< Proverbs 22 >

1 A good name is more to be desired than great wealth, and to be respected is better than silver and gold.
గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.
2 The man of wealth and the poor man come face to face: the Lord is the maker of them all.
ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే.
3 The sharp man sees the evil and takes cover: the simple go straight on and get into trouble.
బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు.
4 The reward of a gentle spirit and the fear of the Lord is wealth and honour and life.
యెహోవా పట్ల భయభక్తులు వినయాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని తెస్తాయి.
5 Thorns and nets are in the way of the twisted: he who keeps watch over his soul will be far from them.
ముళ్ళు, ఉచ్చులు మూర్ఖుల దారిలో ఉన్నాయి. తనను కాపాడుకొనేవాడు వాటికి దూరంగా ఉంటాడు.
6 If a child is trained up in the right way, even when he is old he will not be turned away from it.
పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు.
7 The man of wealth has rule over the poor, and he who gets into debt is a servant to his creditor.
ఐశ్వర్యవంతుడు పేదలపై పెత్తనం చేస్తాడు. అప్పుచేసిన వాడు అప్పిచ్చిన వాడికి బానిస.
8 By planting the seed of evil a man will get in the grain of sorrow, and the rod of his wrath will be broken.
దుర్మార్గాన్ని విత్తనంగా చల్లేవాడు కీడు అనే పంట కోసుకుంటాడు. వాడి క్రోధమనే కర్ర నిరర్థకమై పోతుంది.
9 He who is kind will have a blessing, for he gives of his bread to the poor.
ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు.
10 Send away the man of pride, and argument will go out; truly fighting and shame will come to an end.
౧౦తిరస్కారబుద్ధి గలవాణ్ణి వెళ్ళగొట్టు. కలహాలు, పోరాటాలు, అవమానాలు వాటంతట అవే సద్దు మణుగుతాయి.
11 He whose heart is clean is dear to the Lord; for the grace of his lips the king will be his friend.
౧౧శుద్ధ హృదయాన్ని ప్రేమిస్తూ ఇంపైన మాటలు పలికే వాడికి రాజు స్నేహితుడౌతాడు.
12 The eyes of the Lord keep knowledge, but by him the acts of the false man will be overturned.
౧౨జ్ఞానం గలవాడిపై యెహోవా చూపు నిలుపుకుని అతణ్ణి కాపాడతాడు. విశ్వాస ఘాతకుల మాటలు ఆయన కొట్టి పారేస్తాడు.
13 The hater of work says, There is a lion outside: I will be put to death in the streets.
౧౩సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు.
14 The mouth of strange women is a deep hole: he with whom the Lord is angry will go down into it.
౧౪వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపాన్ని మూటగట్టుకున్నవాడు దానిలో పడతాడు.
15 Foolish ways are deep-seated in the heart of a child, but the rod of punishment will send them far from him.
౧౫పిల్లవాడి హృదయంలో మూఢత్వం సహజంగానే ఉంటుంది. బెత్తంతో విధించే శిక్ష దాన్ని వాడిలోనుండి తోలివేస్తుంది.
16 He who is cruel to the poor for the purpose of increasing his profit, and he who gives to the man of wealth, will only come to be in need.
౧౬తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.
17 Let your ear be bent down for hearing my words, and let your heart give thought to knowledge.
౧౭శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి.
18 For it is a delight to keep them in your heart, to have them ready on your lips.
౧౮నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవడం, అవన్నీ నీ పెదవులపై ఉండడం ఎంతో రమ్యం.
19 So that your faith may be in the Lord, I have made them clear to you this day, even to you.
౧౯నీవు యెహోవాను ఆశ్రయించేలా నీకు, అవును, నీకే గదా నేను ఈ రోజున వీటిని ఉపదేశించాను?
20 Have I not put in writing for you thirty sayings, with wise suggestions and knowledge,
౨౦వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా?
21 To make you see how certain are true words, so that you may give a true answer to those who put questions to you?
౨౧నిన్ను పంపేవారికి నీవు యథార్థంగా జవాబులిచ్చేలా, నమ్మదగిన సత్యవాక్కులు నీకు నేర్పించ లేదా?
22 Do not take away the property of the poor man because he is poor, or be cruel to the crushed ones when they come before the judge:
౨౨పేదవాడు గదా అని పేదవాణ్ణి దోచుకోవద్దు. పట్టణ ద్వారాల దగ్గర నిస్సహాయులను నలగ గొట్టవద్దు.
23 For the Lord will give support to their cause, and take the life of those who take their goods.
౨౩యెహోవా వారి పక్షంగా వాదిస్తాడు. వారిని దోచుకొనేవారి ప్రాణాలు ఆయన దోచుకుంటాడు.
24 Do not be friends with a man who is given to wrath; do not go in the company of an angry man:
౨౪కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు.
25 For fear of learning his ways and making a net ready for your soul.
౨౫నువ్వు కూడా వాడి ధోరణి నేర్చుకుని నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో జాగ్రత్త.
26 Be not one of those who give their hands in an agreement, or of those who make themselves responsible for debts:
౨౬అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు.
27 If you have nothing with which to make payment, he will take away your bed from under you.
౨౭ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా?
28 Let not the old landmark be moved which your fathers have put in place.
౨౮నీ పూర్వీకులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
29 Have you seen a man who is expert in his business? he will take his place before kings; his place will not be among low persons.
౨౯తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు.

< Proverbs 22 >