< Uafisawa 1 >

1 Bulus gono kaduran Kristi Yisa nin yinnu Kutellẹ, udu kiti nale na ina fera nani bara Kutellẹ nan nya Afisus, ale na ina yinin nin Yisa Kristi.
ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారికి దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు రాస్తున్న విషయాలు.
2 Na ubollu nin tọp Kutellẹ so nan ghinu unuzu kitime uchif bit a Cikilari bit Yisa Kristi.
మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి సమాధానాలు కలుగు గాక.
3 Na issu Liru Kutellẹ nin Chiff in Cikilari bit Yisa Kristi. Amere na tinari vat uruhu nmari mongo na midi kitene kani nan nya Kristi.
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు.
4 Bara na Kutellẹ na fere nari alle na iyinna nin Kristi uworu a idutu sa ukẹ in yï. Ana fere nari tinan yita lau sa ndinong nbun me.
క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు.
5 Nan nya nsu Kutellẹ yiru nari atta nono me mun nan nya Yisa Kristi. Anan su nani nan nya lanzun mang nilemon na adinin su asu.
యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.
6 Vat nile imone iwasu, inan su liru Kutellẹ nan nya ngongong nbolu me ulle na ana filli nari nan nya kinayi me.
తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.
7 Kutanki
దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది.
8
ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు.
9 Kutellẹ na durso nari ushiri kidegen ka naki nyeshin nafo usu kibinayi me na aduro nan nya Kristi.
ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.
10 Asa kubin nmalzunu nshiri me nkullo aba munu imon kitene kani nin in yï ulele vat kiti kirum nan nya Kristi.
౧౦కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు.
11 In nan nya Kristi iwa fere nari uworsu nafo ushiri me na adin su imon vat nin kpilizu kibinayi me.
౧౧క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని,
12 Kutellẹ na tinani tinan yita achine bara uzazinu ngongon Me, arikere ale na tiwa yarin uyinnu nin Kristi.
౧౨దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకుని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.
13 Kitin Kristiari iwa lanza ligbulang kidegen ulliru lai nin un tuchu mine kitin Kristi, ulle na anung na yinni mun tutun iyatca minu nin likawali nfip milau.
౧౩మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది.
14 Uruhari likaran ngadu bit se tinin se uso nan nya kipin tigo Kutellẹ bara liru ngongong me.
౧౪దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.
15 Bara nani un woru kubi ko na nwanlanza ubelle yinnu mine sa uyene nan nyan Cikilari Yisa, nin belle nsu vat nale na ina fere nani bara ame.
౧౫ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుంచి,
16 Na in sunna ugodo Kutellẹ bara anughe nin yichu tisa mine nyan lira ning ba.
౧౬మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
17 Ndin lira Kutellẹn Cikilari Yisa Kristi, uchifi ngongonng, ma niminu uruhu inyiru nin puzunu in yinnu me,
౧౭మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
18 Ndin lire bara iyizi nibinayi mine ti kanang, tinang yinno inyari likara inciwu nibinayi bite. Ndi nlira inan yinnu inyarri ngbardang ngonbong gadu nan nya nalle na issosin lissosin me.
౧౮మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన.
19 Iyaghari katin likaran gbardang me nin yiru me kiti nale iyinna, nafo na in gbardang likara katame din su.
౧౯తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.
20 Lo likarere wasu katah nan nya Kristi na Kutellẹ wa fiyghe kisek a sonkoghe nchara ulime me nan nya niti kitene kani.
౨౦దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
21 Ubun nin vat tigoh, a udursuzun nbatinu, likara, usu ligo a kolome lissa lo na ina ni. Ana chewu Kristi ku na nko kuje chas ba, nin du kujin bun wang. (aiōn g165)
౨౧సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు. (aiōn g165)
22 Kutellẹ nani imon vat nabunu Kristi, amini na tighe asso liti nimon vat kuti nlira.
౨౨దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు.
23 Na kunnere kidowo me, ukullu mere din kulusu imon vat tibau ngangang.
౨౩ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.

< Uafisawa 1 >