< లూకః 17 >

1 ఇతః పరం యీశుః శిష్యాన్ ఉవాచ, విఘ్నైరవశ్యమ్ ఆగన్తవ్యం కిన్తు విఘ్నా యేన ఘటిష్యన్తే తస్య దుర్గతి ర్భవిష్యతి|
ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో!
2 ఏతేషాం క్షుద్రప్రాణినామ్ ఏకస్యాపి విఘ్నజననాత్ కణ్ఠబద్ధపేషణీకస్య తస్య సాగరాగాధజలే మజ్జనం భద్రం|
అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
3 యూయం స్వేషు సావధానాస్తిష్ఠత; తవ భ్రాతా యది తవ కిఞ్చిద్ అపరాధ్యతి తర్హి తం తర్జయ, తేన యది మనః పరివర్త్తయతి తర్హి తం క్షమస్వ|
మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.
4 పునరేకదినమధ్యే యది స తవ సప్తకృత్వోఽపరాధ్యతి కిన్తు సప్తకృత్వ ఆగత్య మనః పరివర్త్య మయాపరాద్ధమ్ ఇతి వదతి తర్హి తం క్షమస్వ|
అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”
5 తదా ప్రేరితాః ప్రభుమ్ అవదన్ అస్మాకం విశ్వాసం వర్ద్ధయ|
అప్పుడు అపొస్తలులు, “ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు.
6 ప్రభురువాచ, యది యుష్మాకం సర్షపైకప్రమాణో విశ్వాసోస్తి తర్హి త్వం సమూలముత్పాటితో భూత్వా సముద్రే రోపితో భవ కథాయామ్ ఏతస్యామ్ ఏతదుడుమ్బరాయ కథితాయాం స యుష్మాకమాజ్ఞావహో భవిష్యతి|
ప్రభువు, “మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకు పో’ అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది.
7 అపరం స్వదాసే హలం వాహయిత్వా వా పశూన్ చారయిత్వా క్షేత్రాద్ ఆగతే సతి తం వదతి, ఏహి భోక్తుముపవిశ, యుష్మాకమ్ ఏతాదృశః కోస్తి?
“మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని ‘నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో’ అంటాడా? అనడు.
8 వరఞ్చ పూర్వ్వం మమ ఖాద్యమాసాద్య యావద్ భుఞ్జే పివామి చ తావద్ బద్ధకటిః పరిచర పశ్చాత్ త్వమపి భోక్ష్యసే పాస్యసి చ కథామీదృశీం కిం న వక్ష్యతి?
పైగా ‘నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తరువాత నువ్వు తినవచ్చు’ అంటాడు.
9 తేన దాసేన ప్రభోరాజ్ఞానురూపే కర్మ్మణి కృతే ప్రభుః కిం తస్మిన్ బాధితో జాతః? నేత్థం బుధ్యతే మయా|
తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా?
10 ఇత్థం నిరూపితేషు సర్వ్వకర్మ్మసు కృతేషు సత్ము యూయమపీదం వాక్యం వదథ, వయమ్ అనుపకారిణో దాసా అస్మాభిర్యద్యత్కర్త్తవ్యం తన్మాత్రమేవ కృతం|
౧౦అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత ‘మేము ఏ యోగ్యతా లేని సేవకులం. మేము చేయాల్సిందే చేశాం’ అని చెప్పాలి.”
11 స యిరూశాలమి యాత్రాం కుర్వ్వన్ శోమిరోణ్గాలీల్ప్రదేశమధ్యేన గచ్ఛతి,
౧౧ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ
12 ఏతర్హి కుత్రచిద్ గ్రామే ప్రవేశమాత్రే దశకుష్ఠినస్తం సాక్షాత్ కృత్వా
౧౨ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు.
13 దూరే తిష్ఠనత ఉచ్చై ర్వక్తుమారేభిరే, హే ప్రభో యీశో దయస్వాస్మాన్|
౧౩“యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు.
14 తతః స తాన్ దృష్ట్వా జగాద, యూయం యాజకానాం సమీపే స్వాన్ దర్శయత, తతస్తే గచ్ఛన్తో రోగాత్ పరిష్కృతాః|
౧౪ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి” అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.
15 తదా తేషామేకః స్వం స్వస్థం దృష్ట్వా ప్రోచ్చైరీశ్వరం ధన్యం వదన్ వ్యాఘుట్యాయాతో యీశో ర్గుణాననువదన్ తచ్చరణాధోభూమౌ పపాత;
౧౫వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి
16 స చాసీత్ శోమిరోణీ|
౧౬బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు.
17 తదా యీశురవదత్, దశజనాః కిం న పరిష్కృతాః? తహ్యన్యే నవజనాః కుత్ర?
౧౭అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ?
18 ఈశ్వరం ధన్యం వదన్తమ్ ఏనం విదేశినం వినా కోప్యన్యో న ప్రాప్యత|
౧౮దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?” అన్నాడు.
19 తదా స తమువాచ, త్వముత్థాయ యాహి విశ్వాసస్తే త్వాం స్వస్థం కృతవాన్|
౧౯“నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
20 అథ కదేశ్వరస్య రాజత్వం భవిష్యతీతి ఫిరూశిభిః పృష్టే స ప్రత్యువాచ, ఈశ్వరస్య రాజత్వమ్ ఐశ్వర్య్యదర్శనేన న భవిష్యతి|
౨౦ఒకసారి పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు.
21 అత ఏతస్మిన్ పశ్య తస్మిన్ వా పశ్య, ఇతి వాక్యం లోకా వక్తుం న శక్ష్యన్తి, ఈశ్వరస్య రాజత్వం యుష్మాకమ్ అన్తరేవాస్తే|
౨౧ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు” అని వారికి జవాబిచ్చాడు.
22 తతః స శిష్యాన్ జగాద, యదా యుష్మాభి ర్మనుజసుతస్య దినమేకం ద్రష్టుమ్ వాఞ్ఛిష్యతే కిన్తు న దర్శిష్యతే, ఈదృక్కాల ఆయాతి|
౨౨ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది. కానీ మీరు ఆ రోజును చూడరు.
23 తదాత్ర పశ్య వా తత్ర పశ్యేతి వాక్యం లోకా వక్ష్యన్తి, కిన్తు తేషాం పశ్చాత్ మా యాత, మానుగచ్ఛత చ|
౨౩వారు, ‘ఇదిగో ఇక్కడుంది, అదిగో అక్కడుంది’ అంటారు. మీరు వెళ్ళవద్దు. అసలు వారిని అనుసరించవద్దు.
24 యతస్తడిద్ యథాకాశైకదిశ్యుదియ తదన్యామపి దిశం వ్యాప్య ప్రకాశతే తద్వత్ నిజదినే మనుజసూనుః ప్రకాశిష్యతే|
౨౪ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకూ ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు.
25 కిన్తు తత్పూర్వ్వం తేనానేకాని దుఃఖాని భోక్తవ్యాన్యేతద్వర్త్తమానలోకైశ్చ సోఽవజ్ఞాతవ్యః|
౨౫అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి.
26 నోహస్య విద్యమానకాలే యథాభవత్ మనుష్యసూనోః కాలేపి తథా భవిష్యతి|
౨౬“నోవహు రోజుల్లో జరిగినట్టు గానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది.
27 యావత్కాలం నోహో మహాపోతం నారోహద్ ఆప్లావివార్య్యేత్య సర్వ్వం నానాశయచ్చ తావత్కాలం యథా లోకా అభుఞ్జతాపివన్ వ్యవహన్ వ్యవాహయంశ్చ;
౨౭నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్ళిళ్ళకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది.
28 ఇత్థం లోటో వర్త్తమానకాలేపి యథా లోకా భోజనపానక్రయవిక్రయరోపణగృహనిర్మ్మాణకర్మ్మసు ప్రావర్త్తన్త,
౨౮లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు.
29 కిన్తు యదా లోట్ సిదోమో నిర్జగామ తదా నభసః సగన్ధకాగ్నివృష్టి ర్భూత్వా సర్వ్వం వ్యనాశయత్
౨౯అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు.
30 తద్వన్ మానవపుత్రప్రకాశదినేపి భవిష్యతి|
౩౦“అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది.
31 తదా యది కశ్చిద్ గృహోపరి తిష్ఠతి తర్హి స గృహమధ్యాత్ కిమపి ద్రవ్యమానేతుమ్ అవరుహ్య నైతు; యశ్చ క్షేత్రే తిష్ఠతి సోపి వ్యాఘుట్య నాయాతు|
౩౧ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు.
32 లోటః పత్నీం స్మరత|
౩౨లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.
33 యః ప్రాణాన్ రక్షితుం చేష్టిష్యతే స ప్రాణాన్ హారయిష్యతి యస్తు ప్రాణాన్ హారయిష్యతి సఏవ ప్రాణాన్ రక్షిష్యతి|
౩౩తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు.
34 యుష్మానహం వచ్మి తస్యాం రాత్రౌ శయ్యైకగతయో ర్లోకయోరేకో ధారిష్యతే పరస్త్యక్ష్యతే|
౩౪నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది.
35 స్త్రియౌ యుగపత్ పేషణీం వ్యావర్త్తయిష్యతస్తయోరేకా ధారిష్యతే పరాత్యక్ష్యతే|
౩౫ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.”
36 పురుషౌ క్షేత్రే స్థాస్యతస్తయోరేకో ధారిష్యతే పరస్త్యక్ష్యతే|
౩౬అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు.
37 తదా తే పప్రచ్ఛుః, హే ప్రభో కుత్రేత్థం భవిష్యతి? తతః స ఉవాచ, యత్ర శవస్తిష్ఠతి తత్ర గృధ్రా మిలన్తి|
౩౭దానికి జవాబుగా ఆయన, “శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి” అన్నాడు.

< లూకః 17 >