< సమూయేలు~ మొదటి~ గ్రంథము 24 >

1 సౌలు ఫిలిష్తీయులను తరమడం మానుకుని తిరిగి వెళ్ళాక, దావీదు ఏన్గెదీ అరణ్య ప్రాంతంలో ఉన్నాడని అతనికి కబురు వచ్చింది.
Saulo ne Filistifoɔ no ko wieeɛ no, wɔka kyerɛɛ no sɛ, “Dawid hyɛ En-Gedi ɛserɛ so hɔ.”
2 అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి, కొండమేకలు ఉండే రాతి కొండల మీద దావీదును అతని అనుచరులను వెదకడానికి బయలుదేరాడు.
Ɛno enti, Saulo yii mmarima mpensa firii Israel mmaa nyinaa, de wɔn kɔɔeɛ sɛ wɔrekɔhwehwɛ Dawid ne ne mmarima wɔ beaeɛ bi a ɛbɛn Wiram Mmirekyie Abotan no.
3 దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు.
Ɔbɛduruu nnwammuo bi ho a ɛhɔ ara nso na ɔbodan bi wɔ no, Saulo wuraa mu sɛ, ɔrekɔgye nʼahome. Na Dawid ne ne mmarima no wɔ saa ɔbodan no mu akyirikyiri.
4 దావీదు అనుచరులు “నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది” అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు.
Mmarima no kaa sɛ, “Ɛnnɛ ne ɛda a Awurade kaa sɛ, ‘Mede wo ɔtamfoɔ bɛhyɛ wo nsa, na woayɛ no deɛ wopɛ biara’ no”. Na Dawid weawea kɔɔ Saulo ho, kɔtwaa nʼatadeɛ ano.
5 సౌలు పై వస్రాన్ని కోసినందుకు దావీదు మనస్సులో నొచ్చుకుని,
Na Dawid adwenem antene no sɛ watwa Saulo atadeɛ ano.
6 “ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చేయను, యెహోవాను బట్టి నేను అతణ్ణి చంపను” అని తన వారితో చెప్పాడు.
Ɔka kyerɛɛ ne mmarima no sɛ, “Awurade nim sɛ ɛnsɛ sɛ meyɛ saa. Ɛyɛ musuo sɛ obi mɛtene me nsa wɔ obi a Awurade asra no ngo so; ɛfiri sɛ, Awurade ankasa na wapa no.”
7 ఈ మాటలు చెప్పి దావీదు సౌలు మీదికి వెళ్ళకుండా తన వారిని అడ్డగించాడు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు.
Ɔnam saa nsɛm yi so kaa ne mmarima no anim, na wamma ho kwan amma wɔankɔ Saulo so. Na Saulo firii ɔbodan no mu kɔɔ ne kwan no.
8 అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి “నా యజమానీ, రాజా” అని వెనుక నుండి కేకవేస్తే, సౌలు వెనక్కి చూశాడు. దావీదు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి
Dawid pue baeɛ, teateaam dii nʼakyi sɛ, “Me wura ɔhene!” Saulo twaa nʼani no, Dawid bɔɔ ne mu ase.
9 సౌలుతో ఇలా అన్నాడు “దావీదు నీకు కీడుచేయాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు?
Afei, ɔteaam, bisaa Saulo sɛ, “Adɛn enti na wotie nkurɔfoɔ ano sɛ merepɛ wo aha wo?
10 ౧౦ ఆలోచించు. ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి ఎలా అప్పగించాడో నీ కళ్ళారా చూశావు కదా. కొంతమంది నిన్ను చంపేయమని నాకు చెప్పినప్పటికీ నేనలా చెయ్యలేదు. ‘ఇతడు యెహోవా వలన అభిషేకం పొందిన వాడు కాబట్టి నా ఏలినవాడిపై చెయ్యి ఎత్తను’ అని చెప్పాను.
Ɛnnɛ dua yi, wʼankasa wʼani tua sɛ ɛnyɛ nokorɛ. Ɛfiri sɛ, Awurade de wo hyɛɛ me nsa wɔ ɔbodan no mu, na me mmarima no bi ka kyerɛɛ me sɛ, menkum wo, nanso mankum wo. Na mekaa sɛ, ‘Merenyɛ no bɔne biara da, ɛfiri sɛ, ɔyɛ obi a Awurade asra no.’
11 ౧౧ నా తండ్రీ, చూడు. నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీన్ని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడూ రాదనీ నాలో ఎలాంటి తప్పూ లేదనీ నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చేయకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు.
Mʼagya, hwɛ adeɛ a mekura yi. Ɛyɛ wʼatadeɛ sin bi. Metwaeɛ, nanso mankum wo. Yei da no adi pefee sɛ merenha wo, na menyɛɛ wo bɔne biara nso, na mmom, wo na woataataa me so repɛ me akum me.
12 ౧౨ నీకూ నాకూ మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయంలో పగ సాధిస్తాడు. నేను మాత్రం నిన్ను చంపను.
Awurade na ɔbɛhwɛ me ne wo ntam asɛm. Ebia, deɛ woayɛ enti, Awurade bɛtwe wʼaso wɔ deɛ wopɛ sɛ woyɛ me no ho, na me deɛ, merenha wo da.
13 ౧౩ పితరులు సామెత చెప్పినట్టు దుర్మార్గుల నుండి దుర్మార్గత పుడుతుంది. అయితే నేను నిన్ను చంపను.
Ɛbɛ no se, ‘Abɔnefoɔ mu na bɔne firi ba.’ Enti, gye di sɛ, merenha wo.
14 ౧౪ ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకోవాలని బయలుదేరి వచ్చాడు? ఏ పాటి వాణ్ణి తరుముతున్నాడు? చచ్చిన కుక్కనా? పురుగునా?
“Hwan na Israelhene repɛ no akye no yi? Ɛsɛ sɛ ɔsɛe ne berɛ taataa obi a ne ho nni mfasoɔ sɛ ɔkraman funu anaa edwie?
15 ౧౫ యెహోవా నీకూ, నాకూ మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడుగాక. ఆయనే అసలు విషయం విచారణ జరిపి నా తరపున వాదులాడి నిన్ను కాక నన్ను నిర్దోషిగా తీరుస్తాడు గాక.”
Ma Awurade mmu atɛn nkyerɛ yɛn mu deɛ ɔdi bem, na ɔntwe ɛfɔdifoɔ no aso. Ɔno ne me kamafoɔ, na ɔbɛgye me afiri wo tumi ase.”
16 ౧౬ దావీదు సౌలుతో ఈ మాటలు మాట్లాడి ముగించినప్పుడు, సౌలు “దావీదూ, నాయనా, ఈ మాటలు అన్నది నువ్వేనా?” అని బిగ్గరగా ఏడ్చి
Saulo buaa sɛ, “Me babarima Dawid, wo na worekasa yi?” Na ɔhyɛɛ aseɛ suiɛ.
17 ౧౭ దావీదుతో ఇలా అన్నాడు. “యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు
Ɔtoaa so sɛ, “Wotene sene me. Wode papa atua me bɔne so ka, nanso me deɛ mayɛ wo bɔne.
18 ౧౮ ఈ రోజున నువ్వు అపకారానికి ఉపకారం చేసి, నా పట్ల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. నువ్వు నాకంటే నీతిమంతుడివి.
Ampa ara woayɛ me papa a ɛboro so, ɛfiri sɛ Awurade de me hyɛɛ wo nsa a, anka wobɛtumi akum me nanso woanku me.
19 ౧౯ ఒకరికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేస్తాడా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేస్తాడు గాక.
Sɛ obi nsa ka ne ɔtamfoɔ a, ɔgyaa no ma no kɔ kwa? Awurade nhyira wo wɔ ɛkwan a wode me afa so ɛnnɛ yi ho.
20 ౨౦ కచ్చితంగా నువ్వు రాజువవుతావు. ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్థిరం అయిందని నాకు తెలుసు.
Afei mahunu sɛ, deɛ ɛbɛyɛ biara, wɔbɛsi wo ɔhene, na Israel ahemman no bɛdi yie wɔ wo pɛn so.
21 ౨౧ కాబట్టి నా తరువాత నా సంతతిని నీవు నిర్మూలం చేయకుండా ఉండేలా, నా తండ్రి ఇంట్లోనుండి నా పేరు కొట్టివేయకుండేలా, యెహోవా నామం పేరిట నాకు శపథం చెయ్యి.” అప్పుడు దావీదు సౌలుకు శపథం చేశాడు.
Afei, suae Awurade din mu kyerɛ me sɛ, sɛ wobɛdi adeɛ a, worentwa mʼasefoɔ anaa worempepa me din mfiri mʼagya fie.”
22 ౨౨ తరువాత సౌలు ఇంటికి తిరిగివచ్చాడు. దావీదు, అతని అనుచరులు తాము దాక్కొన్న స్థలాలకు వెళ్ళిపోయారు.
Enti, Dawid suae kyerɛɛ Saulo. Na Saulo sane kɔɔ efie, na Dawid ne ne mmarima kɔɔ wɔn banbɔeɛ mu.

< సమూయేలు~ మొదటి~ గ్రంథము 24 >