< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 13 >

1 దావీదు వేలమంది మీద అధిపతులుగా ఉన్నవాళ్ళతోను, వందలమంది మీద అధిపతులుగా ఉన్న వాళ్ళతోను, అధిపతులందరితోను ఆలోచన చేసి, సమావేశంగా కూడుకున్న ఇశ్రాయేలీయులందరితో,
Un Dāvids aprunājās ar tiem virsniekiem pār tūkstošiem un pār simtiem un ar visiem lielkungiem.
2 “ఈ ఆలోచన మీ దృష్టిలో అనుకూలంగా ఉంటే, ఇది మన దేవుడైన యెహోవా వలన కలిగినదే ఐతే, ఇశ్రాయేలీయుల నివాసప్రదేశాలన్నిట్లో మిగిలి ఉన్న మన సహోదరులు తమ పట్టణాల్లో, పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు, లేవీయులు, మనతో కలిసేలా వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి,
Un Dāvids sacīja uz visu Israēla draudzi: ja jums šķiet labi esam un ja tas ir no Tā Kunga mūsu Dieva, tad sūtīsim visur apkārt pie saviem citiem brāļiem visās Israēla valstīs un pie tiem priesteriem un Levitiem savās pilsētās un viņu apgabalos, ka tie pie mums sapulcējās,
3 మన దేవుని మందసం మళ్ళీ మన దగ్గరికి తీసుకొద్దాం రండి. సౌలు రోజుల్లో దాని దగ్గర మనం ఆయన చిత్తాన్ని అడగలేదు” అన్నాడు.
Un atvedīsim sava Dieva šķirstu atkal pie sevis; jo Saula laikā mēs to neesam meklējuši.
4 ఈ పని సమావేశం అయిన అందరి దృష్టిలో అనుకూలం అయింది గనక ప్రజలందరూ ఆ విధంగా చెయ్యడానికి అంగీకరించారు.
Tad visa draudze sacīja, lai tā darot, jo šī valoda patika visiem ļaudīm.
5 దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుంచి తీసుకు రావడానికి దావీదు ఐగుప్తులోని షీహోరు నది మొదలుకుని హమాతు పొలిమేర వరకూ ఉండే ఇశ్రాయేలీయులందరినీ సమావేశపరిచాడు.
Tad Dāvids sapulcināja visu Israēli no Ēģiptes Šihoras, līdz kur nāk uz Hamatu, atvest Dieva šķirstu no KiriatJearimas.
6 కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడైన యెహోవా పేరు పెట్టిన ఆయన మందసాన్ని యూదాలో ఉండే కిర్యత్యారీము అనే బాలా నుంచి తీసుకు రావడానికి అతనూ, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వెళ్ళారు.
Tad Dāvids cēlās ar visu Israēli uz Baālu, tā ir KiriatJearima iekš Jūda, no turienes atvest Dieva Tā Kunga šķirstu, Tā Kunga, kas mīt pār ķerubiem, kur viņa vārds top piesaukts.
7 వాళ్ళు దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి, అబీనాదాబు ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఉజ్జా, అహ్యో అనే వారు బండిని తోలారు.
Un tie veda Dieva šķirstu uz jauniem ratiem no Abinadaba nama, un Uza un Ahijus vadīja tos ratus.
8 దావీదూ, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణశక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉన్నారు.
Un Dāvids un viss Israēls līksmojās Dieva priekšā ar visu spēku, ar dziesmām un ar koklēm un somastabulēm un bungām un pulkstenīšiem un bazūnēm.
9 వాళ్ళు కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు పశువులకు కాలు జారినందువల్ల మందసాన్ని పట్టుకోవాలని ఉజ్జా చెయ్యి చాపినప్పుడు
Bet kad tie nāca līdz Ķidona klonam, tad Uza izstiepa savu roku, to šķirstu turēt, jo tie vērši (to) gāza.
10 ౧౦ యెహోవా కోపం అతని మీద రగిలింది. అతడు తన చెయ్యి మందసం దగ్గరికి చాపినప్పుడు ఆయన అతన్ని దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని సన్నిధిలో చనిపోయాడు.
Tad Tā Kunga dusmas iedegās pret Uzaju, un viņš to sita par to, ka tas savu roku bija izstiepis pēc tā šķirsta, un tas tur nomira Dieva priekšā.
11 ౧౧ యెహోవా ఉజ్జాను హతం చెయ్యడం చూసి దావీదుకు కోపం వచ్చింది. ఆ కారణంగా ఆ స్థలానికి ఈ రోజు వరకూ పెరెజ్‌ ఉజ్జా అని పేరు.
Un Dāvids noskuma, ka Tas Kungs tādu robu robojis, Uzu sizdams, un to vietu nosauca PerecUza (Uzas robs) līdz šai dienai.
12 ౧౨ ఆ రోజున దావీదు దేవుని విషయంలో భయపడి “దేవుని మందసాన్ని నా దగ్గరికి నేను ఎలా తీసుకు పోతాను?” అన్నాడు.
Un Dāvids bijās Dievu tai dienā un sacīja: kā lai es Dieva šķirstu atvedu pie sevis?
13 ౧౩ కాబట్టి దావీదు, మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకుపోకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లోకి దాన్ని తీసుకువెళ్ళాడు.
Un Dāvids neveda to šķirstu pie sevis Dāvida pilī, bet to nolika Gatieša ObedEdoma namā.
14 ౧౪ దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో అతని కుటుంబంతో మూడు నెలలు ఉంది. యెహోవా ఓబేదెదోము ఇంటివాళ్ళను, అతని ఆస్తి అంతటినీ ఆశీర్వదించాడు.
Tā Dieva šķirsts palika pie ObedEdoma viņa namā trīs mēnešus, un Tas Kungs svētīja ObedEdoma namu un visu, kas tam bija.

< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 13 >