< లూకా 12 >

1 అంతలో వేలకొద్దీ ప్రజలు పోగయి ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన మొదట తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు. “పరిసయ్యుల పులిసిన పిండిని గురించి అంటే వారి వేషధారణ విషయం జాగ్రత్త పడండి.
Med tem ko se je bilo zbralo na tisoče ljudstva, tako, da so eden po drugem gazili, začne govoriti učencem svojim: Najprej se varujte kvasú Farizejskega, kteri je hinavstvo.
2 కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు. రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు.
Nič pa ni skritega, kar se ne bo odkrilo; in skrivnega, kar se ne bo zvedelo.
3 అందుకని మీరు చీకటిలో మాట్లాడేవి వెలుగులో వినబడతాయి. గదుల్లో చెప్పుకునేవి ఇంటి కప్పుల పైన చాటిస్తారు.
Za to se bo to, kar ste pravili v temi, slišalo na svetlem; in kar ste na uho šepetali v kletih, oznanjevalo se bo na strehah.
4 నా స్నేహితులైన మీకు నేను చెప్పేదేమిటంటే దేహాన్ని చంపడం మినహా మరేమీ చేయలేని వాడికి భయపడవద్దు.
Pravim pa vam prijateljem svojim: Ne bojte se jih, kteri ubijajo telo, a po tem ne morejo nič več storiti.
5 ఎవరికి మీరు భయపడాలో చెబుతాను. చంపిన తరువాత నరకంలో పడవేసే శక్తి గల వాడికి భయపడండి. ఆయనకే భయపడమని మీకు చెబుతున్నాను. (Geenna g1067)
Pokazal pa vam bom, koga se bojte: bojte se tistega, kteri ima oblast, po tem ko je ubil, zagnati v pekel. Dà, pravim vam, tega se bojte. (Geenna g1067)
6 ఐదు పిచ్చుకలను రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు.
Ne prodaja li se pet vrabcev za dva solda! in ne eden od njih ni pozabljen pred Bogom.
7 మీ తలవెంట్రుకలన్నిటికీ లెక్క ఉంది. భయపడకండి. మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారు కదా.
A vam so tudi lasje na glavi vsi razšteti. Ne bojte se torej; vi ste bolji od mnogo vrabcev.
8 ఇంకా మీతో చెప్పేదేమిటంటే, నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు.
Pravim vam pa: Vsak kdor bo spoznal mene pred ljudmí, spoznal bo tudi sin človečji njega pred angelji Božjimi;
9 మనుషుల ముందు నేనెవరో తెలియదు అనే వారి గురించి నేను కూడా దేవుని దూతల ముందు వారెవరో నాకు తెలియదు అని చెబుతాను.
Kdor bo pa zatajil mene pred ljudmí, zatajil se bo pred angelji Božjimi.
10 ౧౦ మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా ఏదన్నా మాట అనే వాడికి పాపక్షమాపణ కలుగుతుంది గానీ పరిశుద్ధాత్మను దూషిస్తే వాడికి క్షమాపణ లేదు.
In vsak, kdor reče besedo zoper sina človečjega, odpustila mu se bo; a kdor se zarotí zoper Duha svetega, ne bo mu se odpustilo.
11 ౧౧ వారు సమాజమందిరాల్లో పెద్దల దగ్గరకూ అధిపతుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ మిమ్మల్ని తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా జవాబివ్వాలా, ఏం మాట్లాడాలా అని చింత పడవద్దు.
Kedar vas pa popeljejo v shajališča in h gosposki in pred oblasti, ne skrbite, kako ali kaj bi odgovorili, ali kaj bi povedali:
12 ౧౨ మీరు ఏం చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు.”
Kajti naučil vas bo Duh sveti tisti čas, kaj je treba reči.
13 ౧౩ ఆ జనసమూహంలో ఒకడు, “ఉపదేశకా, వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నాకు భాగం పంచమని మా అన్నయ్యతో చెప్పండి” అన్నాడు.
Reče pa mu nekdo izmed ljudstva: Učenik, reci bratu mojemu, naj razdeli z menoj dedovino.
14 ౧౪ అందుకు ఆయన, “ఏమయ్యా, మీ మీద పెద్దమనిషిగా మధ్యవర్తిగానో నన్నెవరు నియమించారు?” అన్నాడు.
On mu pa reče: Človek, kdo me je postavil za sodnika ali delilca med vama?
15 ౧౫ ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”
In reče jim: Glejte in varujte se lakomnosti; kajti nikdor ne živí ob obilnosti imenja svojega.
16 ౧౬ తరువాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. “ఒక ధనవంతుడి భూమి బాగా దిగుబడి ఇచ్చింది.
Pové jim pa priliko, govoreč: Nekemu človeku bogatemu obrodila je njiva;
17 ౧౭ అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు, ‘నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను.
In premišljeval je v sebi, govoreč: Kaj bom storil, ko nimam kam spraviti letine svoje?
18 ౧౮ నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ నిల్వ చేస్తాను.
Pa reče: To bom storil: podrl bom žitnice svoje, in naredil bom veče, in spravil bom tu vse pridelke svoje in blago svoje.
19 ౧౯ అప్పుడు నా ప్రాణంతో ‘ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు’ అని చెబుతాను’ అనుకున్నాడు.
Ter porečem duši svojej: Duša! veliko blaga imaš na veliko let; počivaj, jej, pij, veseli se.
20 ౨౦ అయితే దేవుడు అతడితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?’ అని అతనితో అన్నాడు.
Reče pa mu Bog: Neumnež! to noč bom tirjal dušo tvojo od tebe; a kar si pripravil, čegavo bo?
21 ౨౧ దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు” అన్నాడు.
Tako, kdor sebi zaklade nabira, pa se ne bogati v Bogu.
22 ౨౨ తరువాత యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు.
Reče pa učencem svojim: Za to vam pravim, da ne skrbite za življenje svoje, kaj boste jedli; tudi za telo svoje ne, kaj boste oblekli.
23 ౨౩ ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా?
Življenje je več kakor hrana, in telo več kakor obleka.
24 ౨౪ కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు.
Poglejte krokarje, da ne sejejo, in ne žanjejo; kteri nimajo kleti ne žitnice, in Bog jih živí: koliko bolji ste vi od tic?
25 ౨౫ పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు?
Kdo od vas pa skrbeč more postavi svojej primakniti en komolec?
26 ౨౬ కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి.
Če torej tudi najmanjega ne morete, čemu skrbite za drugo?
27 ౨౭ అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.
Poglejte lilije, kako rastejo; ne trudijo se in ne predejo; pravim vam pa: Tudi Solomon v vsej slavi svojej se ni oblekel, kakor teh ena.
28 ౨౮ అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా.
Če pa travo na polji, ktera danes stojí, a jutri se meče v peč, Bog tako oblači, koliko bolj vas, maloverni?
29 ౨౯ ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి.
Tudi vi ne iščite, kaj boste jedli, ali kaj boste pili; in ne skrbite.
30 ౩౦ లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు.
Kajti vsega tega iščejo pogani: a oče vaš vé, da tega potrebujete.
31 ౩౧ మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.
Nego iščite kraljestva Božjega, in vse to vam se bo pridalo.
32 ౩౨ చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం.
Ne boj se, mala čreda! kajti volja je očeta vašega dati vam kraljestvo.
33 ౩౩ మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు.
Prodajte imenje svoje, in dajte miloščino. Napravite si mošnje, ktere ne ostaré, zaklad na nebesih, kteri ne izgine, kjer se tat ne približuje, in tudi molj ne razjeda.
34 ౩౪ మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.
Kajti kjer je zaklad vaš, tam bo tudi srce vaše.
35 ౩౫ “మీ నడుము బిగించుకుని ఉండండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి.
Bodi vam ledje opasano, in sveče prižgane;
36 ౩౬ యజమాని ఎప్పుడు వస్తాడో అని అతని కోసం ఎదురు చూస్తూ అతడు పెండ్లి విందు నుండి వచ్చి తలుపు కొట్టగానే తలుపు తీసే సేవకుల్లా ఉండండి.
In vi podobni ljudém, kteri pričakujejo gospodarja svojega, kedaj se bo vrnil z ženitnine, da mu, kedar pride in potrka, precej odpró.
37 ౩౭ యజమాని వచ్చి ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ దాసులు ధన్యులు. అప్పుడు అతడు తన నడుం కట్టుకుని వారిని భోజనానికి కూర్చోబెట్టి, వారికి తానే పరిచర్య చేస్తాడని మీకు కచ్చితంగా చెబుతున్నాను.
Blagor tistim hlapcem, ktere bo našel gospodar, kedar pride, da čujejo. Resnično vam pravim, da se bo opasal in jih bo posadil, ter bo pristopil in jim bo stregel.
38 ౩౮ అతడు రాత్రి రెండవ జాములో వచ్చినా, మూడవ జాములో వచ్చినా ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులు ధన్యులు.
In če pride o drugej straži, ali če o tretjej straži pride in bo našel tako, blagor tistim hlapcem.
39 ౩౯ దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనివ్వడని తెలుసుకోండి.
Vedite pa to, da ko bi vedel gospodar, o kterej straži bo prišel tat, čul bi, in ne bi dal podkopati hiše svoje.
40 ౪౦ మీరు ఊహించని సమయంలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి” అని వారికి చెప్పాడు.
Za to bodite tudi vi pripravljeni; kajti sin človečji bo prišel ob uri, ko se vam ne bo dozdevalo.
41 ౪౧ అప్పుడు పేతురు, “ప్రభూ ఈ ఉపమానం మా కోసమే చెబుతున్నావా లేక అందరి కోసం చెబుతున్నావా?” అని ఆయనను అడిగాడు.
Reče pa mu Peter: Gospod, praviš li to priliko nam, ali vsem?
42 ౪౨ దానికి ప్రభువు ఇలా అన్నాడు, “సరైన సమయంలో అందరికీ ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటిపై నియమించే నమ్మకమైన, బుద్ధిగల నిర్వాహకుడెవడు?
Gospod pa reče: Kdo je torej zvesti in modri pristavnik, kterega je postavil gospodar nad družino svojo, naj jim daje hrano o svojem času?
43 ౪౩ యజమాని వచ్చి ఏ పనివాడు ఆ విధంగా చేయడం చూస్తాడో ఆ పనివాడు ధన్యుడు.
Blagor tistemu hlapcu, kterega bo našel gospodar, kedar pride, da tako dela.
44 ౪౪ అప్పుడు ఆ యజమాని తన ఆస్తి అంతటి మీదా అతణ్ణి ఉంచుతాడని మీకు చెబుతున్నాను.
Resnično vam pravim, da ga bo postavil nad vsem imenjem svojim.
45 ౪౫ అయితే ఆ పనివాడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకుని తోటి దాసదాసీలను కొట్టడం, తిని తాగి మత్తెక్కి ఉండడం చేస్తే
Če pa reče ta hlapec v srcu svojem: Gospodarja mojega še ne bo! in začne pretepati hlapce in dekle, ter jesti in piti in pijančevati:
46 ౪౬ వాడు ఎదురు చూడని రోజున తెలియని సమయంలో యజమాని వస్తాడు. వాణ్ణి కఠినంగా శిక్షించి నమ్మదగని వారి గతే వాడికి పట్టేలా చేస్తాడు.
Prišel bo gospodar tega hlapca o dnevu, ko ne pričakuje, in ob uri, ktere ne vé: in presekal ga bo, in del njegov bo položil z neverniki.
47 ౪౭ తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధపడకుండా, ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా ఉండే సేవకుడికి చాలా దెబ్బలు తగులుతాయి.
Tisti pa hlapec, kteri je voljo gospodarja svojega vedel, pa se ni pripravil in tudi ni storil po volji njegovej, tepen bo zeló;
48 ౪౮ దెబ్బలకు తగిన పనులు చేసినా తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయి. ఎవరికి ఎక్కువగా ఇచ్చారో అతని దగ్గర ఎక్కువగా తీసుకుంటారు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగిస్తారో వారి దగ్గరే ఎక్కువగా అడుగుతారు.
A tisti, kteri ni vedel, pa je storil, kar je kazni vredno, tepen bo malo. Vsakemu pa, komur se je mnogo dalo, tirjalo se bo od njega mnogo; in komor so izročili mnogo, tirjali bodo od njega več.
49 ౪౯ “నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను.
Prišel sem, da vržem ogenj na zemljo, in kaj hočem, če se je uže užgal?
50 ౫౦ అయితే నేను పొందాల్సిన బాప్తిసం ఉంది. అది జరిగే వరకూ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను.
Ali s krstom se imam krstiti, in kako britko mi je, dokler se ne dopolni!
51 ౫౧ నేను భూమి మీద శాంతిని స్థాపించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. నేను చీలికలు కలగజేయడానికే వచ్చానని మీకు చెబుతున్నాను.
Menite li, da sem prišel, da dam na zemljo mir? Ne! pravim vam, nego razpor.
52 ౫౨ ఇక నుండి ఒక ఇంట్లో ఉండే ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురూ, ముగ్గురికి విరోధంగా ఇద్దరూ ఉంటారు.
Kajti odslej jih bo pet v enej hiši razprtih, trije z dvema, in dva s tremi.
53 ౫౩ తండ్రి కొడుక్కీ, కొడుకు తండ్రికీ, తల్లి కూతురుకీ, కూతురు తల్లికీ, అత్త కోడలికీ, కోడలు అత్తకూ విరోధులుగా ఉంటారు” అని చెప్పాడు.
Oče se bo razprl s sinom, in sin z očetom; mati s hčerjo, in hčer z materjo; tašča s sneho svojo, in sneha s taščo svojo.
54 ౫౪ తరవాత ఆయన జనసమూహాలతో ఇలా అన్నాడు, “మీరు పడమర నుండి మబ్బు పైకి రావడం చూసేటప్పుడు వాన వస్తుందని వెంటనే చెప్పేస్తారు. అలాగే జరుగుతుంది.
Pravil je pa tudi ljudstvu: Kedar vidite oblak, da vzhaja od zahoda, precej pravite: Dež bo! in zgodí se tako.
55 ౫౫ దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు. అలాగే జరుగుతుంది.
In kedar jug, da vleče, pravite: Vroče bo! in zgodí se.
56 ౫౬ కపట భక్తులారా, మీరు భూమి, ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు.
Hinavci! lice zemlje in neba véste razločevati: tega časa pa kako ne razločujete?
57 ౫౭ ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు ఆలోచించరు?
Za kaj pa tudi sami od sebe ne sodite, kar je prav?
58 ౫౮ మీపై నేరారోపణ చేసే వాడితో కలసి న్యాయాధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలోనే అతనితో రాజీపడే ప్రయత్నం చెయ్యి. లేకుంటే అతడు నిన్ను న్యాయాధిపతి దగ్గరికి లాక్కుపోతాడు. ఆ న్యాయాధిపతి నిన్ను భటుడికి అప్పగిస్తాడు. ఆ భటుడు నిన్ను జైల్లో పెడతాడు.
Kedar greš pa z zopernikom svojim k poglavarju, potrudi se po poti, da se ga rešiš: da te ne privleče k sodniku, in sodnik da te ne izročí beriču, in berič da te ne vrže v ječo.
59 ౫౯ చివరి పైసా చెల్లించేంత వరకూ నువ్వు బయటకు రానే రావని నీకు చెబుతున్నాను.” అన్నాడు.
Pravim ti: Ne boš izšel odtod, dokler ne plačaš tudi zadnjega solda.

< లూకా 12 >