< עֶזְרָא 5 >

וְהִתְנַבִּ֞י חַגַּ֣י נְבִיאָה (נְבִיָּ֗א) וּזְכַרְיָ֤ה בַר־עִדֹּוא֙ נְבִיאַיָּא (נְבִיַּיָּ֔א) עַל־יְה֣וּדָיֵ֔א דִּ֥י בִיה֖וּד וּבִירוּשְׁלֶ֑ם בְּשֻׁ֛ם אֱלָ֥הּ יִשְׂרָאֵ֖ל עֲלֵיהֹֽון׃ ס 1
హగ్గయి ప్రవక్త, ఇద్దో కొడుకూ ప్రవక్తా అయిన జెకర్యా, యూదా దేశంలో, యెరూషలేములో ఉంటున్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రకటించారు.
בֵּאדַ֡יִן קָ֠מוּ זְרֻבָּבֶ֤ל בַּר־שְׁאַלְתִּיאֵל֙ וְיֵשׁ֣וּעַ בַּר־יֹֽוצָדָ֔ק וְשָׁרִ֣יו לְמִבְנֵ֔א בֵּ֥ית אֱלָהָ֖א דִּ֣י בִירֽוּשְׁלֶ֑ם וְעִמְּהֹ֛ון נְבִיאַיָּא (נְבִיַּיָּ֥א) דִֽי־אֱלָהָ֖א מְסָעֲדִ֥ין לְהֹֽון׃ פ 2
షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవ ఇద్దరూ బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి సహాయం చేస్తూ వచ్చారు.
בֵּהּ־זִמְנָא֩ אֲתָ֨א עֲלֵיהֹ֜ון תַּ֠תְּנַי פַּחַ֧ת עֲבַֽר־נַהֲרָ֛ה וּשְׁתַ֥ר בֹּוזְנַ֖י וּכְנָוָתְהֹ֑ון וְכֵן֙ אָמְרִ֣ין לְהֹ֔ם מַן־שָׂ֨ם לְכֹ֜ם טְעֵ֗ם בַּיְתָ֤א דְנָה֙ לִבְּנֵ֔א וְאֻשַּׁרְנָ֥א דְנָ֖ה לְשַׁכְלָלָֽה׃ ס 3
అప్పుడు నది ఇవతల అధికారులుగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి, వారితోబాటు మరికొందరు, యూదుల దగ్గరికి వచ్చారు. వారు “ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి, మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని ప్రశ్నించారు.
אֱדַ֥יִן כְּנֵ֖מָא אֲמַ֣רְנָא לְּהֹ֑ם מַן־אִנּוּן֙ שְׁמָהָ֣ת גֻּבְרַיָּ֔א דִּֽי־דְנָ֥ה בִנְיָנָ֖א בָּנַֽיִן׃ 4
దాన్ని నిర్మిస్తున్న వారి పేర్లు, ఇతర విషయాలు కూడా వాళ్ళు అడిగారు.
וְעֵ֣ין אֱלָהֲהֹ֗ם הֲוָת֙ עַל־שָׂבֵ֣י יְהוּדָיֵ֔א וְלָא־בַטִּ֣לוּ הִמֹּ֔ו עַד־טַעְמָ֖א לְדָרְיָ֣וֶשׁ יְהָ֑ךְ וֶאֱדַ֛יִן יְתִיב֥וּן נִשְׁתְּוָנָ֖א עַל־דְּנָֽה׃ פ 5
అయితే యూదుల దేవుడు వారిపై తన కాపుదల ఉంచడం వలన ఈ విషయంలో చక్రవర్తి దర్యావేషు నుండి అనుమతి వచ్చేవరకూ అధికారులు కట్టడం పని జరగకుండా అడ్డుకోలేదు.
פַּרְשֶׁ֣גֶן אִ֠גַּרְתָּא דִּֽי־שְׁלַ֞ח תַּתְּנַ֣י ׀ פַּחַ֣ת עֲבַֽר־נַהֲרָ֗ה וּשְׁתַ֤ר בֹּוזְנַי֙ וּכְנָ֣וָתֵ֔הּ אֲפַ֨רְסְכָיֵ֔א דִּ֖י בַּעֲבַ֣ר נַהֲרָ֑ה עַל־דָּרְיָ֖וֶשׁ מַלְכָּֽא׃ 6
నది ఇవతల అధికారులైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారితో ఉన్న ఇతర అధికారులు చక్రవర్తి దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ప్రతి ఇది.
פִּתְגָמָ֖א שְׁלַ֣חוּ עֲלֹ֑והִי וְכִדְנָה֙ כְּתִ֣יב בְּגַוֵּ֔הּ לְדָרְיָ֥וֶשׁ מַלְכָּ֖א שְׁלָמָ֥א כֹֽלָּא׃ ס 7
“రాజైన దర్యావేషుకు సమస్త క్షేమ సుఖాలు కలుగు గాక.
יְדִ֣יעַ ׀ לֶהֱוֵ֣א לְמַלְכָּ֗א דִּֽי־אֲזַ֜לְנָא לִיה֤וּד מְדִֽינְתָּא֙ לְבֵית֙ אֱלָהָ֣א רַבָּ֔א וְה֤וּא מִתְבְּנֵא֙ אֶ֣בֶן גְּלָ֔ל וְאָ֖ע מִתְּשָׂ֣ם בְּכֻתְלַיָּ֑א וַעֲבִ֥ידְתָּא דָ֛ךְ אָסְפַּ֥רְנָא מִתְעַבְדָ֖א וּמַצְלַ֥ח בְּיֶדְהֹֽם׃ ס 8
రాజువైన మీకు తెలియాల్సిన విషయాలు ఏమిటంటే, మేము మహా దేవుని మందిరం ఉన్న యూదుల ప్రాంతానికి వెళ్ళాం. దాన్ని పెద్ద పెద్ద రాళ్లతో కడుతూ ఉన్నారు. గోడల మధ్యలో స్థంభాలు వేస్తున్నారు. ఈ పని త్వరత్వరగా కొనసాగుతూ పూర్తి కావస్తున్నది.
אֱדַ֗יִן שְׁאֵ֙לְנָא֙ לְשָׂבַיָּ֣א אִלֵּ֔ךְ כְּנֵ֖מָא אֲמַ֣רְנָא לְהֹ֑ם מַן־שָׂ֨ם לְכֹ֜ם טְעֵ֗ם בַּיְתָ֤א דְנָה֙ לְמִבְנְיָ֔ה וְאֻשַּׁרְנָ֥א דְנָ֖ה לְשַׁכְלָלָֽה׃ 9
‘ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?’ అని అక్కడున్న పెద్దలను మేము అడిగాం.
וְאַ֧ף שְׁמָהָתְהֹ֛ם שְׁאֵ֥לְנָא לְהֹ֖ם לְהֹודָעוּתָ֑ךְ דִּ֛י נִכְתֻּ֥ב שֻׁם־גֻּבְרַיָּ֖א דִּ֥י בְרָאשֵׁיהֹֽם׃ ס 10
౧౦మీకు తెలియజేయడం కోసం అజమాయిషీ చేస్తున్న అధికారుల పేర్లు వ్రాసి ఇమ్మని కూడా అడిగాం.
וּכְנֵ֥מָא פִתְגָמָ֖א הֲתִיב֣וּנָא לְמֵמַ֑ר אֲנַ֣חְנָא הִמֹּ֡ו עַבְדֹוהִי֩ דִֽי־אֱלָ֨הּ שְׁמַיָּ֜א וְאַרְעָ֗א וּבָנַ֤יִן בַּיְתָא֙ דִּֽי־הֲוָ֨א בְנֵ֜ה מִקַּדְמַ֤ת דְּנָה֙ שְׁנִ֣ין שַׂגִּיאָ֔ן וּמֶ֤לֶךְ לְיִשְׂרָאֵל֙ רַ֔ב בְּנָ֖הִי וְשַׁכְלְלֵֽהּ׃ 11
౧౧దానికి వారు ఇలా జవాబిచ్చారు, భూమి, ఆకాశాలకు దేవుడైన వాడికి సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల్లో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాం.
לָהֵ֗ן מִן־דִּ֨י הַרְגִּ֤זוּ אֲבָהֳתַ֙נָא֙ לֶאֱלָ֣הּ שְׁמַיָּ֔א יְהַ֣ב הִמֹּ֔ו בְּיַ֛ד נְבוּכַדְנֶצַּ֥ר מֶֽלֶךְ־בָּבֶ֖ל כַּסְדָּיָא (כַּסְדָּאָ֑ה) וּבַיְתָ֤ה דְנָה֙ סַתְרֵ֔הּ וְעַמָּ֖ה הַגְלִ֥י לְבָבֶֽל׃ ס 12
౧౨మా పూర్వీకులు ఆకాశంలో నివాసముండే దేవునికి కోపం పుట్టించినందువల్ల ఆయన వారిని కల్దీయుడైన బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బబులోను దేశానికి బందీలుగా తీసుకువెళ్ళాడు.
בְּרַם֙ בִּשְׁנַ֣ת חֲדָ֔ה לְכֹ֥ורֶשׁ מַלְכָּ֖א דִּ֣י בָבֶ֑ל כֹּ֤ורֶשׁ מַלְכָּא֙ שָׂ֣ם טְעֵ֔ם בֵּית־אֱלָהָ֥א דְנָ֖ה לִבְּנֵֽא׃ 13
౧౩అయితే బబులోను రాజు కోరెషు తన పాలన మొదటి సంవత్సరంలో దేవుని మందిరం తిరిగి కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు.
וְ֠אַף מָאנַיָּ֣א דִֽי־בֵית־אֱלָהָא֮ דִּ֣י דַהֲבָ֣ה וְכַסְפָּא֒ דִּ֣י נְבוּכַדְנֶצַּ֗ר הַנְפֵּק֙ מִן־הֵֽיכְלָא֙ דִּ֣י בִֽירוּשְׁלֶ֔ם וְהֵיבֵ֣ל הִמֹּ֔ו לְהֵיכְלָ֖א דִּ֣י בָבֶ֑ל הַנְפֵּ֨ק הִמֹּ֜ו כֹּ֣ורֶשׁ מַלְכָּ֗א מִן־הֵֽיכְלָא֙ דִּ֣י בָבֶ֔ל וִיהִ֙יבוּ֙ לְשֵׁשְׁבַּצַּ֣ר שְׁמֵ֔הּ דִּ֥י פֶחָ֖ה שָׂמֵֽהּ׃ 14
౧౪అంతే కాక నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయం నుండి తీసుకువెళ్ళి బబులోను గుడిలో ఉంచిన వెండి బంగారు సామగ్రిని రాజైన కోరెషు ఆ గుడిలో నుండి తెప్పించాడు.
וַאֲמַר־לֵ֓הּ ׀ אֵלֶּה (אֵ֚ל) מָֽאנַיָּ֔א שֵׂ֚א אֵֽזֶל־אֲחֵ֣ת הִמֹּ֔ו בְּהֵיכְלָ֖א דִּ֣י בִירוּשְׁלֶ֑ם וּבֵ֥ית אֱלָהָ֖א יִתְבְּנֵ֥א עַל־אַתְרֵֽהּ׃ ס 15
౧౫షేష్బజ్జరును గవర్నరుగా నియమించి దేవుని మందిరాన్ని అది ఉన్న స్థలం లో కట్టించి, ఆ సామగ్రిని తీసుకువెళ్ళి యెరూషలేము పట్టణంలోని దేవాలయంలో ఉంచే బాధ్యతలు అతనికి అప్పగించాడు.
אֱדַ֙יִן֙ שֵׁשְׁבַּצַּ֣ר דֵּ֔ךְ אֲתָ֗א יְהַ֧ב אֻשַּׁיָּ֛א דִּי־בֵ֥ית אֱלָהָ֖א דִּ֣י בִירוּשְׁלֶ֑ם וּמִן־אֱדַ֧יִן וְעַד־כְּעַ֛ן מִתְבְּנֵ֖א וְלָ֥א שְׁלִֽם׃ 16
౧౬కాబట్టి షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోని దేవుని మందిరం పునాది వేయించాడు. అప్పటినుండి నేటివరకూ దాన్ని కడుతూ ఉన్నాము. పని ఇంకా పూర్తి కాలేదు.
וּכְעַ֞ן הֵ֧ן עַל־מַלְכָּ֣א טָ֗ב יִ֠תְבַּקַּר בְּבֵ֨ית גִּנְזַיָּ֜א דִּי־מַלְכָּ֣א תַמָּה֮ דִּ֣י בְּבָבֶל֒ הֵ֣ן אִיתַ֗י דִּֽי־מִן־כֹּ֤ורֶשׁ מַלְכָּא֙ שִׂ֣ים טְעֵ֔ם לְמִבְנֵ֛א בֵּית־אֱלָהָ֥א דֵ֖ךְ בִּירוּשְׁלֶ֑ם וּרְע֥וּת מַלְכָּ֛א עַל־דְּנָ֖ה יִשְׁלַ֥ח עֲלֶֽינָא׃ ס 17
౧౭కాబట్టి చక్రవర్తికి ఇష్టమైతే బబులోను పట్టణంలో ఉన్న రాజుకు చెందిన ఖజానాలో వెతికించి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టించాలని కోరెషు రాజు నిర్ణయించాడో లేదో తెలుసుకోవచ్చు. అప్పుడు చక్రవర్తి ఈ విషయంలో తన నిర్ణయం తెలియజేయాలని కోరుకొంటున్నాం.”

< עֶזְרָא 5 >