< Κατα Λουκαν 3 >

1 εν ετει δε πεντεκαιδεκατω τησ ηγεμονιασ τιβεριου καισαροσ ηγεμονευοντοσ ποντιου πιλατου τησ ιουδαιασ και τετραρχουντοσ τησ γαλιλαιασ ηρωδου φιλιππου δε του αδελφου αυτου τετραρχουντοσ τησ ιτουραιασ και τραχωνιτιδοσ χωρασ και λυσανιου τησ αβιληνησ τετραρχουντοσ
సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్. హేరోదు గలిలయకు చతుర్థాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి.
2 επι αρχιερεωσ αννα και καιαφα εγενετο ρημα θεου επι ιωαννην τον ζαχαριου υιον εν τη ερημω
అన్న, కయప ముఖ్య యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది.
3 και ηλθεν εισ πασαν την περιχωρον του ιορδανου κηρυσσων βαπτισμα μετανοιασ εισ αφεσιν αμαρτιων
అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు.
4 ωσ γεγραπται εν βιβλω λογων ησαιου του προφητου λεγοντοσ φωνη βοωντοσ εν τη ερημω ετοιμασατε την οδον κυριου ευθειασ ποιειτε τασ τριβουσ αυτου
యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన బాటలు తిన్నగా చేయండి.
5 πασα φαραγξ πληρωθησεται και παν οροσ και βουνοσ ταπεινωθησεται και εσται τα σκολια εισ ευθειαν και αι τραχειαι εισ οδουσ λειασ
ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.
6 και οψεται πασα σαρξ το σωτηριον του θεου
ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.”
7 ελεγεν ουν τοισ εκπορευομενοισ οχλοισ βαπτισθηναι υπ αυτου γεννηματα εχιδνων τισ υπεδειξεν υμιν φυγειν απο τησ μελλουσησ οργησ
అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
8 ποιησατε ουν καρπουσ αξιουσ τησ μετανοιασ και μη αρξησθε λεγειν εν εαυτοισ πατερα εχομεν τον αβρααμ λεγω γαρ υμιν οτι δυναται ο θεοσ εκ των λιθων τουτων εγειραι τεκνα τω αβρααμ
పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను.
9 ηδη δε και η αξινη προσ την ριζαν των δενδρων κειται παν ουν δενδρον μη ποιουν καρπον καλον εκκοπτεται και εισ πυρ βαλλεται
ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు.
10 και επηρωτων αυτον οι οχλοι λεγοντεσ τι ουν ποιησομεν
౧౦అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.
11 αποκριθεισ δε λεγει αυτοισ ο εχων δυο χιτωνασ μεταδοτω τω μη εχοντι και ο εχων βρωματα ομοιωσ ποιειτω
౧౧అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు.
12 ηλθον δε και τελωναι βαπτισθηναι και ειπον προσ αυτον διδασκαλε τι ποιησομεν
౧౨పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.
13 ο δε ειπεν προσ αυτουσ μηδεν πλεον παρα το διατεταγμενον υμιν πρασσετε
౧౩అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.
14 επηρωτων δε αυτον και στρατευομενοι λεγοντεσ και ημεισ τι ποιησομεν και ειπεν προσ αυτουσ μηδενα διασεισητε μηδε συκοφαντησητε και αρκεισθε τοισ οψωνιοισ υμων
౧౪“మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.
15 προσδοκωντοσ δε του λαου και διαλογιζομενων παντων εν ταισ καρδιαισ αυτων περι του ιωαννου μηποτε αυτοσ ειη ο χριστοσ
౧౫క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు.
16 απεκρινατο ο ιωαννησ απασιν λεγων εγω μεν υδατι βαπτιζω υμασ ερχεται δε ο ισχυροτεροσ μου ου ουκ ειμι ικανοσ λυσαι τον ιμαντα των υποδηματων αυτου αυτοσ υμασ βαπτισει εν πνευματι αγιω και πυρι
౧౬వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
17 ου το πτυον εν τη χειρι αυτου και διακαθαριει την αλωνα αυτου και συναξει τον σιτον εισ την αποθηκην αυτου το δε αχυρον κατακαυσει πυρι ασβεστω
౧౭తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”
18 πολλα μεν ουν και ετερα παρακαλων ευηγγελιζετο τον λαον
౧౮అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.
19 ο δε ηρωδησ ο τετραρχησ ελεγχομενοσ υπ αυτου περι ηρωδιαδοσ τησ γυναικοσ του αδελφου αυτου και περι παντων ων εποιησεν πονηρων ο ηρωδησ
౧౯అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు.
20 προσεθηκεν και τουτο επι πασιν και κατεκλεισεν τον ιωαννην εν τη φυλακη
౨౦హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు.
21 εγενετο δε εν τω βαπτισθηναι απαντα τον λαον και ιησου βαπτισθεντοσ και προσευχομενου ανεωχθηναι τον ουρανον
౨౧ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది.
22 και καταβηναι το πνευμα το αγιον σωματικω ειδει ωσει περιστεραν επ αυτον και φωνην εξ ουρανου γενεσθαι λεγουσαν συ ει ο υιοσ μου ο αγαπητοσ εν σοι ευδοκησα
౨౨పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”
23 και αυτοσ ην ο ιησουσ ωσει ετων τριακοντα αρχομενοσ ων ωσ ενομιζετο υιοσ ιωσηφ του ηλι
౨౩యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కొడుకు.
24 του ματθατ του λευι του μελχι του ιαννα του ιωσηφ
౨౪హేలీ మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు. లేవి మెల్కీ కొడుకు.
25 του ματταθιου του αμωσ του ναουμ του εσλι του ναγγαι
౨౫మెల్కీ యన్న కొడుకు. యన్న యోసేపు కొడుకు. యోసేపు మత్తతీయ కొడుకు. మత్తతీయ ఆమోసు కొడుకు. ఆమోసు నాహోము కొడుకు. నాహోము ఎస్లి కొడుకు. ఎస్లి నగ్గయి కొడుకు.
26 του μααθ του ματταθιου του σεμει του ιωσηφ του ιουδα
౨౬నగ్గయి మయతు కొడుకు. మయతు మత్తతీయ కొడుకు. మత్తతీయ సిమియ కొడుకు. సిమియ యోశేఖు కొడుకు. యోశేఖు యోదా కొడుకు.
27 του ιωαναν του ρησα του ζοροβαβελ του σαλαθιηλ του νηρι
౨౭యోదా యోహన్న కొడుకు. యోహన్న రేసా కొడుకు. రేసా జెరుబ్బాబెలు కొడుకు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కొడుకు. షయల్తీయేలు నేరి కొడుకు.
28 του μελχι του αδδι του κωσαμ του ελμωδαμ του ηρ
౨౮నేరి మెల్కీ కొడుకు. మెల్కీ అద్ది కొడుకు. అద్ది కోసాము కొడుకు. కోసాము ఎల్మదాము కొడుకు. ఎల్మదాము ఏరు కొడుకు.
29 του ιωση του ελιεζερ του ιωρειμ του ματθατ του λευι
౨౯ఏరు యెహోషువ కొడుకు. యెహోషువ ఎలీయెజెరు కొడుకు. ఎలీయెజెరు యోరీము కొడుకు. యోరీము మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు.
30 του συμεων του ιουδα του ιωσηφ του ιωναν του ελιακειμ
౩౦లేవి షిమ్యోను కొడుకు. షిమ్యోను యూదా కొడుకు. యూదా యోసేపు కొడుకు. యోసేపు యోనాము కొడుకు. యోనాము ఎల్యాకీము కొడుకు.
31 του μελεα του μαιναν του ματταθα του ναθαν του δαυιδ
౩౧ఎల్యాకీము మెలెయా కొడుకు. మెలెయా మెన్నా కొడుకు. మెన్నా మత్తతా కొడుకు. మత్తతా నాతాను కొడుకు. నాతాను దావీదు కొడుకు.
32 του ιεσσαι του ωβηδ του βοοζ του σαλμων του ναασσων
౩౨దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.
33 του αμιναδαβ του αραμ του εσρωμ του φαρεσ του ιουδα
౩౩నయస్సోను అమ్మీనాదాబు కొడుకు. అమ్మీనాదాబు అద్మిను కొడుకు. అద్మిను అర్నీ కొడుకు. అర్నీ ఎస్రోము కొడుకు, ఎస్రోము పెరెసు కొడుకు. పెరెసు యూదా కొడుకు.
34 του ιακωβ του ισαακ του αβρααμ του θαρα του ναχωρ
౩౪యూదా యాకోబు కొడుకు. యాకోబు ఇస్సాకు కొడుకు. ఇస్సాకు అబ్రాహాము కొడుకు. అబ్రాహాము తెరహు కొడుకు. తెరహు నాహోరు కొడుకు.
35 του σερουχ του ραγαυ του φαλεγ του εβερ του σαλα
౩౫నాహోరు సెరూగు కొడుకు. సెరూగు రయూ కొడుకు. రయూ పెలెగు కొడుకు. పెలెగు హెబెరు కొడుకు. హెబెరు షేలహు కొడుకు.
36 του καιναν του αρφαξαδ του σημ του νωε του λαμεχ
౩౬షేలహు కేయినాను కొడుకు. కేయినాను అర్పక్షదు కొడుకు. అర్పక్షదు షేము కొడుకు. షేము నోవహు కొడుకు. నోవహు లెమెకు కొడుకు.
37 του μαθουσαλα του ενωχ του ιαρεδ του μαλελεηλ του καιναν
౩౭లెమెకు మెతూషెల కొడుకు. మెతూషెల హనోకు కొడుకు. హనోకు యెరెదు కొడుకు. యెరెదు మహలలేలు కొడుకు. మహలలేలు కేయినాను కొడుకు.
38 του ενωσ του σηθ του αδαμ του θεου
౩౮కేయినాను ఎనోషు కొడుకు. ఎనోషు షేతు కొడుకు. షేతు ఆదాము కొడుకు. ఆదాము దేవుని కొడుకు.

< Κατα Λουκαν 3 >