< حزقیال 16 >

و کلام خداوند بر من نازل شده، گفت: ۱ 1
అప్పుడు యెహోవా నాకు తన వాక్కు ఇచ్చి,
«ای پسر انسان اورشلیم را ازرجاساتش آگاه ساز! ۲ 2
“నరపుత్రుడా, యెరూషలేము చేసిన అసహ్యమైన పనులు దానికి తెలియజేసి, నువ్వు ఇలా ప్రకటించు,
و بگو خداوند یهوه به اورشلیم چنین می‌فرماید: اصل و ولادت تو اززمین کنعان است. پدرت اموری و مادرت حتی بود. ۳ 3
ప్రభువైన యెహోవా యెరూషలేము గురించి ఇలా అంటున్నాడు, నీ ఆరంభం, నీ పుట్టుక కనాను ప్రదేశంలో జరిగింది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.
و اما ولادت تو. در روزی که متولد شدی نافت را نبریدند و تو را به آب غسل ندادند و طاهرنساختند و نمک نمالیدند و به قنداقه نپیچیدند. ۴ 4
నువ్వు పుట్టిన రోజు నీ తల్లి నీ బొడ్డు కొయ్యలేదు. శుభ్రం చెయ్యడానికి నిన్ను నీళ్ళతో కడగలేదు, నిన్ను ఉప్పుతో తుడవలేదు, నిన్ను బట్టల్లో చుట్టలేదు.
چشمی بر تو شفقت ننمود و بر تو مرحمت نفرمود تا یکی از اینکارها را برای تو بعمل آورد. بلکه در روز ولادتت جان تو را خوار شمرده، تورا بر روی صحرا انداختند. ۵ 5
ఈ పనుల్లో ఒక్కటైనా నీ పట్ల చెయ్యాలని ఎవరికీ కనికరం కలగలేదు. నీ పట్ల జాలి పడినవాడు ఒక్కడూ లేడు. నువ్వు పుట్టిన రోజే నీ మీద ద్వేషంతో నిన్ను ఆరుబయట పొలంలో విసిరేశారు.
و من از نزد تو گذرنمودم و تو را در خونت غلطان دیدم. پس تو راگفتم: ای که به خونت آلوده هستی زنده شو! بلی گفتم: ای که به خونت آلوده هستی، زنده شو! ۶ 6
కాని నేను నీ దగ్గరికి వచ్చి, నీ రక్తంలోనే పొర్లుతున్న నిన్ను చూసి, నీ రక్తంలో పొర్లుతున్న నీతో, ‘బ్రతుకు’ అని చెప్పాను.
وتو را مثل نباتات صحرا بسیار افزودم تا نمو کرده، بزرگ شدی و به زیبایی کامل رسیدی. پستانهایت برخاسته و مویهایت بلند شد، لیکن برهنه و عریان بودی. ۷ 7
పొలంలో నాటిన ఒక మొక్క ఎదిగినట్టు నువ్వు ఎదిగేలా చేశాను. నువ్వు వృద్ధి పొంది గొప్పదానివై రత్నాలు పొదిగిన ఆభరణం అయ్యావు. నువ్వు నగ్నంగా వస్త్రహీనంగా ఉన్నా, నీ రొమ్ములు బిగువుగా, నీ తలవెంట్రుకలు ఒత్తుగా పెరిగాయి.
«و چون از تو گذر کردم برتو نگریستم واینک زمان تو زمان محبت بود. پس دامن خود رابر تو پهن کرده، عریانی تو را مستور ساختم و خداوند یهوه می‌گوید که با تو قسم خوردم و با توعهد بستم و از آن من شدی. ۸ 8
మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూశాను. చూడు! ప్రేమ కలిగించే ప్రాయం నీకు వచ్చింది గనక నా వస్త్రంతో నీ నగ్నత్వాన్ని కప్పాను. ఆ తరవాత నేను నీతో ఒప్పందం చేశాను.” ఇది ప్రభువైన యెహోవా చేసిన ప్రకటన. “అప్పుడు నువ్వు నా దానివయ్యావు.
و تو را به آب غسل داده، تو را از خونت طاهر ساختم و تو را به روغن تدهین کردم. ۹ 9
కాబట్టి నేను నీళ్ళతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతా తుడిచి, నిన్ను నూనెతో అభిషేకం చేసి,
و تو را به لباس قلابدوزی ملبس ساختم و نعلین پوست خز به پایت کردم و تو را به کتان نازک آراسته و به ابریشم پیراسته ساختم. ۱۰ 10
౧౦బుటాదారీ పని చేసిన వస్త్రం నీకు ధరింపజేసి, నీ పాదాలకు తోలు చెప్పులు తొడిగాను. సన్నని నారబట్టతో నిన్ను చుట్టి, పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను.
و تو را به زیورها زینت داده، دستبندها بردستت و گردن بندی بر گردنت نهادم. ۱۱ 11
౧౧తరువాత ఆభరణాలతో నిన్ను అలంకరించి నీ చేతులకు కడియాలు తొడిగి నీ మెడలో గొలుసు వేసి,
وحلقه‌ای در بینی و گوشواره‌ها در گوشهایت و تاج جمالی بر سرت نهادم. ۱۲ 12
౧౨నీ చెవులకూ, ముక్కుకూ పోగులు పెట్టి, నీ తల మీద కిరీటం పెట్టాను.
پس با طلا و نقره آرایش یافتی و لباست از کتان نازک و ابریشم قلابدوزی بود و آرد میده و عسل و روغن خوردی و بی‌نهایت جمیل شده، به درجه ملوکانه ممتاز گشتی. ۱۳ 13
౧౩ఈ విధంగా బంగారంతో, వెండితో నేను నిన్ను అలంకరించి, సన్న నార, పట్టు, బుటాదారీ పని ఉన్న బట్టలు నీకు ధరింపజేశాను. నువ్వు మెత్తని గోదుమ పిండి, తేనె, నూనె ఆహారంగా తిని, అత్యంత సౌందర్యరాశివైన రాణివయ్యావు.
و آوازه تو به‌سبب زیباییت درمیان امت‌ها شایع شد. زیرا خداوند یهوه می‌گویدکه آن زیبایی از جمال من که بر تو نهاده بودم کامل شد. ۱۴ 14
౧౪నేను నీకిచ్చిన ఘనతతో నీ అందం పరిపూర్ణం అయింది. దేశదేశాల్లో నీ కీర్తి ప్రచురం అయ్యింది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
«اما بر زیبایی خود توکل نمودی و به‌سبب آوازه خویش زناکار گردیدی و زنای خویش را برهر رهگذری ریختی و از آن او شد. ۱۵ 15
౧౫“కాని నువ్వు నీ అందాన్ని ఆధారం చేసుకుని, నీకు కీర్తి వచ్చినందుకు, ఒక వేశ్యలా దారిలో వెళ్ళే ప్రతివాడితో పొకిరీ పనులు జరిగిస్తూ వచ్చావు. నువ్వు ఆ మగాళ్ళ సొత్తుగా అయ్యావు.
و ازلباسهای خود گرفتی و مکان های بلند رنگارنگ برای خود ساخته، بر آنها زنا نمودی که مثل اینکارها واقع نشده و نخواهد شد. ۱۶ 16
౧౬అప్పుడు నువ్వు నీ వస్త్రాలతో రంగురంగులతో అలంకరించిన దేవాలయాలు నీ కోసం చేసుకుని, వాటి దగ్గర ఒక వేశ్యలా ప్రవర్తించావు. ఇలా జరగాల్సింది కాదు. ఇది జరగక పొతే బాగుండేది.
و زیورهای زینت خود را از طلا و نقره (من که به تو داده بودم )گرفته، تمثالهای مردان را ساخته با آنها زنانمودی. ۱۷ 17
౧౭నేను నీకిచ్చిన బంగారం, వెండి ఆభరణాలతో నువ్వు పురుష రూపంలో విగ్రహాలు చేసుకుని వాటితో ఒక పతిత చేసినట్టు చేశావు.
و لباس قلابدوزی خود را گرفته، به آنها پوشانیدی و روغن و بخور مرا پیش آنهاگذاشتی. ۱۸ 18
౧౮ఇంకా నీ బుటాదారీ పని చేసిన వస్త్రాలు తీసి వాటికి కప్పి, నా తైలాలు, నా పరిమళ తైలాలు వాటి కోసం అర్పించావు.
و نان مرا که به تو داده بودم و آردمیده و روغن و عسل را که رزق تو ساخته بودم، پیش آنها برای هدیه خوشبویی نهادی و چنین شد. قول خداوند یهوه این است. ۱۹ 19
౧౯నీ పోషణ కోసం నేను నీకిచ్చిన మెత్తని గోదుమ పిండితో చేసిన నా రొట్టెలు, నూనె, తేనె తీసుకుని, సువాసన కలిగేలా నువ్వు వాటి కోసం అర్పణ చేశావు. నిజంగా జరిగింది ఇదే.” ఇది ప్రభువైన యెహోవా వాక్కు.
و پسران ودخترانت را که برای من زاییده بودی گرفته، ایشان را به جهت خوراک آنها ذبح نمودی. آیا زنا کاری تو کم بود ۲۰ 20
౨౦“తరువాత ఆ ప్రతిమలు ఆత్రంగా మింగేయడానికి నువ్వు నాకు కన్న కొడుకులను, కూతుళ్ళను వాటికి బలి అర్పించావు.
که پسران مرا نیز کشتی و ایشان راتسلیم نمودی که برای آنها از آتش گذرانیده شوند؟ ۲۱ 21
౨౧నువ్వు నా పిల్లలను చంపి ఆ ప్రతిమలకు దహనబలిగా అర్పించావు.
و در تمامی رجاسات و زنای خود ایام جوانی خود را حینی که عریان و برهنه بودی و درخون خود می‌غلطیدی بیاد نیاوردی.» ۲۲ 22
౨౨నీ బాల్యంలో నువ్వు నగ్నంగా, వస్త్రహీనంగా ఉండి నీ రక్తంలో నువ్వు పొర్లుతూ ఉన్న సంగతి మర్చిపోయి ఈ అసహ్యమైన వ్యభిచార క్రియలు చేస్తూ వచ్చావు.
و خداوند یهوه می‌گوید: «وای بر تو! وای بر تو! زیرا بعد از تمامی شرارت خود، ۲۳ 23
౨౩బాధ! నీకు బాధ” ఇది ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి, ఈ దుర్మార్గమంతటికీ తోడుగా,
خراباتها برای خود بنا نمودی و عمارات بلنددر هر کوچه برای خود ساختی. ۲۴ 24
౨౪నువ్వు నీ కోసం ఒక బలిపీఠం, ప్రతి బహిరంగ ప్రాంగణంలో ఒక గుడి కట్టించావు.
بسر هر راه عمارتهای بلند خود را بنا نموده، زیبایی خود رامکروه ساختی و برای هر راهگذری پایهای خویش را گشوده، زناکاریهای خود را افزودی. ۲۵ 25
౨౫ప్రతి వీధి మొదట్లో గుళ్ళు కట్టి, నీ అందాన్ని అసభ్య క్రియల కోసం వాడి, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నీ కాళ్ళు తెరిచి వాళ్ళతో ఎన్నో వ్యభిచార క్రియలు చేశావు.
و با همسایگان خود پسران مصر که بزرگ گوشت می‌باشند، زنا نمودی و زناکاری خود راافزوده، خشم مرا بهیجان آوردی. ۲۶ 26
౨౬నువ్వు కామ వాంఛలతో నిండి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వేశ్యలా ప్రవర్తించి, వ్యభిచార క్రియలు ఎన్నో చేసి నాకు కోపం పుట్టించావు.
لهذا اینک من دست خود را بر تو دراز کرده، وظیفه تو را قطع نمودم و تو را به آرزوی دشمنانت یعنی دختران فلسطینیان که از رفتار قبیح تو خجل بودند، تسلیم نمودم. ۲۷ 27
౨౭కాబట్టి చూడు! నేను నీకు విరోధినై నీకు తిండి లేకుండా చేస్తాను. నీ వ్యభిచార క్రియలనుబట్టి నిన్ను సిగ్గు పరచడానికి, నీ శత్రువులైన ఫిలిష్తీయుల కూతుళ్ళ చేతికి నీ ప్రాణం అప్పగిస్తాను.
و چونکه سیر نشدی با بنی آشور نیز زنا نمودی و با ایشان نیز زنا نموده، سیرنگشتی. ۲۸ 28
౨౮నీకు తృప్తి లేక, అష్షూరువాళ్ళతో కూడా నువ్వు ఒక వేశ్యలా ప్రవర్తించావు. వేశ్యలా ప్రవర్తించినా, నీకు తృప్తి కలగలేదు.
و زناکاریهای خود را از زمین کنعان تازمین کلدانیان زیاد نمودی و از این هم سیرنشدی.» ۲۹ 29
౨౯కనాను దేశం మొదలుకుని కల్దీయ దేశం వరకూ ఎంతో వ్యభిచారం చేసినా, నువ్వు తృప్తి పొందలేదు.
خداوند یهوه می‌گوید: «دل تو چه قدرضعیف است که تمامی این اعمال را که کار زن زانیه سلیطه می‌باشد، بعمل آوردی. ۳۰ 30
౩౦నీ హృదయం ఎందుకింత బలహీనంగా ఉంది?” ఇది ప్రభువైన యెహోవా వాక్కు “సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటనన్నిటినీ జరిగించడానికి
که بسرهر راه خرابات خود را بنا نمودی و در هر کوچه عمارات بلند خود را ساختی و مثل فاحشه های دیگر نبودی چونکه اجرت را خوار شمردی. ۳۱ 31
౩౧నువ్వు ప్రతి వీధి మొదట్లో బలిపీఠాలు, ప్రతి బహిరంగ ప్రదేశంలో గుళ్ళు కట్టి, నిజానికి నువ్వు ఒక వేశ్య చేసినట్టు చెయ్యలేదు. ఎందుకంటే నువ్వు చేసిన వేశ్యక్రియలకు డబ్బు తీసుకోలేదు!
‌ای زن زانیه که غریبان را به‌جای شوهر خودمی گیری! ۳۲ 32
౩౨కులటా! నువ్వు నీ భర్తకు బదులుగా పరాయివాళ్ళను అంగీకరించావు!
به جمیع فاحشه‌ها اجرت می‌دهند. ۳۳ 33
౩౩మనుషులు వేశ్యలకు డబ్బు చెల్లిస్తారు, కాని నీ ప్రేమికులందరూ నలుదిక్కుల నుంచి వచ్చి నీతో వ్యభిచరించడానికి రమ్మని వాళ్ళందరికీ నువ్వే నీ డబ్బు బాడుగగా ఇస్తూ వచ్చావు.
و عادت تو درزناکاریت برعکس سایر زنان است. چونکه کسی به جهت زناکاری از عقب تو نمی آید و تو اجرت می‌دهی و کسی به تو اجرت نمی دهد. پس عادت تو بر عکس دیگران است.» ۳۴ 34
౩౪నీకు, ఇతర స్త్రీలకు తేడా ఉంది. ఎందుకంటే, తమతో వ్యభిచారం చెయ్యమని ఎవరూ నిన్ను అడగరు. నువ్వే వాళ్లకు ఎదురు డబ్బు చెల్లిస్తావు! నీకెవరూ డబ్బు ఇవ్వరు.”
بنابراین‌ای زانیه! کلام خداوند را بشنو! ۳۵ 35
౩౫కాబట్టి కులటా, యెహోవా మాట ఆలకించు!
خداوند یهوه چنین می‌گوید: «چونکه نقد توریخته شد و عریانی تو از زناکاریت با عاشقانت وبا همه بتهای رجاساتت و از خون پسرانت که به آنها دادی مکشوف گردید، ۳۶ 36
౩౬ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “నువ్వు నీ వ్యభిచార క్రియల ద్వారా నీ ప్రేమికులతోనూ, అసహ్యమైన నీ ప్రతిమలన్నిటితోనూ నీ కామం ఒలకబోసి నీ అంగప్రదర్శన చేశావు గనుక, ఆ విగ్రహాలకు నువ్వు నీ పిల్లలను బలి ఇచ్చి వాళ్ళ రక్తం చిందించావు గనుక,
لهذا هان من جمیع عاشقانت را که به ایشان ملتذ بودی و همه آنانی راکه دوست داشتی، با همه کسانی که از ایشان نفرت داشتی جمع خواهم نمود. و ایشان را از هرطرف نزد تو فراهم آورده، برهنگی تو را به ایشان مکشوف خواهم ساخت، تا تمامی عریانیت راببینند. ۳۷ 37
౩౭ఇదిగో! నువ్వు ఎవరితో పడుకున్నావో ఆ నీ ప్రేమికులందర్నీ, విటులందర్నీ, నువ్వు ద్వేషించే వాళ్ళందర్నీ నేను పోగుచేస్తున్నాను. వాళ్ళను నీ చుట్టూ పోగు చేసి, వాళ్లకు నీ మానం కనబడేలా నేను నీ దిగంబరత్వాన్ని బట్ట బయలు చేస్తాను!
و بر تو فتوای زنانی را که زنا می‌کنند وخونریز می‌باشند، خواهم داد. و خون غضب وغیرت را بر تو وارد خواهم آورد. ۳۸ 38
౩౮నువ్వు చేసిన వ్యభిచారాన్ని బట్టి, నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి నా కోపంతో నా రోషంతో కూడిన రక్తపాతం నీ మీదకు తెప్పిస్తాను.
و تو را به‌دست ایشان تسلیم نموده، خراباتهای تو راخراب و عمارات بلند تو را منهدم خواهندساخت. و لباست را از تو خواهند کند و زیورهای قشنگ تو را خواهند گرفت و تو را عریان و برهنه خواهند گذاشت. ۳۹ 39
౩౯వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తాను. నువ్వు కట్టిన గుళ్లను వాళ్ళు కూలదోసి, నువ్వు నిలబెట్టిన బలిపీఠాలను పగల గొట్టి, నీ బట్టలు ఊడదీసి, నీ నగలు లాగేసుకుని నిన్ను నగ్నంగా, బోడిగా చేస్తారు.
و گروهی بر تو آورده، تو رابه سنگها سنگسار خواهند کرد و به شمشیرهای خود تو را پاره پاره خواهند نمود. ۴۰ 40
౪౦వాళ్ళు నీ మీదకి సమూహాలను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. కత్తులతో నిన్ను పొడిచి ముక్కలు చేస్తారు.
و خانه های تو را به آتش سوزانیده، در نظر زنان بسیار بر توعقوبت خواهند رسانید. پس من تو را از زنا کاری بازخواهم داشت و بار دیگر اجرت نخواهی داد. ۴۱ 41
౪౧వాళ్ళు నీ ఇళ్ళను తగలబెడతారు. ఎంతోమంది స్త్రీలు చూస్తూ ఉండగా నీకు ఎన్నో శిక్షలు వేస్తారు. ఈ విధంగా నేను నీ వ్యభిచారం మాన్పిస్తాను. ఇంక నువ్వు వాటి కోసం ఎవరికీ డబ్బు చెల్లించవు!
و حدت خشم خود را بر تو فرو خواهم نشانیدو غیرت من از تو خواهد برگشت و آرام گرفته، بار دیگر غضب نخواهم نمود. ۴۲ 42
౪౨అప్పుడు నాకు నీ మీద ఉన్న ఉగ్రత చల్లార్చుకుంటాను. నీ పట్ల నాకున్న కోపం పోతుంది, అప్పుడు నేను తృప్తి చెంది, ఇకపై నీ మీద కోపం తెచ్చుకోను.
چونکه ایام جوانی خود را به یاد نیاورده، مرا به همه اینکارهارنجانیدی، از این جهت خداوند یهوه می‌گوید که اینک نیز رفتار تو را بر سرت وارد خواهم آورد وعلاوه بر تمامی رجاساتت دیگر این عمل قبیح رامرتکب نخواهی شد. ۴۳ 43
౪౩నువ్వు నీ యవ్వన ప్రాయం గుర్తు చేసుకోకుండా వీటన్నిటి మూలంగా నాకు పట్టరాని కోపం తెప్పించావు గనక, చూడు! నువ్వు చేసిన అసహ్యమైన పనులన్నిటిని బట్టి నీ తల మీదకి నేనే శిక్ష రప్పిస్తాను” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి ఇంక నువ్వు నీ అసహ్యమైన దుర్మార్గపు ప్రవర్తన మానుకుంటావు.
«اینک هر‌که مثل می‌آورد این مثل را بر توآورده، خواهد گفت که مثل مادر، مثل دخترش می‌باشد. ۴۴ 44
౪౪చూడు! సామెతలు చెప్పేవాళ్ళందరూ, ‘తల్లి ఎలాంటిదో కూతురూ అలాంటిదే’ అని నిన్ను గూర్చి అంటారు.
تو دختر مادر خود هستی که ازشوهر و پسران خود نفرت می‌داشت. و خواهرخواهران خود هستی که از شوهران و پسران خویش نفرت می‌دارند. مادر شما حتی بود و پدرشما اموری. ۴۵ 45
౪౫భర్తనూ, బిడ్డలనూ విడిచిపెట్టిన నీ తల్లీ, నువ్వూ ఒకే రకం. భర్తనూ, బిడ్డలనూ విడిచిపెట్టిన నీ అక్కచెల్లెళ్ళు, నువ్వూ ఒకే రకం. నీ తల్లి హిత్తీయురాలు. నీ తండ్రి అమోరీయుడు.
و خواهر بزرگ تو سامره است که با دختران خود بطرف چپ تو ساکن می‌باشد. وخواهر کوچک تو سدوم است که با دختران خودبطرف راست تو ساکن می‌باشد. ۴۶ 46
౪౬నీ ఎడమవైపు నివసించే షోమ్రోనూ, దాని కుమార్తెలూ నీకు అక్కలు, నీ కుడివైపు నివసించే సొదొమ, దాని కుమార్తెలూ నీకు చెల్లెళ్ళు.
اما تو درطریق های ایشان سلوک نکردی و مثل رجاسات ایشان عمل ننمودی. بلکه گویا این سهل بود که تو در همه رفتار خود از ایشان زیاده فاسد شدی.» ۴۷ 47
౪౭అయితే అవేవో చిన్న విషయాలన్నట్టు, వాళ్ళ అసహ్యమైన ప్రవర్తన ప్రకారం గాని, వాళ్ళ దుర్మార్గంలో గాని నువ్వు ఉండొద్దు. నిజానికి వాళ్ళందరికన్నా నీ ప్రవర్తన ఎంతో ఘోరం.
پس خداوند یهوه می‌گوید: «به حیات خودم قسم که خواهر تو سدوم و دخترانش موافق اعمال تو و دخترانت عمل ننمودند. ۴۸ 48
౪౮నువ్వూ, నీ కూతుళ్ళూ చేసినట్టు నీ చెల్లెలు సొదొమ గాని, దాని కూతుళ్ళు గాని చెయ్యలేదని నా జీవం తోడు, ప్రమాణం చేస్తున్నాను” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
اینک گناه خواهرت سدوم این بود که تکبر وفراوانی نان و سعادتمندی رفاهیت برای او ودخترانش بود و فقیران و مسکینان را دستگیری ننمودند. ۴۹ 49
౪౯“చూడు! నీ చెల్లెలు సొదొమ పాపం ఏమంటే, అది తనకు కలిగిన కులాసాను బట్టి అహంకారం చూపింది. దేని గురించీ దానికి దిగులు లేదు, దేన్నీ లక్ష్య పెట్టదు. పేదల చేతులు దాని వైపుకు, దాని కూతుళ్ళ వైపుకు చాచి ఉన్నాయి గానీ అది ఎవరికీ సాయం చెయ్యలేదు.
و مغرور شده، در حضور من مرتکب رجاسات گردیدند. لهذا چنانکه صلاح دیدم ایشان را از میان برداشتم. ۵۰ 50
౫౦వాళ్ళు అహంకారంతో నా దృష్టిలో అసహ్యమైన క్రియలు చేశారు గనుక నేను దాన్ని చూసి వాళ్ళను వెళ్ళగొట్టాను.
و سامره نصف گناهانت را مرتکب نشد، بلکه تو رجاسات خودرا از آنها زیاده نمودی و خواهران خود را به تمامی رجاسات خویش که بعمل آوردی مبری ساختی. ۵۱ 51
౫౧షోమ్రోను కూడా నీ పాపాల్లో సగమైనా చెయ్యలేదు. వాళ్ళకన్నా నువ్వు అత్యధికంగా అసహ్యకార్యాలు చేశావు. నువ్వు ఇన్ని అసహ్యమైన పనులు చేసి, నీ సోదరి నీకన్నా మెరుగైనదిగా కనబడేలా చేశావు.
پس تو نیز که بر خواهران خود حکم دادی خجالت خود را متحمل بشو. زیرا به گناهانت که در آنها بیشتر از ایشان رجاسات نمودی ایشان از تو عادلتر گردیدند. لهذا تو نیزخجل شو و رسوایی خود را متحمل باش چونکه خواهران خود را مبری ساختی. ۵۲ 52
౫౨నువ్వు వాళ్ళకన్నా అత్యధికంగా అసహ్యమైన పనులు చేశావు గనుక నీతో పోల్చి చూసినప్పుడు నీ సోదరీలు నీకన్నా మెరుగైనవాళ్ళుగా నువ్వు చూపించావు. నువ్వు వాళ్లకు విధించిన అవమాన శిక్ష నీకే రావాలి. నీతో పోల్చి చూసినప్పుడు నీ సోదరీలు నీకన్నా మెరుగైనవాళ్ళుగా కనిపిస్తున్నారు గనుక నీకు అవమానం, సిగ్గూ కలుగుతాయి.
و من اسیری ایشان یعنی اسیری سدوم و دخترانش و اسیری سامره و دخترانش و اسیری اسیران تو را در میان ایشان خواهم برگردانید. ۵۳ 53
౫౩నేను సొదొమను, దాని కూతుళ్ళనూ, షోమ్రోను, దాని కూతుళ్ళనూ గతంలో ఉన్న సౌభాగ్యానికి తెస్తాను. కాని నీ భాగ్యం వాళ్ళలా ఉండదు.
تا خجالت خود رامتحمل شده، از هر‌چه کرده‌ای شرمنده شوی چونکه ایشان را تسلی داده‌ای. ۵۴ 54
౫౪వీటివలన నువ్వు సిగ్గుపడతావు. నువ్వు చేసిన వాటన్నిటి బట్టి నువ్వు అవమానం పాలవుతావు. ఆ విధంగా నువ్వు వాళ్లకు ఆదరణగా ఉంటావు.
و خواهرانت یعنی سدوم و دخترانش به حالت نخستین خودخواهند برگشت. و سامره و دخترانش به حالت نخستین خود خواهند برگشت. و تو و دخترانت به حالت نخستین خود خواهید برگشت. ۵۵ 55
౫౫సొదొమ, దాని కూతుళ్ళూ తమ పూర్వస్థితికి వస్తారు. షోమ్రోను, దాని కూతుళ్ళూ తమ పూర్వస్థితికి వస్తారు. తరువాత నువ్వూ నీ కూతుళ్ళూ మీ పూర్వస్థితికి వస్తారు.
اماخواهر تو سدوم در روز تکبر تو به زبانت آورده نشد. ۵۶ 56
౫౬నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కూతుళ్ళూ, సిరియా కూతుళ్ళూ నిన్ను అవమానపరిచినప్పుడు
قبل از آنکه شرارت تو مکشوف بشود. مثل آن زمانی که دختران ارام مذمت می‌کردند وجمیع مجاورانش یعنی دختران فلسطینیان که تورا از هر طرف خوار می‌شمردند.» ۵۷ 57
౫౭నీ దుర్మార్గం బయట పడక ముందు, నువ్వు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలు సొదొమ ప్రస్తావన నువ్వు తీసుకురాలేదు.
پس خداوند می‌فرماید که «تو قباحت ورجاسات خود را متحمل خواهی شد. ۵۸ 58
౫౮నువ్వు చేసిన మోసం, నీ అసహ్యమైన పనులు నువ్వే భరించావు.” ఇదే యెహోవా వాక్కు.
زیراخداوند یهوه چنین می‌گوید: به نهجی که تو عمل نمودی من با تو عمل خواهم نمود، زیرا که قسم را خوار شمرده، عهد را شکستی. ۵۹ 59
౫౯యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. “చేసిన ప్రమాణాన్ని చులకనగా ఎంచి, ఒప్పందం భంగ పరిచే ఎవరికైనా ఏమి చేస్తానో అదే నీకు చేస్తాను.
لیکن من عهد خود را که در ایام جوانیت با تو بستم به یادخواهم آورد و عهد جاودانی با تو استوار خواهم داشت. ۶۰ 60
౬౦కానీ నేనే నీ యవ్వనంలో నీతో చేసిన నిబంధన గుర్తు చేసుకుంటాను. నీతో శాశ్వత నిబంధన చేస్తాను.
و هنگامی که خواهران بزرگ و کوچک خود را پذیرفته باشی، آنگاه راههای خود را به یاد آورده، خجل خواهی شد. و من ایشان را به‌جای دختران به تو خواهم داد، لیکن نه از عهد تو. ۶۱ 61
౬౧అప్పుడు నువ్వు నీ అక్కలను చెల్లెళ్ళను కలుసుకున్నప్పుడు గతంలో నీ సిగ్గుమాలిన ప్రవర్తన గుర్తు చేసుకుంటావు. వారిని నీకు కూతుర్లుగా ఇస్తాను, అయితే నిబంధన మూలంగా కాదు.
و من عهد خود را با تو استوار خواهم ساخت وخواهی دانست که من یهوه هستم. ۶۲ 62
౬౨నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు!
تا آنکه به یاد آورده، خجل شوی. و خداوند یهوه می‌فرماید که چون من همه کارهای تو را آمرزیده باشم، بار دیگر به‌سبب رسوایی خویش دهان خود را نخواهی گشود.» ۶۳ 63
౬౩నువ్వు చేసిన వాటన్నిటి కోసం నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దాన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడి, నోరు మూసుకుంటావు.” ఇదే ప్రభువైన యెహోవా ప్రకటన.

< حزقیال 16 >