< మత్తయి 23 >

1 అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు,
Kuleka ite auligilye ne antu neamanyisigwa ahwe,
2 “ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు.
''Iaandeki neamafalisayo ikaie ituntu lang'wa Musa.
3 కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు.
Kehi neakumuila kituma, itumi kunu mezeagoza. Kuita muteke kituma intendo yao, kunsoko neanso elunga imakani neshaituma.
4 మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు.
Itai etunga meligo melito neanso hange mekaku humehenha, hange eahensha iantu mumeenga ao. Kuite neanso shaehugeela ata ninino kukenha.
5 వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు.
Inlendo yao yehi, ituma nsoko agozwe neantu. Kunsoko neanso igalipya imasandeko ao nukongeelya ukuulu nua upendi wang'wenda ao.
6 విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు.
Neanso ilowa kikie muianza yakikulya muumalagone mumatuntu akakulya mukate amumasinagogi,
7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం.
nuhulamushigwa kukulyo nkani yakusoko, nukulang'wa, ''Amanyisi'' ne antu.
8 మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు.
Kuite unye singainonee kitangwa''Miamanyisi'' Kunsoko muukete umumanyisi ung'wi, hange unye meehi mekiluna.
9 ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి.
Muleke kuuitanga muntu wehi apa mihe kena Tata wanyu, kunsoko mukete Tata wang'wi alua, nung'wenso ukole hilunde.
10 ౧౦ అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.
Hange muleke kitangwa ''amanyisi'' kunsoko mukete umumanyisi ung'wi duu, inge Kristo.
11 ౧౧ మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి.
Inge numukulu mulalanyu ukutala mutumi wanyu.
12 ౧౨ తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
Wehi nukihumbula ukusimigwa, hange wehi nukisimya ukuhumbulwa.
13 ౧౩ “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు.
Kuite ukea wanyu aandeki nea mafalisayo, ateele! mukua lugaile iantu utemi nuakilunde. Nunyenyeshamuhumile kingela, shamuagombilye neakingela hutende ite.
14 ౧౪ మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు.
15 ౧౫ అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు. (Geenna g1067)
Ukae wanyu aandeki neafalisayo, ateele! Mukuputa itumbe labahali nukumutenda umuntu ung'wi wahuele kuaya nemukumanyisa. hangi nuekatenda anga unyenye, mukumulenda kabiili muntu nue [kumoto] jehanamu anga uu uuyenye nemile. (Geenna g1067)
16 ౧౬ “అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు.
Ukae wanyu atongeeli nea poku, unye nemilunga, wehi nuelapa kitekeelo, singa kentu. Kuite nuelapa kilapo la zahabu ni lekeelo, ukulungwa nekelapokakwe.
17 ౧౭ బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా?
Unye apoku meapungu, nekeule nekekulu kukelakeuya, zahabune angwi itekeelo neliikilwe wakufu nezahabu kung'wi Tunda?
18 ౧౮ అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు.
Hange, wehi nukulapa kuzahabu, singa kentu. Inge nukulapa kisongelyo nelekole mung'waakwe, utungilwa nuulapi wakwe.
19 ౧౯ అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా?
Unye antu nemeapoku, nekeule nekekulu kukele ikiunya isongeelyona ang'wi adhabu neekwa wakufu imasongeilyo nepumigwa kung'wi Tunda?
20 ౨౦ బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
Kuite, nuanso nuelopa kuzahabu wilapa kunelanso nukumaintu ehe nahole kung'wa akwe.
21 ౨౧ అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
Nung'wenso nuelapa mitekeelo, wilapa kunelanso kung'wenso nuekili akwe.
22 ౨౨ ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
Nung'wenso nuelapa kiluunde, wilapa pituntu la utemi ne lang'wi Tunda nukung'wenso nuikie mung'wanso.
23 ౨౩ “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.
Ukae wanyu, aandeki neafalisayo, ateele! kunsoko mukupunya ezaka kubizali, mnaanaa nechicha, kuita mukuleka imakani nemalito milego -tai ukende, nuuhueli. Kuite aya yemunonee kutula mutumile, hange singa kumaleka nemangiza muhile kumitumela.
24 ౨౪ అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు.
Unye atongeeli nemeapoku, nemukusuza umududu numuniino kuite mukuimela ingamia!
25 ౨౫ అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి.
Ukae wanyu, andeki neafalisayo, miateele! Kunsoko mukoja ikole kunzi ne sahani kuhunzi, kuite kunzi izue uubi hange kulile anga upolo.
26 ౨౬ గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.
Unye aaafalisa nemiapoku, oji hanza ikole mukati ne mukati a sahani, nsoko inkika na kunzi etule nza nenyenso gaa.
27 ౨౭ అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి.
Ukae wanyi, aandeke neafalisayo, meateele! kunsoko mukimpyana niibeela napakilwe ukenke, kunzi igela maza, kuite mukati izue imakupa naashi hange kela kentu neke bii.
28 ౨౮ అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు.
Uulukuli, nunye kunzi migee kena miaza ntongeele aantu, kuite kunzi mizue uteele nuubi.
29 ౨౯ “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు.
Ukae wanyu, aandeki neafalisayo, meateele! kunsoko mukuzenga iibiila na anyakidagu nukupambe iibiila yao awa nea tai.
30 ౩౦ ‘మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసే వాళ్ళం కాము’ అని చెప్పుకొంటారు.
Unye milunga, anga aekikie mumahiku a tata itu, shanga aezekipalung'wi nao kuhunula usakami nuanya kidagu.
31 ౩౧ నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.
Kuite mukihenga unyenye kena unye miana ao awa nae abulagile ianyakidagu.
32 ౩౨ ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి.
Hange unyenye mukupikeelya kizulya pang'wanso niinonee umulandu nua Tata anyu.
33 ౩౩ “సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు. (Geenna g1067)
Unye nzoka, akete vipilibao, muuekile ule uulamuli nuakujehanamu? (Geenna g1067)
34 ౩౪ కాబట్టి వినండి! నేను మీ దగ్గరికి ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు. సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు.
Kuite, goza, kuatuma kitalanyu ianyakidagu, antuneakuligwa, neaandeki, Ang'wi ao mukuabulaga nukuaja. Ang'wiao mukuakua mumasinagogi anyu nukuazunsa nukupuma makesale king'wi sunga numuya.
35 ౩౫ నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది.
Upumeli kena kung'wa anyu ukupumela usakami wehi nua tai nauhunuwe mihe, kaziilya isakamiang'wa Habili nua tai sunga isakani niya Zakalia ung'waa Balaki, nae mumubulabile patakatifu nepa kezindaalo.
36 ౩౬ అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
Tai, kumuila, imakani aya ehi akuupata uwileli uwu.
37 ౩౭ “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు.
Yerusalemu, Yerusalemu, uewe nukeze abulaga ianyakidagu nukuakua namagwe awa neatumilwe kung'wa ako! Nkua inga kumilingeela iang'enya ako palung'wi anga enkuku nilingeela iana akwe mumanana akwe, kuite singa wikagomba!
38 ౩౮ ఇదుగో, ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను
Goza ito lako lasaga nuula.
39 ౩౯ ఇప్పటి నుండి మీరు ‘ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతులు పొందుతాడు గాక’ అని చెప్పే వరకూ మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను.”
Nunee kuila, kandeelya, itungo lele nukulongoleka singa umona, sunga nuekalunga, “Ukembetilwe nuanso nuzile kulina nela Mukulu.”

< మత్తయి 23 >