< మత్తయి 28 >

1 విశ్రాంతిదినం గడిచిన తరవాత ఆదివారం నాడు తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, మరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.
ತತಃ ಪರಂ ವಿಶ್ರಾಮವಾರಸ್ಯ ಶೇಷೇ ಸಪ್ತಾಹಪ್ರಥಮದಿನಸ್ಯ ಪ್ರಭೋತೇ ಜಾತೇ ಮಗ್ದಲೀನೀ ಮರಿಯಮ್ ಅನ್ಯಮರಿಯಮ್ ಚ ಶ್ಮಶಾನಂ ದ್ರಷ್ಟುಮಾಗತಾ|
2 ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది.
ತದಾ ಮಹಾನ್ ಭೂಕಮ್ಪೋಽಭವತ್; ಪರಮೇಶ್ವರೀಯದೂತಃ ಸ್ವರ್ಗಾದವರುಹ್ಯ ಶ್ಮಶಾನದ್ವಾರಾತ್ ಪಾಷಾಣಮಪಸಾರ್ಯ್ಯ ತದುಪರ್ಯ್ಯುಪವಿವೇಶ|
3 ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.
ತದ್ವದನಂ ವಿದ್ಯುದ್ವತ್ ತೇಜೋಮಯಂ ವಸನಂ ಹಿಮಶುಭ್ರಞ್ಚ|
4 అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.
ತದಾನೀಂ ರಕ್ಷಿಣಸ್ತದ್ಭಯಾತ್ ಕಮ್ಪಿತಾ ಮೃತವದ್ ಬಭೂವಃ|
5 ఆ దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు.
ಸ ದೂತೋ ಯೋಷಿತೋ ಜಗಾದ, ಯೂಯಂ ಮಾ ಭೈಷ್ಟ, ಕ್ರುಶಹತಯೀಶುಂ ಮೃಗಯಧ್ವೇ ತದಹಂ ವೇದ್ಮಿ|
6 ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి,
ಸೋಽತ್ರ ನಾಸ್ತಿ, ಯಥಾವದತ್ ತಥೋತ್ಥಿತವಾನ್; ಏತತ್ ಪ್ರಭೋಃ ಶಯನಸ್ಥಾನಂ ಪಶ್ಯತ|
7 త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు.
ತೂರ್ಣಂ ಗತ್ವಾ ತಚ್ಛಿಷ್ಯಾನ್ ಇತಿ ವದತ, ಸ ಶ್ಮಶಾನಾದ್ ಉದತಿಷ್ಠತ್, ಯುಷ್ಮಾಕಮಗ್ರೇ ಗಾಲೀಲಂ ಯಾಸ್ಯತಿ ಯೂಯಂ ತತ್ರ ತಂ ವೀಕ್ಷಿಷ್ಯಧ್ವೇ, ಪಶ್ಯತಾಹಂ ವಾರ್ತ್ತಾಮಿಮಾಂ ಯುಷ್ಮಾನವಾದಿಷಂ|
8 వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా
ತತಸ್ತಾ ಭಯಾತ್ ಮಹಾನನ್ದಾಞ್ಚ ಶ್ಮಶಾನಾತ್ ತೂರ್ಣಂ ಬಹಿರ್ಭೂಯ ತಚ್ಛಿಷ್ಯಾನ್ ವಾರ್ತ್ತಾಂ ವಕ್ತುಂ ಧಾವಿತವತ್ಯಃ| ಕಿನ್ತು ಶಿಷ್ಯಾನ್ ವಾರ್ತ್ತಾಂ ವಕ್ತುಂ ಯಾನ್ತಿ, ತದಾ ಯೀಶು ರ್ದರ್ಶನಂ ದತ್ತ್ವಾ ತಾ ಜಗಾದ,
9 యేసు వారికి ఎదురు వచ్చి, “మీకు శుభం!” అని చెప్పాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాదాలపై వాలి ఆయనను పూజించారు.
ಯುಷ್ಮಾಕಂ ಕಲ್ಯಾಣಂ ಭೂಯಾತ್, ತತಸ್ತಾ ಆಗತ್ಯ ತತ್ಪಾದಯೋಃ ಪತಿತ್ವಾ ಪ್ರಣೇಮುಃ|
10 ౧౦ అప్పుడు యేసు, “భయపడకండి. మీరు వెళ్ళి, నా సోదరులను గలిలయకి వెళ్ళమని చెప్పండి. అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారితో చెప్పాడు.
ಯೀಶುಸ್ತಾ ಅವಾದೀತ್, ಮಾ ಬಿಭೀತ, ಯೂಯಂ ಗತ್ವಾ ಮಮ ಭ್ರಾತೃನ್ ಗಾಲೀಲಂ ಯಾತುಂ ವದತ, ತತ್ರ ತೇ ಮಾಂ ದ್ರಕ್ಷ್ಯನ್ತಿ|
11 ౧౧ వారు వెళ్తూ ఉండగా సమాధికి కావలిగా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు.
ಸ್ತ್ರಿಯೋ ಗಚ್ಛನ್ತಿ, ತದಾ ರಕ್ಷಿಣಾಂ ಕೇಚಿತ್ ಪುರಂ ಗತ್ವಾ ಯದ್ಯದ್ ಘಟಿತಂ ತತ್ಸರ್ವ್ವಂ ಪ್ರಧಾನಯಾಜಕಾನ್ ಜ್ಞಾಪಿತವನ್ತಃ|
12 ౧౨ కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి,
ತೇ ಪ್ರಾಚೀನೈಃ ಸಮಂ ಸಂಸದಂ ಕೃತ್ವಾ ಮನ್ತ್ರಯನ್ತೋ ಬಹುಮುದ್ರಾಃ ಸೇನಾಭ್ಯೋ ದತ್ತ್ವಾವದನ್,
13 ౧౩ “మీరు ‘మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు’ అని చెప్పండి.
ಅಸ್ಮಾಸು ನಿದ್ರಿತೇಷು ತಚ್ಛಿಷ್ಯಾ ಯಾಮಿನ್ಯಾಮಾಗತ್ಯ ತಂ ಹೃತ್ವಾನಯನ್, ಇತಿ ಯೂಯಂ ಪ್ರಚಾರಯತ|
14 ౧౪ ఇది గవర్నరుకు తెలిసినా మేమతనితో మాట్లాడి మీకేమీ ఇబ్బంది లేకుండా చూస్తాం.” అన్నారు.
ಯದ್ಯೇತದಧಿಪತೇಃ ಶ್ರೋತ್ರಗೋಚರೀಭವೇತ್, ತರ್ಹಿ ತಂ ಬೋಧಯಿತ್ವಾ ಯುಷ್ಮಾನವಿಷ್ಯಾಮಃ|
15 ౧౫ సైనికులు ఆ డబ్బు తీసుకుని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. ఆ మాట యూదుల్లో ఇప్పటి వరకూ వ్యాపించి ఉంది.
ತತಸ್ತೇ ಮುದ್ರಾ ಗೃಹೀತ್ವಾ ಶಿಕ್ಷಾನುರೂಪಂ ಕರ್ಮ್ಮ ಚಕ್ರುಃ, ಯಿಹೂದೀಯಾನಾಂ ಮಧ್ಯೇ ತಸ್ಯಾದ್ಯಾಪಿ ಕಿಂವದನ್ತೀ ವಿದ್ಯತೇ|
16 ౧౬ పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు.
ಏಕಾದಶ ಶಿಷ್ಯಾ ಯೀಶುನಿರೂಪಿತಾಗಾಲೀಲಸ್ಯಾದ್ರಿಂ ಗತ್ವಾ
17 ౧౭ అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.
ತತ್ರ ತಂ ಸಂವೀಕ್ಷ್ಯ ಪ್ರಣೇಮುಃ, ಕಿನ್ತು ಕೇಚಿತ್ ಸನ್ದಿಗ್ಧವನ್ತಃ|
18 ౧౮ అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.
ಯೀಶುಸ್ತೇಷಾಂ ಸಮೀಪಮಾಗತ್ಯ ವ್ಯಾಹೃತವಾನ್, ಸ್ವರ್ಗಮೇದಿನ್ಯೋಃ ಸರ್ವ್ವಾಧಿಪತಿತ್ವಭಾರೋ ಮಯ್ಯರ್ಪಿತ ಆಸ್ತೇ|
19 ౧౯ కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ
ಅತೋ ಯೂಯಂ ಪ್ರಯಾಯ ಸರ್ವ್ವದೇಶೀಯಾನ್ ಶಿಷ್ಯಾನ್ ಕೃತ್ವಾ ಪಿತುಃ ಪುತ್ರಸ್ಯ ಪವಿತ್ರಸ್ಯಾತ್ಮನಶ್ಚ ನಾಮ್ನಾ ತಾನವಗಾಹಯತ; ಅಹಂ ಯುಷ್ಮಾನ್ ಯದ್ಯದಾದಿಶಂ ತದಪಿ ಪಾಲಯಿತುಂ ತಾನುಪಾದಿಶತ|
20 ౨౦ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు. (aiōn g165)
ಪಶ್ಯತ, ಜಗದನ್ತಂ ಯಾವತ್ ಸದಾಹಂ ಯುಷ್ಮಾಭಿಃ ಸಾಕಂ ತಿಷ್ಠಾಮಿ| ಇತಿ| (aiōn g165)

< మత్తయి 28 >