాపించిన ప్రకారం వారు పస్కాపండగ ఆచరించి, యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించడం వలన ఆ రోజు ఏ లోపం లేకుండా యెహోవా సేవ జరిగింది.
Tak więc cała służba została przygotowana w tym dniu, aby obchodzić święto Paschy i składać całopalenia na ołtarzu PANA według rozkazu króla Jozjasza.
17 ౧౭ అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు, ఆ సమయంలో పస్కా అనే పొంగని రొట్టెల పండగను ఏడు రోజులు ఆచరించారు.
Synowie Izraela, którzy tam się znajdowali, obchodzili w tym czasie święto Paschy, a Święto Przaśników przez siedem dni.
18 ౧౮ సమూయేలు ప్రవక్త రోజులనుంచి ఇశ్రాయేలులో పస్కాపండగ ఆచరించడం అంత ఘనంగా జరగలేదు. యాజకులూ, లేవీయులూ, అక్కడ ఉన్న యూదా, ఇశ్రాయేలువారూ, యెరూషలేము నివాసులతో కలసి యోషీయా పస్కా పండగ ఆచరించినట్టు ఇశ్రాయేలు రాజుల్లో ఏ రాజూ పస్కా పండగ ఆచరించ లేదు.
Żadne święto Paschy podobne do tego nie było obchodzone w Izraelu od czasów proroka Samuela i żaden z królów Izraela nie obchodził tak święta Paschy, jak obchodzili [je] Jozjasz, kapłani, Lewici, cały lud Judy i Izraela, który się tam znajdował, oraz mieszkańcy Jerozolimy.
19 ౧౯ యోషీయా పాలనలో 18 వ సంవత్సరం ఈ పస్కా పండగ జరిగింది.
Paschę tę obchodzono w osiemnastym roku panowania Jozjasza.
20 ౨౦ ఇదంతా అయిన తరువాత, యోషీయా మందిరాన్ని చక్కపెట్టిన తరువాత ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న కర్కెమీషు మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు. యోషీయా అతనితో పోరాడడానికి వెళ్ళాడు.
Po tym wszystkim, gdy Jozjasz naprawił dom [Boży], nadciągnął Necho, król Egiptu, aby walczyć przeciw Karkemisz nad [rzeką] Eufrat, a Jozjasz wyruszył mu naprzeciw.
21 ౨౧ అయితే నెకో అతని దగ్గరికి రాయబారులను పంపి “యూదా రాజా, నాకూ నీకూ విరోధమేంటి? నేను ఇప్పుడు నీతో యుద్ధం చేయడానికి రాలేదు, కానీ నేను యుద్ధం చేయబోతున్న వాడి పైకి వెళ్తున్నాను. త్వరపడమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, కాబట్టి దేవుని జోలికి నీవు రావద్దు. ఆయన నాతో ఉన్నాడు. లేకపోతే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు” అని చెప్పాడు.
Ale on posłał do niego swoich posłańców ze słowami: Co ja mam z tobą, królu Judy? Nie przeciw tobie [ciągnę] dzisiaj, lecz przeciwko domowi, który ze mną walczy. I Bóg nakazał mi, abym się pospieszył. Przestań walczyć z Bogiem, który [jest] ze mną, aby cię nie zniszczył.
22 ౨౨ అయినా యోషీయా అతని దగ్గరనుంచి వెళ్ళిపోడానికి ఇష్టపడలేదు. అతనితో యుద్ధం చేయడానికి మారువేషం వేసుకుని, యెహోవా నోటిమాటగా నెకో చెప్పింది వినలేదు. మెగిద్దో లోయలో యుద్ధం చేయడానికి వెళ్ళాడు.
Ale Jozjasz nie odwrócił się od niego, lecz zmienił swoje szaty, aby z nim walczyć, i nie posłuchał słów Necho, [które pochodziły] z ust Boga. Tak więc wyruszył, aby walczyć na równinie Megiddo.
23 ౨౩ విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన సేవకులతో “నాకు పెద్ద గాయం అయింది. ఇక్కడ నుంచి నన్ను తీసుకు వెళ్ళండి” అన్నాడు.
A łucznicy ugodzili króla Jozjasza i wtedy król powiedział do swoich sług: Wyprowadźcie mnie, bo jestem ciężko ranny.
24 ౨౪ కాబట్టి అతని సేవకులు రథం మీదనుంచి అతని దింపి, అతనికున్న వేరే రథం మీద అతని ఉంచి యెరూషలేము తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వీకుల సమాధుల్లో అతణ్ణి పాతిపెట్టారు. యూదా యెరూషలేము వారంతా యోషీయా మృతికి విలపించారు.
Jego słudzy więc wyciągnęli go z rydwanu i wsadzili na inny rydwan, który należał do niego: zawieźli go do Jerozolimy i tam umarł. Potem pogrzebali go w grobach jego ojców, a cały lud Judy i Jerozolimy opłakiwał Jozjasza.
25 ౨౫ యిర్మీయా యోషీయాను గురించి శోక గీతం రాశాడు. గాయకులూ గాయకురాండ్రంతా ఇప్పటికీ యోషీయా కోసం ఆ పాట పాడుతూ దుఃఖిస్తారు. ఈ గీతాలు ఇశ్రాయేలులో వాడుక అయ్యాయి. విలాప వాక్యాల్లో అలాంటివి రాసి ఉన్నాయి.
Jeremiasz też lamentował nad Jozjaszem, a wszyscy śpiewacy i śpiewaczki wspominają Jozjasza w swoich lamentacjach aż do dziś, i uczynili z tego zwyczaj w Izraelu. Oto są zapisane w lamentacjach.
26 ౨౬ యోషీయాను గురించిన ఇతర విషయాలు, యెహోవా ధర్మశాస్త్రంలో రాసిన మాటలు బట్టి అతడు చూపిన భయభక్తులు,
A pozostałe dzieje Jozjasza, jego życzliwość według tego, co jest napisane w Prawie PANA;
27 ౨౭ అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి.
I jego czyny pierwsze i ostatnie są zapisane w księdze królów Izraela i Judy.

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 35 >