< 2 Царе 1 >

1 След смъртта на Саула, като се върна Давид от поражението на амаличаните, и Давид беше престоял в Сиклаг два дена,
దావీదు అమాలేకీయులను చంపి తిరిగి వచ్చాడు. సౌలు చనిపోయిన తరువాత అతడు సిక్లగు ప్రాంతంలో రెండు రోజులు ఉన్నాడు.
2 на третия ден, ето, дойде един човек из стана, от Саула, с раздрани дрехи и пръст на главата си; и като влезе при Давида, падна на земята та се поклони.
మూడవ రోజు ఒకడు తన బట్టలు చింపుకుని, తల మీద బూడిద పోసుకుని సౌలు సైన్యం నుండి వచ్చాడు.
3 И Давид рече: От где идеш? А той му каза: От Израилевия стан се отървах.
అతడు దావీదును చూసి నేలపై సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకు వచ్చాను” అన్నాడు.
4 И рече Му Давид: Какво стана? Кажи ми, моля. А той отговори: Людете побягнаха от сражението, даже и мнозина от людете паднаха мъртви; умряха още и Саул и син му Ионатан.
“జరిగిన సంగతులు నాతో చెప్పు” అని దావీదు అడిగాడు. అందుకు అతడు “సైనికులు యుద్ధంలో నిలవలేక పారిపోయారు. చాలా మంది గాయాలపాలై పడిపోయారు, చాలా మంది చనిపోయారు. సౌలూ అతని కొడుకు యోనాతానూ చనిపోయారు” అన్నాడు.
5 Тогава Давид рече на момъка, който му съобщаваше това: От къде знаеш, че Саул и син му Ионатан са мъртви?
“సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారని నీకెలా తెలిసిందో నాకు వివరంగా చెప్పు” అని దావీదు అతణ్ణి అడిగాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు,
6 И момъкът, който му съобщаваше това рече: Намерих се случайно в хълма Гелвуе, и, ето, Саул беше се подпрял на копието си, и, ето, колесниците и конниците го застигнаха.
“నేను అనుకోకుండా గిల్బోవ కొండకు వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకుని ఉన్నాడు.
7 И като погледна отдире си, той ме видя, и повика ме. И отговорих: Ето ме.
రథాలు, రౌతులు అతనిని తరుముతూ పట్టుకోవడానికి సమీపించినప్పుడు అతడు వెనక్కి తిరిగి చూసి నన్ను పిలిచాడు. అందుకు నేను, ‘చిత్తం నా రాజా’ అన్నాను.
8 И рече ми: Кой си ти? И отговорих му, амаличанин съм.
అతడు ‘నువ్వు ఎవరివి?’ అని నన్ను అడిగాడు. ‘నేను అమాలేకీయుణ్ణి’ అని చెప్పాను.
9 Пак ми рече: Застани, моля, над мене та ме убий, защото помрачение ме обзе; понеже целият ми живот е още в мене.
అతడు ‘నాలో కొన ప్రాణం ఉన్నందువల్ల నేను తీవ్రమైన యాతనలో ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నన్ను చంపెయ్యి’ అని ఆజ్ఞాపించాడు.
10 И тъй, застанах над него и го убих, понеже бях уверен, че не можеше да живее, като беше вече паднал; и взех короната, която беше на главата му, и гривната, която беше на ръката му, та ги донесох тук при господаря си.
౧౦అంత తీవ్రంగా గాయపడిన తరువాత అతడు ఇక బతకడని అనిపించి నేను అతని దగ్గర నిలబడి అతణ్ణి చంపివేశాను. అతని తల మీద ఉన్న కిరీటాన్ని, చేతి కంకణాలను తీసుకుని నా రాజువైన నీ దగ్గరికి వాటిని తెచ్చాను” అన్నాడు.
11 Тогава Давид хвана дрехите си, та ги раздра: така направиха и всичките мъже, които бяха с него
౧౧దావీదు ఆ వార్త విని తన బట్టలు చింపుకున్నాడు. అతని దగ్గర ఉన్నవారంతా అలాగే చేసి,
12 И жалиха и плакаха и постиха до вечерта за Саула и за сина му Ионатана, и за Господните люде и за Израилевия дом, за гдето бяха паднали от меч.
౧౨సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు.
13 А Давид рече на момъка, който му съобщаваше това: От где си ти? И отговори: Аз съм син на един чужденец, амаличанин.
౧౩తరువాత దావీదు “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?” అని ఆ వార్త తెచ్చినవాణ్ణి అడిగాడు. వాడు “నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకువాడైన ఒకడి కొడుకును” అన్నాడు.
14 И рече му Давид: Ти как се не убоя да дигнеш ръка да убиеш Господния помазаник?
౧౪అందుకు దావీదు “భయం లేకుండా యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపడానికి అతని మీద నువ్వెందుకు చెయ్యి ఎత్తావు?” అని
15 И Давид повика един от момците и рече: Пристъпи, нападни го. И той го порази та умря.
౧౫తన మనిషి ఒకణ్ణి పిలిచి “వెళ్లి వాణ్ణి చంపు” అని చెప్పగా అతడు వాణ్ణి కొట్టి చంపాడు.
16 И Давид му рече: Кръвта ти да бъде на главата ти; защото устата ти свидетелствуваха против тебе, като рече: Аз убих Господния помазаник
౧౬“యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపానని నువ్వు చెప్పావే, నీ నోటి మాటే నీకు సాక్ష్యం. కాబట్టి నీ ప్రాణానికి నువ్వే జవాబుదారివి” అని దావీదు ఆ మృత అమాలేకీయుడితో అన్నాడు.
17 Тогава Давид оплака Саула и сина му Ионатана с тоя плач;
౧౭దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు.
18 (и заръча да научат юдейците тая Песен на лъка; ето, написана е в Книгата на Праведния):
౧౮యూదా వారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాషారు గ్రంథంలో రాసి ఉంది.
19 Славата ти, о Израилю, е застреляна на опасните места на полето ти! Как паднаха Силните.
౧౯ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా నీ పర్వతాలపై మృతి చెందింది. బలవంతులు ఎలా పడిపోయారో గదా!
20 Не възвестявайте това в Гет, Не го прогласявайте по улиците на Аскалон, За да не се зарадват филистимските дъщери, За да не се развеселят дъщерите на необрязаните.
౨౦ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు. సున్నతి లేనివారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు. అందుకని ఈ సంగతి గాతులో తెలియనియ్యకండి. అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి.
21 Хълми гелвуиски, да няма роса нито дъжд на вас, Нито ниви доставяйки първи плодове за жертви; Защото там бе захвърлен щитът на силните, Щитът на Саула, като да не е бил той помазан с миро.
౨౧గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక. అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవు గాక. పరాక్రమవంతుల డాలు అవమానం పాలయింది. సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది.
22 От кръвта на убитите, От лоя на силните, Лъкът Ионатанов не се връщаше назад, И мечът Саулов не се връщаше празен.
౨౨హతుల రక్తం ఒలికించకుండా, బలిష్టుల దేహాలనుండి యోనాతాను విల్లు మడమ తిప్పలేదు. ఎవరినీ హతమార్చకుండా సౌలు ఖడ్గం వట్టినే వెనుదిరగ లేదు.
23 Саул и Ионатан Бяха любезни и рачителни в живота си, И в смъртта си не се разделиха; По-леки бяха от орлите, По-силни от лъвовете.
౨౩సౌలూ యోనాతానూ తమ బతుకులో ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు. తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు. వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు. సింహాలకంటే బలమైన వారు.
24 Израилеви дъщери, плачете за Саула, Който ви обличаше в червено с украшения, Който туряше златни украшения по дрехите ви.
౨౪ఇశ్రాయేలీయుల కుమార్తెలూ, సౌలును గూర్చి ఏడవండి. అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింప జేశాడు. మీకు బంగారు నగలు ఇచ్చాడు.
25 Как паднаха силните всред боя! Ионатан, поразен на опасните места на полето ти
౨౫యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు.
26 Прескръбен съм за тебе Ионатане, брате мой! Рачителен ми беше ти; Твоята любов към мене беше чудесна, Превъзхождаше любовта на жените.
౨౬నా సోదరుడా, యోనాతానూ, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను. నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది. స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది.
27 Как паднаха силните, И погинаха бойните оръжия!
౨౭అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు. యుద్ధ శూరులు నశించిపోయారు.

< 2 Царе 1 >