< Acts 3 >

1 Now Peter and John went up to the temple at the ninth hour of prayer.
మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.
2 And a certain man, who was lame from his mother’s womb, was being carried in. They would lay him every day at the gate of the temple, which is called the Beautiful, so that he might request alms from those entering into the temple.
పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు.
3 And this man, when he had seen Peter and John beginning to enter the temple, was begging, so that he might receive alms.
పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు.
4 Then Peter and John, gazing at him, said, “Look at us.”
పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు.
5 And he looked intently at them, hoping that he might receive something from them.
అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు.
6 But Peter said: “Silver and gold is not mine. But what I have, I give to you. In the name of Jesus Christ the Nazarene, rise up and walk.”
అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని
7 And taking him by the right hand, he lifted him up. And immediately his legs and feet were strengthened.
వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి.
8 And leaping up, he stood and walked around. And he entered with them into the temple, walking and leaping and praising God.
వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.
9 And all the people saw him walking and praising God.
వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు.
10 And they recognized him, that he was the same one who was sitting for alms at the Beautiful Gate of the temple. And they were filled with awe and amazement at what had happened to him.
౧౦‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.
11 Then, as he held on to Peter and John, all the people ran to them at the portico, which is called Solomon’s, in astonishment.
౧౧వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.
12 But Peter, seeing this, responded to the people: “Men of Israel, why do you wonder at this? Or why do you stare at us, as if it were by our own strength or power that we caused this man to walk?
౧౨పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితోనో, భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?
13 The God of Abraham and the God of Isaac and the God of Jacob, the God of our fathers, has glorified his Son Jesus, whom you, indeed, handed over and denied before the face of Pilate, when he was giving judgment to release him.
౧౩అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరాయన్ని పిలాతుకు అప్పగించారు, అతడు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు మీరు అతని ముందు ఆయనను తిరస్కరించారు.
14 Then you denied the Holy and Just One, and petitioned for a murderous man to be given to you.
౧౪పవిత్రుడూ నీతిమంతుడైన వాణ్ణి మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు.
15 Truly, it was the Author of Life whom you put to death, whom God raised from the dead, to whom we are witnesses.
౧౫మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.
16 And by faith in his name, this man, whom you have seen and known, has confirmed his name. And faith through him has given this man complete health in the sight of you all.
౧౬ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
17 And now, brothers, I know that you did this through ignorance, just as your leaders also did.
౧౭సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు.
18 But in this way God has fulfilled the things that he announced beforehand through the mouth of all the Prophets: that his Christ would suffer.
౧౮అయితే తన క్రీస్తు తప్పక బాధల పాలు కావాలని దేవుడు ప్రవక్తలందరి ద్వారా ముందే తెలియజేసిన సంగతులను ఆయన ఇప్పుడు ఈ విధంగా నెరవేర్చాడు.
19 Therefore, repent and be converted, so that your sins may be wiped away.
౧౯కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.
20 And then, when the time of consolation will have arrived from the presence of the Lord, he will send the One who was foretold to you, Jesus Christ,
౨౦అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.
21 whom heaven certainly must take up, until the time of the restoration of all things, which God has spoken of by the mouth of his holy prophets, from ages past. (aiōn g165)
౨౧అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పించాడు. అంతవరకూ యేసు పరలోకంలో ఉండడం అవసరం. (aiōn g165)
22 Indeed, Moses said: ‘For the Lord your God shall raise up a Prophet for you from your brothers, one like me; the same shall you listen to according to everything whatsoever that he shall speak to you.
౨౨మోషే నిజంగా ఇలా అన్నాడు కదా, ‘ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుండి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు తప్పకుండా వినాలి.’
23 And this shall be: every soul who will not listen to that Prophet shall be exterminated from the people.’
౨౩ఆ ప్రవక్త చెప్పినదాన్ని పెడచెవిన పెట్టేవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమై పోతాడు.
24 And all the prophets who have spoken, from Samuel and thereafter, have announced these days.
౨౪“సమూయేలుతో మొదలుపెట్టి మిగతా ప్రవక్తలంతా ఈ రోజుల గురించి ముందుగానే చెప్పారు.
25 You are sons of the prophets and of the testament which God has appointed for our fathers, saying to Abraham: ‘And by your offspring all the families of the earth shall be blessed.’
౨౫‘నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాను’ అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.
26 God raised up his Son and sent him first to you, to bless you, so that each one may turn himself away from his wickedness.”
౨౬దేవుడు తన సేవకుని లేవనెత్తి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు.”

< Acts 3 >