< Luc 19 >

1 Il entra et traversa Jéricho.
ఆయన ప్రయాణం చేస్తూ సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి
2 Il y avait là un homme nommé Zachée. C'était un grand collecteur d'impôts, et il était riche.
దానిగుండా వెళ్తున్నాడు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ముఖ్యపన్ను వసూలుదారు, ధనవంతుడు.
3 Il cherchait à voir qui était Jésus, mais il ne pouvait pas à cause de la foule, car il était de petite taille.
ఇతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు. కాని జనసమూహం గుమిగూడడం వలనా ఇతడు పొట్టివాడు కావడం వలనా చూడలేకపోయాడు.
4 Il courut donc en avant et grimpa sur un sycomore pour le voir, car il allait passer par là.
అప్పుడు యేసు ఆ దారిలోనే వస్తున్నాడు, కాబట్టి అతడు ముందుగా పరిగెత్తి వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు.
5 Lorsque Jésus arriva à cet endroit, il leva les yeux et le vit, et il lui dit: « Zachée, dépêche-toi de descendre, car aujourd'hui je dois rester chez toi. »
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి, “జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి” అన్నాడు.
6 Il se hâta, descendit et le reçut avec joie.
అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.
7 Quand ils le virent, ils murmurèrent tous, disant: « Il est entré pour loger chez un homme qui est un pécheur. »
అది చూసి అందరూ, “ఈయన ఒక పాపాత్ముడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు” అని గొణగడం మొదలుపెట్టారు.
8 Zachée, debout, dit au Seigneur: « Voici, Seigneur, la moitié de mes biens, je la donne aux pauvres. Si j'ai exigé injustement quelque chose de quelqu'un, je lui rends quatre fois plus. »
జక్కయ్య నిలబడి, “ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను” అన్నాడు.
9 Jésus lui dit: « Aujourd'hui, le salut est arrivé à cette maison, car lui aussi est fils d'Abraham.
అందుకు యేసు, “ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే.
10 Car le Fils de l'homme est venu chercher et sauver ce qui était perdu. »
౧౦నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు” అని చెప్పాడు.
11 Comme ils entendaient ces choses, il poursuivit et raconta une parabole, parce qu'il était près de Jérusalem, et qu'ils supposaient que le Royaume de Dieu allait être révélé immédiatement.
౧౧వారు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఆయన యెరూషలేముకు దగ్గరలో ఉండడం వల్ల దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుందని వారు అనుకుంటున్నారు.
12 Il dit donc: « Un certain noble s'en alla dans un pays lointain pour recevoir un royaume et s'en retourner.
౧౨“గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు.
13 Il appela dix de ses serviteurs, leur donna dix pièces de mina et leur dit: « Occupez-vous de vos affaires jusqu'à ce que je vienne.
౧౩దానికి ముందు తన సేవకులు పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణాలు ఇచ్చాడు. “నేను తిరిగి వచ్చే వరకూ మీరు వీటితో వ్యాపారం చేయండి” అని చెప్పాడు.
14 Mais ses concitoyens le haïssaient et envoyèrent un émissaire à sa poursuite en disant: 'Nous ne voulons pas que cet homme règne sur nous.'
౧౪అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. ‘ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు’ అంటూ అతని వెనుకే రాయబారం పంపారు.
15 « Lorsqu'il fut de retour, après avoir reçu le royaume, il ordonna que ces serviteurs, à qui il avait donné l'argent, soient appelés auprès de lui, afin qu'il sache ce qu'ils avaient gagné en faisant des affaires.
౧౫అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చాడు. తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు.
16 Le premier se présenta devant lui et dit: « Seigneur, ton mina a fait dix autres minas.
౧౬“మొదటి వాడు వచ్చి, ‘అయ్యా, మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది” అన్నాడు.
17 Il lui dit: « C'est bien, bon serviteur. Parce que tu as été trouvé fidèle avec très peu de choses, tu auras autorité sur dix villes.
౧౭దానికి ఆ యజమాని, ‘భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.
18 « Le second vint, disant: « Ton mina, Seigneur, a fait cinq minas ».
౧౮ఇక రెండవ పనివాడు వచ్చాడు. ‘అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో ఐదు నాణాలు సంపాదించాను’ అన్నాడు.
19 Il lui dit: « Et toi, tu seras à la tête de cinq villes ».
౧౯యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.
20 Un autre vint, disant: « Seigneur, voici ta mina, que j'ai gardée dans un mouchoir,
౨౦అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, ‘అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం.
21 car je te craignais, parce que tu es un homme exigeant. Tu ramasses ce que tu n'as pas déposé, et tu récoltes ce que tu n'as pas semé.
౨౧దీన్ని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడివని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు,’ అన్నాడు.
22 Il lui dit: « C'est de ta propre bouche que je te jugerai, méchant serviteur! Tu savais que je suis un homme exigeant, prenant ce que je n'ai pas déposé et récoltant ce que je n'ai pas semé.
౨౨అందుకా యజమాని, ‘చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా,
23 Alors, pourquoi n'as-tu pas déposé mon argent à la banque, pour qu'à mon retour, j'en tire un intérêt?
౨౩అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా’ అని వాడితో చెప్పి,
24 Il dit à ceux qui se tenaient là: « Enlève-lui le mina et donne-le à celui qui a les dix minas.
౨౪తన దగ్గర ఉన్న వారితో, “వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణాలు ఉన్న వాడికివ్వండి’ అన్నాడు.
25 Ils lui dirent: « Seigneur, il a dix mines!
౨౫దానికి వారు, ‘అయ్యా అతని దగ్గర పది నాణాలు ఉన్నాయి కదా’ అన్నారు.
26 Car, je vous le dis, à quiconque a quelque chose, on donnera davantage; mais à celui qui n'a rien, on enlèvera même ce qu'il a.
౨౬అందుకు అతడు, ‘ఉన్న ప్రతి వాడికీ ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెబుతున్నాను.’
27 Mais amène ici ceux de mes ennemis qui n'ont pas voulu que je règne sur eux, et tue-les devant moi. »
౨౭మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.”
28 Ayant dit ces choses, il se mit en route, montant à Jérusalem.
౨౮యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు.
29 Lorsqu'il approcha de Bethsphage et de Béthanie, sur la montagne appelée des Oliviers, il envoya deux de ses disciples,
౨౯ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు.
30 en disant: « Allez de l'autre côté du village, où vous trouverez, en entrant, un ânon attaché, sur lequel personne ne s'est jamais assis. Détachez-le et amenez-le.
౩౦“మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకు రండి.
31 Si quelqu'un vous demande: « Pourquoi le détachez-vous? », dites-lui: « Le Seigneur en a besoin. »
౩౧ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపించాడు.
32 Ceux qui avaient été envoyés s'en allèrent et trouvèrent les choses exactement comme il les avait dites.
౩౨ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు.
33 Comme ils détachaient l'ânon, ses propriétaires leur dirent: « Pourquoi détachez-vous l'ânon? »
౩౩ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు, “మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారినడిగారు.
34 Ils répondirent: « Le Seigneur en a besoin. »
౩౪దానికి వారు, “ఇది ప్రభువుకు కావాలి” అన్నారు.
35 Puis ils l'amenèrent à Jésus. Ils jetèrent leurs manteaux sur l'ânon, et firent asseoir Jésus dessus.
౩౫తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు.
36 Pendant qu'il allait, ils étendirent leurs manteaux sur la route.
౩౬ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు.
37 Comme il approchait de la descente de la montagne des Oliviers, toute la multitude des disciples se mit à se réjouir et à louer Dieu à haute voix pour toutes les merveilles qu'ils avaient vues,
౩౭ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు.
38 en disant: Béni soit le Roi qui vient au nom du Seigneur! Paix dans les cieux, et gloire au plus haut des cieux! »
౩౮“ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు.
39 Quelques pharisiens de la foule lui dirent: « Maître, reprends tes disciples! »
౩౯ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, “బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు.
40 Il leur répondit: « Je vous le dis, si elles se taisaient, les pierres crieraient. »
౪౦ఆయన, “వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు.
41 Lorsqu'il s'approcha, il vit la ville et il pleura sur elle,
౪౧ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు.
42 en disant: « Si tu avais su aujourd'hui les choses qui appartiennent à ta paix! Mais maintenant, elles sont cachées à tes yeux.
౪౨“నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు.
43 Car il viendra sur toi des jours où tes ennemis dresseront contre toi une barricade, t'entoureront, t'enserreront de toutes parts,
౪౩ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు.
44 et te précipiteront par terre, toi et tes enfants qui sont en toi. Ils ne laisseront pas en toi une pierre sur l'autre, parce que tu n'as pas connu le moment de ton châtiment. »
౪౪నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు.
45 Il entra dans le temple et se mit à chasser ceux qui y achetaient et vendaient,
౪౫అప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో,
46 en leur disant: « Il est écrit: « Ma maison est une maison de prière", mais vous en avez fait une « caverne de voleurs ». »
౪౬“‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగల గుహగా చేశారు” అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు.
47 Il enseignait chaque jour dans le temple, mais les chefs des prêtres, les scribes et les principaux du peuple cherchaient à le faire périr.
౪౭ఆయన ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ, ప్రజల్లో ముఖ్యులు ఆయనను అంతం చేయాలని చూస్తూ వచ్చారు.
48 Ils ne trouvaient pas ce qu'ils pouvaient faire, car tout le peuple était attaché à chacune de ses paroles.
౪౮కాని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను విడిచి పెట్టకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు.

< Luc 19 >