< జెకర్యా 12 >

1 ఇది దేవోక్తి. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలాన్ని విశాలంగా చేసి, భూమికి పునాది వేసి, మనిషిలో జీవాత్మను పుట్టించినవాడు యెహోవా.
Пророческое слово Господа об Израиле. Господь, распростерший небо, основавший землю и образовавший дух человека внутри него, говорит:
2 ఆయన చెబుతున్నది ఏమిటంటే “నేను యెరూషలేమును చుట్టూ ఉన్న సమస్త ప్రజలందరికీ మత్తు కలిగించే పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమును, యూదా దేశాన్ని కూడా ముట్టడిస్తారు.
вот, Я сделаю Иерусалим чашею исступления для всех окрестных народов и также для Иуды во время осады Иерусалима.
3 భూమిపై ఉన్న ఇతర జాతులన్నీ యెరూషలేముకు విరోధంగా సమకూడతాయి. ఆ రోజుల్లో నేను యెరూషలేమును సమస్త జాతులకు బరువైన రాయిగా చేస్తాను, దాన్ని తొలగించాలని చూసేవాళ్ళంతా గాయాలపాలు అవుతారు.”
И будет в тот день, сделаю Иерусалим тяжелым камнем для всех племен; все, которые будут поднимать его, надорвут себя, а соберутся против него все народы земли.
4 ఇదే యెహోవా వాక్కు. “ఆ దినాన నేను గుర్రాలన్నిటికీ బెదురు, గుర్రపు రౌతులకు వెర్రి పుట్టిస్తాను. యూదావారి విషయం శ్రద్ధ చూపించి, ఇతర ప్రజల గుర్రాలన్నిటికీ గుడ్డితనం కలిగిస్తాను.”
В тот день, говорит Господь, Я поражу всякого коня бешенством и всадника его безумием, а на дом Иудин отверзу очи Мои; всякого же коня у народов поражу слепотою.
5 అప్పుడు యెరూషలేములోని అధికారులు, నివాసులు “దేవుడైన యెహోవాను నమ్ముకోవడం వల్ల ఆయన మాకు తోడుగా ఉన్నాడు” అని తమ మనస్సుల్లో చెప్పుకుంటారు.
И скажут князья Иудины в сердцах своих: сила моя жители Иерусалима в Господе Саваофе, Боге их.
6 ఆ దినాన నేను యూదా అధికారులను కట్టెల కింద మంటగా చేస్తాను, పనల కింద కాగడాగా చేస్తాను, వారు నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ దహించివేస్తారు. యెరూషలేము నివాసులు తమ స్వస్థలంలో స్థిరంగా నివసిస్తారు.
В тот день Я сделаю князей Иудиных, как жаровню с огнем между дровами и как горящий светильник среди снопов, и они истребят все окрестные народы, справа и слева, и снова населен будет Иерусалим на своем месте, в Иерусалиме.
7 మొదటగా యెహోవా యూదావారి నివాసాలను రక్షిస్తాడు. దావీదు వంశంవారు, యెరూషలేము ప్రజలు తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారిని చిన్నచూపు చూడకుండా ఉండేలా ఆయన ఇలా చేస్తాడు.
И спасет Господь сначала шатры Иуды, чтобы величие дома Давидова и величие жителей Иерусалима не возносилось над Иудою.
8 ఆ కాలంలో యెహోవా యెరూషలేము నివాసులను కాపాడతాడు. వారిలో బలహీనులు దావీదువంటి వారిలాగా, దావీదు వంశీయులు దేవుని వంటివారుగా, ప్రజల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉంటారు.
В тот день защищать будет Господь жителей Иерусалима, и самый слабый между ними в тот день будет как Давид, а дом Давида будет как Бог, как Ангел Господень перед ними.
9 ఆ కాలంలో యెరూషలేము మీదికి దండెత్తే ఇతర దేశాల ప్రజలందరినీ నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.
И будет в тот день, Я истреблю все народы, нападающие на Иерусалим.
10 ౧౦ అప్పుడు దావీదు వంశీయుల మీదా యెరూషలేములో నివసించే ప్రజల మీదా కరుణ కలిగించే ఆత్మ కోసం విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరిస్తాను. తాము పొడిచిన నన్ను వారు కళ్లారా చూస్తారు. ఒకడు తన ఏకైక కుమారుడు మరణిస్తే దుఃఖించినట్టు, తన జ్యేష్ఠపుత్రుడు మరణిస్తే ఒకడు విలపించినట్టు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు.
А на дом Давида и на жителей Иерусалима изолью дух благодати и умиления, и они воззрят на Него, Которого пронзили, и будут рыдать о Нем, как рыдают об единородном сыне, и скорбеть, как скорбят о первенце.
11 ౧౧ మెగిద్దో మైదానంలో హదదిమ్మోను దగ్గర జరిగిన విలాపం వలె ఆ రోజున యెరూషలేములో మహా విలాపం జరుగుతుంది.
В тот день поднимется большой плач в Иерусалиме, как плач Гададриммона в долине Мегиддонской.
12 ౧౨ దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా విలపిస్తారు. దావీదు వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. నాతాను వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.
И будет рыдать земля, каждое племя особо: племя дома Давидова особо, и жены их особо; племя дома Нафанова особо, и жены их особо;
13 ౧౩ లేవి వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా, షిమీ వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.
племя дома Левиина особо, и жены их особо; племя Симеоново особо, и жены их особо.
14 ౧౪ మిగిలిన అన్ని వంశాలవారు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.
Все остальные племена - каждое племя особо, и жены их особо.

< జెకర్యా 12 >