< Birinci Padşahlar 20 >

1 Aram padşahı Ben-Hadad bütün ordusunu topladı. Onunla birgə otuz iki padşah, atlar və döyüş arabaları var idi. Ben-Hadad gəlib Samariyanı mühasirəyə aldı və şəhərə hücum etdi.
సిరియా రాజు బెన్హదదు తన సైన్యాన్నంతా సిద్ధం చేశాడు. అతనితో ఉన్న ముప్ఫై ఇద్దరు రాజులతో గుర్రాలతో రథాలతో బయలుదేరి సమరయను ముట్టడించి దాని మీద యుద్ధం చేశాడు.
2 O, şəhərə, İsrail padşahı Axavın yanına qasidlər göndərib dedi: «Ben-Hadad belə deyir:
అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజు అహాబు దగ్గరికి వార్తాహరులను పంపి,
3 “Sənin qızıl-gümüşün mənimdir, arvadlarının və oğullarının ən yaxşıları da mənimdir”».
“నీ వెండి, నీ బంగారం నావే. నీ భార్యల్లో నీ పిల్లల్లో అందమైన వాళ్ళు ఇప్పుడు నా వాళ్ళే అని బెన్హదదు తెలియచేస్తున్నాడు” అని వారికి సందేశం పంపించాడు.
4 İsrail padşahı cavab verib dedi: «Ağam padşah, sənin söylədiyin kimi özüm və hər nəyim var, sənindir».
అందుకు ఇశ్రాయేలు రాజు “నా ప్రభూ, నా రాజా, నీవు చెప్పినట్టే నేనూ నాకున్నదంతా నీ ఆధీనంలో ఉన్నాం” అని చెప్పి వారిని పంపించాడు.
5 Qasidlər yenə gəlib dedilər: «Ben-Hadad belə söyləyir: “Hərçənd ki sənə ‹qızıl-gümüşünü, arvadlarını və oğullarını mənə ver› deyə xəbər göndərdim,
ఆ వార్తాహరులు వెళ్లి ఆ మాట తెలియచేసి తిరిగి వచ్చి, బెన్హదదు ఇలా అంటున్నాడని చెప్పారు. “నీవు నీ వెండినీ నీ బంగారాన్నీ నీ భార్యలనూ నీ పిల్లలనూ నాకు అప్పగించాలని నేను నా సేవకులను నీ దగ్గరికి పంపాను.
6 ancaq sabah bu vaxt adamlarımı sənin yanına göndərəcəyəm. Evini və əyanlarının evlərini axtaracaqlar və sənin xoşuna gələn hər şeyi götürüb gətirəcəklər”».
రేపు ఈ పాటికి వారు నీ ఇంటినీ నీ సేవకుల ఇళ్లనూ వెతికి వారి కళ్ళకు ఏది ఇష్టమో దాన్ని తీసుకుపోతారు.”
7 İsrail padşahı ölkənin bütün ağsaqqallarını çağırıb dedi: «Görün bu adam necə pislik axtarır. Arvadlarımı, oğullarımı, qızıl-gümüşümü məndən tələb etdi, mən ondan əsirgəmədim».
అప్పుడు ఇశ్రాయేలు రాజు జాతి పెద్దలందర్నీ పిలిపించి “బెన్హదదు, నీ భార్యలనూ పిల్లలనూ వెండి బంగారాలనూ తీసుకుపోతానని కబురు పంపితే, నేను ఇవ్వనని చెప్పలేదు. అతడు చేయబోయే మోసం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి” అన్నాడు.
8 Bütün ağsaqqallar və xalq ona «qulaq asma və razı olma» dedilər.
“నీవతని మాట వినొద్దు, దానికి ఒప్పుకోవద్దు” అని ఆ పెద్దలూ ప్రజలంతా అతనితో చెప్పారు.
9 O, Ben-Hadadın qasidlərinə dedi: «Ağam padşaha deyin: “Bu qulundan əvvəlcə istədiyin hər şeyi verərəm, ancaq bunu edə bilməyəcəyəm”». Qasidlər gedib onun sözünü çatdırdılar.
కాబట్టి అహాబు అ వార్తాహరులతో “మీరు రాజైన నా యజమానితో ఇలాచెప్పండి. ‘నీవు మొదట నీ సేవకుడినైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను గాని, ఇప్పుడు చెప్పిన దాన్ని మాత్రం చేయలేను’” అన్నాడు. ఆ వార్తాహరులు బెన్హదదు దగ్గరికి వెళ్లి ఆ జవాబు తెలియచేశారు.
10 Ben-Hadad ona xəbər göndərib dedi: «Əgər Samariya torpağı mənim dalımca gedən qoşunun ovuclarını doldurmağa bəs edərsə, allahlar mənə beləsini və bundan betərini etsin».
౧౦బెన్హదదు మళ్ళీ అతని దగ్గరికి వార్తాహరులను పంపి “నాతో కూడా వచ్చిన వారంతా చేతినిండా తీసుకుపోడానికి సమరయ బూడిద చాలదు. అలా జరక్కపోతే దేవుళ్ళు నాకు గొప్ప కీడు చేస్తారు గాక” అని చెప్పి పంపాడు.
11 İsrail padşahı cavab verib dedi: «Söyləyin, qurşanan adam soyunan kimi öyünməsin».
౧౧అందుకు ఇశ్రాయేలు రాజు “తన యుద్ధ కవచాన్ని ధరించకుండానే దాన్ని విప్పి, తీసేసిన వాడిలాగా అతిశయపడకూడదని బెన్హదదుతో చెప్పండి” అన్నాడు.
12 Bu sözü eşidəndə Ben-Hadad padşahlarla birgə çadırlarda şərab içirdi. O, əsgərlərinə «Sıraya düzülün!» dedi. Onlar şəhərin qarşısında sıraya düzüldülər.
౧౨తమ గుడారాల్లో బెన్హదదు, అతని తోటి రాజులు తాగుతూ ఉన్నప్పుడు ఈ కబురు విన్నారు. కాబట్టి అతడు తన సేవకులను పిలిపించి “యుద్ధానికి సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు పట్టణం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు.
13 Bu vaxt bir peyğəmbər İsrail padşahı Axavın yanına gəlib dedi: «Rəbb belə deyir: “Bu böyük qoşunu görürsənmi? Bu gün onu sənə təslim edəcəyəm və biləcəksən ki, Rəbb Mənəm”».
౧౩అప్పుడు ఒక ప్రవక్త ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరికి వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యాన్ని చూశావా? ఈ రోజే దాన్ని నీ చేతిలో పెడతాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకుంటావు” అన్నాడు.
14 Axav dedi: «Kimin vasitəsilə?» O dedi: «Rəbb belə deyir: “Əyalət başçılarının xidmətində olan igidlərin vasitəsilə bunu edəcəyəm”». Sonra Axav dedi: «Döyüşü kim başlayacaq?» O cavab verdi: «Sən».
౧౪“ఇది ఎవరివల్ల అవుతుంది?” అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త “రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల వలన అవుతుందని యెహోవా చెబుతున్నాడు” అన్నాడు. “యుద్ధాన్ని ఎవరు మొదలెట్టాలి?” అని రాజు అడిగాడు. అతడు “నువ్వే” అని జవాబిచ్చాడు.
15 Sonra Axav əyalət başçılarının igidlərini sıraya düzdü: onlar iki yüz otuz iki nəfər idi. Onlardan sonra orada olan xalqın hamısını – bütün İsrail övladlarını sıraya düzdü: onlar yeddi min nəfər idi.
౧౫అప్పుడు అహాబు రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల లెక్క చూశాడు. వారు 232 మంది ఉన్నారు. తరువాత సైనికులను, అంటే ఇశ్రాయేలు సైన్యాన్నంతా లెక్కిస్తే ఏడు వేలమంది అయ్యారు.
16 Onlar günorta oradan çıxdılar. Ben-Hadad və ona kömək edən otuz iki padşah çadırlarda içib sərxoşluq edirdilər.
౧౬వాళ్ళు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళారు. బెన్హదదు, ఆ 32 మంది తోటిరాజులూ గుడారాల్లో తాగి మత్తుగా ఉన్నారు.
17 Əvvəl əyalət başçılarının igidləri çıxdılar. Ben-Hadadın göndərdiyi casuslar ona «Samariyadan adamlar çıxır» deyə bildirdilər.
౧౭రాజ్యాధిపతుల్లో ఉన్న యువకులు మొదటగా బయలుదేరారు. విషయం తెలుసుకుందామని బెన్హదదు కొంతమందిని పంపించాడు. సమరయ నుంచి కొంతమంది వచ్చారని అతనికి తెలిసింది.
18 O dedi: «Əgər sülh üçün çıxırlarsa, onları diri tutun, yox, döyüş üçün çıxırlarsa, yenə onları diri tutun».
౧౮బెన్హదదు “వారు శాంతంగా వచ్చినా యుద్ధం చేయడానికి వచ్చినా వారిని ప్రాణాలతో పట్టుకు రండి” అని ఆజ్ఞాపించాడు.
19 O vaxt bu adamlar – həm əyalət başçılarının igidləri, həm də onların ardınca gələn qoşun artıq şəhərdən çıxmışdı.
౧౯రాజ్యాధికారుల్లో ఉన్న యువకులు, వారితో కూడ ఉన్న సైన్యం, పట్టణంలో నుంచి బయలు దేరారు.
20 Onlardan hər biri qarşısında duranı vurdu. Aramlılar qaçdılar və İsraillilər onları təqib etdilər. Aram padşahı Ben-Hadad at üstündə süvariləri ilə birgə qaçıb qurtardı.
౨౦వారిలో ప్రతివాడూ తనకెదురు వచ్చిన శత్రువుని చంపేశాడు. కాబట్టి సిరియా వారు పారిపోయారు. ఇశ్రాయేలీయులు వారిని తరిమారు. సిరియా రాజు బెన్హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతోపాటు తప్పించుకుపోయాడు.
21 İsrail padşahı oradan çıxıb atlara və döyüş arabalarına hücum etdi və Aramlıları böyük tələfata uğratdı.
౨౧అప్పుడు ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రాలనూ రథాలనూ పట్టుకుని చాలామంది సిరియా వారిని చంపేశాడు.
22 Həmin peyğəmbər İsrail padşahının yanına gəlib ona dedi: «Get özünü möhkəmləndir, gör ki, nə etməlisən. Çünki bahar gələndə Aram padşahı yenə sənin üstünə gələcək».
౨౨అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి “నీవు ధైర్యం తెచ్చుకో. నీవు చేయాల్సిందేదో కనిపెట్టి చూడు. ఎందుకంటే వచ్చే సంవత్సరం సిరియారాజు నీ మీదికి మళ్ళీ వస్తాడు” అని అతనితో చెప్పాడు.
23 Aram padşahının əyanları ona deyirdilər: «İsraillilərin Allahı təpələr Allahıdır, buna görə də onlar bizə qalib gəldilər. Onlarla düzənlikdə vuruşaq, hökmən biz onlara qalib gələcəyik.
౨౩అయితే సిరియా రాజు బెన్హదదు సేవకులు అతనితో ఇలా అన్నారు. “వాళ్ళ దేవుడు కొండల దేవుడు. అందుకే వాళ్ళు మన కంటే బలంగా ఉన్నారు. అయితే మనం మైదానంలో వాళ్ళతో యుద్ధం చేస్తే తప్పకుండా గెలుస్తాం.
24 Belə et: padşahların hər birini vəzifəsindən götür və onların yerinə valilər təyin et.
౨౪ఇంకా నువ్విలా చెయ్యి. ఈ రాజులందరినీ తీసేసి, వారికి బదులు సైన్యాధిపతులను నియమించు.
25 Sən isə at yerinə at, araba yerinə araba qoyaraq itirdiyin ordu kimi özün üçün bir ordu düzəlt ki, biz onlara qarşı düzənlikdə vuruşaq. Hökmən biz onlara qalib gələcəyik». Ben-Hadad onların sözünə qulaq asdı və belə etdi.
౨౫నీవు పోగొట్టుకున్న సైన్యమంత మరో సైన్యాన్నీ గుర్రానికి గుర్రాన్నీ రథానికి రథాన్నీ సిద్ధం చెయ్యి. అప్పుడు మనం మైదానంలో వారితో యుద్ధం చేసి, తప్పకుండా గెలుస్తాం.” అతడు వారి సలహా విని, వాళ్ళు చెప్పినట్టు చేశాడు.
26 Bahar gələndə Ben-Hadad Aramlıları topladı və İsraillilərlə vuruşmaq üçün Afeqə doğru getdi.
౨౬కొత్త సంవత్సరం మొదట్లో, బెన్హదదు సిరియనులను సిద్ధం చేసి లెక్క చూసి బయలుదేరి, ఇశ్రాయేలువారితో యుద్ధం చేయడానికి ఆఫెకు వచ్చాడు.
27 İsrail övladları da toplaşdılar, azuqə hazırladılar və onların qarşısına getdilər. İsrail övladları onların önündə iki kiçik sürü kimi ordugah qurdular, Aramlılar isə hər tərəfi tutmuşdular.
౨౭ఇశ్రాయేలు వారంతా సిద్ధపడి వాళ్ళని ఎదుర్కోడానికి బయలుదేరారు. ఇశ్రాయేలు వారు రెండు మేకల మందల్లాగా వాళ్ళ ఎదుట దిగారు. ఆ ప్రాంతమంతా సిరియా వాళ్ళతో నిండిపోయింది.
28 Allah adamı İsrail padşahının yanına gəlib dedi: «Rəbb belə deyir: “Aramlılar ‹Rəbb təpələr Allahıdır, düzənliklər Allahı deyil› deyirlər. Buna görə də Mən bu böyük qoşunu bütünlüklə sənə təslim edəcəyəm və biləcəksiniz ki, Rəbb Mənəm”».
౨౮అప్పుడొక దైవ సేవకుడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇలా అన్నాడు. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘సిరియా వాళ్ళు యెహోవా కొండల దేవుడే గాని లోయల దేవుడు కాడు’ అని అనుకుంటున్నారు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకొనేలా ఈ గొప్ప సమూహమంతటినీ నీ వశం చేస్తాను.”
29 Onlar bir-birlərinin qarşısında yeddi gün ordugahda qaldılar. Yeddinci gün döyüş başlandı. İsrail övladları bir gündə Aramlıların piyada qoşunundan yüz min nəfəri qırdılar.
౨౯వాళ్ళు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఏడు రోజులున్నారు. ఏడో రోజున యుద్ధం మొదలయింది. ఇశ్రాయేలు వారు ఒక్క రోజులోనే సిరియను సైన్యంలోని లక్షమంది కాల్బలాన్ని చంపేశారు.
30 Onların qalanları Afeqə – şəhərin içinə qaçdılar. Şəhərin divarı qalan iyirmi yeddi min nəfərin üstünə yıxıldı. Ben-Hadad şəhərə qaçıb bir iç otağa girdi.
౩౦మిగతావారు ఆఫెకు పట్టణంలోకి పారిపోతే, పట్టణ గోడ కూలి 27,000 మంది చనిపోయారు. బెన్హదదు కూడా ఆ పట్టణంలోకి పారిపోయి ఒక ఇంట్లో లోపలి గదిలో దాక్కున్నాడు.
31 Əyanları ona dedilər: «Biz eşitmişik ki, İsrail padşahları mərhəmətli padşahlardır. Gəlin bellərimizə çul, başlarımıza ip sarıyaq və İsrail padşahının yanına gedək. Bəlkə o səni sağ buraxar».
౩౧అతని సేవకులు “ఇశ్రాయేలు వారి రాజులు దయగల వారని మేము విన్నాం. కాబట్టి నీకు అనుకూలమైతే, మేము నడుం చుట్టూ గోనెపట్టాలు కట్టుకుని తల మీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి పోతాం. అతడు నీ ప్రాణాన్ని కాపాడతాడేమో” అని రాజుతో అన్నారు. రాజు అందుకు ఒప్పుకున్నాడు.
32 Onlar bellərinə çul, başlarına ip bağladılar və gəlib İsrail padşahına dedilər: «Qulun Ben-Hadad “yalvarıram, məni sağ burax” deyir». İsrail padşahı dedi: «O hələ sağdır? O ki mənim qardaşımdır».
౩౨కాబట్టి వాళ్ళు తమ నడుములకు గోనెపట్టాలు కట్టుకుని తలమీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి “నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బతకనిమ్మని మనవి చేయడానికి మమ్మల్ని పంపాడు” అని చెప్పారు. అతడు “బెన్హదదు నా సోదరుడు. అతడింకా బతికే ఉన్నాడా” అని అడిగాడు.
33 Bu adamlar bir əlamət gözləyirdilər, padşahın sözünü yaxşı əlamət sayıb cəld dedilər: «Bəli, Ben-Hadad sənin qardaşındır». O dedi: «Gedin, onu gətirin». Ben-Hadad onun yanına gəldi və o, Ben-Hadadı öz döyüş arabasına mindirdi.
౩౩అప్పుడు వాళ్ళు అహాబు దగ్గర్నుంచి ఏదైనా సూచన కోసం కనిపెడుతూ ఉండి, అతడా మాట అనగానే వెంటనే “అవును, బెన్హదదు మీ సోదరుడే” అన్నారు. అప్పుడు అహాబు “మీరు వెళ్లి అతన్ని తీసుకు రండి” అన్నాడు. బెన్హదదు తన దగ్గరికి వచ్చినప్పుడు, అహాబు తన రథం మీద అతన్ని ఎక్కించుకున్నాడు.
34 Ben-Hadad ona dedi: «Mənim atamın sənin atandan aldığı şəhərləri geri qaytarıram. Atamın Samariyada düzəltdiyi kimi sən də Dəməşqdə özün üçün bazarlar düzəldərsən». İsrail padşahı dedi: «Mənimlə saziş bağlayandan sonra səni buraxacağam». Ben-Hadadla saziş bağladı və onu buraxdı.
౩౪బెన్హదదు అహాబుతో “మీ తండ్రి చేతిలోనుంచి మా నాన్న తీసుకున్న పట్టణాలను నేను తిరిగి ఇచ్చేస్తాను. మా నాన్న సమరయలో వ్యాపార కేంద్రాలను కట్టించుకున్నట్టు, దమస్కులో తమరు వ్యాపార కేంద్రాలు కట్టించుకోవచ్చు” అన్నాడు. అహాబు జవాబిస్తూ “అలా చేస్తే ఈ ఒప్పందంతో నిన్ను వదిలేస్తాను” అని అతనితో ఒప్పందం చేసుకుని అతన్ని వదిలేశాడు.
35 Peyğəmbərlərdən olan bir nəfər Rəbbin sözü ilə öz yoldaşına dedi: «Məni vur». O adam onu vurmaq istəmədi.
౩౫ప్రవక్తల బృందంలో ఒకడు, యెహోవా ద్వారా ప్రేరణ పొంది, తన తోటి ప్రవక్తతో “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. అయితే ఆ వ్యక్తి అతన్ని కొట్టడానికి ఒప్పుకోలేదు.
36 Onda peyğəmbər o adama dedi: «İndi ki sən Rəbbin sözünə qulaq asmadın, mənim yanımdan gedəndə bir şir səni öldürəcək». Peyğəmbərin yanından gedəndə bir şir ona rast gəlib onu öldürdü.
౩౬అప్పుడా ప్రవక్త తన తోటి ప్రవక్తతో “నీవు యెహోవా మాట వినలేదు. కాబట్టి నీవు నా దగ్గరనుంచి వెళ్లిపోగానే సింహం నిన్ను చంపేస్తుంది” అన్నాడు. అతడు వెళ్లిపోతుంటే సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది.
37 Peyğəmbər başqa bir adam tapıb ona dedi: «Məni vur». O adam peyğəmbəri vurub yaraladı.
౩౭తరువాత ఆ ప్రవక్త మరొకనితో “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. అతడు అతన్ని కొట్టి గాయపరచాడు.
38 Peyğəmbər getdi və gözlərini örtərək qiyafəsini dəyişib padşahın yolu üstündə dayandı.
౩౮అప్పుడా ప్రవక్త వెళ్లి, రాజు కోసం దారిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. తననెవరూ గుర్తుపట్టకుండా తన కళ్ళకు గుడ్డ కట్టుకున్నాడు.
39 Padşah keçəndə onu səsləyib dedi: «Bu qulun döyüşün ortasına girmişdi. Bu zaman bir adam kənara çəkildi və mənim yanıma bir nəfər gətirib dedi: “Bu adamı qoru. Əgər aradan çıxsa, əvəzində ya canını verəcəksən ya da bir talant gümüş”.
౩౯రాజు రావడం చూసి అతడు బిగ్గరగా ఇలా అన్నాడు. “నీ సేవకుడైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. ఒక సైనికుడు నా దగ్గరికి ఒక బందీని తెచ్చి, ‘ఇతన్ని చూస్తూ ఉండు, ఎలాగైనా వాడు తప్పించుకుపోతే వాని ప్రాణానికి బదులు నీ ప్రాణం పెట్టాలి. లేకపోతే నీవు 34 కిలోల వెండి ఇవ్వాలి’ అన్నాడు.
40 Bu qulun orada-burada çalışarkən o, yanımdan qaçdı». İsrail padşahı bu adama dedi: «Hökmün elə də olmalıdır, özün qərar vermisən».
౪౦అయితే నీ సేవకుడనైన నేను పనిమీద అటూ ఇటూ తిరుగుతుంటే వాడు తప్పించుకు పోయాడు.” అప్పుడు ఇశ్రాయేలు రాజు “నీకిదే శిక్ష. దాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు” అన్నాడు.
41 O cəld gözlərindən örtüyü götürdü. İsrail padşahı onun peyğəmbərlərdən biri olduğunu gördü.
౪౧ఆ ప్రవక్త వెంటనే తన కళ్ళమీదున్న గుడ్డ తీసేశాడు. అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు గుర్తించాడు.
42 O, İsrail padşahına dedi: «Rəbb belə deyir: “Mənim lənətlədiyim adamı sən əldən buraxdın. Buna görə də onun yerinə sən öləcəksən və onun xalqının başına gələcək işlər sənin xalqının başına gələcək”».
౪౨ప్రవక్త రాజుతో “యెహోవా చెప్పేదేమిటంటే, నేను చంపేయమన్న వాణ్ణి నీవు వెళ్లిపోనిచ్చావు. కాబట్టి వాడి ప్రాణానికి బదులు నీ ప్రాణం ఇవ్వాలి. అతని ప్రజలకు బదులు నీ ప్రజలు నిర్మూలమవుతారు” అన్నాడు.
43 İsrail padşahı qaşqabaqlı və dilxor halda Samariyada olan evinə gəldi.
౪౩ఇశ్రాయేలు రాజు విచారంతో, కోపంగా సమరయలోని తన భవనానికి వెళ్ళిపోయాడు.

< Birinci Padşahlar 20 >