< ఎజ్రా 2 >

1 నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు. 2 వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది. 3 పరోషు వంశం వారు 2, 172 మంది. 4 షెఫట్య వంశం వారు 372 మంది. 5 ఆరహు వంశం వారు 775 మంది. 6 పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2, 812 మంది. 7 ఏలాము వంశం వారు 1, 254 మంది. 8 జత్తూ వంశం వారు 945 మంది. 9 జక్కయి వంశం వారు 760 మంది. 10 ౧౦ బానీ వంశం వారు 642 మంది. 11 ౧౧ బేబై వంశం వారు 643 మంది. 12 ౧౨ అజ్గాదు వంశం వారు 1, 222 మంది. 13 ౧౩ అదొనీకాము వంశం వారు 666 మంది. 14 ౧౪ బిగ్వయి వంశం వారు 2,056 మంది. 15 ౧౫ ఆదీను వంశం వారు 454 మంది. 16 ౧౬ అటేరు వంశం వారు హిజ్కియాతో కలిపి 98 మంది. 17 ౧౭ బెజయి వంశం వారు 323 మంది. 18 ౧౮ యోరా వంశం వారు 112 మంది. 19 ౧౯ హాషుము వంశం వారు 223 మంది, 20 ౨౦ గిబ్బారు వంశం వారు 95 మంది. 21 ౨౧ బేత్లెహేము వంశం వారు 123 మంది. 22 ౨౨ నెటోపా వంశం వారు 56 మంది. 23 ౨౩ అనాతోతు వంశం వారు 128 మంది. 24 ౨౪ అజ్మావెతు వంశం వారు 42 మంది, 25 ౨౫ కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది. 26 ౨౬ రమా గెబ వంశం వారు 621 మంది. 27 ౨౭ మిక్మషు వంశం వారు 123 మంది. 28 ౨౮ బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది. 29 ౨౯ నెబో వంశం వారు 52 మంది. 30 ౩౦ మగ్బీషు వంశం వారు 156 మంది. 31 ౩౧ వేరొక ఏలాము వంశం వారు 1, 254 మంది. 32 ౩౨ హారీము వంశం వారు 320 మంది. 33 ౩౩ లోదు, హదీదు, ఓనో గ్రామాల వారు 725 మంది. 34 ౩౪ యెరికో వంశం వారు 345 మంది. 35 ౩౫ సెనాయా వంశం వారు 3, 630 మంది. 36 ౩౬ యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది. 37 ౩౭ ఇమ్మేరు వంశం వారు 1,052 మంది. 38 ౩౮ పషూరు వంశం వారు 1, 247 మంది. 39 ౩౯ హారీము వంశం వారు 1,017 మంది. 40 ౪౦ లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది. 41 ౪౧ గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది. 42 ౪౨ ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వంశం వారు 139 మంది. 43 ౪౩ నెతీనీయులకు చెందిన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు. 44 ౪౪ కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు. 45 ౪౫ లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు. 46 ౪౬ హాగాబు, షల్మయి, హానాను వంశాల వారు. 47 ౪౭ గిద్దేలు, గహరు, రెవాయా వంశాల వారు. 48 ౪౮ రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు. 49 ౪౯ ఉజ్జా, పాసెయ, బేసాయి వంశాల వారు. 50 ౫౦ అస్నా, మెహూనీము, నెపూసీము వంశాల వారు. 51 ౫౧ బక్బూకు, హకూపా, హర్హూరు వంశం వారు. 52 ౫౨ బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు. 53 ౫౩ బర్కోసు, సీసెరా, తెమహు వంశాల వారు. 54 ౫౪ నెజీయహు, హటీపా వంశాల వారు. 55 ౫౫ సొలొమోను సేవకుల వారసులు, సొటయి, సోపెరెతు, పెరూదా వంశాల వారు. 56 ౫౬ యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు. 57 ౫౭ షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు. 58 ౫౮ నెతీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది, 59 ౫౯ ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు. 60 ౬౦ వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది, 61 ౬౧ ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు. 62 ౬౨ వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు. 63 ౬౩ ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు. 64 ౬౪ సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు. 65 ౬౫ వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు. 66 ౬౬ వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245, 67 ౬౭ ఒంటెలు 435, గాడిదలు 6, 720 ఉన్నాయి. 68 ౬౮ గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు. 69 ౬౯ ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు. 70 ౭౦ యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు.

< ఎజ్రా 2 >