< మార్కు 12 >

1 ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. “ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి, అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్షతోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూర దేశానికి వెళ్ళాడు.
ⲁ̅ⲞⲨⲞϨ ⲀϤⲈⲢϨⲎⲦⲤ ⲚⲤⲀϪⲒ ⲚⲈⲘⲰⲞⲨ ϦⲈⲚϨⲀⲚⲠⲀⲢⲀⲂⲞⲖⲎ ⲚⲈⲞⲨⲞⲚ ⲞⲨⲢⲰⲘⲒ ⲀϤϬⲞ ⲚⲞⲨⲒⲀϨⲀⲖⲞⲖⲒ ⲞⲨⲞϨ ⲀϤⲔⲰⲦ ⲚⲞⲨϪⲞⲒ ⲈⲢⲞϤ ⲞⲨⲞϨ ⲀϤϢⲰⲔ ⲚⲞⲨϨⲢⲰⲦ ⲚϦⲎⲦϤ ⲞⲨⲞϨ ⲀϤⲔⲰⲦ ⲚⲞⲨⲠⲨⲢⲄⲞⲤ ⲚϦⲎⲦϤ ⲞⲨⲞϨ ⲀϤⲦⲎⲒϤ ⲈⲦⲞⲦⲞⲨ ⲚϨⲀⲚⲞⲨⲒⲎ ⲞⲨⲞϨ ⲀϤϢⲈ ⲚⲀϤ ⲈⲠϢⲈⲘⲘⲞ
2 పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్షపండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు.
ⲃ̅ⲞⲨⲞϨ ⲀϤⲞⲨⲰⲢⲠ ϨⲀ ⲚⲒⲞⲨⲒⲎ ϦⲈⲚⲠⲤⲎ ⲞⲨ ⲚⲞⲨⲂⲰⲔ ϨⲒⲚⲀ ⲚⲦⲈϤϬⲒ ⲚⲦⲞⲦⲞⲨ ⲚⲚⲒⲞⲨⲒⲎ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲞⲨⲦⲀϨ ⲚⲦⲈⲠⲒⲒⲀϨⲀⲖⲞⲖⲒ.
3 అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు.
ⲅ̅ⲞⲨⲞϨ ⲈⲦⲀⲨϬⲒⲦϤ ⲀⲨϨⲒⲞⲨⲒ ⲈⲢⲞϤ ⲞⲨⲞϨ ⲀⲨⲞⲨⲞⲢⲠϤ ⲈϤϢⲞⲨⲒⲦ.
4 అతడు మళ్ళీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతని తలపై గాయపరచి, అవమానించి పంపివేశారు.
ⲇ̅ⲞⲨⲞϨ ⲀϤⲞⲨⲰⲢⲠ ⲞⲚ ϨⲀⲢⲰⲞⲨ ⲚⲔⲈⲂⲰⲔ ⲞⲨⲞϨ ⲠⲒⲔⲈⲞⲨⲀⲒ ⲀⲨⲪⲞⲖϨϤ ⲞⲨⲞϨ ⲀⲨϢⲞϢϤ.
5 అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతణ్ణి చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు. కాని, ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి, ఇంకొందరిని చంపారు.
ⲉ̅ⲞⲨⲞϨ ⲀϤⲞⲨⲰⲢⲠ ⲚⲔⲈⲞⲨⲀⲒ ⲞⲨⲞϨ ⲠⲒⲬⲈⲦ ⲀⲨϦⲞⲐⲂⲈϤ ⲞⲨⲞϨ ⲀϤⲞⲨⲰⲢⲠ ⲚϨⲀⲚⲔⲈⲘⲎ ϢϨⲀⲚⲞⲨⲞⲚ ⲀⲨϨⲒⲰⲚⲒ ⲈⲢⲰⲞⲨ ϨⲀⲚⲔⲈⲬⲰⲞⲨⲚⲒ ⲆⲈ ⲀⲨϦⲰⲦⲈⲂ ⲘⲘⲰⲞⲨ.
6 వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియ కుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకుని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు.
ⲋ̅ⲈⲦⲒ ⲞⲨϢⲎⲢⲒ ⲘⲘⲈⲚⲢⲒⲦ ⲈⲚⲀϤⲚⲦⲀϤ ⲀϤⲞⲨⲞⲢⲠϤ ⲈⲠϦⲀⲈ ϨⲀⲢⲰⲞⲨ ⲈϤϪⲰ ⲘⲘⲞⲤ ϪⲈ ⲤⲈⲚⲀϢⲪⲒⲦ ϦⲀⲦϨⲎ ⲘⲠⲀϢⲎⲢⲒ.
7 కాని ఆ కౌలుదారులు ‘ఇతడే వారసుడు! ఇతన్ని చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది’ అని తమలో తాము మాట్లాడుకున్నారు.
ⲍ̅ⲚⲒⲞⲨⲒⲎ ⲆⲈ ⲈⲦⲈⲘⲘⲀⲨ ⲚⲀⲨϪⲰ ⲘⲘⲞⲤ ⲚⲚⲞⲨⲈⲢⲎⲞⲨ ϪⲈ ⲪⲀⲒ ⲠⲈ ⲠⲒⲔⲖⲎⲢⲞⲚⲞⲘⲞⲤ ⲀⲘⲰⲒⲚⲒ ⲘⲀⲢⲈⲚϦⲞⲐⲂⲈϤ ⲚⲦⲈϮⲔⲖⲎⲢⲞⲚⲞⲘⲒⲀ ⲈⲢⲐⲰⲚ.
8 వారు అతన్ని పట్టుకుని, చంపి ఆ ద్రాక్షతోట అవతల పారవేశారు.
ⲏ̅ⲞⲨⲞϨ ⲈⲦⲀⲨϬⲒⲦϤ ⲀⲨϦⲞⲐⲂⲈϤ ⲞⲨⲞϨ ⲀⲨϨⲒⲦϤ ⲤⲀⲂⲞⲖ ⲘⲠⲒⲒⲀϨⲀⲖⲞⲖⲒ.
9 అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు.
ⲑ̅ⲞⲨ ⲠⲈ ⲈⲦⲈϤⲚⲀⲀⲒϤ ⲚϪⲈⲠϬⲞⲒⲤ ⲘⲠⲒⲒⲀϨⲀⲖⲞⲖⲒ ϤⲚⲀⲒ ⲞⲨⲞϨ ϤⲚⲀⲦⲀⲔⲞ ⲚⲚⲒⲞⲨⲒⲎ ⲞⲨⲞϨ ⲚⲦⲈϤϮ ⲘⲠⲒⲒⲀϨⲀⲖⲞⲖⲒ ⲚϨⲀⲚⲔⲈⲬⲰⲞⲨⲚⲒ.
10 ౧౦ మీరు ఈ లేఖనం చదవలేదా? ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.
ⲓ̅ⲞⲨⲆⲈ ⲦⲀⲒⲄⲢⲀⲪⲎ ⲘⲠⲈⲦⲈⲚⲰϢ ⲘⲘⲞⲤ ϪⲈ ⲠⲒⲰⲚⲒ ⲈⲦⲀⲨϢⲞϢϤ ⲚϪⲈⲚⲎ ⲈⲦⲔⲰⲦ ⲪⲀⲒ ⲀϤϢⲰⲠⲒ ⲚⲞⲨϪⲰϪ ⲚⲖⲀⲔϨ.
11 ౧౧ అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’”
ⲓ̅ⲁ̅ⲈⲦⲀ ⲪⲀⲒ ϢⲰⲠⲒ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲠϬⲞⲒⲤ ⲞⲨⲞϨ ϤⲞⲒ ⲚϢⲪⲎⲢⲒ ϦⲈⲚⲚⲈⲚⲂⲀⲖ.
12 ౧౨ ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు కాని, ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు.
ⲓ̅ⲃ̅ⲞⲨⲞϨ ⲚⲀⲨⲔⲰϮ ⲚⲤⲀⲀⲘⲞⲚⲒ ⲘⲘⲞϤ ⲠⲈ ⲞⲨⲞϨ ⲀⲨⲈⲢϨⲞϮ ϦⲀⲦϨⲎ ⲘⲠⲒⲘⲎϢ ⲀⲨⲈⲘⲒ ⲄⲀⲢ ϪⲈ ⲈⲦⲀϤϪⲈ ⲦⲀⲒⲠⲀⲢⲀⲂⲞⲖⲎ ⲈⲐⲂⲎ ⲦⲞⲨ ⲞⲨⲞϨ ⲈⲦⲀⲨⲬⲀϤ ⲀⲨϢⲈ ⲚⲰⲞⲨ
13 ౧౩ యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు.
ⲓ̅ⲅ̅ⲞⲨⲞϨ ⲀⲨⲞⲨⲰⲢⲠ ϨⲀⲢⲞϤ ⲚϨⲀⲚⲞⲨⲞⲚ ⲚⲦⲈⲚⲒⲪⲀⲢⲒⲤⲈⲞⲤ ⲚⲈⲘ ⲚⲒⲎⲢⲰⲆⲒⲀⲚⲞⲤ ϨⲒⲚⲀ ⲚⲦⲞⲨϪⲞⲢϪϤ ⲚⲞⲨⲤⲀϪⲒ.
14 ౧౪ వారు వచ్చి ఇలా అన్నారు, “బోధకా! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా?
ⲓ̅ⲇ̅ⲞⲨⲞϨ ⲈⲦⲀⲨⲒ ⲠⲈϪⲰⲞⲨ ⲚⲀϤ ϪⲈ ⲪⲢⲈϤϮ ⲤⲂⲰ ⲦⲈⲚⲈⲘⲒ ϪⲈ ⲚⲐⲞⲔ ⲞⲨⲐⲘⲎⲒ ⲞⲨⲞϨ ⲤⲈⲢⲘⲈⲖⲒⲚ ⲚⲀⲔ ⲀⲚ ϦⲀ ϨⲖⲒ ⲞⲨ ⲄⲀⲢ ⲔϪⲞⲨϢⲦ ⲈϨⲞ ⲚⲢⲰⲘⲒ ⲀⲚ ⲀⲖⲖⲀ ⲔϮⲤⲂⲰ ⲘⲠⲒⲘⲰⲒⲦ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ϦⲈⲚⲞⲨⲘⲈⲐⲘⲎⲒ ⲤϢⲈ ⲚϮϨⲰϮ ⲘⲠⲞⲨⲢⲞ ϢⲀⲚ ⲘⲘⲞⲚ ⲚⲦⲈⲚϮ ϢⲀⲚ ⲚⲦⲈⲚϢⲦⲈⲘϮ.
15 ౧౫ మనం పన్నులు కట్టాలా? మానాలా?” అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, “నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకు రండి” అన్నాడు.
ⲓ̅ⲉ̅ⲚⲐⲞϤ ⲆⲈ ⲈϤⲤⲰⲞⲨⲚ ⲚⲦⲞⲨⲘⲈⲦϢⲞⲂⲒ ⲠⲈϪⲀϤ ⲚⲰⲞⲨ ϪⲈ ⲈⲐⲂⲈⲞⲨ ⲦⲈⲦⲈⲚϬⲰⲚⲦ ⲘⲘⲞⲒ ⲀⲚⲒⲞⲨⲒ ⲚⲎⲒ ⲚⲞⲨⲤⲀⲐⲈⲢⲒ ϨⲒⲚⲀ ⲚⲦⲀⲚⲀⲨ ⲈⲢⲞⲤ.
16 ౧౬ వారు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని ఆయన అడిగాడు. వారాయనతో, “సీజరుది” అన్నారు.
ⲓ̅ⲋ̅ⲚⲐⲰⲞⲨ ⲆⲈ ⲀⲨⲒⲚⲒ ⲞⲨⲞϨ ⲠⲈϪⲀϤ ⲚⲰⲞⲨ ϪⲈ ⲐⲀ ⲚⲒⲘ ⲦⲈ ⲦⲀⲒϨⲒⲔⲰⲚ ⲚⲈⲘ ⲦⲀⲒⲈⲠⲒⲄⲢⲀⲪⲎ ⲚⲐⲰⲞⲨ ⲆⲈ ⲠⲈϪⲰⲞⲨ ⲚⲀϤ ϪⲈ ⲚⲀ ⲠⲞⲨⲢⲞ ⲚⲈ.
17 ౧౭ అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు.
ⲓ̅ⲍ̅ⲚⲐⲞϤ ⲆⲈ ⲠⲈϪⲀϤ ⲚⲰⲞⲨ ϪⲈ ⲚⲀ ⲠⲞⲨⲢⲞ ⲘⲎⲒⲦⲞⲨ ⲘⲠⲞⲨⲢⲞ ⲞⲨⲞϨ ⲚⲀ ⲪⲚⲞⲨϮ ⲘⲎⲒⲦⲞⲨ ⲘⲪⲚⲞⲨϮ ⲞⲨⲞϨ ⲚⲀⲨⲈⲢϢⲪⲎⲢⲒ ⲈϪⲰϤ ⲠⲈ.
18 ౧౮ అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు.
ⲓ̅ⲏ̅ⲞⲨⲞϨ ⲀⲨⲒ ϨⲀⲢⲞϤ ⲚϪⲈϨⲀⲚⲤⲀⲆⲆⲞⲨⲔⲈⲞⲤ ⲚⲎ ⲈⲦϪⲰ ⲘⲘⲞⲤ ϪⲈ ⲘⲘⲞⲚ ⲀⲚⲀⲤⲦⲀⲤⲒⲤ ϢⲞⲠ ⲞⲨⲞϨ ⲚⲀⲨϢⲒⲚⲒ ⲘⲘⲞϤ ⲠⲈ ⲈⲨϪⲰ ⲘⲘⲞⲤ
19 ౧౯ “బోధకా, ఒకడి సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకుని, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో రాశాడు.
ⲓ̅ⲑ̅ϪⲈ ⲪⲢⲈϤϮⲤⲂⲰ ⲘⲰⲨⲤⲎⲤ ⲀϤⲤϦⲀⲒ ⲚⲀⲚ ϪⲈ ⲈϢⲰⲠ ⲚⲦⲈⲠⲤⲞⲚ ⲚⲞⲨⲀⲒ ⲘⲞⲨ ⲞⲨⲞϨ ⲚⲦⲈϤⲤⲈϪⲠ ⲞⲨⲤϨⲒⲘⲒ ⲞⲨⲞϨ ⲚⲦⲈϤϢⲦⲈⲘⲬ ⲀϢⲎⲢⲒ ϨⲒⲚⲀ ⲚⲦⲈⲠⲈϤⲤⲞⲚ ϬⲒ ⲚϮⲤϨⲒⲘⲒ ⲞⲨⲞϨ ⲚⲦⲈϤⲦⲞⲨⲚⲞⲤ ⲞⲨϪⲢⲞϪ ⲘⲠⲈϤⲤⲞⲚ.
20 ౨౦ ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు.
ⲕ̅ⲚⲈ ⲞⲨⲞⲚ ⲌⲆⲈ ⲚⲤⲞⲚ ϦⲀⲦⲞⲦⲈⲚ ⲠⲈ ⲞⲨⲞϨ ⲠⲒϨⲞⲨⲒⲦ ϬⲒⲤϨⲒⲘⲒ ⲚⲀϤⲘⲞⲨ ⲘⲠⲈϤⲬⲀ ϪⲢⲞϪ.
21 ౨౧ రెండవవాడు ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వాడికి కూడా అలాగే జరిగింది.
ⲕ̅ⲁ̅ⲞⲨⲞϨ ⲠⲒⲘⲀϨⲂ ⲀϤϬⲒⲦⲤ ⲞⲨⲞϨ ⲀϤⲘⲞⲨ ⲘⲠⲈϤⲬⲀ ϪⲢⲞϪ ⲞⲨⲞϨ ⲠⲒⲘⲀϨⲄ ⲘⲠⲀⲒⲢⲎϮ ⲞⲚ
22 ౨౨ ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళిచేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది.
ⲕ̅ⲃ̅ⲞⲨⲞϨ ⲠⲒⲘⲀϨⲌ ⲘⲠⲞⲨⲬⲀ ϪⲢⲞϪ ⲈⲠϦⲀⲈ ⲆⲈ ⲘⲘⲰⲞⲨ ⲦⲎⲢⲞⲨ ⲀⲤⲘⲞⲨ ⲚϪⲈϮⲔⲈⲤϨⲒⲘⲒ.
23 ౨౩ చనిపోయిన వారు తిరిగి బ్రతికినపుడు ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకున్నారు కదా!” అని అడిగారు.
ⲕ̅ⲅ̅ϦⲈⲚ ϮⲀⲚⲀⲤⲦⲀⲤⲒⲤ ⲀⲤⲚⲀⲈⲢ ⲤϨⲒⲘⲒ ⲚⲚⲒⲘ ⲘⲘⲰⲞⲨ ⲠⲒⲌ ⲄⲀⲢ ⲀⲨϬⲒⲦⲤ ⲚⲤϨⲒⲘⲒ.
24 ౨౪ యేసు వారికి జవాబిస్తూ, “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు.
ⲕ̅ⲇ̅ⲠⲈϪⲀϤ ⲚⲰⲞⲨ ⲚϪⲈⲒⲎⲤⲞⲨⲤ ϪⲈ ⲘⲎ ⲈⲐⲂⲈⲪⲀⲒ ⲀⲚ ⲦⲈⲦⲈⲚⲤⲞⲢⲈⲘ ⲚⲦⲈⲦⲈⲚⲤⲰⲞⲨⲚ ⲀⲚ ⲚϮⲄⲢⲀⲪⲎ ⲞⲨⲆⲈ ϮϪⲞⲘ ⲚⲦⲈⲪϮ
25 ౨౫ చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు.
ⲕ̅ⲉ̅ϨⲞⲦⲀⲚ ⲄⲀⲢ ⲀⲨϢⲀⲚⲦⲰⲞⲨⲚⲞⲨ ϦⲈⲚⲚⲎ ⲈⲐⲘⲰⲞⲨⲦ ⲞⲨⲆⲈ ⲘⲠⲀⲨϬⲒ ⲞⲨⲆⲈ ⲘⲠⲀⲨϬ ⲒⲦⲞⲨ ⲀⲖⲖⲀ ⲀⲨⲘⲪⲢⲎϮ ⲚⲚⲒⲀⲄⲄⲈⲖⲞⲤ ϦⲈⲚⲚⲒⲪⲎⲞⲨⲒ.
26 ౨౬ ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే, మోషే తాను రాసిన గ్రంథంలో ‘పొదను గురించిన భాగం’ రాసినప్పుడు దేవుడతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు.
ⲕ̅ⲋ̅ⲈⲐⲂⲈ ⲚⲎ ⲈⲐⲘⲰⲞⲨⲦ ⲆⲈ ϪⲈ ⲤⲈⲚⲀⲦⲰⲞⲨⲚⲞⲨ ⲘⲠⲈⲦⲈⲚⲰϢ ϨⲒ ⲠϪⲰⲘ ⲘⲘⲰⲨⲤⲎⲤ ⲠⲰⲤ ⲀϤϪⲞⲤ ⲚⲀϤ ϨⲒϪⲈⲚ ⲠⲒⲂⲀⲦⲞⲤ ⲈϤϪⲰ ⲘⲘⲞⲤ ϪⲈ ⲀⲚⲞⲔ ⲠⲈ ⲪⲚⲞⲨϮ ⲚⲀⲂⲢⲀⲀⲘ ⲚⲈⲘ ⲪⲚⲞⲨϮ ⲚⲒⲤⲀⲀⲔ ⲚⲈⲘ ⲪⲚⲞⲨϮ ⲚⲒⲀⲔⲰⲂ.
27 ౨౭ తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు” అన్నాడు.
ⲕ̅ⲍ̅ⲪⲚⲞⲨϮ ⲪⲀ ⲚⲎ ⲈⲐⲘⲰⲞⲨⲦ ⲀⲚ ⲠⲈ ⲀⲖⲖⲀ ⲪⲀ ⲚⲎ ⲈⲦⲞⲚϦ ⲦⲈⲦⲈⲚⲤⲞⲢⲈⲘ ⲈⲘⲀϢⲰ.
28 ౨౮ ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని ఆయనను అడిగాడు.
ⲕ̅ⲏ̅ⲞⲨⲞϨ ⲀϤⲒ ϨⲀⲢⲞϤ ⲚϪⲈⲞⲨⲀⲒ ⲚⲚⲒⲤⲀϦ ⲈⲦⲀϤⲤⲰⲦⲈⲘ ⲈⲢⲰⲞⲨ ⲈⲨⲔⲰϮ ⲈϤⲈⲘⲒ ϪⲈ ⲔⲀⲖⲰⲤ ⲀϤⲈⲢⲞⲨⲰ ⲚⲰⲞⲨ ⲀϤϢⲈⲚϤ ϪⲈ ⲀϢ ⲦⲈ ϮⲈⲚⲦⲞⲖⲎ ⲈⲦⲞⲒ ⲚϢⲞⲢⲠ ⲈⲢⲰⲞⲨ ⲦⲎⲢⲞⲨ.
29 ౨౯ అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే.
ⲕ̅ⲑ̅ⲀϤⲈⲢⲞⲨⲰ ⲚϪⲈⲒⲎⲤⲞⲨⲤ ϪⲈ ϮϢⲞⲢⲠ ⲦⲈ ⲐⲀⲒ ⲤⲰⲦⲈⲘ ⲠⲒⲤⲖ ⲠϬⲞⲒⲤ ⲠⲈⲔⲚⲞⲨϮ ⲠϬⲞⲒⲤ ⲞⲨⲀⲒ ⲠⲈ.
30 ౩౦ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ.
ⲗ̅ⲞⲨⲞϨ ⲈⲔⲈⲘⲈⲚⲢⲈ ⲠϬⲞⲒⲤ ⲠⲈⲔⲚⲞⲨϮ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲈⲔϨⲎⲦ ⲦⲎⲢϤ ⲚⲈⲘ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲦⲈⲔⲮⲨⲬⲎ ⲦⲎⲢⲤ ⲚⲈⲘ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲚⲈⲔⲘⲈⲨⲒ ⲦⲎⲢⲞⲨ ⲚⲈⲘ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲦⲈⲔϪⲞⲘ ⲦⲎⲢⲤ.
31 ౩౧ రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు.
ⲗ̅ⲁ̅ϮⲘⲀϨⲤⲚⲞⲨϮ ⲦⲈ ⲐⲀⲒ ⲈⲔⲈⲘⲈⲚⲢⲈ ⲠⲈⲔϢⲪⲎⲢ ⲘⲠⲈⲔⲢⲎϮ ⲘⲘⲞⲚ ⲔⲈⲈⲚⲦⲞⲖⲎ ⲈⲤⲞⲒ ⲚⲚⲒϢϮ ⲈⲚⲀⲒ.
32 ౩౨ ఆ ధర్మశాస్త్ర పండితుడు, “అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే.
ⲗ̅ⲃ̅ⲠⲈϪⲀϤ ⲚⲀϤ ⲚϪⲈⲠⲒⲤⲀϦ ϪⲈ ⲔⲀⲖⲰⲤ ⲠⲒⲢⲈϤϮⲤⲂⲰ ϦⲈⲚⲞⲨⲘⲈⲐⲘⲎⲒ ⲀⲔϪⲞⲤ ϪⲈ ⲞⲨⲀⲒ ⲠⲈ ⲪⲚⲞⲨϮ ⲞⲨⲞϨ ⲘⲘⲞⲚ ⲔⲈⲞⲨⲀⲒ ⲈⲂⲎⲖ ⲈⲢⲞϤ.
33 ౩౩ పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు.
ⲗ̅ⲅ̅ⲞⲨⲞϨ ⲠⲒⲘⲈⲚⲢⲒⲦϤ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲈⲔϨⲎ ⲦⲦⲎⲢϤ ⲚⲈⲘ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲦⲈⲔϪⲞⲘ ⲦⲎⲢⲤ ⲚⲈⲘ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲒⲔⲀϮ ⲦⲎⲢϤ ⲞⲨⲞϨ ⲠⲒⲘⲈⲚⲢⲈ ⲠⲈⲔϢⲪⲎⲢ ⲘⲠⲈⲔⲢⲎϮ ⲤⲈⲞⲒ ⲚⲚⲒϢϮ ⲈⲚⲒϬⲖⲒⲖ ⲦⲎⲢⲞⲨ ⲚⲈⲘ ⲚⲒϢⲞⲨϢⲰⲞⲨϢⲒ.
34 ౩౪ అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది.
ⲗ̅ⲇ̅ⲞⲨⲞϨ ⲈⲦⲀϤⲚⲀⲨ ⲈⲢⲞϤ ⲚϪⲈⲒⲎⲤⲞⲨⲤ ϪⲈ ⲀϤⲈⲢⲞⲨⲰ ⲈⲞⲨⲞⲚ ϨⲎⲦ ⲘⲘⲞϤ ⲠⲈϪⲀϤ ⲚⲀϤ ϪⲈ ⲬⲞⲨⲎⲞⲨ ⲀⲚ ⲈⲂⲞⲖ ϨⲀ ϮⲘⲈⲦⲞⲨⲢⲞ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲞⲨⲞϨ ⲘⲠⲈ ϨⲖⲒ ϢⲈⲢⲦⲞⲖⲘⲀⲚ ⲈϢⲈⲚϤ.
35 ౩౫ యేసు దేవాలయంలో ఉపదేశం చేస్తూ, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు?
ⲗ̅ⲉ̅ⲞⲨⲞϨ ⲈⲦⲀϤⲈⲢⲞⲨⲰ ⲚϪⲈⲒⲎⲤⲞⲨⲤ ⲚⲀϤϪⲰ ⲘⲘⲞⲤ ⲈϤϮⲤⲂⲰ ϦⲈⲚⲠⲒⲈⲢⲪⲈⲒ ⲠⲰⲤ ⲤⲈϪⲰ ⲘⲘⲞⲤ ⲚϪⲈⲚⲒⲤⲀϦ ϪⲈ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲠϢⲎⲢⲒ ⲚⲆⲀⲨⲒⲆ ⲠⲈ.
36 ౩౬ దావీదు, తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు, నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకూ నా కుడి పక్కన కూర్చో’ అన్నాడు.
ⲗ̅ⲋ̅ⲚⲐⲞϤ ⲆⲀⲨⲒⲆ ⲀϤϪⲞⲤ ϦⲈⲚⲠⲒⲠⲚⲈⲨⲘⲀⲈⲐⲞⲨⲀⲂ ϪⲈ ⲠⲈϪⲈ ⲠϬⲞⲒⲤ ⲘⲠⲀϬⲞⲒⲤ ϪⲈ ϨⲈⲘⲤⲒ ⲤⲀⲦⲀⲞⲨⲒⲚⲀⲘ ϢⲀϮⲬⲀ ⲚⲈⲔϪⲀϪⲒ ⲤⲀⲠⲈⲤⲎⲦ ⲚⲚⲈⲔϬⲀⲖⲀⲨϪ.
37 ౩౭ దావీదు స్వయంగా ఆయనను ‘ప్రభువు’ అని పిలిచాడు కదా! అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు?” అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు.
ⲗ̅ⲍ̅ⲚⲐⲞϤ ⲆⲀⲨⲒⲆ ⲈϤϪⲰ ⲘⲘⲞⲤ ⲈⲢⲞϤ ϪⲈ ⲠϬⲞⲒⲤ ⲞⲨⲞϨ ⲈⲂⲞⲖ ⲐⲰⲚ ⲠⲈϤϢⲎⲢⲒ ⲠⲈ ⲞⲨⲞϨ ⲠⲒⲘⲎϢ ⲈⲦⲞϢ ⲚⲀϤⲤⲰⲦⲈⲘ ⲈⲢⲞϤ ϨⲎⲆⲈⲰⲤ
38 ౩౮ ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, “ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి, సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ,
ⲗ̅ⲏ̅ⲞⲨⲞϨ ϦⲈⲚⲦⲈϤⲤⲂⲰ ⲚⲀϤϪⲰ ⲘⲘⲞⲤ ϪⲈ ⲀⲚⲀⲨ ⲈⲂⲞⲖ ϨⲀ ⲚⲒⲤⲀϦ ⲚⲈⲘ ⲚⲎ ⲈⲐⲞⲨⲰϢ ⲈⲘⲞϢⲒ ϦⲈⲚϨⲀⲚⲤⲦⲞⲖⲎ ⲚⲈⲘ ϨⲀⲚⲀⲤⲠⲀⲤⲘⲞⲤ ϦⲈⲚⲚⲒⲀⲄⲞⲢⲀ
39 ౩౯ సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను కోరుకుంటారు.
ⲗ̅ⲑ̅ⲚⲈⲘ ϨⲀⲚϢⲞⲢⲠ ⲘⲘⲀⲚϨⲈⲘⲤⲒ ϦⲈⲚⲚⲒⲔⲀⲐⲈⲆⲢⲀ ϦⲈⲚⲚⲒⲤⲨⲚⲀⲄⲰⲄⲎ ⲚⲈⲘ ϨⲀⲚϢⲞⲢⲠ ⲚⲢⲰⲦⲈⲂ ϦⲈⲚⲚⲒⲆⲒⲠⲚⲞⲚ
40 ౪౦ వారు విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”
ⲙ̅ⲚⲎ ⲈⲐⲞⲨⲰⲘ ⲚⲚⲒⲎⲒ ⲚⲦⲈⲚⲒⲬⲎⲢⲀ ⲞⲨⲞϨ ϦⲈⲚⲞⲨⲖⲰⲒϪⲒ ⲈⲤⲞⲨⲎⲞⲨ ⲤⲈⲈⲢⲠⲢⲞⲤⲈⲨⲬ ⲈⲤⲐⲈ ⲚⲀⲒ ⲈⲐⲚⲀϬⲒ ⲚⲞⲨϨⲞⲨⲞ ϨⲀⲠ.
41 ౪౧ యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు.
ⲙ̅ⲁ̅ⲞⲨⲞϨ ⲈⲦⲀϤϨⲈⲘⲤⲒ ⲘⲠⲈⲘⲐⲞ ⲘⲠⲒⲄⲀⲌⲞⲪⲨⲖⲀⲔⲒⲞⲚ ⲚⲀϤⲚⲀⲨ ϪⲈ ⲠⲰⲤ ⲚⲒⲘⲎϢ ϨⲒ ϨⲞⲘⲦ ⲈⲠⲒⲄⲀⲌⲞⲪⲨⲖⲀⲔⲒⲞⲚ ⲞⲨⲞϨ ⲞⲨⲘⲎϢ ⲚⲢⲀⲘⲀⲞ ⲚⲀⲨϨⲒⲞⲨⲒ ⲚϨⲀⲚⲘⲎϢ.
42 ౪౨ అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది.
ⲙ̅ⲃ̅ⲈⲦⲀⲤⲒ ⲆⲈ ⲚϪⲈⲞⲨⲬⲎⲢⲀ ⲚϨⲎⲔⲒ ⲀⲤϨⲒⲞⲨⲒ ⲚⲦⲈⲂⲒ ⲤⲚⲞⲨϮ ⲈⲦⲈ ⲞⲨⲔⲞⲚⲆⲢⲀⲚⲦⲎⲤ ⲠⲈ
43 ౪౩ ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది.
ⲙ̅ⲅ̅ⲞⲨⲞϨ ⲈⲦⲀϤⲘⲞⲨϮ ⲈⲚⲈϤⲘⲀⲐⲎⲦⲎⲤ ⲠⲈϪⲀϤ ⲚⲰⲞⲨ ϪⲈ ⲀⲘⲎⲚ ϮϪⲰ ⲘⲘⲞⲤ ⲚⲰⲦⲈⲚ ϪⲈ ⲦⲀⲒⲬⲎⲢⲀ ⲚϨⲎⲔⲒ ⲀⲤϨⲒⲞⲨⲒ ⲈϨⲞⲦⲈ ⲚⲀⲒ ⲦⲎⲢⲞⲨ ⲈⲦϨⲒⲞⲨⲒ ⲈⲠⲒⲄⲀⲌⲞⲪⲨⲖⲀⲔⲒⲞⲚ.
44 ౪౪ మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.
ⲙ̅ⲇ̅ⲞⲨⲞⲚ ⲄⲀⲢ ⲚⲒⲂⲈⲚ ⲈⲦⲀⲨϨⲒⲞⲨⲒ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲈⲦⲈⲢϨⲞⲨⲞ ⲈⲢⲰⲞⲨ ⲐⲀⲒ ⲆⲈ ⲚⲐⲞⲤ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲈⲦⲈⲤⲈⲢϦⲀⲈ ⲘⲘⲞϤ ϨⲰⲂ ⲚⲒⲂⲈⲚ ⲈⲦⲈⲚⲦⲀⲤ ⲀⲤϨⲒⲦⲞⲨ ⲠⲈⲤⲰⲚϦ ⲦⲎⲢϤ.

< మార్కు 12 >