< Ісус Навин 10 >

1 І сталося, як почув єрусалимський цар Адоні-Цедек, що Ісус здобув Ай та вчинив його закля́ттям, і що як зробив Єрихонові й цареві його, так зробив Аєві та цареві його, і що ме́шканці Ґів'ону склали мир з Ізраїлем та були серед них,
యెహోషువ యెరికోనూ, దాని రాజునూ నిర్మూలం చేసినట్టు హాయినీ దాని రాజునూ నిర్మూలం చేసిన సంగతీ గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతీ యెరూషలేం రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడూ అతని ప్రజలూ చాలా భయపడ్డారు.
2 то дуже налякалися, бо Ґів'он місто велике, як одне з міст царськи́х, і що він більший за Ай, а всі люди його лицарі.
ఎందుకంటే గిబియోనును నాటి రాజధానుల్లో ప్రధాన పట్టణంగా ఎంచేవారు. అది హాయి కంటే పెద్దది, అక్కడి ప్రజలందరూ శూరులు. కాబట్టి యెరూషలేము రాజైన అదోనీసెదెకు “గిబియోనీయులు యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు. మీరు నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేస్తే మనం వారి పట్టణాన్ని నాశనం చేద్దాం” అని
3 І послав єрусалимський цар Адоні-Цедек до хевронського царя Гогама, і до ярмутського царя Пір'ама, і до лахіського царя Яфії, і до еґлонського царя Девіра, говорячи:
హెబ్రోను రాజు హోహాముకూ యర్మూతు రాజు పిరాముకూ
4 „Прийдіть до мене, і допоможіть мені, і ми поб'ємо Ґів'она, бо він замири́в з Ісусом та з Ізраїлевими синами“.
లాకీషురాజు యాఫీయకూ ఎగ్లోను రాజు దెబీరుకూ వార్త పంపాడు.
5 І вони зібралися, і пішли п'ять аморейських царів: цар єрусалимський, цар хевронський, цар ярмутський, цар лахіський, цар еґлонський, вони та всі табо́ри їхні, і розтаборува́лися при Ґів'оні, і воювали проти них.
కాబట్టి అమోరీయుల ఐదుగురు రాజులూ కలిసి, తమ సేనలతో బయలుదేరి, గిబియోను ముందు దిగి, గిబియోనీయులతో యుద్ధం చేశారు.
6 І послали ґів'онські люди до Ісуса та до табо́ру в Ґілґал, говорячи: „Не стримуй своєї руки від своїх рабів! Прийди до нас скоро, і спаси нас та допоможи нам, бо зібралися на нас усі аморейські царі, що замешкують го́ри“.
అప్పుడు “గిబియోనీయుల కొండ ప్రాంతాల్లో నివసించే అమోరీయుల రాజులందరూ ఏకమై మాపైకి దండెత్తి వచ్చారు, కాబట్టి నీ దాసుల చెయ్యి విడిచిపెట్టక త్వరగా వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించు” అని గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువకు వార్త పంపారు.
7 І рушив Ісус із Ґілґалу, він та з ним усі вояки́ й військо́ві лицарі.
వెంటనే యెహోషువ, అతని దగ్గరున్న యోధులూ, పరాక్రమవంతులైన శూరులూ అందరూ గిల్గాలు నుండి బయలుదేరారు.
8 І сказав Господь до Ісуса: „Не бійся їх, бо Я віддав їх у твою руку, — ніхто з них не встоїть перед тобою“.
అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు, వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఎవరూ నీ ముందు నిలబడలేరు” అని యెహోషువతో చెప్పగానే,
9 І прибув до них Ісус знена́цька, — ці́лу ніч ішов із Ґілґалу.
యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా నడచి వారి మీద హఠాత్తుగా దాడి చేశాడు.
10 І Господь навів на них замі́шання перед Ізраїлем, і побив їх великою пора́зкою в Ґів'оні. І він гнав їх дорогою входу до Бет-Хорону, і бив їх аж до Азеки та аж до Маккеди.
౧౦అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువ గిబియోను ముందే మహా ఘోరంగా వారిని హతం చేశాడు. బేత్‌హోరోనుకు పైకి వెళ్ళే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ, యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు.
11 І сталося, коли вони втікали перед Ізраїлем і були на сході від Бет-Хорону, то Господь кидав на них із неба велике каміння аж до Азеки, і вони вмирали. Тих, що повмирали від градово́го каміння, було більше від тих, що Ізраїлеві сини повбивали мече́м.
౧౧వారు ఇశ్రాయేలీయుల నుండి బేత్‌హోరోనుకు దిగిపోయే తోవలో పారిపోతుండగా, వారు అజేకాకు వచ్చే వరకూ యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్ళను వారి మీద కురిపించాడు. కాబట్టి వారు దాని వల్ల చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారికంటే ఆ వడగండ్ల వలన చచ్చినవారు ఎక్కువమంది అయ్యారు.
12 Тоді Ісус говорив Господе́ві того дня, коли Господь дав аморе́янина перед Ізраїлевих синів, та й сказав на оча́х Ізраїля: „Стань, сонце, в Ґів'оні, а ти, місяцю, ув айялонській долині!
౧౨యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, “సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.”
13 І сонце затри́малося, а місяць спинився, аж поки народ відімстився своїм ворогам“. Чи це не написане в книзі Праведного? І сонце стало на половині неба, і не поспішалося заходити майже ці́лий день.
౧౩“ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు” అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.
14 І не було такого, як день той, ані перед ним, ані по ньому, щоб Господь так слухав лю́дського голосу, — бо Господь воював для Ізраїля.
౧౪యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.
15 І вернувся Ісус, а з ним увесь Ізраїль до табо́ру в Ґілґал.
౧౫అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.
16 А ті п'ять царів повтікали, та й схова́лися в печері в Маккеді.
౧౬ఆ రాజులు ఐదు గురూ పారిపోయి మక్కేదాలో ఉన్న గుహలో దాక్కున్నారు.
17 І було доне́сено Ісусові й сказано: „Зна́йдені ті п'ять царів, схо́вані в печері в Маккеді“.
౧౭మక్కేదా గుహలో దాక్కున్న ఐదుగురు ఆ రాజులు దొరికారని యెహోషువకు తెలిసినప్పుడు,
18 А Ісус відказав: „Приваліть велике каміння на о́твір печери, і призначте до неї людей, щоб їх стерегти.
౧౮యెహోషువ “ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెద్ద రాళ్ళు దొర్లించి వారిని కాపలా కాయడానికి మనుషులను ఉంచండి.
19 А ви не стійте, — женіться за своїми ворогами, і понищте їхні за́дні сте́жі, і не давайте їм вхо́дити до їхніх міст, бо Господь, Бог ваш, віддав їх у вашу руку“.
౧౯మీరు అక్కడే ఆగిపోకండి. మీ దేవుడు యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు కాబట్టి వారిని తమ పట్టణాల్లోకి తిరిగి వెళ్లనీయకుండా వారిని తరిమి, వెనుక ఉన్న వారిని కూల్చండి” అని చెప్పాడు.
20 І сталося, як завдав їм Ісус та Ізраїлеві сини дуже велику пора́зку, так, що прийшов їм кінець, а врято́вані повтікали від них, і повхо́дили до тверди́нних міст,
౨౦వారు పూర్తిగా నశించే వరకూ యెహోషువ, ఇశ్రాయేలీయులు గొప్ప జనసంహారం చేసి వారిని వధించిన తరువాత వారిలో తప్పించుకొన్న కొద్దిమంది, ప్రాకారాలు ఉన్న పట్టణాల్లోకి చొరబడిపోయారు.
21 то ввесь народ у споко́ї вернувся до табо́ру до Ісуса в Маккеді, і ніхто не поворушив язика свого проти кого з Ізраїлевих синів!
౨౧ప్రజలందరూ మక్కేదాలో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడటానికి ఎవరికీ గుండెల్లేక పోయాయి.
22 І сказав Ісус: „Відчиніть о́твір печери, і приведіть до мене з печери тих п'ятьо́х царів“.
౨౨యెహోషువ “ఆ గుహకు అడ్దం తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నాదగ్గరికి తీసుకు రండి” అని చెప్పగానే,
23 І вони зробили так, і вивели до нього з печери тих п'ятьох царів: царя єрусалимського, царя хевронського, царя ярмутського, царя лахіського, царя еґлонського.
౨౩వారు అలా చేసి, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు-ఈ ఐదుగురినీ ఆ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకువచ్చారు.
24 І сталося, як привели́ тих царів до Ісуса, то Ісус закли́кав усіх Ізраїлевих людей, і сказав військо́вим начальникам, що йшли з ним: „Підійдіть, — поста́вте свої ноги на шиї цих царів“. І вони попідхо́дили, і поста́вили свої ноги на їхні шиї.
౨౪వారు ఆ రాజులను యెహోషువ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, తనతో యుద్ధానికి వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో “మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడలపై మీ పాదాలను ఉంచండి” అని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడలపై తమ పాదాలను ఉంచారు.
25 І сказав до них Ісус: „Не бійтеся й не лякайтеся, будьте сильні та відважні, бо Господь зробить так усім вашим ворогам, із якими ви воюєте“.
౨౫అప్పుడు యెహోషువ వారితో “మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు” అన్నాడు.
26 А по цьому Ісус бив їх, і повбивав їх, і повісив їх на п'ятьох дере́вах. І висіли вони на тих дере́вах аж до вечора.
౨౬తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరితీశాడు, వారి శవాలు సాయంకాలం వరకూ ఆ చెట్ల మీద వేలాడుతూనే ఉన్నాయి.
27 І сталося на час за́ходу сонця, Ісус наказав, і поздіймали їх із дере́в, і повкида́ли їх до печери, де вони були поховалися, і понакладали велике каміння на о́твір печери, де воно аж до цього дня.
౨౭పొద్దుగుంకే సమయంలో యెహోషువ అనుమతి ఇయ్యగా ప్రజలు చెట్ల మీద నుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడేసి ఆ గుహ ద్వారం దగ్గర పెద్ద రాళ్లను వేశారు. ఆ రాళ్లు ఈ రోజు వరకూ ఉన్నాయి.
28 А Маккеду Ісус здобув того дня, і побив ві́стрям меча її та царя її, учинив закляттям їх та кожну особу, хто був у ній, — не позоставив жодного врятованого в ній. І зробив він її цареві те саме, що зробив був цареві єрихонському.
౨౮ఆ రోజు యెహోషువ మక్కేదాను వశం చేసుకుని దాని రాజుతో సహా అందులోని వారందరినీ కత్తితో చంపేశాడు. అతడు దానిలో ఎవరినీ ప్రాణాలతో వదలకుండా నిర్మూలం చేసాడు. యెరికో రాజుకు చేసినట్టు మక్కేదా రాజుకూ చేశాడు.
29 А Ісус та ввесь Ізра́їль із ним перейшов з Маккеди до Лівни, та й воював проти Лівни.
౨౯యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నావారితో యుద్ధం చేశారు.
30 І дав Господь в Ізра́їлеву ру́ку також її та царя її, і він побив ві́стрям меча її та кожну особу, що в ній, — не позоставив жодного врятованого в ній. І зробив він цареві її, як зробив був цареві єрихонському.
౩౦యెహోవా దానినీ, దాని రాజునూ, ఇశ్రాయేలీయులకు అప్పగించగా వారు ఎవ్వరూ మిగలకుండా దాన్నీ, దానిలో ప్రాణాలతో ఉన్నవారందరినీ కత్తితో చంపేశారు. అతడు యెరికో రాజుకు చేసినట్టు దాని రాజుకూ చేశారు.
31 І перейшов Ісус та ввесь Ізраїль із ним із Лівни до Лахішу, і таборува́в при ньому та воював проти ньо́го.
౩౧తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులందరితో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అక్కడ దిగి లాకీషు వారితో యుద్దం చేయగా
32 І дав Господь в Ізраїлеву руку Лахіш, — і здобув він його другого дня, і побив ві́стрям меча його та кожну особу, що в ньому, — усе так, як зробив був Лівні.
౩౨యెహోవా లాకీషుని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వారు రెండవ రోజు దాన్ని ఆక్రమించుకుని తాము లిబ్నాకు చేసినట్టే దాన్నీ, దానిలో ఉన్న వారందరినీ కత్తితో చంపేశారు.
33 Тоді прийшов ґезерський цар Горам допомогти Лахішу, та Ісус побив його й народ його, так що не позоставив жодного в ньому.
౩౩లాకీషుకు సహాయం చేయడానికి గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ అతన్నీ అతని ప్రజలనూ హతం చేశాడు.
34 І перейшов Ісус та ввесь Ізра́їль із ним з Лахішу до Еґлону, і таборува́ли при ньому та воювали з ним.
౩౪తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ముందు దిగి దాని నివాసులతో యుద్ధం చేసి
35 І здобули́ його того дня, і побили його ві́стрям меча, а кожну особу, що в ньому, того дня зробили закляттям, — усе так, як зробив був Лахішу.
౩౫ఆ రోజు దాన్ని ఆక్రమించుకుని, కత్తితో వారిని హతం చేశారు. అతడు లాకీషుకు చేసినట్టే వారు దానిలో ఉన్నవారందరినీ ఆ రోజు నిర్మూలం చేశారు.
36 І пішов Ісус та ввесь Ізраїль із ним з Еґлону до Хеврону, і воював із ним.
౩౬అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని ప్రజలతో యుద్ధం చేసి
37 І здобув його, і побив ві́стрям меча його та царя його, і всі міста його, і кожну особу, що в ньому, — не позоставив жодного врято́ваного, усе так, як зробив був Еґлонові. І зробив закляттям його та кожну особу, що в ньому була́.
౩౭దాన్ని స్వాధీనం చేసుకుని దాన్నీ దాని రాజునూ దాని పట్టణాలన్నిటినీ దానిలో ఉన్న వారందరినీ కత్తితో హతం చేశారు. అతడు ఎగ్లోనుకు చేసినట్టే దాన్నీ దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేశారు.
38 І вернувся Ісус та ввесь Ізраїль із ним до Девіру, і воював із ним.
౩౮అక్కడి నుండి యెహోషువ, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరు దెబీరు వైపు తిరిగి దానితో యుద్ధం చేసి
39 І він здобув його, і царя його, і всі міста його, і повбивали їх ві́стрям меча, та й зробив закляттям кожну душу, що в ньому, не позоставив жодного врято́ваного, — як зробив був Хевронові, так зробив Девірові та цареві його, і як зробив був Лівні та цареві її.
౩౯దానినీ దాని రాజునూ దాని సమస్త పట్టణాలనూ పట్టుకుని కత్తి చేత హతం చేసి దానిలో ఉన్న వారినందరినీ నిర్మూలం చేశారు. అతడు హెబ్రోనుకూ లిబ్నాకూ దాని రాజుకూ చేసినట్లు, దెబీరుకూ దాని రాజుకూ చేశాడు.
40 І побив Ісус увесь край: гору, і Неґев і Шефелу, і узбі́ччя, і всіх їхніх царів, — не зоставив жодного врятованого, а кожну особу зробив закляттям, як наказав був Господь, Бог Ізраїлів.
౪౦తరువాత యెహోషువ పర్వత ప్రాంతాలనూ, దక్షిణ ప్రదేశాన్నీ షెఫేలా ప్రదేశాన్నీ చరియల ప్రదేశాన్నీ వాటి రాజులందరినీ జయించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విధంగా అతడు ఏదీ మిగలకుండా ఊపిరిగల సమస్తాన్నీ నిర్మూలం చేశాడు.
41 І бив їх Ісус від Кадеш-Барнеа та аж до Аззи, і ввесь ґошенський край, і аж до Ґів'ону.
౪౧కాదేషు బర్నేయ మొదలు గాజా వరకూ గిబియోను వరకూ గోషేను దేశమంతటినీ యెహోషువ జయించాడు.
42 А всіх тих царів та їхній край Ісус здобув одним ра́зом, бо Господь, Бог Ізраїлів, воював для Ізраїля.
౪౨ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్త రాజులనూ వారి దేశాలనూ యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాడు.
43 І вернувся Ісус та ввесь Ізраїль із ним до табо́ру в Ґілґал.
౪౩తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.

< Ісус Навин 10 >