< హబక్కూకు 1 >

1 ప్రవక్త అయిన హబక్కూకు దగ్గరికి దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.
Ennustus, jonka profeetta Habakuk näki.
2 “యెహోవా, నేను సహాయం కోసం మొర్రపెట్టినా నీవెన్నాళ్లు ఆలకించకుండా ఉంటావు? బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినా నువ్వు రక్షించడం లేదు.
Kuinka kauan, Herra, minun täytyy apua huutaa, ja sinä et kuule, parkua sinulle: "Väkivaltaa!" ja sinä et auta?
3 నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు? బాధను నీవెందుకు చూస్తూ ఉండిపోతున్నావు? ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం కనబడుతున్నాయి. జగడం, కలహం రేగుతున్నాయి.
Minkätähden sinä annat minun nähdä vääryyttä ja itse katselet turmiota? Minun edessäni on hävitys ja väkivalta; on syntynyt riita, ja on noussut tora.
4 అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమై పోయింది. న్యాయం జరగకుండా ఆగిపోయింది. భక్తి హీనులు నీతిపరులను చుట్టుముడుతున్నారు. న్యాయం చెడిపోతున్నది.
Sentähden on laki heikko, ja oikeus ei tule milloinkaan voimaan. Sillä jumalaton saartaa vanhurskaan; sentähden oikeus vääristetään.
5 అన్యజనుల్లో జరుగుతున్నది చూడండి, ఆలోచించండి. నిర్ఘాంతపొండి. మీ కాలంలో నేనొక కార్యం చేస్తాను. అలా జరుగుతుందని ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు.
Katsokaa kansojen joukkoon, katselkaa ja kauhistukaa, sillä minä teen teidän päivinänne teon, jota ette uskoisi, jos siitä kerrottaisiin.
6 కల్దీయులను నేను రేపుతున్నాను. వినండి. వారు తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించాలని భూదిగంతాలదాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు.
Sillä katso, minä nostan kaldealaiset, tuiman ja rajun kansan, joka kulkee maata lavealti ja ottaa omaksensa asuinsijat, jotka eivät ole sen.
7 వారు ఘోరమైన భీకర జాతి. వారు ప్రభుత్వ విధులను తమ ఇష్టం వచ్చినట్టు ఏర్పరచుకుంటారు.
Se on hirmuinen ja peljättävä, siitä itsestään tulee sen oikeus ja sen korkeus.
8 వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి. రాత్రిలో తిరుగులాడే తోడేళ్లకంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు. ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు.
Sen hevoset ovat nopeammat kuin pantterit, ne juoksevat kiivaammin kuin sudet illoin. Sen ratsumiehet kiidättävät-kaukaa tulevat sen ratsumiehet, ne lentävät, niinkuin kotka syöksyy syönnökselleen.
9 వెనుదిరిగి చూడకుండా దౌర్జన్యం చేయడానికి వారు వస్తారు. ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెర పట్టుకుంటారు.
Se tulee kaikkinensa väkivallan tekoon, heidän kasvojensa suunta on suoraan eteenpäin; se kokoaa vankeja kuin hietaa.
10 ౧౦ రాజులను అపహాస్యం చేస్తారు. అధిపతులను హేళన చేస్తారు. ప్రాకారాలున్న దుర్గాలన్నిటిని తృణీకరిస్తారు. మట్టి దిబ్బలు వేసి వాటిని పట్టుకుంటారు.
Pilkkanaan pitää se kuninkaat ja naurunansa ruhtinaat. Se nauraa kaikille varustuksille, kasaa kokoon hiekkaa ja valloittaa ne.
11 ౧౧ తమ బలమే తమ దేవుడనుకుంటారు. గాలి కొట్టుకుని పోయేలా వారు కొట్టుకు పోతూ అపరాధులౌతారు.
Sitten se tuulena kiitää ja hyökkää, mutta joutuu syynalaiseksi, tuo, jolla oma voimansa on jumalana.
12 ౧౨ యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా? మేము మరణించము. యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు. ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు.
Etkö sinä ole ikiajoista asti Herra, minun pyhä Jumalani? Me emme kuole! Sinä, Herra, olet pannut sen tuomioksi; sinä, kallio, olet asettanut sen kuritukseksi.
13 ౧౩ నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవు గదా. కపటులను నువ్వు చూసి కూడా, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు?
Sinun silmäsi ovat puhtaat, niin ettet voi katsoa pahaa etkä saata katsella turmiota. Minkätähden sinä katselet uskottomia, olet vaiti, kun jumalaton nielee hurskaampansa,
14 ౧౪ పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు.
teet ihmiset samankaltaisiksi kuin meren kalat, kuin matelevaiset, joilla ei ole hallitsijaa?
15 ౧౫ వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు. ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు. వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు.
Se nostaa heidät kaikki ylös koukulla, vetää heidät pyydyksessään ja kokoaa heidät verkkoonsa. Sentähden se iloitsee ja riemuitsee.
16 ౧౬ కాబట్టి వలల వలన మంచి రాబడి, పుష్టినిచ్చే భోజనం తనకు దొరుకుతున్నాయని వాడు తన వలకు బలులు అర్పిస్తున్నాడు. తన వలలకు సాంబ్రాణి వేస్తున్నాడు.
Sentähden se uhraa pyydykselleen ja polttaa uhreja verkollensa, sillä niitten turvin sen osa on rasvainen, sen ruoka lihava.
17 ౧౭ వాడు అస్తమానం తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జాతులను దయలేకుండా హతం చేస్తూ ఉండాలా?”
Saako se sentähden tyhjentää pyydyksensä, aina surmata kansoja säälimättä?

< హబక్కూకు 1 >