< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 18 >

1 ఇది జరిగిన తరువాత దావీదు ఫిలిష్తీయుల మీద దాడి చేసి వాళ్ళను జయించాడు. గాతు పట్టణాన్ని, దాని గ్రామాలను, ఫిలిష్తీయుల ఆధీనంలోనుంచి లాగేసుకున్నాడు.
Un notikās pēc tam, ka Dāvids kāva Fīlistus un tos pārvarēja un uzņēma Gatu un viņas ciemus no Fīlistu rokas.
2 తరువాత అతడు మోయాబీయులను జయించగా వాళ్ళు దావీదుకు కప్పం కట్టి దాసోహమయ్యారు.
Un viņš kāva arī Moabiešus, tā ka Moabieši Dāvidam palika par kalpiem un nesa dāvanas.
3 తరువాత, సోబా రాజు హదరెజెరు యూఫ్రటీసు నది వరకూ తన అధికారం స్థాపించడానికి బయలు దేరగా హమాతు దగ్గర దావీదు అతన్ని ఓడించాడు.
Dāvids kāva arī HadadEzeru, Cobas ķēniņu, Hamatā, kad šis nogāja savu varu atkal uzcelt pie Eifrat upes.
4 అతని దగ్గర నుంచి వెయ్యి రథాలను, ఏడువేల గుర్రపు రౌతులను, ఇరవైవేల మంది సైనికులను స్వాధీనం చేసుకున్నాడు. దావీదు వాటిలో వంద రథాలకు సరిపడిన గుర్రాలు ఉంచుకుని, మిగిలిన వాటికి చీలమండ నరాలు తెగవేయించాడు.
Un Dāvids tiem atņēma tūkstoš ratus un septiņtūkstoš jātniekus un divdesmit tūkstoš kājniekus, un Dāvids darīja visus zirgus tizlus un atlicināja no tiem simts zirgus.
5 సోబా రాజు హదరెజెరుకు సాయం చెయ్యాలని దమస్కులోని అరామీయులు వచ్చినప్పుడు, దావీదువారిలో ఇరవై రెండు వేలమందిని హతం చేశాడు.
Un Sīrieši no Damaskus nāca HadadEzeram, Cobas ķēniņam, palīgā, bet Dāvids kāva no Sīriešiem divdesmit divi tūkstoš vīrus.
6 తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు కప్పం కట్టి దాసోహమన్నారు. ఈ ప్రకారం దావీదు వెళ్లిన ప్రతి చోటా యెహోవా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు.
Un Dāvids lika (karavīrus) Damaskū Sīrijā, un Sīrieši Dāvidam palika par kalpiem un nesa dāvanas; jo Tas Kungs palīdzēja Dāvidam visur, kur viņš gāja.
7 దావీదు ఇంకా, హదరెజెరు సేవకులు స్వాధీనంలో ఉన్న బంగారు డాళ్లను యెరూషలేముకు తీసుకొచ్చాడు.
Un Dāvids ņēma tās zelta priekšturamās bruņas, kas HadadEzera kalpiem bija, un tās pārveda uz Jeruzālemi.
8 హదరెజెరు పట్టణాలు టిబ్హతు నుంచీ కూను నుంచీ దావీదు లెక్క లేనంత ఇత్తడిని తీసుకొచ్చాడు. తరువాతి కాలంలో సొలొమోను దీనితోనే ఇత్తడి సముద్రాన్ని, స్తంభాలను, ఇత్తడి వస్తువులను చేయించాడు.
Dāvids paņēma arī ļoti daudz vara no Tibeatas un no Kunas, HadadEzera pilsētām; no tā Salamans taisīja to vara jūru un tos stabus un tos vara traukus.
9 దావీదు సోబా రాజు హదరెజెరు సైన్యం అంతటినీ ఓడించాడన్న వార్త హమాతు రాజు తోహూకు వినబడింది.
Kad nu Tojus, Hamatas ķēniņš, dzirdēja, ka Dāvids bija kāvis visu HadadEzera, Cobas ķēniņa, karaspēku,
10 ౧౦ హదరెజెరుకూ తోహూకూ మధ్య విరోధం ఉంది కాబట్టి రాజైన దావీదు హదద్ ఎజెరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించినందుకు, దావీదు క్షేమం తెలుసుకోడానికీ, అతనితో శుభవచనాలు పలకడానికీ, బంగారంతో, వెండితో, ఇత్తడితో చేసిన అనేక రకాలైన పాత్రలు ఇచ్చి, తోహూ తన కొడుకు హదోరమును అతని దగ్గరికి పంపించాడు.
Tad viņš savu dēlu Adoramu sūtīja pie ķēniņa Dāvida, vaicāt pēc viņa labklāšanās un viņam pateikt, kā tas pret HadadEzeru bija karojis un viņu kāvis, jo HadadEzeram bija karš pret Toju.
11 ౧౧ ఈ వస్తువులను కూడా రాజైన దావీదు, తాను ఎదోమీయుల దగ్గర నుంచి, మోయాబీయుల దగ్గర నుంచి, అమ్మోనీయుల దగ్గర నుంచి, ఫిలిష్తీయుల దగ్గర నుంచి, అమాలేకీయుల దగ్గర నుంచి తీసుకొన్న వెండి బంగారాలతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించాడు.
Un visus zelta un sudraba un vara traukus, tos ķēniņš Dāvids svētīja Tam Kungam līdz ar to sudrabu un zeltu, ko viņš no visām tautām bija paņēmis, no Edoma un Moaba un no Amona bērniem, no Fīlistiem un no Amalekiešiem.
12 ౧౨ ఇంకా సెరూయా కొడుకు అబీషై ఉప్పు లోయలో ఎదోమీయుల్లో పద్దెనిమిది వేలమందిని హతం చేశాడు.
Abizajus, Cerujas dēls, kāva arīdzan Edomiešus sāls ielejā, astoņpadsmit tūkstošus.
13 ౧౩ దావీదు ఎదోములో కావలి సైన్యాన్ని ఉంచాడు. ఎదోమీయులందరూ అతనికి దాసులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహోవా అతన్ని రక్షించాడు.
Un viņš lika karavīrus Edomā, un visi Edomieši palika Dāvidam par kalpiem, jo Tas Kungs palīdzēja Dāvidam visur, kurp tas gāja.
14 ౧౪ ఈ విధంగా దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉండి తన ప్రజలందరికీ నీతిన్యాయాలు జరిగించాడు.
Tā Dāvids valdīja pār visu Israēli un nesa tiesu un taisnību visiem saviem ļaudīm.
15 ౧౫ సెరూయా కొడుకు యోవాబు సైన్యాధిపతి. అహీలూదు కొడుకు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల లేఖరి.
Un Joabs, Cerujas, dēls, bija pār karaspēku, un Jehošafats, Aķiluda dēls, bija kanclers,
16 ౧౬ అహీటూబు కొడుకు సాదోకూ, అబ్యాతారు కొడుకు అబీమెలెకూ యాజకులు. షవ్శా శాస్త్రి.
Un Cadoks, Aķitoba dēls, un Abimeleks, Abjatara dēls, bija priesteri, un Zauzus bija skrīveris,
17 ౧౭ యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీయులకూ, పెలేతీయులకూ అధిపతి. ఇంకా, దావీదు కొడుకులు రాజుకు సహాయకులు.
Un Benaja, Jojadas dēls bija pār tiem Krietiem un Plietiem, un Dāvida bērni bija tie pirmie pie ķēniņa.

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 18 >