< テモテへの手紙第一 2 >

1 第二項 祭典に就きて守るべき規則 然れば我が第一に勧むるは、衆人の為、
మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం,
2 帝王等及び総て上位に在る人々の為に、懇願し、祈祷し、請願し、且感謝せられん事なり。是は我等が全き敬虔と正直とに於て、安らかに静なる生活を営まん為なり、
రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.
3 斯の如きは善事にして我救主にて在す神の御前に嘉納せらるればなり。
ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది.
4 即ち神は一切の人の救はれ、眞理を知るに至らん事を望み給ふ。
మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.
5 蓋神は唯一に在し、神と人との仲裁者も亦唯一なり。是人たるキリスト、イエズスに在して、
దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు.
6 衆人の為に己を贖として捧げ給ひ、時至りて其證據ありしなり。
ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.
7 我は之が為に立てられて宣教者たり、且使徒たり、――我は眞を言ひて僞らず――信仰と眞理とに於る異邦人の教師たり。
దీన్ని గూర్చి ప్రకటించేవానిగా అపొస్తలునిగా దేవుడు నన్ను నియమించాడు. నిజం చెబుతున్నాను. అబద్ధమాడడం లేదు. నేను యూదులు కాని వారికి విశ్వాస సత్యాలను బోధించేవాణ్ణి.
8 然れば我は、男子が何れの處に於ても潔き手を挙げて怒なく争なく祈らん事を望む。
అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను.
9 婦人も亦斯の如くして相應の衣服を着け、己を飾るに羞耻心と節制とを以てし、縮し髪、黄金、眞珠、高價の衣服を以てせず、
అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా
10 敬虔を約束せる婦人に相當する如く善業を以てすべし。
౧౦భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.
11 婦人は全く服從して静に學ぶべし。
౧౧స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి.
12 我は婦人の教ふる事、又男子を司る事を許さず、静にすべきなり。
౧౨ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే.
13 蓋アダンは前に造られ、エワは其後なり。
౧౩ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు?
14 又アダンは惑はされず、婦は惑はされて罪に陥れり。
౧౪ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.
15 然れども信仰と愛と聖徳と節制とに止らば、子女を挙ぐる事によりて救かるべし。
౧౫అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.

< テモテへの手紙第一 2 >