< 1 కొరింథీయులకు 15 >

1 సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు.
ואני אחי אודיעכם את הבשורה אשר בשרתי אתכם אשר גם קבלתם אתה וגם עמדתם בה׃
2 మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు.
אשר גם תושעו בה אם תחזיקו בדבר אשר בשרתי אתכם אך אם לא לשוא האמנתם׃
3 దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు,
כי מסרתי לכם בראשונה את אשר גם קבלתי כי המשיח מת בעד חטאתינו כפי הכתובים׃
4 లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయనను మూడవ రోజున తిరిగి లేపాడు కూడా.
וכי נקבר וכי הוקם ביום השלישי כפי הכתובים׃
5 ఆయన కేఫాకూ, తరువాత పన్నెండు మందికీ కనబడ్డాడు.
וכי נראה אל כיפא ואחריו אל שנים העשר׃
6 ఆ తరువాత ఐదు వందలకంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్ను మూశారు.
ואחרי כן נראה ליותר מחמש מאות אחים כאחד אשר רבם עודם בחיים ומקצתם ישנו׃
7 తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులకందరికీ కనిపించాడు.
ואחרי כן נראה אל יעקב ואחריו אל כל השליחים׃
8 చివరిగా అకాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు.
ואחרי כלם נראה גם אלי כמו אל הנפל׃
9 ఎందుకంటే నేను అపొస్తలులందరిలో తక్కువ వాణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి కాబట్టి నాకు అపొస్తలుడు అన్న పిలుపుకు అర్హత లేదు.
כי אני הצעיר בשליחים ואינני כדי להקרא שליח באשר רדפתי את קהל האלהים׃
10 ౧౦ అయినా నేనేమిటో అది దేవుని కృప వల్లనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను.
אבל בחסד אלהים הייתי מה שהייתי וחסדו עלי לא היה לריק כי יותר מכלם עבדתי ולא אני כי אם חסד אלהים אשר עמדי׃
11 ౧౧ నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే.
והנה גם אני גם המה ככה משמיעים וככה האמנתם׃
12 ౧౨ క్రీస్తు మరణించి సజీవుడై లేచాడని మేము ప్రకటిస్తూ ఉంటే మీలో కొందరు అసలు మృతుల పునరుత్థానమే లేదని ఎలా చెబుతారు?
ואם הגד הגד כי הוקם המשיח מן המתים איך יאמרו אנשים מכם כי אין תחיה למתים׃
13 ౧౩ మృతుల పునరుత్థానం లేకపోతే, క్రీస్తు కూడ లేవలేదు.
אם אין תחיה למתים גם המשיח לא הוקם׃
14 ౧౪ క్రీస్తు లేచి ఉండకపోతే మా సువార్త ప్రకటనా వ్యర్థం, మీ విశ్వాసమూ వ్యర్థం.
ואם המשיח לא הוקם כי עתה ריק שמועתנו וגם ריק אמונתכם׃
15 ౧౫ దేవుడు క్రీస్తును లేపాడని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పాం కదా? మృతులు లేవడం అనేది లేకపోతే దేవుడు యేసును కూడా లేపలేదు కాబట్టి మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులమన్నట్టే.
וגם נמצא עדי שקר לאלהים יען אשר העידנו את האלהים כי הקים את המשיח אשר לא הקימו אם אמת הוא שהמתים לא יקומו׃
16 ౧౬ మృతులు లేవకపోతే క్రీస్తు కూడ లేవలేదు.
כי אם המתים לא יקומו גם המשיח לא קם׃
17 ౧౭ క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్నమాట.
ואם המשיח לא קם הבל אמונתכם ועודכם בחטאתיכם׃
18 ౧౮ అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్నుమూసిన వారు కూడా నశించినట్టే.
אזי גם אשר ישנו במשיח אבד אבדו׃
19 ౧౯ మనం ఈ జీవిత కాలం వరకే క్రీస్తులో ఆశ పెట్టుకొనే వారమైతే మనుషుల్లో మనకంటే నిర్భాగ్యులెవరూ ఉండరు.
ואם בחיים האלה לבד בטחים אנחנו במשיח אמללים אנחנו מכל אדם׃
20 ౨౦ కానీ ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమఫలం అయ్యాడు.
ועתה המשיח הוקם מן המתים ויהי לראשית הישנים׃
21 ౨౧ మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది.
כי אחרי אשר בא המות על ידי אדם אחד גם תחית המתים באה על ידי אדם אחד׃
22 ౨౨ ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు.
כי כאשר באדם מתים כלם כן גם יחיו כלם במשיח׃
23 ౨౩ ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బ్రతికించబడతారు. మొదట, అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనకు చెందినవారు బ్రతికించబడతారు.
וכל אחד ואחד בסדרו ראשית כלם המשיח ואחרי כן אשר הם למשיח בבואו׃
24 ౨౪ ఆ తరువాత ఆయన సమస్త ఆధిపత్యాన్నీ అధికారాన్నీ బలాన్నీ రద్దు చేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది.
ואחרי כן הקץ כשימסר את המלכות אל האלהים האב אחרי בטלו כל משרה וכל שלטן וגבורה׃
25 ౨౫ ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకూ ఆయన పరిపాలించాలి.
כי הוא מלך ימלך עד כי ישית את כל איביו תחת רגליו׃
26 ౨౬ చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం.
ואחרון האיבים אשר יבטל הוא המות׃
27 ౨౭ దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తం అనే మాటలో పాదాల కింద ఉంచిన దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా.
כי כל שת תחת רגליו ובאמרו כל הושת תחתיו ברור הוא שהשת כל תחתיו איננו בכלל׃
28 ౨౮ సమస్తమూ కుమారుడికి వశమైన తరువాత దేవుడు సర్వాధికారిగా ఉండే నిమిత్తం ఆయన కుమారుడు సమస్తాన్నీ తన కింద ఉంచిన దేవునికి తానే లోబడతాడు.
וכאשר יושת הכל תחתיו אז הבן גם הוא יושת תחת השת כל תחתיו למען יהיה האלהים הכל בכל׃
29 ౨౯ ఇదేమీ కాకపోతే చనిపోయిన వారి కోసం బాప్తిసం పొందేవారి సంగతేమిటి? చనిపోయినవారు లేవకపోతే వారి కోసం బాప్తిసం పొందడం ఎందుకు?
כי מה יעשו הנטבלים בעד המתים אם אמת הוא שהמתים קום לא יקומו למה זה יטבלו בעד המתים׃
30 ౩౦ మేము గంటగంటకు ప్రాణం అరచేతిలో ఉంచుకుని బతకడం ఎందుకు?
ולמה זה אנחנו בסכנה בכל שעה׃
31 ౩౧ సోదరులారా, మన ప్రభు క్రీస్తు యేసులో మిమ్మల్ని గూర్చి నేను చూపే అతిశయాన్ని బట్టి నేను ప్రకటించేది ఏమిటంటే, “నేను ప్రతి దినం చనిపోతున్నాను.”
בתהלתנו אשר יש לי במשיח ישוע אדנינו מעיד אני עלי כי מת אנכי בכל יום ויום׃
32 ౩౨ నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడింది కేవలం మానవరీత్యా అయితే నాకు లాభమేముంది? చనిపోయిన వారు లేవకపోతే, “రేపు చనిపోతాం కాబట్టి తిని, తాగుదాం.”
אם לפי ררכו של אדם נלחמתי עם החיות הרעות באפסוס מה תועלת יש לי אם המתים לא יקומו נאכלה ונשתה כי מחר נמות׃
33 ౩౩ మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.”
אל נא תתעו חברת אנשים רעים משחתת מדות טבות׃
34 ౩౪ కాబట్టి మేల్కోండి! నీతి ప్రవర్తన కలిగి, పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గూర్చిన అవగాహన లేదు. మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను.
הקיצו במישרים משכרון ואל תחטאו כי יש אנשים אשר אין בהם דעת אלהים לבשתכם אני אמר זאת׃
35 ౩౫ అయితే “చనిపోయిన వారు ఎలా లేస్తారు? వారెలాటి శరీరంతో వస్తారు?” అని ఒకడు అడుగుతాడు.
ואם יאמר איש איך יקומו המתים ובאי זה גוף יבואו׃
36 ౩౬ బుద్ధి హీనుడా, నీవు విత్తనం వేసినప్పుడు అది ముందు చనిపోతేనే కదా, తిరిగి బతికేది!
אתה הסכל הן מה שתזרע לא יחיה בלתי אם ימות׃
37 ౩౭ నీవు పాతినది గోదుమ గింజైనా, మరి ఏ గింజైనా, వట్టి గింజనే పాతిపెడుతున్నావు గాని పైకి మొలిచే శరీరాన్ని కాదు.
ומה שתזרע אינך זרע את הגוף אשר יהיה כי אם כגרגר ערם של חטה או של אחד הזרעים׃
38 ౩౮ దేవుడే తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికీ దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు.
והאלהים יתן לו גוף כפי רצונו ולכל זרע וזרע את גופו למינהו׃
39 ౩౯ అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు.
לא כל הבשר באשר אחד הוא כי מין אחר הוא בשר האדם ומין אחר בשר הבהמה ומין אחר בשר הדגה ומין אחר בשר העוף׃
40 ౪౦ ఆకాశంలో వస్తువులున్నాయి, భూమి మీద వస్తువులున్నాయి. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు.
ויש גופות שבשמים וגופות שבארץ אבל אחר הוא כבוד הגופות שבשמים וגופות שבארץ אבל אחר הוא כבוד הגופות שבשמים ואחר הוא כבוד הגופות שבארץ׃
41 ౪౧ నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల వెలుగు వేరు. ఒక నక్షత్రానికీ మరొక నక్షత్రానికీ వెలుగులో తేడా ఉంటుంది కదా.
אחר הוא כבוד השמש ואחר הוא כבוד הירח ואחר הוא כבוד הכוכבים כי כוכב מכוכב נבדל בכבודו׃
42 ౪౨ చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు.
וכן גם בתחיה המתים הן יזרע בכליון ויקום בלא כליון׃
43 ౪౩ ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా, బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది.
יזרע בבזיון ויקום בכבוד יזרע בחלשה ויקום בגבורה׃
44 ౪౪ ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తినది ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది.
יזרע גוף נפשי ויקום גוף רוחני יש גוף נפשי ויש גוף רוחני׃
45 ౪౫ దీని గురించి, “ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు” అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు.
כן גם כתוב ויהי האדם הוא אדם הראשון לנפש חיה אדם האחרון לרוח מחיה׃
46 ౪౬ మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరవాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి.
אבל לא של הרוח היא הראשונה אלא של הנפש ואחרי כן של הרוח׃
47 ౪౭ మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు.
האדם הראשון מן האדמה הוא של עפר והאדם השני הוא האדון מן השמים׃
48 ౪౮ మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే.
וכמו אשר הוא מעפר ככה גם אשר הם מעפר וכמו אשר הוא מן השמים ככה גם אשר הם מן השמים׃
49 ౪౯ మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం.
וכאשר לבשנו דמות האדם אשר מעפר כן נלבש גם דמות האדם אשר מן השמים׃
50 ౫౦ సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.
וזאת אני אמר אחי כי בשר ודם לא יוכל לרשת את מלכות האלהים ואשר יכלה לא יירש את אשר לא יכלה׃
51 ౫౧ ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం.
הנה סוד אגידה לכם הן לא כלנו נישן המות אבל כלנו נתחלף׃
52 ౫౨ బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం.
ברגע אחד כהרף עין כתקע השופר האחרון כי יתקע בשופר והמתים יחיו בלי כליון ואנחנו נתחלף׃
53 ౫౩ నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి.
כי מה שעתה לכליון לבוש ילבש אל כליון ואמר ימות יבוש ילבש אל מות׃
54 ౫౪ ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు, “విజయం మరణాన్ని మింగివేసింది” అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.
וכשילבש מה שעתה לכליון אל כליון ומה שעתה למות ילבש אל מות אז יהיה דבר הכתוב בלע המות לנצח׃
55 ౫౫ “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?” (Hadēs g86)
איה עקצף המות איה שאול בצחונך׃ (Hadēs g86)
56 ౫౬ మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.
עקץ המות הוא החטא וכח החטא היא התורה׃
57 ౫౭ అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.
אבל תודות לאלהים אשר נתן לנו הנצחון על ידי אדנינו ישוע המשיח׃
58 ౫౮ కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.
על כן אחי חביבי התכוננו בל תמוטו והעדיפו בכל עת במעשה אדנינו מדעתכם כי לא לריק עמלכם באדנינו׃

< 1 కొరింథీయులకు 15 >