< Luhka 9 >

1 Acunüng Jesuh naw axüisaw he xaleinghngih atänga jah khü lü, khawyai he avan jah mkhütnaka johit la natnak he jah m'yainak be theinak jah pe lü,
ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ అధికారాన్నీ, రోగాలు నయం చేసే శక్తినీ ఇచ్చాడు.
2 Pamhnama khawa mawng sang hü khai he la, am phetki he jah m’yai be khai hea a jah tüih.
దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగులను బాగు చేయడానికీ వారిని పంపాడు.
3 Acunüng Jesuh naw, “Nami cehnaka ipi ä nami cehei vai, ksawngkhea pi kyase, kthäheinaka ngjaa pi kyase, eia pi kyase, nguia pi kyase, ä nami cehei vai, kcu nghngih ä nami cehei vai.
అప్పుడు ఆయన, “మీరు ప్రయాణం కోసం చేతికర్రను గానీ సంచిని గానీ రొట్టెను గానీ వెండిని గానీ ఇంకా దేనినైనా తీసుకు వెళ్ళవద్దు. రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు.
4 “Acunüng nami phanaka ima nami awm laih laih vai, acun üngka naw nami ktawih be vai.
మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి. అక్కడ నుండే బయలుదేరండి.
5 “Am ning jah dokhamki cun, acuna mlüh üngka naw nami ktawih be üng, ami ngsingnak vaia nami khawpha üngka mvut nami khawk hüt vai,” a ti.
మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలో నుండి బయలుదేరేటప్పుడు వారిమీద సాక్ష్యంగా ఉండడానికి మీ కాలి దుమ్మును దులిపివేయండి” అన్నాడు.
6 Acunüng axüisaw he cun ktawih u lü, ngnam naküta cit hü u lü, thangkdaw sang hü u lü, hmün naküt üng ami jah m’yai hü be.
వారు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ, రోగులను బాగు చేస్తూ గ్రామాల్లో పర్యటించారు.
7 Acunüng, Kalile uki Herod naw ahmäi ngja law lü aktäa cäi lawki; avang he naw, “Baptican Johan xüng law beki ni,” ami ti.
జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయన గురించి కొందరు ‘యోహాను చనిపోయి లేచాడు’ అనీ,
8 Avang naw, “Elijah ngdang lawki ni,” ti u se, avang he naw, “Ajana sahma mat mat xüng law beki he ni” ami ti.
మరి కొందరు ‘ఏలీయా కనిపించాడు’ అనీ, ఇంకొంతమంది ‘పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడు’ అనీ చెప్పుకుంటూ ఉన్నారు.
9 Acunüng, Herod naw, “Johan cun a lu ka xün päng ni, ahikba sena a mawng ka ngjak hin u ni?” a ti. Acunüng Herod naw Jesuh a hmuh vai aktäa ngjahlüki.
అప్పుడు హేరోదు ‘నేను యోహాను తల తీయించాను కదా. మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో’ అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు.
10 Acunüng, ngsä he law be u lü, ami bilawh he Jesuh üng ami jah mtheh law. Acunüng, Jesuh naw jah ngkhahpüi lü Bethsaida mlüh ami tia, a jah cehpüi.
౧౦అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంట బెట్టుకుని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు.
11 Cunsepi, khyang he naw sim u lü, ami läk laih laih, acunüng Jesuh naw aktäa jah dokham lü, Pamhnama khawa mawng ngthu jah mtheki naw, m’yai be vai avan a jah m’yai be.
౧౧జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి, దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు.
12 Acunüng, nghngi kya law hlü se, xaleinghngih he Jesuha veia law u lü, “Khyang he mi peisu ngnam he la loea jah tüia, ngsutnak la ei vai hmuei khai hea, hina mäih khawkhyawng khawa mi awm ve,” ami ti.
౧౨పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి” అన్నారు.
13 Acunüng Jesuh naw jah msang lü, “Nangmi naw ami ei vai jah pe ua,” a ti. Acunüng axüisaw he naw, “Muk mhma la nga nglung nghngih ni kami tak. Hin he avana hama, ei vai kami va kheih vai ti aih lü? ami ti.
౧౩ఆయన, “మీరే వీళ్ళకి భోజనం పెట్టండి” అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే” అన్నారు.
14 Kpami däng pi thawng mhma lawki hea kyaki. Acunüng Jesuh naw, axüisaw he üng, “Mhmakip cia, aphäh phäha jah ngawhsak u,” a ti.
౧౪అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు.
15 Acunüng acunkba ami van ami jah ngawhsak.
౧౫వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు.
16 Jesuh naw muk mhma la nga nglung nghngih lo lü, khankhawa hang mang lü, josenak am kbe lü, boki naw, khyang hea maa, ami tak vaia axüisaw he üng a jah pet.
౧౬అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు.
17 Acunüng, ami van naw ei u lü phü u se, ami ei mnawi cä xaleinghngiha ami kaw.
౧౭వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.
18 Acunüng hinkba kyaki, Jesuh amät ktaiyü se, axüisaw he a veia lawki he, Jesuh naw, “Khyang he naw ua ni ami na ngaih,” ti lü a jah kthäh.
౧౮ఒకసారి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. “నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు.
19 Acunüng, axüisaw he naw, “Baptican Johana ning ngai ve u; cunsepi, avang naw, ‘Elijaha’ ning ngai ve u, avang naw, ‘Akphyüma sahma mat mat xüng law beki ni’ ti ve u,” tia ami msang.
౧౯వారు, “బాప్తిసమిచ్చే యోహాననీ, కొందరు ఏలీయా అనీ, కొందరేమో పూర్వకాలంలో నివసించిన ప్రవక్త లేచాడనీ చెప్పుకుంటున్నారు” అని ఆయనకు జవాబిచ్చారు.
20 Acunüng Jesuh naw, “Acuna akyaküng, nangmi naw mä ua ni nami na ngaih,” a ti. Pita naw, “Nang cun Mhnama Mesijah ni” a ti.
౨౦అప్పుడు ఆయన, “మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు దేవుని అభిషిక్తుడివి” అన్నాడు.
21 Acunüng, upi acuna mawng ä ami mtheh vaia a jah ksük.
౨౧ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి కచ్చితంగా ఆజ్ఞాపించాడు.
22 Acunüng Jesuh naw, “Khyanga capa naw aktäa khuikhanak khamei khai, angvai he, ktaiyü ngvai he la thum ksing he naw ma khai he, hnima kya khai, amhmüp kthum üng tho law be khai,” a ti.
౨౨“మనుష్య కుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు. యూదు పెద్దలూ, ప్రధాన యాజకులూ, ధర్మ శాస్త్ర పండితులూ ఆయనను తిరస్కరిస్తారు. ఆయనను చంపుతారు. ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది.” అని చెప్పాడు.
23 Acunüng, ami vana veia, “Upi na läk law khai ngaiki naw amät ä ngaikyu lü, a kutlamktung amhmüp tä se kawt lü na läk law se.
౨౩ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి,
24 “Upi a xünnak küikyanei khai büki naw mkhyüh lü, upi keia phäha, a xünnak mkhyühki naw küikyanei khai.
౨౪తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనే వాడు దాన్ని కాపాడుకుంటాడు.
25 “Khyang naw khawmdek avan ka na lü, amät la amät pyeh se, am acunüng xükse, ia ni a ngmangnak kawm?
౨౫ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం?
26 “Upi, kei la ka ngthu ngkekhyakei naki cun, khyanga Capa naw, a pa hlüngtainak, amäta hlüngtainak la khankhawngsä ngcim he am a law be üng, ngkekhyakei na be khai.
౨౬నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు.
27 “Akcanga ka ning jah mthehki, hin üng ngdüiki he avang, Pamhnama khaw am ami hmuh hlana küt üng am thi khai he awmki he” a ti.
౨౭అయితే ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకూ మరణించరని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
28 Acuna ngthu a pyen kän amhmüp khyet üng, Pita, Johan la Jakuk jah ngkhahpüi lü, ktaiyü khaia mcunga kaiki.
౨౮ఈ మాటలు పలికిన తరువాత సుమారు ఎనిమిది రోజులయ్యాక ఆయన పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు.
29 A ktaiyü k’um üng, a hmai hnga law lü, a suisak he a ktäa bawk law lü ngkah lawki.
౨౯ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరిసాయి.
30 Acunüng, khyang nghngih Jesuh am ngthuheiki xawi, acun kxawi cun Mosi la Elijaha kyaki xawi,
౩౦ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే ఏలీయాలు.
31 khankhaw hlüngtai kyäpsawknak suiawi ni lü, Jerusalema a khuikhanak vaia mawng pyenki xawi.
౩౧వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు.
32 Acunüng, Pita la a püi he ipeiki he let law u lü, a hlüngtainak la a peia khyang nghngih ngdüiki xawi ami jah hmuh.
౩౨పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారికి మెలకువ రాగానే ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులనూ చూశారు.
33 Acun xawi naw Jesuh ani ktawih law hlü tak üng, Pita naw i a pyen ä ksingei lü Jesuh üng, “Saja aw, hia awm hin daw ve, na hama mat, Mosia hama mat, Elijaha hama mat samca kthum kami sa khai,” a ti.
౩౩ఆ ఇద్దరు వ్యక్తులూ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతుండగా పేతురు, “ప్రభూ, మనం ఇక్కడ ఉండడం బాగుంటుంది. నీకు ఒకటీ, మోషేకు ఒకటీ, ఏలీయాకు ఒకటీ మూడు పర్ణశాలలు మేము కడతాం” అంటూ తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు.
34 Acukba a pyen k’um üng khawngmei naw jah msungin law se, axüisaw he kyü lawki he.
౩౪అతడు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు చాలా భయపడ్డారు.
35 Ngmei üng “Hin hin ka xüa ka Capa ni, a ngthu ngai u,” tia ngthu ngthang lawki.
౩౫తరువాత, “ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు. ఈయన మాట వినండి” అని ఒక శబ్దం ఆ మేఘంలో నుంచి వచ్చింది.
36 Acunüng, ngthu a ngdüm la, Jesuh amät däng ami hmuh. Axüisaw he cun am khikheh u lü, ami hmuha mawng cun, acuna pät üng u üng pi am mtheh u.
౩౬ఆ శబ్దం వచ్చిన తరువాత వారికి యేసు మాత్రమే కనిపించాడు. ఆ రోజుల్లో వీరు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు.
37 A ngawi üng mcung üngka naw axüisaw kthum am kyum be u se, khyang khawjah naw ami na khyum.
౩౭మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది.
38 Acunüng, khyang hea ksunga khyang mat ngpyang lü, “Saja aw, amät däng ka canak ka capa teng law, ning hui na veng.
౩౮ఆ జనసమూహంలో ఒకడు, “బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నాకొక్కడే కుమారుడు.
39 “Khawyai naw man khawi se, ngpyangin sawxat xatki, a mci mvawn pi kya law khaia pawh lü mdek üng a kyuk sak khawi, acunkba mkhuimkha lü am ceh hlü ta.
౩౯చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయాల పాలు చేస్తుంది.
40 “Acunüng, na xüisaw he üng ami ktäm vaia jah nghui na ni se, amimi naw pi ani cun am ami ktäm thei,” a ti.
౪౦దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు” అని దీనంగా చెప్పాడు.
41 Jesuh naw, “Jumnak am ta lü, üpnak am awmkia khyang he, nami veia ivei ka awm khai aw? Ivei ka ning jah msawk vai aw?” ti lü, acuna khyang üng, “Na ca hia lawpüia,” ti lü a msang.
౪౧యేసు, “విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?” అని, “నీ కొడుకుని ఇక్కడికి తీసుకుని రా” అని ఆ తండ్రితో చెప్పాడు.
42 Acunüng, hnasen a law k'um üng, khawyai naw khawmdek khana kyuk sak lü, aknaa a pawh. Cunsepi, Jesuh naw, khawyai kse jüi lü, anghmaw mdaw beki naw a pa üng a pet.
౪౨వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు.
43 Acunüng, khyang avan naw Pamhnama hlüngtainak cun aktäa kyühkhyai lawki he. Ami van naw acunkba, a bilawh he ami kyühkhyai law üng, Jesuh naw axüisaw he üng,
౪౩అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
44 “Ka ning jah mtheh hlü ä mhnih u; Khyanga Capa, khyang hea kut üng mansak vai ng'et law ve,” a ti.
౪౪ఆయన చేసిన కార్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి. మనుష్య కుమారుణ్ణి మనుషుల స్వాధీనం చేయబోతూ ఉన్నారు”
45 Cunsepi, a ngthu pyena suilam cun am ami ksing, ami ksing vaia mjiha kyaki, ami kthäh vaia pi ami kyüh.
౪౫అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు. అది వారికి రహస్యంగానే ఉండిపోయింది. కాబట్టి వారు దాన్ని తెలుసుకోలేక పోయారు. అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు.
46 Acunüng, u kyäp säih khai tia amimät he ana ngcuh hü u se,
౪౬తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది.
47 Jesuh naw ami ngaikyunak jah ksing lü, hnasenca mat kai lü, a peia taki naw,
౪౭యేసు వారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని,
48 “Upi hina hnasenca, ka ngming üng dokhamki cun, kei na dokhamki ni, acunüng u pi, kei na dokhamki cun, kei na tüi lawki pi dokhamki ni. Nangmi üng jaw säihki, acun cen kyäp säih khai,” a ti.
౪౮“ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు. మీలో ఎవరు అందరి కంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు.”
49 Acunüng Johan naw, “Saja aw, khyang mat naw na ngming am khawyai he jah ktäm se kami hmuh, keimi üngka am nikia kyase am a pawh ti vaia kami kpyai,” a ti.
౪౯అప్పుడు యోహాను, “ప్రభూ, ఎవరో ఒక వ్యక్తి నీ పేర దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాడు మనలను అనుసరించేవాడు కాదు కాబట్టి వాణ్ణి అడ్డుకున్నాం” అని యేసుతో చెప్పాడు.
50 Acunüng, Jesuh naw, “Ä kpyai ti ua, u pi nangmi am ning jah hnengki cun nami püia kyaki ni,” a ti.
౫౦అందుకు యేసు, “మీరు వాణ్ణి అడ్డుకోవద్దు. మీకు విరోధి కాని వాడు మీ వైపు ఉన్నవాడే” అని చెప్పాడు.
51 Acunüng, khankhawa a cehnak vai ng'et law se, Jerusalema a ceh vai lingki.
౫౧యేసు తాను పరలోకానికి ఎక్కిపోవలసిన సమయం దగ్గర పడింది అని గ్రహించి
52 Ngsä he a ma a jah na tüih. Acunüng, ana dawng u lü, ana ngtün pe khai hea Samarih khaw mata lutki he.
౫౨ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మనసులో నిశ్చయం చేసుకున్నాడు. ఆయన తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ గ్రామంలో ప్రవేశించారు.
53 Jerusalema cit khaia a büa phäha Samarih khyang he naw am a na dokham u.
౫౩ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడని తెలిసి వారు ఆయనను స్వీకరించలేదు.
54 Acunüng, axüisaw xawi Johan la Jakuk naw acun ani ksing la, “Bawipa aw, hin he ami ngkhihnak bäih vaia, khankhawa mei han khü vaia na ngjahlüki aw?” tia ani kthäh.
౫౪శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి, “ప్రభూ, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా?” అని అడిగారు.
55 Acunüng, Jesuh naw ani veia nghlat law lü, a jah jüih.
౫౫ఆయన వారి వైపు తిరిగి వారిని మందలించాడు.
56 Acunüng ngnam kcea citki he.
౫౬అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్ళారు.
57 Lam ami ceh k'um üng khyang mat naw, “Na cehnak avana ka ning läk khai,” ti lü Jesuh a mtheh,
౫౭వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి, “నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను” అని ఆయనతో అన్నాడు.
58 Jesuh naw, “Sauie naw khui ta u lü, kha he naw pi ngbu taki he, khyanga Capa naw ta a lu a khännak vai la a xüieinak vai pi am ta ve,” a ti.
౫౮అందుకు యేసు, “నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు” అని అతనికి చెప్పాడు.
59 Acunüng, Jesuh naw khyang kcea veia, “Na läk lawa,” a ti. Cunsepi ani naw, “Bawipa aw, cit be lü ka pa va k'ut hüt ma vang,” a ti.
౫౯ఆయన మరో వ్యక్తిని చూసి “నా వెంట రా” అన్నాడు. ఆ వ్యక్తి, “ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి” అన్నాడు.
60 Acunüng Jesuh naw, “Khyangkthi he naw amimät akthi k'utei u se; nang ta Pamhnama khawa mawng ngthu va sanga,” a ti.
౬౦అందుకాయన, “చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు” అని అతనితో చెప్పాడు.
61 Akce naw pi, “Saja aw, ka ning läk law khai; cunsepi, ka im üngka he, ngthukdaw am jah va ngkhyahpüi ma vang,” a ti.
౬౧మరొకడు, “ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి” అన్నాడు.
62 Acunüng, Jesuh naw mtheh lü, “Upi, lai thawn khaia ngtün lü, a hnu lam tengki cun Pamhnama khaw am ä nghlawiki ni,” a ti.
౬౨దానికి యేసు, “నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు” అని వాడితో చెప్పాడు.

< Luhka 9 >