< Jelenések 4 >
1 Ezek után látám, és ímé egy megnyílt ajtó vala a mennyben, és az első szó, a melyet mint egy velem beszélő trombitának szavát hallék, ezt mondja vala: Jőjj fel ide, és megmutatom néked, a miknek meg kell lenni ezután.
౧ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరుచుకుని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం భేరీ నాదంలా నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం, “పైకి రా. తరువాత జరగాల్సినవి నీకు చూపిస్తాను” అని పలికింది.
2 És azonnal elragadtatám lélekben: és ímé egy királyiszék vala letéve a mennyben, és üle valaki a királyiszékben;
౨వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. అప్పుడు పరలోకంలో ఉన్న ఒక సింహాసనాన్నీ, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తినీ చూశాను.
3 És a ki üle, tekintetére nézve hasonló vala a jáspis és sárdius kőhöz; és a királyiszék körül szivárvány vala, látszatra smaragdhoz hasonló.
౩అలా కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలాగా కెంపులాగా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది.
4 És a királyiszék körül huszonnégy királyiszék vala; és a királyiszékekben látám ülni a huszonnégy Vénet fehér ruhákba öltözve: és a fejökön arany koronák valának.
౪ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి.
5 A királyiszékből pedig villámlások és mennydörgések és szózatok jőnek vala ki. És hét tűzlámpás ég vala a királyiszék előtt, a mely az Istennek hét lelke;
౫ఆ సింహాసనం నుండి మెరుపులు, శబ్దాలు, ఉరుములు వస్తున్నాయి. సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.
6 És a királyiszék előtt üvegtenger vala, hasonló a kristályhoz; és a királyiszék közepette és a királyiszék körül négy lelkes állat, szemekkel teljesek elől és hátul.
౬ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి.
7 És az első lelkes állat hasonló vala az oroszlánhoz, és a második lelkes állat hasonló a borjúhoz, és a harmadik lelkes állatnak olyan arcza vala, mint egy embernek, és a negyedik lelkes állat hasonló vala a repülő sashoz.
౭మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖంలాటి ముఖం ఉంది. నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది.
8 És a négy lelkes állat, a melyek közül mindeniknek hat-hat szárnya vala, köröskörül és belül teljes vala szemekkel; és meg nem szűnik vala nappal és éjjel ezt mondani: Szent, szent, szent az Úr, a mindenható Isten, a ki vala és a ki van és a ki eljövendő,
౮ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”
9 És mikor a lelkes állatok dicsőséget, tisztességet és hálát adnak annak, a ki a királyiszékben ül, annak, a ki örökkön örökké él, (aiōn )
౯ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు (aiōn )
10 Leesik a huszonnégy Vén az előtt, a ki a királyiszékben ül, és imádja azt, a ki örökkön örökké él, és az ő koronáit a királyiszék elé teszi, mondván: (aiōn )
౧౦ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, (aiōn )
11 Méltó vagy Uram, hogy végy dicsőséget és tisztességet és erőt; mert te teremtettél mindent, és a te akaratodért vannak és teremttettek.
౧౧“మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.