< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 13 >

1 యరొబాము రాజు ఇశ్రాయేలును పాలిస్తున్న పద్దెనిమిదో సంవత్సరంలో అబీయా యూదావారి మీద రాజయ్యాడు.
Ķēniņa Jerobeama astoņpadsmitā gadā Abija palika par ķēniņu pār Jūdu.
2 అతడు మూడు సంవత్సరాలు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా పట్టణానికి చెందిన ఊరియేలు కుమార్తె.
Viņš valdīja trīs gadus Jeruzālemē, un viņa mātei bija vārds Mikaja, Uriēļa meita no Ģibejas. Un karš cēlās starp Abiju un Jerobeamu.
3 అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. అబీయా 4,00,000 మంది పరాక్రమశాలులైన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. యరొబాము కూడా 8,00,000 మంది పరాక్రమశాలులను అతనికి ఎదురుగా వ్యూహపరిచాడు.
Un Abija taisījās uz karu ar varenu kara spēku, ar četrsimt tūkstoš izlasītiem vīriem. Un Jerobeams taisījās pret viņu uz karu ar astoņsimt tūkstoš izlasītiem stipriem kara vīriem.
4 అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యంలోని సెమరాయిము కొండ మీద నిలబడి ఇలా ప్రకటించాడు, “యరొబాము, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా వినండి.
Un Abija uzkāpa uz Cemaraim kalnu Efraīma kalnos un sacīja: klausiet mani, Jerobeam un viss Israēl.
5 ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎల్లకాలం పాలించడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దావీదుతో, అతని సంతతివారితో ఎవరూ భంగం చేయలేని నిబంధన చేసి దాన్ని వారికిచ్చాడని మీకు తెలుసు గదా
Vai jums nav zināms, ka Tas Kungs, Israēla Dievs, valdību pār Israēli devis Dāvidam uz mūžīgiem laikiem, ir viņam, ir viņa dēliem caur sāls (neiznīkstamu) derību?
6 అయినా దావీదు కుమారుడు సొలొమోనుకు దాసుడు, నెబాతు కొడుకు అయిన యరొబాము పనికిమాలిన దుష్టులతో చేతులు కలిపి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు.
Taču Jerobeams, Nebata dēls, Salamana Dāvida dēla, kalps, sacēlis dumpi pret savu kungu!
7 సొలొమోను కొడుకు రెహబాము ఇంకా బాలుడుగా, అనుభవం లేక వారిని ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధానికి వెళ్ళారు.”
Un pie viņa sapulcējušies nelieši, netikli ļaudis, un pret Rekabeamu, Salamana dēlu, palikuši stipri, kamēr Rekabeams vēl bija jauns un tam bija bailīga sirds, ka pret viņiem nevarēja turēties.
8 “ఇప్పుడు దావీదు సంతతి వశంలో ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి తెగిస్తున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు కూడా మీ దగ్గర ఉన్నాయి.
Un nu jūs domājat stipri būt pret Tā Kunga valstību Dāvida dēlu rokā; jūs gan esat liels pulks, bet pie jums ir zelta teļi, ko Jerobeams jums cēlis par dieviem.
9 మీరు అహరోను సంతానమైన యెహోవా యాజకులనూ లేవీయులనూ వెళ్ళగొట్టి, అన్యదేశాల ప్రజలు చేసినట్టు మీ కోసం యాజకులను నియమించుకున్నారు గదా? ఒక కోడెనీ ఏడు గొర్రె పొట్టేళ్లనీ తీసుకు వచ్చి తనను ప్రతిష్ఠించుకోడానికి వచ్చే ప్రతివాడూ దేవుళ్ళు కాని వాటికి యాజకుడై పోతున్నాడు గదా.
Vai jūs Tā Kunga priesterus, Ārona dēlus, tos Levitus, neesat izdzinuši un neesat sev priesterus cēluši, kā pasaules tautas? Ikviens, kas nāk savu roku pildīdams ar jaunu vērsi un septiņiem auniem, tas top par priesteri tādiem, kas nav dievi.
10 ౧౦ అయితే యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు. మేము ఆయన్ని విసర్జించలేదు. యెహోవాకు సేవ చేసే యాజకులు అహరోను సంతతివారు. లేవీయులు చేయాల్సిన పనులు లేవీయులే చేస్తున్నారు.
Bet ar mums ir Tas Kungs, mūsu Dievs, un mēs Viņu neesam atstājuši, un tie priesteri, kas Tam Kungam kalpo, ir Ārona dēli, un Leviti savā kalpošanā.
11 ౧౧ వారు ప్రతి ఉదయం, సాయంకాలం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ, సుగంధద్రవ్యాలతో ధూపం వేస్తూ, పవిత్రమైన బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ, బంగారు దీపస్తంభాన్ని, ప్రమిదలను ప్రతి సాయంత్రం వెలిగిస్తూ ఉన్నారు. మేము మా దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన ఆజ్ఞల ప్రకారం సమస్తాన్నీ జరిగిస్తున్నాం. కానీ మీరు మాత్రం ఆయన్ని విడిచిపెట్టారు.”
Un tie Tam Kungam iededzina dedzināmos upurus ik rītu un ik vakaru, arī saldas kvēpināmās zāles, un liek to (svēto) maizi uz to šķīsto galdu; un tur ir tas zelta lukturis ar saviem eļļas lukturīšiem, kas ik vakaru top iededzināti; jo mēs turam Tā Kunga, sava Dieva, likumus, bet jūs Viņu esat atstājuši.
12 ౧౨ “ఆలోచించండి, దేవుడే మాకు తోడుగా, మాకు అధిపతిగా ఉన్నాడు. ఆయన యాజకులు మీ మీద ఆర్భాటం చేయడానికీ బూరలు ఊదడానికీ మా పక్షాన ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకండి. చేసినా మీకు జయం కలగదు.”
Un nu redzi, Dievs ir ar mums pašā priekšā un Viņa priesteri ar skanīgām bazūnēm, bazūnēt pret jums. Jūs, Israēla bērni nekarojat ar To Kungu, savu tēvu Dievu; jo tas jums neizdosies.
13 ౧౩ అంతకుముందు యరొబాము యూదావారి వెనక భాగంలో కొందరు మాటుగాళ్ళను ఉంచదువు. యరోబాము సైన్యం యూదా వారికి ఎదుటా, మాటుగాళ్ళు వారికి వెనకా ఉండేలా చేశాడు.
Bet Jerobeams karavīriem lika slepeni apiet apkārt, tiem uzbrukt mugurā, un tā viņi stāvēja Jūda priekšā, un tie glūnētāji viņiem mugurā.
14 ౧౪ యూదా వారు, తమకు ముందూ వెనకా యోధులు ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేశారు, యాజకులు బూరలు ఊదారు.
Kad nu Jūda atpakaļ skatījās, redzi, tad karš tiem bija priekšā un mugurā. Un tie piesauca To Kungu, un priesteri bazūnēja ar bazūnēm.
15 ౧౫ అప్పుడు యూదా వారు గట్టిగా కేకలు వేశారు. వారు కేకలు వేస్తుండగా యరొబాము, ఇశ్రాయేలు వారంతా అబీయా ఎదుటా యూదావారి ఎదుటా నిలబడ లేకుండేలా దేవుడు వారిని దెబ్బ తీశాడు.
Un Jūda vīri kliedza. Un kad Jūda vīri tā kliedza, tad Dievs kāva Jerobeamu un visu Israēli Abijas un Jūda priekšā,
16 ౧౬ ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించాడు.
Un Israēla bērni bēga Jūda priekšā, un Dievs tos deva viņu rokā,
17 ౧౭ కాబట్టి అబీయా, అతని ప్రజలు వారిని ఘోరంగా హతమార్చారు. ఇశ్రాయేలు వారిలో 5,00,000 మంది యుద్ధ వీరులు చనిపోయారు.
Un Abija ar saviem ļaudīm tos sakāva lielā kaušanā, un no Israēla krita nokauti piecsimt tūkstoš izlasīti vīri.
18 ౧౮ ఈ విధంగా ఇశ్రాయేలు వారు ఆ కాలంలో అణిగిపోయారు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణంగానే విజయం సాధించారు.
Tā Israēla bērni tanī laikā tapa pazemoti, bet Jūda bērni tapa vareni, tāpēc ka tie bija paļāvušies uz To Kungu, savu tēvu Dievu.
19 ౧౯ అబీయా యరొబామును తరిమి, బేతేలునూ దాని గ్రామాలనూ యెషానానూ దాని గ్రామాలనూ ఎఫ్రోనునూ దాని గ్రామాలనూ పట్టుకున్నాడు.
Un Abija dzinās Jerobeamam pakaļ un ieņēma viņa pilsētas: Bēteli ar viņas miestiem un Jēzanu ar viņas miestiem, un Efronu ar viņas miestiem.
20 ౨౦ అబీయా జీవించి ఉన్న కాలంలో యరొబాము మళ్ళీ బలపడలేదు, యెహోవా అతణ్ణి దెబ్బ తీయడం వలన అతడు చనిపోయాడు.
Un Jerobeams vairs netika pie spēka Abijas laikā, bet Tas Kungs to sita, un tas nomira.
21 ౨౧ అబీయా అభివృద్ధి చెందాడు. అతనికి 14 మంది భార్యలు, 22 మంది కుమారులు, 16 మంది కుమార్తెలు ఉన్నారు.
Un Abija palika spēcīgs un apņēma četrpadsmit sievas un dzemdināja divdesmit divus dēlus un sešpadsmit meitas.
22 ౨౨ అబీయా చేసిన ఇతర కార్యాల గురించీ అతని నడవడి, అతని మాటలను గురించీ అతని కాలంలో జరిగిన సంగతుల గురించీ ప్రవక్త ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో రాసి వుంది.
Un kas vēl par Abiju stāstāms, viņa ceļi un viņa vārdi, tie rakstīti pravieša Idus stāstos.

< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 13 >