< Dzieje 2 >

1 A gdy nadszedł dzień Pięćdziesiątnicy, wszyscy byli jednomyślnie na tym samym miejscu.
పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట సమావేశమయ్యారు.
2 Nagle powstał odgłos z nieba, jakby uderzenie gwałtownego wiatru, i wypełnił cały dom, w którym siedzieli.
అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది.
3 Ukazały się im rozdzielone języki jakby z ognia, które spoczęły na każdym z nich.
అగ్నిజ్వాలలు నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరి మీదా వాలాయి.
4 I wszyscy zostali napełnieni Duchem Świętym, i zaczęli mówić innymi językami, tak jak im Duch pozwalał mówić.
అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు.
5 A przebywali w Jerozolimie Żydzi, mężczyźni pobożni, ze wszystkich narodów pod niebem.
ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు.
6 A kiedy powstał ten szum, zeszło się mnóstwo [ludzi] i zdumieli się, bo każdy z nich słyszał ich mówiących [w jego] własnym języku.
ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు.
7 I pytali się nawzajem zdziwieni i pełni zdumienia: Czy ci wszyscy, którzy mówią, nie są Galilejczykami?
వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా.
8 Jak to jest, że każdy z nas słyszy swój własny język ojczysty?
మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి?
9 Partowie, Medowie, Elamici i ci, którzy mieszkają w Mezopotamii, Judei, Kapadocji, w Poncie i Azji;
పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసపటేమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియ
10 We Frygii, w Pamfilii, Egipcie i w częściach Libii, które leżą obok Cyreny, a także przybysze z Rzymu, [zarówno] Żydzi, [jak] i prozelici;
౧౦ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనేలో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన
11 Kreteńczycy i Arabowie – słyszymy ich głoszących w naszych językach wielkie dzieła Boże.
౧౧యూదులూ, యూదామతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నాము” అనుకున్నారు.
12 I zdumiewali się wszyscy, i dziwili, mówiąc jeden do drugiego: Co to ma znaczyć?
౧౨అందరూ ఆశ్చర్యచకితులై ఎటూ తోచక, “ఇదేమిటో” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.
13 Lecz inni naśmiewali się i mówili: Upili się młodym winem.
౧౩కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు.
14 Wtedy stanął Piotr z jedenastoma, podniósł swój głos i przemówił do nich: Mężowie z Judei i wszyscy, którzy mieszkacie w Jerozolimie, przyjmijcie do wiadomości i posłuchajcie uważnie moich słów.
౧౪అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “యూదయ ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి.
15 Oni bowiem nie są pijani, jak sądzicie, bo jest dopiero trzecia godzina dnia.
౧౫“మీరనుకున్నట్టు వీరు మద్యపానం చేయలేదు. ఇప్పుడు ఉదయం తొమ్మిదయినా కాలేదు.
16 Ale to jest to, co zostało przepowiedziane przez proroka Joela:
౧౬యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే,
17 I stanie się w ostatecznych dniach – mówi Bóg – że wyleję z mego Ducha na wszelkie ciało i będą prorokować wasi synowie i córki, wasi młodzieńcy będą mieć widzenia, a starcy będą śnić sny.
౧౭‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు. మీ యువకులు దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కంటారు,
18 Nawet na moje sługi i służebnice wyleję w tych dniach z mego Ducha i będą prorokować.
౧౮ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు.
19 I ukażę cuda na niebie w górze i znaki na ziemi na dole, krew, ogień i kłęby dymu.
౧౯పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను.
20 Słońce zamieni się w ciemność, a księżyc w krew, zanim nadejdzie ten dzień Pański, wielki i okazały.
౨౦ప్రభువు ప్రత్యక్షమయ్యే మహిమాయుక్తమైన ఆ మహాదినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు.
21 I stanie się, [że] każdy, kto wezwie imienia Pana, będzie zbawiony.
౨౧ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారంతా పాప విమోచన పొందుతారు’ అని దేవుడు చెబుతున్నాడు.
22 Mężowie izraelscy, słuchajcie tych słów: Jezusa z Nazaretu, męża potwierdzonego przez Boga wśród was mocami, cudami i znakami, których Bóg dokonał przez niego wśród was, o czym sami wiecie;
౨౨“ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు.
23 Wydanego zgodnie z powziętym postanowieniem Boga oraz tym, co przedtem wiedział, wzięliście i rękami bezbożników ukrzyżowaliście i zabiliście.
౨౩దేవుని స్థిరమైన ప్రణాళికనూ ఆయనకున్న భవిష్య జ్ఞానాన్నీ అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు.
24 Jego to Bóg wskrzesił, uwolniwszy od boleści śmierci, bo było niemożliwe, aby ta mogła go zatrzymać.
౨౪మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు.
25 Dawid bowiem mówi o nim: Patrzyłem na Pana zawsze przed moim obliczem, bo jest po [mojej] prawicy, żebym się nie zachwiał.
౨౫“ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు, ‘నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను, ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు.
26 Dlatego rozweseliło się moje serce i rozradował się mój język, a także moje ciało będzie spoczywać w nadziei.
౨౬నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది. నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది.
27 Nie zostawisz bowiem mojej duszy w piekle i nie dasz swojemu Świętemu doznać zniszczenia. (Hadēs g86)
౨౭ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు. (Hadēs g86)
28 Dałeś mi poznać drogi życia, a twoje oblicze napełni mnie radością.
౨౮నాకు జీవమార్గాలు తెలిపావు. నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.’
29 Mężowie bracia, mogę swobodnie mówić do was o patriarsze Dawidzie, że umarł i został pogrzebany, a jego grobowiec znajduje się u nas aż do dziś.
౨౯“సోదరులారా, పూర్వికుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు.
30 Będąc więc prorokiem i wiedząc, że Bóg zaręczył mu przysięgą, [iż] z owocu jego bioder, według ciała, wzbudzi Chrystusa i posadzi na jego tronie;
౩౦అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి ‘అతని గర్భఫలం నుంచి ఒకడిని అతని సింహాసనం మీద కూర్చోబెడతాను’ అని “దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి అతనికి తెలుసు.
31 Przepowiadał [to] i mówił o zmartwychwstaniu Chrystusa, że jego dusza nie pozostanie w piekle, a jego ciało nie dozna zniszczenia. (Hadēs g86)
౩౧క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండి పోలేదనీ, ఆయన శరీరం కుళ్ళి పోలేదనీ దావీదు ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు. (Hadēs g86)
32 Tego to Jezusa wskrzesił Bóg, czego my wszyscy jesteśmy świadkami.
౩౨“ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.
33 [Będąc] więc wywyższony prawicą Boga, otrzymał od Ojca obietnicę Ducha Świętego i wylał to, co wy teraz widzicie i słyszycie.
౩౩కాబట్టి ఆయనను దేవుడు తన కుడి స్థానానికి హెచ్చించాడు. ఆయన తన తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది, మీరు చూస్తున్న, వింటున్న ఈ కుమ్మరింపును జరిగించాడు.
34 Dawid bowiem nie wstąpił do nieba, a jednak sam mówi: Powiedział Pan memu Panu: Siądź po mojej prawicy;
౩౪దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు. అయితే అతడిలా అన్నాడు,
35 Aż położę twoich nieprzyjaciół jako podnóżek pod twoje stopy.
౩౫‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచే వరకూ నీవు నా కుడి పక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.’
36 Niech więc cały dom Izraela wie z pewnością, że tego Jezusa, którego wy ukrzyżowaliście, Bóg uczynił i Panem, i Chrystusem.
౩౬“మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి.”
37 A słysząc to, przerazili się do [głębi] serca i zapytali Piotra i pozostałych apostołów: Co mamy robić, mężowie bracia?
౩౭వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు.
38 Wtedy Piotr powiedział do nich: Pokutujcie i niech każdy z was ochrzci się w imię Jezusa Chrystusa na przebaczenie grzechów, a otrzymacie dar Ducha Świętego.
౩౮దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు.
39 Obietnica ta bowiem dotyczy was, waszych dzieci i wszystkich, którzy są daleko, każdego, kogo powoła Pan, nasz Bóg.
౩౯ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.
40 W wielu też innych słowach dawał świadectwo i napominał ich: Ratujcie się od tego przewrotnego pokolenia.
౪౦ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు.
41 Ci więc, którzy chętnie przyjęli jego słowa, zostali ochrzczeni. I przyłączyło się tego dnia około trzech tysięcy dusz.
౪౧అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.
42 Trwali oni w nauce apostołów, w społeczności, w łamaniu chleba i w modlitwach.
౪౨వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.
43 I strach ogarnął każdą duszę, gdyż wiele znaków i cudów działo się przez apostołów.
౪౩అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు.
44 A wszyscy, którzy uwierzyli, byli razem i wszystko mieli wspólne.
౪౪నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు.
45 Sprzedawali posiadłości i dobra i rozdzielali je wszystkim według potrzeb.
౪౫అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు.
46 Każdego dnia trwali zgodnie w świątyni, a łamiąc chleb po domach, przyjmowali pokarm z radością i w prostocie serca;
౪౬ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ,
47 Chwaląc Boga i ciesząc się przychylnością wszystkich ludzi. A Pan dodawał kościołowi każdego dnia tych, którzy mieli być zbawieni.
౪౭ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

< Dzieje 2 >