< 路加福音 1 >

1 如你所知,很多人都曾试图用文字记录我们参与的成就。
ఘనులైన తియొఫిలా,
2 他们所记录的证据,来自最早见证和传递上帝讯息之人。
మొదటి నుంచీ కళ్ళారా చూసిన వాక్య సేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలా మంది పూనుకున్నారు.
3 由于我从始至终都参与其中,所以应该可以准确无误地撰写所发生的一切。
కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు కచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటిని మొదటి నుండీ పరిశోధించి కూలంకషంగా తెలుసుకున్న నేను నీ కోసం
4 敬爱的提阿非罗们,我之所以这么做,是为了让你们确认自己所学之道完全值得信赖。
వాటన్నిటినీ క్రమపద్ధతిలో రాయడం మంచిదని నాకు అనిపించింది.
5 希律担任犹太王的那段时间,亚比雅班里有一位名叫撒迦利亚的祭司,他妻子以利沙伯是亚伦的后人。
యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు.
6 他们的一举一动都遵循上帝正道,严格遵守主所立下的一切诫命规条。
వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు.
7 但他们没有孩子,因为以利沙伯无法生育,而且二人都年岁已高。。
అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.
8 有一天,撒迦利亚按照排班的时间履行作为上帝祭司的职责,
జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా
9 照惯例抽签后,他被选中进入主的神庙上香。
యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది.
10 在烧香的过程,众人都在外面祈祷。
౧౦ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు.
11 这时天使向撒迦利亚显化,立于香坛的右侧。
౧౧ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు.
12 撒迦利亚见状颇感惊慌,非常害怕。
౧౨జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు.
13 天使说:“撒迦利亚,别害怕,上帝听到了你的祈求。你妻子以利沙伯将为你生下一子,你将为他起名为约翰。
౧౩అప్పుడా దూత అతనితో, “జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు.
14 这孩子会为你带来欢喜和快乐,许多人都会来庆祝他的降生。
౧౪అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది. అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు.
15 他将成为主面前的尊者,滴酒不沾,未降生之前便有圣灵附体。
౧౫అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు.
16 他将带领众多以色列人,回到主、也就是他们的上帝身边。
౧౬ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు.
17 他将以以利亚的圣灵和力量走在前,劝说父亲们关爱自己的儿女,规劝悖逆之人走正道,让民众准备好迎接主。”
౧౭తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్ళించి, అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు. తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు” అన్నాడు.
18 撒迦利亚问天使:“我要如何相信这一切?我老了,我妻子也是一把年纪。”
౧౮దేవదూతతో జెకర్యా, “ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు” అన్నాడు
19 天使回答:“我是上帝面前的加百列,奉命向你传话,告诉你这个好消息。
౧౯దూత, “నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు.
20 但你并不相信我所说的一切,所以你会失语,直到我所言之事成真,你才能开口说话。”
౨౦నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు” అని అతనితో అన్నాడు.
21 众人正在外面等候撒迦利亚,见他迟迟未从神庙出来,很是奇怪。
౨౧ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు.
22 但他出来时却真的失语了,无法讲话,只能打手势。于是众人意识到刚才在神庙中出现了神迹。
౨౨అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.
23 他完成自己的职责后便回了家。
౨౩అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరవాత ఇంటికి వెళ్ళి పోయాడు.
24 几天后,他妻子以利沙伯果真怀孕,在家中待了五个月。
౨౪ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు.
25 她说:“这一切是主的旨意,他这样待我,便是要让我不再在世人面前感到羞辱。”
౨౫ఆమె, “దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు” అనుకుంది.
26 在怀孕的第六个月,上帝派天使加百列来到加利利的拿撒勒镇,现身在一个名叫玛利亚的少女面前。
౨౬ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో
27 玛利亚当时已与一位名叫约瑟夫的男人订婚。
౨౭దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ.
28 天使向她问候,然后对她说“你很幸运,主与你同在。”
౨౮ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, “అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు” అని పలికాడు.
29 玛利亚对此颇感困惑,不知道这问候到底意味着什么。
౨౯ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా,
30 天使说:“玛利亚,不要怕!因为上帝已对你施以恩典。
౩౦దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది.
31 你将怀孕生子,那婴儿将起名叫耶稣。
౩౧ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
32 他将成为一位伟人,被称为至高上帝之子,上帝将把向其赐予祖先大卫的王位,
౩౨ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.
33 他将永远统治雅各的家园,他的王国将永续存在。” (aiōn g165)
౩౩ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు. (aiōn g165)
34 玛利亚问天使:“但这怎能可能?我还是处女。”
౩౪మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది.
35 天使回答:“圣灵将降临于你,至高上帝将笼罩于你。那即将诞下的婴儿生而神圣,将被称为上帝之子。
౩౫ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.
36 甚至连你的亲戚以利沙伯都怀孕了,人们说那女人无法生育,现在怀胎已有六个月。
౩౬పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల.
37 对于上帝而言,一切皆有可能。”
౩౭దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.
38 玛利亚说:“我听你的,随时准备服侍上帝,愿你所言的事情发生在我身上。”于是天使便离开了。
౩౮అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.
39 稍后,玛利亚准备了一下便急忙赶去犹太山地的一座城市,
౩౯ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది.
40 来到撒迦利亚的家。她走进屋向以利沙伯问安。
౪౦
41 听见玛利亚的问候,以利沙伯腹中的婴儿立刻开始跳动,表达着喜悦。圣灵注入了以利沙伯的体内,
౪౧ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది.
42 于是她高声说:“你是一位如此有福的女人,你腹中的婴儿能由你诞下,也是一种福气!
౪౨“స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది.
43 我太荣幸了,我主之母能够造访我的寒舍。
౪౩నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!
44 听到你问候的那一刻,我腹中的婴儿就欢喜跳跃。
౪౪నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు.
45 你真荣幸,因为你已确信,主将把对你的承诺变为现实!”
౪౫ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు” అంది.
46 玛利亚说:“赞美主!
౪౬అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.
47 上帝救世主让我如此欢喜,
౪౭ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.
48 因为我作为他的仆人,尽管身世卑微,他却决定垂青于我。今后万代都会认为我是获得赐福之人。
౪౮నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.
49 全能上帝对我做出伟大之举,他的名字如此神圣。
౪౯
50 他的怜悯将在尊敬他的世界中传递。
౫౦ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది.
51 他凭借其力量,击败了那些自作聪明之人。
౫౧ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు.
52 他能够让位高权重之人跌落王位,让谦卑之人获得升华,
౫౨బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు
53 他让饥肠辘辘之人饱餐美食,也让富足之人两手空空。
౫౩ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.
54 在他的帮助下,他的仆人以色列将永记他的怜悯, (aiōn g165)
౫౪
55 正如他向我们先父、亚伯拉罕及其后裔所做的承诺。”
౫౫అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి, వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.” (aiōn g165)
56 玛利亚和以利沙伯同住了三个月,然后便返回自己的家。
౫౬మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది.
57 以利沙伯终于诞下一名男婴。
౫౭ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది.
58 邻居和亲戚们得知主向她施以如此善意,便和她一同庆祝。
౫౮అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు.
59 到了第八天,他们前来为孩子行割礼,打算让他随父亲的名字叫撒迦利亚。
౫౯వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా
60 但以利沙伯说:“不要,他应该叫做约翰。”
౬౦తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది.
61 众人回答:“但你的亲戚中并没有这样的名字。”
౬౧అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని,
62 他们通过手势询问孩子的父亲撒迦利亚,询问他的意见。
౬౨“వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు.
63 撒迦利亚示意要写字。令众人诧异的是,他写下的是:“他就叫约翰。”
౬౩అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు.
64 忽然他再次开口说话了,开始赞美上帝。
౬౪వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు.
65 这一切让住在周围的人心生敬畏,这个消息很快就传遍整个犹太山地。
౬౫అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు.
66 众人听闻此事便思量它的含义:“这孩子将会成为怎样的人?”因为很显然,他对上帝而言非常特别。
౬౬జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు.
67 婴儿的父亲撒迦利亚体内充满了圣灵,他预言道:
౬౭అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు,
68 “主就是以色列的上帝,他如此伟大,因为他降临到子民之中,为其赋予自由,
౬౮“ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.
69 他向其仆人大卫的家族赐予伟大的救赎,
౬౯తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.
70 正如他自古以来借由其神圣先知所传达的预言。 (aiōn g165)
౭౦మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు. దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు. ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను, అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు. (aiōn g165)
71 他承诺拯救我们摆脱敌人,远离那些憎恨我们的人。
౭౧
72 他怜悯我们的祖先,记得他的圣约,
౭౨
73 那是他向我们的祖先亚伯拉罕所发誓言。
౭౩
74 他让我们摆脱恐惧,从敌人手中拯救我们,
౭౪మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.
75 这让我们可以毕生遵循正道并服侍于他。
౭౫
76 尽管你现在只是一个婴儿,但却会被称为至高上帝的先知,因你将先于主之前,为他铺好道路,
౭౬ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.
77 通过宽恕其子民的罪,传播救赎的讯息。
౭౭
78 蒙上帝对我们的关爱怜悯,天堂的黎明将降临照耀我们,
౭౮
79 照亮那些活在黑暗中、笼罩在死亡阴影中的人,引导我们走上平安之路。”
౭౯మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది. ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.”
80 这个叫做约翰的男孩逐渐长大,精神变得很强大。他一直住在荒野之中,等待在以色列人中公开露面的时机。
౮౦ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.

< 路加福音 1 >