< تثنیه 30 >

و چون جمیع این چیزها، یعنی برکت ولعنتی که پیش روی تو گذاشتم بر توعارض شود، و آنها را در میان جمیع امتهایی که یهوه، خدایت، تو را به آنجا خواهد راند، بیادآوری. ۱ 1
“నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన
و تو با فرزندانت با تمامی دل و تمامی جان خود به سوی یهوه خدایت بازگشت نموده، قول او را موافق هر‌آنچه که من امروز به تو امرمی فرمایم، اطاعت نمایی. ۲ 2
అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే
آنگاه یهوه خدایت اسیری تو را برگردانیده، بر تو ترحم خواهد کرد، و رجوع کرده، تو را از میان جمیع امتهایی که یهوه، خدایت، تو را به آنجا پراکنده کرده است، جمع خواهد نمود. ۳ 3
మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.
اگر آوارگی تو تا کران آسمان بشود، یهوه، خدایت، تو را از آنجا جمع خواهد کرد و تو را از آنجا خواهد آورد. ۴ 4
చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు.
ویهوه، خدایت، تو را به زمینی که پدرانت مالک آن بودند خواهد آورد، و مالک آن خواهی شد، و برتو احسان نموده، تو را بیشتر از پدرانت خواهدافزود. ۵ 5
మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ యెహోవా దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకుల కంటే మిమ్మల్ని అసంఖ్యాకంగా చేస్తాడు.
«و یهوه خدایت دل تو و دل ذریت تو رامختون خواهد ساخت تا یهوه خدایت را به تمامی دل و تمامی جان خود دوست داشته، زنده بمانی. ۶ 6
మీరు బతకడానికి, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని ప్రేమించేలా మీ యెహోవా దేవుడు మీ హృదయానికీ మీ పిల్లల హృదయానికీ సున్నతి చేస్తాడు.
و یهوه خدایت جمیع این لعنتها را بردشمنان و بر خصمانت که تو را آزردند، نازل خواهد گردانید. ۷ 7
మిమ్మల్ని హింసించిన మీ శత్రువుల మీదికీ మిమ్మల్ని ద్వేషించినవారి మీదికీ మీ యెహోవా దేవుడు ఆ శాపాలన్నీ రప్పిస్తాడు.
و تو بازگشت نموده، قول خداوند را اطاعت خواهی کرد، و جمیع اوامر او را که من امروز به تو امر می‌فرمایم، بجا خواهی آورد. ۸ 8
మీరు తిరిగి వచ్చి యెహోవా మాట వింటారు. నేనిప్పుడు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తారు.
و یهوه، خدایت، تو را در تمامی اعمال دستت و در میوه بطنت و نتایج بهایمت ومحصول زمینت به نیکویی خواهد افزود، زیراخداوند بار دیگر بر تو برای نیکویی شادی خواهد کرد، چنانکه بر پدران تو شادی نمود. ۹ 9
మీ యెహోవా దేవుడు, మీరు చేతులతో చేసే పనులన్నిటిలో, మీ గర్భఫలం విషయంలో మీ పశువుల గర్భఫలం విషయంలో మీ భూపంట విషయంలో మీకు అభివృద్ధి కలిగిస్తాడు.
اگر آواز یهوه خدای خود را اطاعت نموده، اوامر و فرایض او را که در طومار این شریعت مکتوب است، نگاه داری، و به سوی یهوه، خدای خود، با تمامی دل و تمامی جان بازگشت نمایی. ۱۰ 10
౧౦ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆయన ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటిస్తే మీ యెహోవా దేవుని మాట విని, మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని వైపు తిరిగితే, యెహోవా మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు మీకు మేలు చేయడానికి మీపట్ల మళ్ళీ సంతోషిస్తాడు.
«زیرا این حکمی که من امروز به تو امرمی فرمایم، برای تو مشکل نیست و از تو دورنیست. ۱۱ 11
౧౧ఇవ్వాళ నేను మీకు ఆజ్ఞాపించే ఈ విధులు గ్రహించడం మీకు కష్టం కాదు, వాటిని అందుకోవడం అసాధ్యమూ కాదు.
نه در آسمان است تا بگویی کیست که به آسمان برای ما صعود کرده، آن را نزد ما بیاوردو آن را به ما بشنواند تا به عمل آوریم. ۱۲ 12
౧౨‘మనం విని, దాని ప్రకారం చేయడం కోసం పరలోకానికి ఎక్కిపోయి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?’ అని మీరు భావించడానికి అది ఆకాశంలో ఉండేది కాదు.
و نه آن طرف دریا که بگویی کیست که برای ما به آنطرف دریا عبور کرده، آن را نزد ما بیاورد و به ما بشنواندتا به عمل آوریم. ۱۳ 13
౧౩‘మనం విని, దాని ప్రకారం చేయడానికి సముద్రం దాటి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?’ అని భావించడానికి అది సముద్రం అవతల ఉండేదీ కాదు.
بلکه این کلام، بسیار نزدیک توست و در دهان و دل توست تا آن را بجا آوری. ۱۴ 14
౧౪మీరు దాని ప్రకారం చేయడానికి ఆ మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీ నోటి వెంట, మీ హృదయంలో ఉంది.
«ببین امروز حیات و نیکویی و موت و بدی را پیش روی تو گذاشتم. ۱۵ 15
౧౫చూడండి, ఈరోజు నేను జీవాన్నీ మేలునూ, చావునూ కీడునూ మీ ఎదుట ఉంచాను.
چونکه من امروز تورا امر می‌فرمایم که یهوه خدای خود را دوست بداری و در طریقهای او رفتار نمایی، و اوامر وفرایض و احکام او را نگاه داری تا زنده مانده، افزوده شوی، و تا یهوه، خدایت، تو را در زمینی که برای تصرفش به آن داخل می‌شوی، برکت دهد. ۱۶ 16
౧౬మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలూ చట్టాలూ విధులూ ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశించే దేశంలో మీ యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
لیکن اگر دل تو برگردد و اطاعت ننمایی و فریفته شده، خدایان غیر را سجده و عبادت نمایی، ۱۷ 17
౧౭అయితే మీ హృదయం వేరొక వైపుకు మళ్ళి, మాటకు లోబడక అన్య దేవుళ్ళకు మొక్కి, పూజిస్తే
پس امروز به شما اطلاع می‌دهم که البته هلاک خواهید شد، و در زمینی که از اردن عبور می‌کنید تا در آن داخل شده، تصرف نمایید، عمر طویل نخواهید داشت. ۱۸ 18
౧౮మీరు తప్పకుండా నాశనమైపోతారని, స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటిపోతున్న దేశంలో మీరు శాశ్వితకాలం జీవించరనీ తెలియచేస్తున్నాను.
امروز آسمان وزمین را بر شما شاهد می‌آورم که حیات و موت وبرکت و لعنت را پیش روی تو گذاشتم، پس حیات را برگزین تا تو با ذریتت زنده بمانی. ۱۹ 19
౧౯ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను.
و تایهوه خدای خود را دوست بداری و آواز او رابشنوی و با او ملصق شوی، زیرا که او حیات تو ودرازی عمر توست تا در زمینی که خداوند برای پدرانت، ابراهیم و اسحاق و یعقوب، قسم خوردکه آن را به ایشان بدهد، ساکن شوی.» ۲۰ 20
౨౦మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”

< تثنیه 30 >