< నెహెమ్యా 3 >

1 ప్రధానయాజకుడు ఎల్యాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు నూరవ గోపురం, హనన్యేలు గోపురం వరకూ ప్రతిష్టించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు.
Et Eliasub le grand prêtre se leva avec ses frères les prêtres, et ils édifièrent la porte Probatique; eux-mêmes la sanctifièrent, et ils mirent ses battants; ils sanctifièrent aussi la tour de cent coudées, et la tour d'Anamehel.
2 వారిని ఆనుకుని యెరికో పట్టణం వారు కట్టారు, వారిని ఆనుకుని ఇమ్రీ కొడుకు జక్కూరు కట్టాడు.
Et, auprès d'eux, édifièrent des hommes de Jéricho, et des fils de Zacchur, fils d'Aman.
3 హస్సెనాయా వంశం వారు చేప ద్వారం కట్టారు. వారు దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.
Les fils d'Asana édifièrent la porte des Poissons; eux-mêmes la couvrirent et mirent ses battants, serrures et verrous.
4 వారిని ఆనుకుని హక్కోజు మనవడు, ఊరియా కొడుకు మెరేమోతు బాగుచేశాడు. అతని పక్కన మెషేజబెయేలు మనవడు బెరెక్యా కొడుకు మెషుల్లాము, అతని పక్కన బయనా కొడుకు సాదోకు బాగు చేశారు.
Et, auprès d'eux, édifièrent Ramoth, fils d'Urie, fils d'Accos, et Mosollam, fils de Barachias, fils de Mazebel; et, auprès de ceux-ci, Sadoc, fils de Baana.
5 వారిని ఆనుకుని తెకోవ ఊరివాళ్ళు బాగు చేశారు. అయితే తమ అధికారులు చెప్పిన పని చేయడానికి వారి నాయకులు నిరాకరించారు.
Et, après ce dernier, se trouvaient des hommes de Thécoé; mais les nobles n'offrirent pas de ployer leur cou pour un tel service.
6 పాసెయ కొడుకు యెహోయాదా, బెసోద్యా కొడుకు మెషుల్లాము పాత ద్వారం బాగుచేసి దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.
Joad, fils de Phasec, et Mesulam, fils de Basodias, édifièrent la porte Ancienne; eux-mêmes la couvrirent et mirent ses battants, serrures et verrous.
7 వారి పక్కన గిబియోనీయుడు మెలట్యా, మేరోనీతీవాడు యాదోను బాగుచేశారు. వాళ్ళు గిబియోను, మిస్పా పట్టణాల ప్రముఖులు. నది అవతలి ప్రాంతం గవర్నరు నివసించే భవనం వరకూ ఉన్న గోడను వారు బాగు చేశారు.
Et, auprès de ce lieu, édifia Oziel, fils d'Arachias l'orfèvre. Et, auprès, Ananias, fils de Roceïm, et les siens terminèrent Jérusalem jusqu'aux murs de la Grande rue.
8 వారి పక్కనే కంసాలి పనివారి బంధువు హర్హయా కొడుకు ఉజ్జీయేలు బాగుచేయడానికి సిద్ధమయ్యాడు. అతని పక్కనే పరిమళ ద్రవ్యాలు చేసే హనన్యా పని జరిగిస్తున్నాడు. వాళ్ళు వెడల్పు గోడ వరకూన్న యెరూషలేమును తిరిగి కట్టారు.
Et, auprès de ce lieu, édifia Oziel, fils d'Arachias l'orfèvre. Et, auprès, Ananias, fils de Roceïm, et les siens terminèrent Jérusalem jusqu'aux murs de la Grande rue.
9 వారి పక్కన యెరూషలేంలో సగ భాగానికి అధికారి హూరు కొడుకు రెఫాయా బాగు చేశాడు.
Et, auprès d'eux, édifia Raphaïe, fils de Sur, chef de la moitié de la banlieue de Jérusalem.
10 ౧౦ అతని పక్కన హరూమపు కొడుకు యెదాయా తన యింటికి ఎదురుగా ఉన్న స్థలాన్ని బాగు చేశాడు. అతని పక్కన హషబ్నెయా కొడుకు హట్టూషు పని జరిగిస్తున్నాడు.
Et, auprès de lui, Jedaïe, fils d'Eromaph, édifia en face sa maison; et, auprès de lui, Attuth, fils d'Asabanias.
11 ౧౧ రెండవ భాగాన్ని, అగ్నిగుండాల గోపురాన్ని హారిము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు బాగు చేశారు.
Et, auprès de ce dernier, Melchias, fils d'Héram, et Asub, fils de Phaat-Moab, édifièrent jusqu'à la tour des Fours.
12 ౧౨ వారి పక్కన యెరూషలేం నగరం సగభాగానికి అధికారి హల్లోహెషు కొడుకు షల్లూము, అతని కూతుళ్ళు బాగు చేశారు.
Et, auprès de là, édifièrent Sallum, fils d'Alloès, chef de la moitié de la banlieue de Jérusalem, lui et ses filles.
13 ౧౩ హానూను, జానోహ కాపురస్థులు లోయ ద్వారం బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు, తాళాలు, గడులు అమర్చారు. ఇది కాకుండా పెంట ద్వారం వరకూ వెయ్యి మూరల గోడ కట్టారు.
Anun et les habitants de Zano relevèrent la porte de la Vallée; ils l'édifièrent eux-mêmes, et mirent ses battants, serrures et verrous; et ils réparèrent mille coudées de muraille jusqu'à la porte du Fumier.
14 ౧౪ బేత్‌హక్కెరెం ప్రదేశానికి అధికారి రేకాబు కొడుకు మల్కీయా పెంట ద్వారం బాగుచేశాడు. దాన్ని కట్టి తలుపులు నిలబెట్టారు, తాళాలు, గడులు అమర్చాడు.
Et Melchias, fils de Réchab, chef de la banlieue de Bethaccharim, lui et ses fils relevèrent la porte du Fumier, et ils la couvrirent, et ils mirent ses battants, serrures et verrous.
15 ౧౫ ఆ తరువాత మిస్పా ప్రదేశానికి అధికారియైన కొల్హోజె కొడుకు షల్లూము ఊట ద్వారాన్ని తిరిగి కట్టి, దానికి పైకప్పు పెట్టి, తలుపులు నిలబెట్టారు, తాళాలు, గడులు అమర్చాడు. ఇంతేకాక, దావీదు నగరు నుండి దిగువకు వెళ్ళే మెట్ల దాకా రాజు తోటలో ఉన్న సిలోయము వాగు గోడ కూడా కట్టాడు.
Il fit aussi le mur de la piscine où on lave les toisons lors de la tonte du roi, jusqu'aux degrés qui descendent de la ville de David.
16 ౧౬ దాని పక్కన ఉన్న బేత్సూరులో సగ భాగాన్ని అధికారి అజ్బూకు కొడుకు నెహెమ్యా బాగు చేశాడు. అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకూ కట్టి ఉన్న కోనేరు వరకూ, యుద్ధవీరుల ఇళ్ళ వరకూ కట్టాడు.
Après lui, Néhémias, fils d'Azabuch, chef de la moitié de la banlieue de Bethsur, édifia jusqu'au jardin du sépulcre de David, et jusqu'à la piscine artificielle, et jusqu'à la maison des hommes vaillants.
17 ౧౭ దాని పక్కన లేవీయులు బాగుచేశారు. వారిలో బానీ కొడుకు రెహూము ఉన్నాడు. దాన్ని ఆనుకుని అధికారి హషబ్యా తన భాగం నుండి కెయిలాకు చెందిన సగభాగం దాకా బాగు చేశాడు.
Après lui, édifièrent les lévites, sous Rahum, fils de Bani; à côté de celui-ci, Asabie, chef de la moitié de la banlieue de Cella, avec ses habitants.
18 ౧౮ కెయీలాలో సగభాగానికి అధికారిగా ఉన్న వారి సహోదరుడు, హేనాదాదు కొడుకు బవ్వై బాగు చేశాడు.
Et, après lui, étaient leurs frères, sous Béneï, fils d'Enadad, chef de l'autre moitié de la même banlieue.
19 ౧౯ దాని పక్కన మిస్పాకు అధిపతి అయిన యేషూవ కొడుకు ఏజెరు ఆయుధాగారం దారికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన, మరో భాగం బాగు చేశాడు.
Et, à côté de ceux-ci, Azur, fils de Josué, chef de Masphaï, releva une part de la tour de la Montée, celle qui tenait à l'angle.
20 ౨౦ ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడు ఎల్యాషీబు ఇంటి ద్వారం దాకా ఉన్న మరొక భాగాన్ని జబ్బయి కొడుకు బారూకు శ్రద్ధగా బాగు చేశాడు.
Après lui, Baruch, fils de Zabu, édifia une autre part, depuis l'angle jusqu'à la porte de la maison d'Eliasub le grand prêtre.
21 ౨౧ హక్కోజు మనవడు, ఊరియా కొడుకు మెరేమోతు మరొక భాగాన్ని అంటే ఎల్యాషీబు ఇంటి ద్వారం నుండి చివరి వరకూ బాగు చేశాడు.
Après lui, Meramoth, fils d'Urie, fils d'Accos, édifia une autre part, à partir de la porte de la maison d'Eliasub, jusqu'à l'extrémité de cette maison.
22 ౨౨ దాన్ని అనుకుని యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే యాజకులు బాగు చేశారు.
Après lui, édifièrent les prêtres, les hommes d'Eccbechar.
23 ౨౩ దాని పక్కన తమ యింటికి ఎదురుగా బెన్యామీను, హష్షూబు అనేవారు బాగు చేశారు. దాన్ని ఆనుకుని అనన్యా మనవడు, మయశేయా కొడుకు అజర్యా తన యింటి దగ్గర బాగు చేశాడు.
Après lui, Benjamin et Asub édifièrent devant leur maison; ensuite, Azarias, fils de Maasia, fils d'Anania, le long de sa maison.
24 ౨౪ అజర్యా ఇంటి దగ్గర నుంచి గోడ మలుపు మూల వరకూ మరో భాగాన్ని హేనాదాదు కొడుకు బిన్నూయి బాగు చేశాడు.
Après celui-ci, Bani, fils d'Adad, édifia une autre part, depuis la maison d'Azarias, jusqu'à l'angle et jusqu'au tournant.
25 ౨౫ ఆ భాగాన్ని ఆనుకుని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజు భవనం ఉండే మహా గోపురం దాకా ఊజై కొడుకు పాలాలు బాగు చేశాడు. దాని పక్కన పరోషు కొడుకు పెదాయా బాగు చేశాడు.
Phalach, fils d'Euzaï, édifia vis-à-vis l'angle où la tour fait saillie sur le palais du roi, et domine la cour de la prison; et, après lui, Phadaïa, fils de Pharos,
26 ౨౬ ఓపెలులో నివసించే దేవాలయ సేవకులు తూర్పున నీటి ద్వారం పక్కన, గోపురం దగ్గర బాగు చేశారు.
Et les Nathinéens se placèrent en Ophel, jusqu'au jardin de la porte des Eaux, du côté de l'orient, où une tour s'élève en saillie.
27 ౨౭ తెకోవీయులు ఓపెలు గోడ వరకూ గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న మరో భాగాన్ని బాగు చేశారు.
Ensuite, ceux de Thécoé édifièrent une autre part, vis-à-vis la grande tour qui fait saillie, jusqu'au mur d'Ophla.
28 ౨౮ గుర్రం ద్వారం దాటుకుని ఉన్న యాజకులంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా బాగు చేశారు.
Les prêtres édifièrent au-dessus de la porte des Cavaliers, chacun en face de sa maison.
29 ౨౯ వారి పక్కన ఇమ్మేరు కొడుకు సాదోకు తన ఇంటికి ఎదురుగా బాగు చేశాడు. తూర్పు ద్వారాన్ని కాపలా కాసే షెకన్యా కొడుకు షెమయా దాని పక్కన బాగు చేశాడు.
Après ceux-là, Saddoc, fils d'Emmer, édifia en face de sa maison; et, après lui, Samaïa, fils de Sechénias, garde de la porte orientale du temple.
30 ౩౦ దాని పక్కన షెలెమ్యా కొడుకు హనన్యా, జాలాపు ఆరవ కొడుకు హానూను మరో భాగాన్ని బాగు చేశారు. బెరెక్యా కొడుకు మెషుల్లాము తన గదికి ఎదురుగా ఉన్న స్థలం బాగు చేశాడు.
Après celui-cl, Ananias, fils de Sélémias, et Anom, sixième fils de Séleph, édifièrent; puis, Mesulam, fils de Barachias, édifia en face du trésor dont il était le gardien;
31 ౩౧ ఆలయ సేవకుల స్థలానికి, పరిశీలన ద్వారానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకూ కంసాలి మల్కీయా బాగు చేశాడు.
puis, Méchias, fils de Saréphi, édifia jusqu'à la maison des Nathinéens, et les petits marchands vis-à-vis la porte de Maphecad jusqu'aux degrés du tournant.
32 ౩౨ మూలనున్న పై గది నుండి గొర్రెల ద్వారం మధ్య వరకూ కంసాలులు, వర్తకులు బాగు చేశారు.
Enfin, les forgerons et des détaillants édifièrent du côté de la porte Probatique.

< నెహెమ్యా 3 >