< 箴言 知恵の泉 16 >

1 心にはかることは人に属し、舌の答は主から出る。
మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు.
2 人の道は自分の目にことごとく潔しと見える、しかし主は人の魂をはかられる。
ఒక వ్యక్తి ప్రవర్తన అతని దృష్టిలో సవ్యంగానే ఉంటుంది. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు.
3 あなたのなすべき事を主にゆだねよ、そうすれば、あなたの計るところは必ず成る。
నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి.
4 主はすべての物をおのおのその用のために造り、悪しき人をも災の日のために造られた。
యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు.
5 すべて心に高ぶる者は主に憎まれる、確かに、彼は罰を免れない。
హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు.
6 いつくしみとまことによって、とがはあがなわれる、主を恐れることによって、人は悪を免れる。
నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన పరిహారం కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు.
7 人の道が主を喜ばせる時、主はその人の敵をもその人と和らがせられる。
ఒకడి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు.
8 正義によって得たわずかなものは、不義によって得た多くの宝にまさる。
అన్యాయంగా సంపాదించే అధికమైన సంపద కంటే నీతిగా వచ్చే కొంచెమైనా ఉత్తమం.
9 人は心に自分の道を考え計る、しかし、その歩みを導く者は主である。
ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.
10 王のくちびるには神の決定がある、さばきをするとき、その口に誤りがない。
౧౦రాజు నోటి నుండి దైవిక తీర్మానం వెలువడుతుంది. తీర్పు తీర్చునప్పుడు అతని మాట న్యాయం తప్పిపోదు.
11 正しいはかりと天びんとは主のものである、袋にあるふんどうもすべて彼の造られたものである。
౧౧న్యాయమైన త్రాసు, తూకం రాళ్లు యెహోవా నియమించాడు. సంచిలో ఉండే తూనిక గుళ్ళు ఆయన ఏర్పాటు.
12 悪を行うことは王の憎むところである、その位が正義によって堅く立っているからである。
౧౨రాజులు చెడ్డ పనులు జరిగించడం హేయమైన చర్య. సింహాసనం నిలిచేది న్యాయం మూలానే.
13 正しいくちびるは王に喜ばれる、彼は正しい事を言う者を愛する。
౧౩సరైన సంగతి సూటిగా మాట్లాడేవారు రాజులకు సంతోషం కలిగిస్తారు. నిజాయితీపరులు వారికి ఇష్టమైనవారు.
14 王の怒りは死の使者である、知恵ある人はこれをなだめる。
౧౪రాజుకు కోపం వస్తే మరణం దాపురిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఆ కోపం చల్లారేలా చేస్తాడు.
15 王の顔の光には命がある、彼の恵みは春雨をもたらす雲のようだ。
౧౫రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది. అతని అనుగ్రహం వసంతకాలంలో వాన కురిసే మేఘం లాంటిది.
16 知恵を得るのは金を得るのにまさる、悟りを得るのは銀を得るよりも望ましい。
౧౬విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం.
17 悪を離れることは正しい人の道である、自分の道を守る者はその魂を守る。
౧౭నిజాయితీపరులకు దుష్ట ప్రవర్తన విడిచి నడుచుకోవడమే రాజమార్గం వంటిది. తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు.
18 高ぶりは滅びにさきだち、誇る心は倒れにさきだつ。
౧౮ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.
19 へりくだって貧しい人々と共におるのは、高ぶる者と共にいて、獲物を分けるにまさる。
౧౯దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.
20 慎んで、み言葉をおこなう者は栄える、主に寄り頼む者はさいわいである。
౨౦ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు.
21 心に知恵ある者はさとき者ととなえられる、くちびるが甘ければ、その教に人を説きつける力を増す。
౨౧హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు. మధురమైన మాటలు విద్యాభివృద్ది కలిగిస్తాయి.
22 知恵はこれを持つ者に命の泉となる、しかし、愚かさは愚かな者の受ける懲しめである。
౨౨తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది.
23 知恵ある者の心はその言うところを賢くし、またそのくちびるに人を説きつける力を増す。
౨౩జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది.
24 ここちよい言葉は蜂蜜のように、魂に甘く、からだを健やかにする。
౨౪మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం.
25 人が見て自分で正しいとする道があり、その終りはついに死にいたる道となるものがある。
౨౫ఒకడు నడిచే బాట వాడి దృష్టికి యథార్థం అనిపిస్తుంది. చివరకూ అది మరణానికి నడిపిస్తుంది.
26 ほねおる者は飲食のためにほねおる、その口が自分に迫るからである。
౨౬కూలివాడి ఆకలే వాడి చేత అని చేయిస్తుంది. వాడి క్షుద్బాధ వాడు పనిచేసేలా తొందరపెడుతుంది.
27 よこしまな人は悪を企てる、そのくちびるには激しい火のようなものがある。
౨౭దుష్టులు కీడు కలిగించడం కోసం కారణాలు వెతుకుతారు. వారి పెదాల మీద కోపాగ్ని రగులుతూ ఉంటుంది.
28 偽る者は争いを起し、つげ口する者は親しい友を離れさせる。
౨౮మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.
29 しえたげる者はその隣り人をいざない、これを良くない道に導く。
౨౯దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు.
30 めくばせする者は悪を計り、くちびるを縮める者は悪事をなし遂げる。
౩౦కళ్ళు మూస్తూ పెదవులు బిగబట్టేవారు, కుయుక్తులు పన్నేవారు కీడు కలిగించే వారు.
31 しらがは栄えの冠である、正しく生きることによってそれが得られる。
౩౧నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి.
32 怒りをおそくする者は勇士にまさり、自分の心を治める者は城を攻め取る者にまさる。
౩౨పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను స్వాధీనం చేసుకునేవాడి కంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు.
33 人はくじをひく、しかし事を定めるのは全く主のことである。
౩౩చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.

< 箴言 知恵の泉 16 >