< సామెతలు 31 >

1 రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి,
Речи цара Лемуила; сабране речи, којима га је учила мати његова.
2 కుమారా, నేనేమంటాను? నేను కన్న కుమారా, నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారా, నేనే మంటాను?
Шта, сине мој, шта, сине утробе моје, и шта, сине завета мојих?
3 నీ బలాన్ని స్త్రీలకియ్యకు. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయ వద్దు.
Не дај крепост своју женама, ни путеве своје онима што сатиру цареве.
4 ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు.
Није за цареве, Лемуило, није за цареве да пију вино, ни за кнезове да пију силовито пиће,
5 తాగితే వారు చట్టాలను విస్మరిస్తారు. దీనులందరి హక్కులనూ కాలరాస్తారు.
Да не би пијући заборавио уредбе, и изменио правицу коме невољнику.
6 ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి.
Подајте силовито пиће ономе који хоће да пропадне, и вино онима који су тужног срца;
7 వారు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు. తమ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు.
Нека се напије и заборави своје сиромаштво, и да се више не сећа своје муке.
8 మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు.
Отварај уста своја за немога, за ствар свих намењених смрти.
9 నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి.
Отварај уста своја, суди право, дај правицу невољноме и убогоме.
10 ౧౦ సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది.
Ко ће наћи врсну жену? Јер вреди више него бисер.
11 ౧౧ ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు.
Ослања се на њу срце мужа њеног, и добитка неће недостајати.
12 ౧౨ ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు.
Чини му добро, а не зло, свега века свог.
13 ౧౩ ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది.
Тражи вуне и лана, и ради по вољи рукама својим.
14 ౧౪ వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది.
Она је као лађа трговачка, из далека доноси храну своју.
15 ౧౫ ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది.
Устаје док је још ноћ, даје храну чељади својој и посао девојкама својим.
16 ౧౬ ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది.
Мисли о њиви, и узме је, од рада руку својих сади виноград.
17 ౧౭ ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది.
Опасује снагом бедра своја и крепи мишице своје.
18 ౧౮ తనకు లాభం చేకూర్చే వాటిని గుర్తిస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.
Види како јој је добра радња, не гаси јој се ноћу жижак.
19 ౧౯ ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది.
Рукама својим маша се преслице, и прстима својим држи вретено.
20 ౨౦ దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది.
Руку своју отвара сиромаху, и пружа руке убогоме.
21 ౨౧ తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు.
Не боји се снега за своју чељад, јер сва чељад њена има по двоје хаљине.
22 ౨౨ ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు.
Покриваче сама себи гради, тако платно и скерлет одело јој је
23 ౨౩ ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడు. ఊరి మొగసాల దగ్గర అతనికి పేరుప్రతిష్టలు ఉంటాయి.
Зна се муж њен на вратима кад седи са старешинама земаљским.
24 ౨౪ ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది.
Кошуље гради и продаје, и појасе даје трговцу.
25 ౨౫ బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది.
Одело јој је крепост и лепота, и осмева се на време које иде.
26 ౨౬ ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది.
Уста своја отвара мудро и на језику јој је наука блага.
27 ౨౭ ఆమె తన ఇంటివారి ప్రవర్తన బాగా కనిపెట్టి చూస్తుంటుంది. పనిచేయకుండా ఆమె భోజనం చేయదు.
Пази на владање чељади своје, и хлеба у лењости не једе.
28 ౨౮ ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు.
Синови њени подижу се и благосиљају је; муж њен такође хвали је;
29 ౨౯ “చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు” అంటాడు.
Многе су жене биле врсне, али ти их надвишујеш све.
30 ౩౦ చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు.
Љупкост је преварна и лепота ташта; жена која се боји Господа, она заслужује похвалу.
31 ౩౧ ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి. ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి.
Подајте јој од плода руку њених, и нека је хвале на вратима дела њена.

< సామెతలు 31 >