< యోనా 3 >

1 యెహోవా వాక్కు రెండో సారి యోనాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే
Wtedy słowo PANA doszło do Jonasza po raz drugi mówiące:
2 “నువ్వు లేచి, నీనెవె మహాపట్టణానికి వెళ్లి నేను నీకు ఆజ్ఞాపించిన సందేశాన్ని దానికి చాటించు.”
Wstań, idź do Niniwy, tego wielkiego miasta, i głoś przeciwko niej to, co ci rozkazuję.
3 కాబట్టి యోనా లేచి యెహోవా మాటకు లోబడి నీనెవె పట్టణానికి నడచుకుంటూ వెళ్ళాడు. నీనెవె నగరం చాలా పెద్దది. అది మూడు రోజుల ప్రయాణమంత పెద్దది.
Wstał więc Jonasz i poszedł do Niniwy zgodnie ze słowem PANA. A Niniwa była bardzo wielkim miastem, [na] trzy dni drogi.
4 యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు.
Jonasz zaczął chodzić po mieście, ile mógł przejść w jeden dzień, i wołał: Po czterdziestu dniach Niniwa zostanie zburzona.
5 నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు.
I mieszkańcy Niniwy uwierzyli Bogu, ogłosili post i oblekli się w wory, od największego z nich aż do najmniejszego.
6 ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు.
Doszła bowiem [ta] sprawa do króla Niniwy i powstał z tronu, i zdjął z siebie płaszcz, po czym oblekł się w wór i siedział w popiele.
7 అతడు ఇలా ప్రకటన చేయించాడు “రాజూ ఆయన మంత్రులూ ఆజ్ఞాపించేదేమంటే, మనుషులు ఏమీ తినకూడదు. పశువులు మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు.”
Rozkazał ogłosić i opowiadać w Niniwie z dekretu króla i swoich książąt: Ludzie i zwierzęta, woły i owce niech nic nie jedzą, niech się nie pasą i wody nie piją;
8 “మనుషులు, పశువులు గోనెపట్ట కట్టుకుని దేవునికి బిగ్గరగా మొర్రపెట్టాలి. అందరూ తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి తాము చేస్తున్న దౌర్జన్యం మానాలి.
Ale ludzie i zwierzęta niech się okryją worami i niech gorliwie wołają do Boga. Niech każdy się odwróci od swojej złej drogi i od grabieży [popełnianej] swoimi rękami.
9 ఒకవేళ దేవుడు తన మనస్సు మార్చుకుని తన కోపాగ్ని చల్లార్చుకుని మనం నాశనం కాకుండా చేస్తాడేమో ఎవరికి తెలుసు?”
Kto wie, czy Bóg się nie odwróci i nie pożałuje, i nie odstąpi od zapalczywości swego gniewu, abyśmy nie zginęli.
10 ౧౦ నీనెవె వాళ్ళు తమ చెడు ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు.
I Bóg widział ich czyny, że odwrócili się od swojej złej drogi, i Bóg pożałował tego nieszczęścia, które zapowiedział im czynić, a nie uczynił.

< యోనా 3 >