< תהילים 148 >

הללו-יה הללו את-יהוה מן-השמים הללוהו במרומים 1
యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి.
הללוהו כל-מלאכיו הללוהו כל-צבאו 2
ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.
הללוהו שמש וירח הללוהו כל-כוכבי אור 3
సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి.
הללוהו שמי השמים והמים אשר מעל השמים 4
అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి.
יהללו את-שם יהוה כי הוא צוה ונבראו 5
అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి.
ויעמידם לעד לעולם חק-נתן ולא יעבור 6
ఆయన వాటికి శాశ్విత నివాస స్థానాలు ఏర్పాటు చేశాడు. ఆయన వాటికి శాసనాలు నియమించాడు. ప్రతిదీ వాటికి లోబడక తప్పదు.
הללו את-יהוה מן-הארץ-- תנינים וכל-תהמות 7
భూమి మీద సృష్టి అయిన ప్రతి వస్తువూ ఆయనను స్తుతించాలి. సముద్రంలో ఉన్న అగాధజలాల్లారా, యెహోవాను స్తుతించండి.
אש וברד שלג וקיטור רוח סערה עשה דברו 8
అగ్నిపర్వతాలూ, వడగళ్ళూ, మంచూ, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ, యెహోవాను స్తుతించండి.
ההרים וכל-גבעות עץ פרי וכל-ארזים 9
పర్వతాలూ, ఎన్నెన్నో కొండలూ, ఫలాలిచ్చే చెట్లూ, అన్ని దేవదారు వృక్షాలూ యెహోవాను స్తుతించండి.
החיה וכל-בהמה רמש וצפור כנף 10
౧౦మృగాలూ, పశువులూ, నేల మీద పాకే జీవులూ, రెక్కలతో ఎగిరే పక్షులూ యెహోవాను స్తుతించండి.
מלכי-ארץ וכל-לאמים שרים וכל-שפטי ארץ 11
౧౧భూరాజులూ, సమస్త ప్రజల సమూహాలూ, భూమిపై ఉన్న అధిపతులూ, సమస్త న్యాయాధిపతులూ యెహోవాను స్తుతించండి.
בחורים וגם-בתולות זקנים עם-נערים 12
౧౨యువకులు, కన్యలు, వృద్ధులు, బాలబాలికలు అందరూ యెహోవా నామాన్ని స్తుతిస్తారు గాక.
יהללו את-שם יהוה-- כי-נשגב שמו לבדו הודו על-ארץ ושמים 13
౧౩ఆయన నామం మాత్రమే మహోన్నతమైనది. ఆయన ప్రభావం భూమి కంటే, ఆకాశం కంటే ఉన్నతమైనది.
וירם קרן לעמו תהלה לכל-חסידיו-- לבני ישראל עם קרבו הללו-יה 14
౧౪ఆయన తన ప్రజలకు రెట్టింపు ఘనత కలిగించాడు. అది ఆయన భక్తులకు, ఆయన శరణు కోరిన ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా ఉన్నది. యెహోవాను స్తుతించండి.

< תהילים 148 >