< కీర్తనల~ గ్రంథము 61 >

1 ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలతో పాడేది. దావీదు కీర్తన దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను. 2 నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు. 3 నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు. 4 యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను. (సెలా) 5 దేవా, నువ్వు నా మొక్కుబడులు అంగీకరించావు. నీ నామాన్ని గౌరవించే వారికిచ్చే వారసత్వాన్ని నాకు అనుగ్రహించావు. 6 రాజుకు దీర్ఘాయువు కలుగజేస్తావు గాక, అతని సంవత్సరాలు తరతరాలు నడుస్తాయి గాక. 7 అతడు నిత్యం దేవుని సన్నిధిలో నివసిస్తాడు గాక. అతని కాపుదల కోసం నీ కృపాసత్యాలను నియమించు. 8 ప్రతి రోజూ నా మొక్కుబడులు నేను చెల్లించేలా నీ నామాన్ని నిత్యం కీర్తిస్తాను.

< కీర్తనల~ గ్రంథము 61 >