< Luukkaan 18 >

1 Ja hän puhui heille vertauksen siitä, että heidän tuli aina rukoilla eikä väsyä.
తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు.
2 Hän sanoi: "Eräässä kaupungissa oli tuomari, joka ei peljännyt Jumalaa eikä hävennyt ihmisiä.
“ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు.
3 Ja siinä kaupungissa oli leskivaimo, joka vähän väliä tuli hänen luoksensa ja sanoi: 'Auta minut oikeuteeni riitapuoltani vastaan'.
ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి ‘నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి’ అని అడుగుతూ ఉండేది.
4 Mutta pitkään aikaan hän ei tahtonut. Vaan sitten hän sanoi mielessään: 'Vaikka en pelkää Jumalaa enkä häpeä ihmisiä,
అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు. కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు, ‘నేను దేవుడికి భయపడను, మనుషులనూ లెక్కచెయ్యను.
5 niin kuitenkin, koska tämä leski tuottaa minulle vaivaa, minä autan hänet oikeuteensa, ettei hän lopulta tulisi ja kävisi minun silmilleni'."
కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను’ అనుకున్నాడు.”
6 Niin Herra sanoi: "Kuulkaa, mitä tuo väärä tuomari sanoo!
ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా!
7 Eikö sitten Jumala toimittaisi oikeutta valituillensa, jotka häntä yötä päivää avuksi huutavat, ja viivyttäisikö hän heiltä apuansa?
తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా?
8 Minä sanon teille: hän toimittaa heille oikeuden pian. Kuitenkin, kun Ihmisen Poika tulee, löytäneekö hän uskoa maan päältä?"
ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?”
9 Niin hän puhui vielä muutamille, jotka luottivat itseensä, luullen olevansa vanhurskaita, ja ylenkatsoivat muita, tämän vertauksen:
తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు.
10 "Kaksi miestä meni ylös pyhäkköön rukoilemaan, toinen fariseus ja toinen publikaani.
౧౦“ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు.
11 Fariseus seisoi ja rukoili itsekseen näin: 'Jumala, minä kiitän sinua, etten minä ole niinkuin muut ihmiset, riistäjät, väärämieliset, huorintekijät, enkä myöskään niinkuin tuo publikaani.
౧౧పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
12 Minä paastoan kahdesti viikossa; minä annan kymmenykset kaikista tuloistani.'
౧౨వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
13 Mutta publikaani seisoi taampana eikä edes tahtonut nostaa silmiään taivasta kohti, vaan löi rintaansa ja sanoi: 'Jumala, ole minulle syntiselle armollinen'.
౧౩అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.
14 Minä sanon teille: tämä meni kotiinsa vanhurskaampana kuin se toinen; sillä jokainen, joka itsensä ylentää, alennetaan, mutta joka itsensä alentaa, se ylennetään."
౧౪పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.
15 Ja he toivat hänen tykönsä myös pieniä lapsia, että hän koskisi heihin; mutta sen nähdessään opetuslapset nuhtelivat tuojia.
౧౫తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు.
16 Mutta Jeesus kutsui lapset tykönsä ja sanoi: "Sallikaa lasten tulla minun tyköni älkääkä estäkö heitä, sillä senkaltaisten on Jumalan valtakunta.
౧౬అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే.
17 Totisesti minä sanon teille: joka ei ota vastaan Jumalan valtakuntaa niinkuin lapsi, se ei pääse sinne sisälle."
౧౭చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
18 Ja eräs hallitusmies kysyi häneltä sanoen: "Hyvä opettaja, mitä minun pitää tekemän, että minä iankaikkisen elämän perisin?" (aiōnios g166)
౧౮ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. (aiōnios g166)
19 Jeesus sanoi hänelle: "Miksi sanot minua hyväksi? Ei kukaan ole hyvä, paitsi Jumala yksin.
౧౯అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.
20 Käskyt sinä tiedät: 'Älä tee huorin', 'Älä tapa', 'Älä varasta', 'Älä sano väärää todistusta', 'Kunnioita isääsi ja äitiäsi'."
౨౦వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.
21 Mutta hän sanoi: "Tätä kaikkea minä olen noudattanut nuoruudestani asti".
౨౧దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.
22 Kun Jeesus sen kuuli, sanoi hän hänelle: "Yksi sinulta vielä puuttuu: myy kaikki, mitä sinulla on, ja jakele köyhille, niin sinulla on oleva aarre taivaissa; ja tule ja seuraa minua".
౨౨యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు.
23 Mutta tämän kuullessaan hän tuli kovin murheelliseksi, sillä hän oli sangen rikas.
౨౩అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు.
24 Kun Jeesus näki hänen olevan murheissaan, sanoi hän: "Kuinka vaikea onkaan niiden, joilla on tavaraa, päästä Jumalan valtakuntaan!
౨౪యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం.
25 Helpompi on kamelin käydä neulansilmän läpi kuin rikkaan päästä Jumalan valtakuntaan."
౨౫ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.
26 Niin ne, jotka sen kuulivat, sanoivat: "Kuka sitten voi pelastua?"
౨౬ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు
27 Mutta hän sanoi: "Mikä ihmisille on mahdotonta, se on Jumalalle mahdollista".
౨౭అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు.
28 Silloin Pietari sanoi: "Katso, me olemme luopuneet siitä, mitä meillä oli, ja seuranneet sinua".
౨౮అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.”
29 Niin hän sanoi heille: "Totisesti minä sanon teille: ei ole ketään, joka Jumalan valtakunnan tähden on luopunut talosta tai vaimosta tai veljistä tai vanhemmista tai lapsista,
౨౯అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి,
30 ja joka ei saisi monin verroin takaisin tässä ajassa, ja tulevassa maailmassa iankaikkista elämää". (aiōn g165, aiōnios g166)
౩౦ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. (aiōn g165, aiōnios g166)
31 Ja hän otti tykönsä ne kaksitoista ja sanoi heille: "Katso, me menemme ylös Jerusalemiin, ja kaikki on täysin toteutuva, mitä profeettain kautta on kirjoitettu Ihmisen Pojasta.
౩౧ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి.
32 Sillä hänet annetaan pakanain käsiin, ja häntä pilkataan ja häväistään ja syljetään;
౩౨ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు.
33 ja ruoskittuaan he tappavat hänet, ja kolmantena päivänä hän nousee ylös."
౩౩ఆయనను కొరడాలతో కొడతారు, చంపివేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పాడు.
34 Mutta he eivät ymmärtäneet tästä mitään, ja tämä puhe oli heiltä niin salattu, etteivät he käsittäneet, mitä sanottiin.
౩౪వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు.
35 Ja hänen lähestyessään Jerikoa eräs sokea istui tien vieressä kerjäten.
౩౫ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు.
36 Ja kuullessaan, että siitä kulki kansaa ohi, hän kyseli, mitä se oli.
౩౬పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి, “ఏం జరుగుతోంది?” అని అడిగాడు.
37 He ilmoittivat hänelle Jeesuksen, Nasaretilaisen, menevän ohitse.
౩౭నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు.
38 Niin hän huusi sanoen: "Jeesus, Daavidin poika, armahda minua!"
౩౮అప్పుడు వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని కేకలు వేయడం మొదలు పెట్టాడు.
39 Ja edelläkulkijat nuhtelivat häntä saadakseen hänet vaikenemaan; mutta hän huusi vielä enemmän: "Daavidin poika, armahda minua!"
౩౯ముందు నడుస్తున్నవారు, “నోరు మూసుకో” అని గద్దించారు. కానీ వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు.
40 Silloin Jeesus seisahtui ja käski taluttaa hänet tykönsä. Ja hänen tultuaan lähelle Jeesus kysyi häneltä:
౪౦అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు.
41 "Mitä tahdot, että minä sinulle tekisin?" Hän sanoi: "Herra, että saisin näköni jälleen".
౪౧వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, “నీ కోసం నేనేంచేయాలని కోరుతున్నావు?” అని అడిగాడు. దానికి వాడు, “ప్రభూ, నాకు చూపు కావాలి” అన్నాడు.
42 Niin Jeesus sanoi hänelle: "Saa näkösi; sinun uskosi on sinut pelastanut".
౪౨దానికి యేసు, “చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
43 Ja heti hän sai näkönsä ja seurasi häntä ylistäen Jumalaa. Ja sen nähdessään kaikki kansa kiitti Jumalaa.
౪౩వెంటనే వాడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు.

< Luukkaan 18 >