< اول تواریخ 15 >

و داود در شهر خود خانه ها بنا کرد و مکاني براي تابوت خدا فراهم ساخته، خيمه اي به جهت آن برپا نمود. ۱ 1
దావీదు తన కోసం దావీదు పట్టణంలో ఇళ్ళు కట్టించుకున్నాడు. దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి, అక్కడ ఒక గుడారం వేయించాడు.
آنگاه داود فرمود که غير از لاويان کسي تابوت خدا را برندارد زيرا خداوند ايشان را برگزيده بود تا تابوت خدا بردارند و او را هميشه خدمت نمايند. ۲ 2
అప్పుడు దావీదు “మందసాన్ని మోయడానికీ నిత్యం ఆయనకు సేవ చెయ్యడానికీ యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నాడు, వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు” అని ఆజ్ఞాపించాడు.
و داود تمامي اسرائيل را در اورشليم جمع کرد تا تابوت خداوند را به مکاني که برايش مهيا ساخته بود، بياورند. ۳ 3
అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.
و داود پسران هارون و لاويان را جمع کرد. ۴ 4
అహరోను సంతతి వారిని, లేవీయులను,
از بني قَهات اُوريئيلِ رئيس وصد بيست نفر برادرانش را. ۵ 5
కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఊరీయేలును, అతని బంధువుల్లో నూట ఇరవైమందిని,
از بني مَراري، عَساياي رئيس ودوست بيست نفر برادرانش را. ۶ 6
మెరారీయుల్లో వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో రెండువందల ఇరవై మందిని,
از بني جَرشُوم، يوئيل رئيس و صد وسي نفر برادرانش را. ۷ 7
గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో నూట ముప్ఫై మందిని,
از بني اليصافان، شَمَعياي رئيس و دوست نفر برادرانش را. ۸ 8
ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని,
از بني حَبرُون، اِيلِيئيل رئيس و هشتاد نفر برادرانش را. ۹ 9
హెబ్రోను సంతతి వారికి అధిపతి అయిన ఎలీయేలును, అతని బంధువుల్లో ఎనభై మందిని,
از بني عُزّيئيل، عَمِّيناداب رئيس وصد و دوازده نفر برادرانش را. ۱۰ 10
౧౦ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మీనాదాబును, అతని బంధువుల్లో నూట పన్నెండు మందిని దావీదు సమావేశపరిచాడు.
و داود صادوق و ابياتارِکَهَنَه و لاويان يعني اُرِيئيل و عَسايا و يوئيل و شَمَعيا و اِيليئيل و عَمِّيناداب را خوانده، ۱۱ 11
౧౧అప్పుడు దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనే వాళ్ళతో
به ايشان گفت: «شما رؤساي خاندانهاي آباي لاويان هستيد؛ پس شما و برادران شما خويشتن را تقديس نماييد تا تابوت يهُوَه خداي اسرائيل را به مکاني که برايش مهيا ساخته ام بياوريد. ۱۲ 12
౧౨“లేవీయుల పూర్వీకుల వంశాలకు మీరు పెద్దలుగా ఉన్నారు.
زيرا از اين سبب که شما دفعه اول آن را نياورديد، يهُوَه خداي ما بر ما رخنه کرد، چونکه او را بر حسب قانون نطلبيديم.» ۱۳ 13
౧౩ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని మోయకపోవడం చేత, ఆయన దగ్గర విచారణ చేయక పోవడం చేత, ఆయన మనలో నాశనం కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు, మీవాళ్ళు, మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని, నేను ఆ మందసానికి సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావాలి” అన్నాడు.
پس کاهنان و لاويان خويشتن را تقديس نمودند تا تابوت يهُوَه خداي اسرائيل را بياورند. ۱۴ 14
౧౪అప్పుడు యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము ప్రతిష్ట చేసుకున్నారు.
و پسران لاويان بر وفق آنچه موسي بر حسب کلام خداوند امر فرموده بود، چوب دستيهاي تابوت خدا را بر کتفهاي خود گذاشته، آن را برداشتند. ۱۵ 15
౧౫తరువాత లేవీయులు యెహోవా చెప్పిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసాన్ని దాని మోత కర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.
و داود رؤساي لاويان را فرمود تا برادران خود مغنيان را با آلات موسيقي از عودها و بربطها سنجها تعين نمايند، تا به آواز بلند و شادماني صدا زنند. ۱۶ 16
౧౬అప్పుడు దావీదు “మీరు మీ బంధువులైన వాద్యకారులను పిలిచి, స్వరమండలాలు, తీగ వాద్యాలు, కంచు తాళాలతో ఉన్న వాద్యాలతో, గంభీర శబ్ధంతో, సంతోషంతో గొంతెత్తి పాడేలా ఏర్పాటు చెయ్యండి” అని లేవీయుల నాయకులకు ఆజ్ఞాపించాడు.
پس لاويان هِيمان بن يوئيل و از برادران او آساف بن بَرَکيا و از برادران ايشان بني مَراري ايتان بن قُوشيا را تعيين نمودند. ۱۷ 17
౧౭కాబట్టి లేవీయులు, యోవేలు కొడుకు హేమాను, అతని బంధువుల్లో బెరెక్యా కొడుకు ఆసాపు, తమ బంధువులైన మెరారీయుల్లో కూషాయాహు కొడుకు ఏతాను,
و با ايشان از برادران درجه دوم خود: زکريا و بَين و يعريئيل شَميراموت و يحيئيل و عُنِّي و اَلِيآب و بنايا و مَعَسيا و مَتِّتيا و اَليفَليا و مَقَنيا و عُوبيد اَدُوم و يعِيئِيل دربانان را. ۱۸ 18
౧౮వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.
و از مغنيان: هِيمان و آساف و ايتان را با سنجهاي برنجين تا بنوازند. ۱۹ 19
౧౯వాద్యకారులైన హేమాను, ఆసాపు, ఏతాను పంచలోహాల తాళాలు వాయించడానికి నిర్ణయం అయింది.
و زَکرّيا و عَزِيئيل و شَميراموت و يحيئيل و عُنِّي و اَليآب و مَعَسيا و بنايا را با عودها بر آلاموت. ۲۰ 20
౨౦జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అనే వాళ్ళు హెచ్చు స్వరం కలిగిన స్వరమండలాలు వాయించాలని నిర్ణయం అయింది.
و مَتَّتيا و اَليفَليا و مَقَنيا و عُوبيد اَدُوم و يعِيئيل و عَزَريا را با بربطهاي بر ثَمانِي تا پيشرَوِي نمايند. ۲۱ 21
౨౧ఇంకా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనే వాళ్ళు రాగం ఎత్తడానికీ, తీగ వాయిద్యాలు వాయించడానికీ నిర్ణయం అయింది.
و کَنَنيا رئيس لاويان بر نغمات بود و مغنّيان را تعليم مي داد زيرا که ماهر بود. ۲۲ 22
౨౨లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీతం నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు.
و بَرَکيا و اَلقانَه دربانان تابوت بودند. ۲۳ 23
౨౩బెరెక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా,
و شَبَنيا و يوشافاط و نَتَنئيل و عَماساي و زَکريا و بَنايا و اَلَيعَزَر کَهَنَه پيش تابوت خدا کرنا مي نواختند، و عوبيد اَدُوم و يحيي دربانانِ تابوت بودند. ۲۴ 24
౨౪షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదే వారిగా, ఓబేదెదోము, యెహీయా వెనుక వైపున ఉండే సంరక్షకులుగా నియమించారు.
و داود و مشايخ اسرائيل و سرداران هزاره رفتند تا تابوت عهد خداوند را از خانه عوبيد اَدُوم با شادماني بياورند. ۲۵ 25
౨౫దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందసాన్ని ఓబేదెదోము ఇంట్లోనుంచి తీసుకు రావడానికి ఉత్సాహంతో వెళ్ళారు.
و چون خدا لاويان را که تابوت عهد خداوند را برمي داشتند اعانت کرد، ايشان هفت گاو و هفت قوچ ذبح کردند. ۲۶ 26
౨౬యెహోవా నిబంధన మందసం మోసే లేవీయులకు దేవుడు సహాయం చేయగా, వాళ్ళు ఏడు కోడెలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు.
و داود و جميع لاوياني که تابوت را برمي داشتند و مغنيان و کَنَنيا که رئيس نغمات مغنيان بود به کتان نازک ملبس بودند، و داود ايفود کتان دربرداشت. ۲۷ 27
౨౭దావీదు, మందసం మోసే లేవీయులందరూ, సంగీతం నిర్వహించే కెనన్యా సన్నని నారతో నేసిన వస్త్రాలు వేసుకున్నారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించాడు.
و تمامي اسرائيل تابوت عهد خداوند را به آواز شادماني و آواز بوق و کرّنا و سنج و عود و بربط مي نواختند. ۲۸ 28
౨౮ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ కొమ్ములు, బాకాలు ఊదుతూ, కంచు తాళాలు కొడుతూ, స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు వచ్చారు.
و چون تابوت عهد خداوند وارد شهر داود مي شد، ميکال دختر شاؤل از پنجره نگريست و داود پادشاه را ديد که رقص و وجد مي نمايد، او را در دل خود خوار شمرد. ۲۹ 29
౨౯కాని, యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోకి వచ్చినప్పుడు, సౌలు కూతురు మీకాలు కిటికీలో నుంచి చూసి రాజైన దావీదు నాట్యం చేస్తూ సంబరం చేసుకోవడం గమనించి, తన మనస్సులో అతన్ని అసహ్యించుకుంది.

< اول تواریخ 15 >