< Levitico 20 >

1 IL Signore parlò, oltre a ciò, a Mosè dicendo: Di' ancora a' figliuoli d'Israele:
యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు.
2 Chiunque de' figliuoli d'Israele, o de' forestieri che dimorano in Israele, avrà dato della sua progenie a Molec, del tutto sia fatto morire; lapidilo il popolo del paese.
ఇశ్రాయేలీయుల్లో గానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించే పరదేశుల్లోగాని ఎవరైనా తన పిల్లలను మోలెకు దేవుడికి ఇస్తే వాడికి తప్పకుండా మరణ శిక్ష విధించాలి. ప్రజలు వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి.
3 E io ancora metterò la mia faccia contro a quell'uomo, e lo sterminerò d'infra il suo popolo; perciocchè egli avrà dato della sua progenie a Molec, per contaminare il mio Santuario, e per profanare il mio Nome santo.
అతడు తన సంతానాన్ని మోలెకుకు ఇచ్చి నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచి నా పవిత్ర నామాన్ని కలుషితం చేశాడు గనక నేను అతనికి శత్రువునై ప్రజల్లో అతడు లేకుండా చేస్తాను.
4 Che se pure il popolo del paese del tutto chiude gli occhi, per non vedere quell'uomo, quando avrà dato della sua progenie a Molec, per non farlo morire;
ఆ వ్యక్తి తన సంతానాన్ని మోలెకుకు ఇస్తుండగా మీ దేశ ప్రజలు చూసి కూడా కళ్ళు మూసుకుంటే, వాణ్ణి చంపక పొతే
5 io metterò la mia faccia contro a quell'uomo, e contro alla sua famiglia; e sterminerò d'infra il lor popolo lui, e tutti coloro che lo seguiranno, in fornicare dietro a Molec.
అప్పుడు నేనే వాడికి, వాడి వంశానికి విరోధినై వాణ్ణి ప్రజల్లో లేకుండా చేస్తాను. మోలెకుతో వేశ్యరికం చెయ్యడానికి వాడి వెంటబడి వ్యభిచారం చేసే వారందరినీ ప్రజల్లో లేకుండా చేస్తాను.
6 E se alcuna persona si rivolge agli spiriti di Pitone, o agl'indovini, per fornicar dietro a loro, io metterò la mia faccia contro a quella persona, e la sterminerò d'infra il suo popolo.
చచ్చిన వారితో మాట్లాడుతామని చెప్పేవారితో సోదె చెప్పే వారితో వేశ్యరికం చెయ్యడానికి వారివైపు తిరిగే వారికి నేను విరోధినై ప్రజల్లో వాణ్ణి లేకుండా చేస్తాను.
7 Voi dunque santificatevi, e siate santi; perciocchè io [sono] il Signore Iddio vostro.
కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్టించుకుని పవిత్రంగా ఉండండి. నేను మీ దేవుడైన యెహోవాను.
8 E osservate i miei statuti, e metteteli in opera. Io [sono] il Signore che vi santifico.
మీరు నా శాసనాలను పాటించి వాటి ప్రకారం చెయ్యాలి. నేను మిమ్మల్ని పవిత్ర పరచే యెహోవాను.
9 Se alcuno maledice suo padre, o sua madre, del tutto sia fatto morire; egli ha maledetto suo padre, o sua madre; [sia] il suo sangue sopra lui.
ఎవడు తన తండ్రినిగానీ తన తల్లినిగానీ దూషిస్తాడో వాడికి మరణశిక్ష విధించాలి. వాడు తన తండ్రినో తల్లినో దుర్భాషలాడాడు గనక అతడు దోషి, మరణ శిక్షకు పాత్రుడు.
10 E se alcuno commette adulterio con la moglie di un altro, con la moglie del suo prossimo; facciansi morire l'adultero e l'adultera.
౧౦వేరొకడి భార్యతో వ్యభిచరించిన వాడికి, అంటే తన పొరుగు వాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడికి-ఆ వ్యభిచారికి, వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి.
11 E se alcuno giace con la moglie di suo padre, egli ha scoperte le vergogne di suo padre; del tutto facciansi morire amendue; [sia] il lor sangue sopra loro.
౧౧తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం కోసం ఆమెతో పండుకున్న వాడు తన తండ్రి గౌరవాన్ని భంగపరిచాడు. వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు తమ శిక్షకు తామే కారకులు.
12 E se alcuno giace con la sua nuora, del tutto facciansi morire amendue; essi hanno fatta confusione; [sia] il lor sangue sopra loro.
౧౨ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు వరసలు తప్పారు. వారు దోషులు. మరణ శిక్షకు పాత్రులు.
13 E se alcuno giace carnalmente con maschio, amendue hanno fatta una cosa abbominevole; del tutto facciansi morire; [sia] il lor sangue sopra loro.
౧౩ఒకడు స్త్రీతో పెట్టుకున్నట్టు పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరూ అసహ్య కార్యం చేశారు గనక వారికి మరణశిక్ష విధించాలి. వారు దోషులు, మరణ శిక్షకు పాత్రులు.
14 E se alcuno prende una donna, e la madre di essa [insieme], ciò [è] scelleratezza; brucinsi col fuoco, e lui e loro; acciocchè non vi sia alcuna scelleratezza nel mezzo di voi.
౧౪ఒకడు స్త్రీని పెళ్ళాడి ఆమె తల్లిని కూడా పెళ్లాడితే అది దుర్మార్గం. అతణ్ణి, ఆ స్త్రీలను సజీవ దహనం చెయ్యాలి. ఆ విధంగా మీ మధ్యనుండి దుర్మార్గత తొలిగిపోతుంది.
15 E se alcuno si congiunge carnalmente con una bestia, del tutto sia fatto morire; uccidete ancora la bestia.
౧౫ఎవరైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకుంటే వాడికి తప్పక మరణ శిక్ష విధించాలి. ఆ జంతువును చంపాలి.
16 Parimente, se alcuna donna si accosta ad alcuna bestia, per farsi coprire, uccidi la donna, e la bestia; del tutto facciansi morire; [sia] il lor sangue sopra loro.
౧౬జంతువుతో ఒక స్త్రీ లైంగికంగా కలవడం కోసం దాని దగ్గరికి పోతే ఆ స్త్రీని ఆ జంతువును చంపాలి. ఆమెకు దానికి తప్పక మరణ శిక్ష పడాలి. వారు దోషులు, మరణ శిక్షకు పాత్రులు.
17 E se alcuno prende la sua sorella, figliuola di suo padre, o figliuola di sua madre, e vede le sue vergogne, ed essa vede le vergogne di lui, ciò [è] cosa vituperosa; sieno adunque amendue sterminati alla vista de' figliuoli del lor popolo; colui ha scoperte le vergogne della sua sorella; porti la sua iniquità.
౧౭ఒకడు తన సోదరితో, అంటే తన తండ్రి కుమార్తెతో గానీ తన తల్లి కుమార్తెతో గానీ లైంగిక సంబంధం పెట్టుకుంటే అది సిగ్గుచేటు. తమ జాతి వారి సమక్షంలో వారిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి. వాడు తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తన దోష శిక్షను తాను భరించాలి.
18 E se alcuno giace con donna che è nella sua immondizia, e scopre le sue vergogne, egli ha scoperto il flusso di quella donna, ed essa ha scoperto il flusso del suo sangue; perciò sieno amendue sterminati del mezzo del lor popolo.
౧౮ఒక స్త్రీ ఋతుస్రావం సమయంలో ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆమె రక్త స్రావాన్ని, రక్తధారను బట్టబయలు చేసాడు. ప్రజల్లో నుండి వారిద్దరినీ లేకుండా చేయాలి.
19 E non iscoprir le vergogne della sorella di tua madre, o della sorella di tuo padre; perciocchè [se alcuno] scopre la carne loro, [amendue] porteranno la loro iniquità.
౧౯నీ తల్లి సోదరితో గాని నీ తండ్రి సోదరితో గానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకంటే అలా చేస్తే నీవు నీ దగ్గర బంధువును హీన పరిచావు. నీ దోషశిక్షను భరించాలి.
20 E se alcuno giace con la sua zia, egli ha scoperte le vergogne del suo zio; [amendue] porteranno il lor peccato; sieno fatti morire, e non abbiano figliuoli.
౨౦బాబాయి భార్యతో గానీ మేనమామ భార్యతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు తన దగ్గర బంధువును హీనపరిచాడు. వారు తమ పాపశిక్షను భరించాలి. వారు పిల్లలు లేకుండా చనిపోతారు.
21 Parimente, se alcuno prende la moglie del suo fratello, ciò [è] cosa brutta; colui ha scoperte le vergogne del suo fratello; sieno senza figliuoli.
౨౧ఒకడు తన సోదరుని భార్యను పెళ్లాడితే అది అశుద్ధం. ఎందుకంటే వాడు తన సోదరుని వివాహబంధాన్ని మీరాడు. వారు సంతాన హీనులుగా ఉంటారు.
22 Osservate tutti i miei statuti, e tutte le mie leggi, e metteteli in opera; acciocchè il paese, dove io vi conduco per abitarvi, non vi vomiti fuori.
౨౨కాబట్టి మీరు నివసించాలని నేను ఏ దేశానికి మిమ్మల్ని తీసుకు పోతున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండేలా మీరు నా శాసనాలన్నిటిని, నా విధులన్నిటిని పాటించాలి.
23 E non procedete secondo i costumi della nazione che io scaccio dal vostro cospetto; perciocchè essi hanno fatte tutte queste cose; onde io li ho avuti in abbominio.
౨౩నేను మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్న జాతుల ఆచారాల ప్రకారం నడుచుకోకూడదు. వారు అలాటి క్రియలన్నీ చేశారు కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను.
24 E io vi ho detto: Voi possederete la terra loro, e io ve la darò per possederla; terra stillante latte e miele. Io [sono] il Signore Iddio vostro, che vi ho separati dagli [altri] popoli.
౨౪నేను మీతో చెప్పాను. మీరు వారి భూమిని వారసత్వంగా పొందుతారు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీరు స్వాధీన పరచుకునేందుకై మీకిస్తాను. జాతుల్లో నుండి మిమ్మల్ని వేరు చేసిన మీ దేవుడైన యెహోవాను నేనే.
25 E però mettete differenza fra la bestia monda e l'immonda, e fra l'uccello mondo e l'immondo; e non rendete le vostre persone abbominevoli per quelle bestie, o per quegli uccelli, o per alcun rettile che serpe sopra la terra, i quali io vi ho separati per averli per immondi.
౨౫కాబట్టి మీరు శుద్ధ జంతువులకు, అశుద్ధ జంతువులకు, శుద్ధ పక్షులకు, అశుద్ధ పక్షులకు అంతరం తెలుసుకోవాలి. అశుద్ధమైనదని నేను మీకు వేరు చేసి చెప్పిన ఏ జంతువు మూలంగా గానీ ఏ పక్షి మూలంగా గానీ, నేల మీద పాకే దేని మూలంగా గానీ మిమ్మల్ని మీరు అపవిత్ర పరచుకోకూడదు.
26 E siatemi santi; perciocchè io, il Signore, [son] santo; e vi ho separati dagli [altri] popoli, acciocchè siate miei.
౨౬మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. మీరు నావారై ఉండేలా అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరు చేశాను.
27 Se alcuno, uomo o donna, ha lo spirito di Pitone, o è indovino, del tutto sia fatto morire; sia lapidato; [sia] il sangue di tali persone sopra loro.
౨౭పురుషుడుగానీ స్త్రీగానీ పూనకం వచ్చి చచ్చిన వారితో, ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉంటే వారికి తప్పక మరణ శిక్ష విధించాలి. ప్రజలు వారిని రాళ్లతో కొట్టాలి. వారు దోషులు, మరణ పాత్రులు.”

< Levitico 20 >