< Притчи 18 >

1 Прихоти ищет своенравный, восстает против всего умного.
తనకు తానుగా ఉండే వాడు స్వార్థపరుడు. వాడు సరైన ఆలోచనకు వ్యతిరేకం.
2 Глупый не любит знания, а только бы выказать свой ум.
మూర్ఖుడికి విషయం అర్థం చేసుకోవాలని ఉండదు. తానేమి అనుకుంటున్నాడో అది చెప్పడమే అతనికి ఇష్టం.
3 С приходом нечестивого приходит и презрение, а с бесславием - поношение.
దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది. అతడితో బాటే కళంకం, నింద వస్తాయి.
4 Слова уст человеческих - глубокие воды; источник мудрости - струящийся поток.
మనిషి పలికే మాటలు లోతుగా ప్రవహించే ప్రవాహం వంటివి. జ్ఞానపు ఊటలో నుండి పారే సెలయేరు వంటివి.
5 Нехорошо быть лицеприятным к нечестивому, чтобы ниспровергнуть праведного на суде.
దుష్టుడి పట్ల పక్షపాతం చూపుడం, నిర్దోషులకు అన్యాయం చేయడం భావ్యం కాదు.
6 Уста глупого идут в ссору, и слова его вызывают побои.
బుద్ధి లేని వాడి పెదాలు కలహానికి కాచుకుని ఉంటాయి. వాడి మాటలు దెబ్బల కోసం వెంపర్లాతాయి.
7 Язык глупого - гибель для него, и уста его - сеть для души его.
మూర్ఖుడి నోరు వాడికే నాశన హేతువు. అతని మాటలే అతనికి ఉరి.
8 Слова наушника - как лакомства, и они входят во внутренность чрева.
కొండేలు చెప్పే వాడి మాటలు చవులూరించే భక్ష్యాలు. అవి హాయిగా కడుపులోకి దిగిపోతాయి.
9 Нерадивый в работе своей - брат расточителю.
పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న.
10 Имя Господа - крепкая башня: убегает в нее праведник - и безопасен.
౧౦యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.
11 Имение богатого крепкий город его, и как высокая ограда в его воображении.
౧౧ధనవంతుడి ఆస్తి అతనికి దిట్టమైన కోట. అది పటిష్టమైన ప్రాకారం అని అతని భ్రమ.
12 Перед падением возносится сердце человека, а смирение предшествует славе.
౧౨విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది.
13 Кто дает ответ не выслушав, тот глуп, и стыд ему.
౧౩సావధానంగా వినకుండానే జవాబిచ్చేవాడు తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటాడు. సిగ్గు కొని తెచ్చుకుంటాడు.
14 Дух человека переносит его немощи; а пораженный дух - кто может подкрепить его?
౧౪వ్యాధి కలిగినా మనిషి ఆత్మ వైపుకుని నిలబడుతుంది. ఆత్మే నలిగిపోతే భరించడమెలా?
15 Сердце разумного приобретает знание, и ухо мудрых ищет знания.
౧౫తెలివి గలవారి హృదయం జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. వివేకి అస్తమానం దాని పైనే గురి పెట్టుకుంటాడు.
16 Подарок у человека дает ему простор и до вельмож доведет его.
౧౬ఒక మనిషి ఇచ్చే కానుక తలుపులు తెరుస్తుంది. దాని సాయంతో అతడు గొప్పవారిని కలుసుకుంటాడు.
17 Первый в тяжбе своей прав, но приходит соперник его и исследывает его.
౧౭వ్యాజ్యంలో మొదట మాట్లాడిన వాడి మాటలు సరైనవిగా కనిపిస్తాయి. అయితే అతని ప్రత్యర్థి వచ్చాక గానీ విషయం తేట పడదు.
18 Жребий прекращает споры и решает между сильными.
౧౮చీట్లు వేస్తే వివాదం సమసిపోతుంది. బలమైన వారిని అది ఊరుకోబెడుతుంది.
19 Озлобившийся брат неприступнее крепкого города, и ссоры подобны запорам замка.
౧౯పటిష్టమైన నగరాన్ని వశపరచుకోవడం కంటే అలిగిన సోదరుణ్ణి సముదాయించడం కష్టం. పోట్లాటలు కోట తలుపుల అడ్డగడియలంత గట్టివి.
20 От плода уст человека наполняется чрево его; произведением уст своих он насыщается.
౨౦ఒకడి కడుపు నిండడం అతని నోటి మాటలను బట్టే ఉంటుంది. తన పెదవుల పంట కోత మూలంగా అతడు తృప్తిచెందుతాడు.
21 Смерть и жизнь - во власти языка, и любящие его вкусят от плодов его.
౨౧జీవన్మరణాలు నాలుక వశం. దాన్ని ఇష్టపడే వారు దాని ఫలం అనుభవిస్తారు.
22 Кто нашел добрую жену, тот нашел благо и получил благодать от Господа.
౨౨భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు.
23 С мольбою говорит нищий, а богатый отвечает грубо.
౨౩నిరుపేద ఎంతో ప్రాధేయ పడతాడు. ధనవంతుడు దురుసుగా జవాబిస్తాడు.
24 Кто хочет иметь друзей, тот и сам должен быть дружелюбным; и бывает друг, более привязанный, нежели брат.
౨౪ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.

< Притчи 18 >