< అపొస్తలుల కార్యములు 24 >

1 ఐదు రోజుల తరువాత ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాది కైసరయ వచ్చి, పౌలు మీద మోపిన ఫిర్యాదును గవర్నరుకి తెలియజేశారు.
Po pěti pak dnech sstoupil nejvyšší kněz Ananiáš s staršími a s nějakým Tertullem řečníkem. Kteříž postavili se před vládařem proti Pavlovi.
2 పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరం మోపుతూ ఇలా అన్నాడు.
A když povolán byl, počal žalovati Tertullus, řka:
3 “మహా ఘనత వహించిన ఫేలిక్స్, పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు ఎంతో నెమ్మది అనుభవిస్తున్నామనీ, ఈ దేశ ప్రజలకు కలిగే అనేక సమస్యలు మీ ద్వారా పరిష్కారం అవుతున్నాయనీ ఒప్పుకొంటున్నాము. ఆ కారణంగా మేము అన్ని విధాలా, అన్ని చోట్లా మీ పట్ల పూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాం.
Kterak mnohý pokoj způsoben jest nám skrze tebe, a mnohé věci v tomto národu výborně se dějí skrze tvou opatrnost, to my i všelijak i všudy se vším děkováním vyznáváme, výborný Felix.
4 నేను మీకు ఎక్కువ విసుగు పుట్టించకుండా క్లుప్తంగా చెప్పే విషయాలను మీరు సహనంతో వినాలని వేడుకొంటున్నాను.
Ale abych tě déle nezaměstknával, prosím, vyslyšiž nás maličko podlé obyčeje přívětivosti své.
5 ఈ వ్యక్తి ఒక చీడలాంటి వాడు. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడని మేము గమనించాం.
Nalezli jsme zajisté muže tohoto nešlechetného, a vzbuzujícího různice mezi všemi Židy po všem světě, a vůdci té sekty Nazaretské.
6 పైగా ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు. అందువలన మేము అతణ్ణి నిర్బంధించాం
Kterýž také i o to se pokoušel, aby chrámu poškvrnil; a kteréhož javše, vedlé zákona svého chtěli jsme souditi.
7 అయితే మీ సైనికాధికారి లూసియస్ వచ్చి బలవంతంగా పౌలును మా చేతుల్లోనుంచి విడిపించి తీసుకుపోయాడు.
Ale přišed hejtman Lyziáš s mocí velikou, vzal ho z rukou našich,
8 వీటిని గురించి మీరు పౌలును ప్రశ్నిస్తే మేము ఇతని మీద మోపుతున్న నేరాలన్నీ వాస్తవమని మీకే అర్థం అవుతుంది.”
Rozkázav, aby žalobníci jeho šli k tobě. Od něhož ty sám budeš moci, vyptaje se, zvěděti o tom o všem, z čeho my jej viníme.
9 యూదులంతా ఏకీభవించి ఈ మాటలు నిజమే అని చెప్పారు.
A k tomu se přimluvili i Židé, pravíce, že to tak jest.
10 ౧౦ అప్పుడు గవర్నర్, పౌలును మాట్లాడమని సైగ చేశాడు. పౌలు ఇలా అన్నాడు, “మీరు అనేక సంవత్సరాలుగా ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలిసి నేను ధైర్యంగా జవాబు చెప్పుకుంటున్నాను.
Tedy Pavel odpověděl, když mu návěští dal vládař, aby mluvil: Od mnohých let věda tebe býti soudcím národu tomuto představeným, s lepší myslí k tomu, což se mne dotýče, odpovídati budu,
11 ౧౧ నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు.
Poněvadž ty můžeš to věděti, že není tomu dní více než dvanácte, jakž jsem přišel do Jeruzaléma, abych se modlil.
12 ౧౨ దేవాలయంలోగానీ, సమాజ మందిరాల్లోగానీ, పట్టణంలోగానీ, నేను ఎవరితోనైనా తర్కించడం, లేదా ప్రజల మధ్య అల్లరి రేపడం ఎవరూ చూడలేదు.
A aniž mne nalezli v chrámě s někým se hádajícího, aneb činícího roty v zástupu, ani v školách, ani v městě,
13 ౧౩ వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచలేరు.
Aniž toho prokázati mohou, což na mne nyní žalují.
14 ౧౪ అయితే ఒక సంగతి మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నమ్మి,
Ale totoť před tebou vyznávám, že podlé té cesty, kterouž nazývají kacířstvím, tak sloužím Bohu otců, věře všemu, cožkoli psáno jest v zákoně a v prorocích,
15 ౧౫ నీతిపరులకూ అనీతిపరులకూ పునరుత్థానం కలుగుతుందని వీరు నమ్ముతున్నట్టుగానే నేను కూడా దేవునిలో నమ్మకముంచి, వారు మతశాఖ అని పిలిచిన ఈ మార్గంలోనే నా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను.
Maje naději v Bohu, že bude, jehož i oni čekají, vzkříšení z mrtvých, i spravedlivých i nespravedlivých.
16 ౧౬ ఈ విధంగా నేను దేవుని పట్లా, మనుష్యుల పట్లా ఎప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను.
Sám pak o to pracuji, abych měl svědomí bez úrazu před Bohem i před lidmi vždycky.
17 ౧౭ “కొన్ని సంవత్సరాలైన తరువాత నేను నా సొంత ప్రజలకి దాన ధర్మంగా డబ్బు, కానుకలు ఇవ్వడానికి వచ్చాను.
Po mnohých pak letech přišel jsem, almužny nesa národu svému a oběti.
18 ౧౮ నేను శుద్ధి చేసుకుని వాటిని అప్పగిస్తుండగా వీరు దేవాలయంలో నన్ను చూశారు. నేనేమీ గుంపు కూర్చలేదు, నా వలన అల్లరీ కాలేదు.
Při čemž mne nalezli v chrámě očištěného, ne s zástupem, ani s bouřkou, někteří Židé z Azie,
19 ౧౯ అయితే ఆసియ నుండి వచ్చిన కొందరు యూదులు ఉన్నారు. నామీద వారికేమైన ఉంటే వారే మీ దగ్గరికి వచ్చి నా మీద నేరం మోపి ఉండవలసింది.
Kteříž by měli tuto také před tebou státi a žalovati, měli-li by co proti mně.
20 ౨౦ లేదా, నేను మహాసభలో నిలబడి ఉన్నప్పుడు, ‘మృతుల పునరుత్థానం గురించి నేడు మీ ఎదుట విమర్శ పాలవుతున్నాను’ అని నేను బిగ్గరగా చెప్పిన ఆ ఒక్క మాట విషయమై తప్ప నాలో మరి ఏ నేరమైనా వీరు కనిపెట్టి ఉంటే అది చెప్పవచ్చు.”
Aneb nechať tito sami povědí, nalezli-li na mně jakou nepravost, když jsem stál v radě.
21 ౨౧
Leč to jedno promluvení, že jsem zavolal, stoje mezi nimi: Pro vzkříšení z mrtvých já k soudu potažen jsem dnes od vás.
22 ౨౨ ఫేలిక్సుకు ఈ మార్గం గూర్చి బాగా తెలుసు. అతడు, “సహస్రాధిపతి లూసియస్ వచ్చినప్పుడు నీ సంగతి నేను విచారించి తెలుసుకుంటాను” అని చెప్పి విచారణ నిలిపివేశాడు.
A vyslyšav to Felix, odložil jim, řka: Až bych o té cestě něco místnějšího vyzvěděl, když hejtman Lyziáš sem přijede, posoudím té pře vaší.
23 ౨౩ పౌలుని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారం చేయడానికి అతని బంధువుల్లో ఎవరినీ ఆటంకపరచవద్దని శతాధిపతికి ఆజ్ఞాపించాడు.
I poručil setníkovi, aby Pavla ostříhal, a polehčil mu, a nebránil žádnému z přátel jeho posluhovati jemu aneb navštěvovati ho.
24 ౨౪ కొన్ని రోజుల తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తు యేసులో విశ్వాసం గూర్చి అతడు బోధించగా విన్నాడు.
Po několika pak dnech přišed Felix s Druzillou, manželkou svou, kteráž byla Židovka, zavolal Pavla, a slyšel od něho o víře v Krista.
25 ౨౫ అప్పుడు పౌలు నీతిని గూర్చీ ఆశానిగ్రహం గూర్చీ రాబోయే తీర్పును గూర్చీ ప్రసంగిస్తుండగా ఫేలిక్సు చాలా భయపడి, “ఇప్పటికి వెళ్ళు, నాకు సమయం దొరికినప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.
A když on vypravoval o spravedlnosti a o zdrželivosti a o budoucím soudu, ulekl se Felix, a odpověděl: Nyní odejdi, a v čas příhodný povolám tě.
26 ౨౬ తరువాత పౌలు తనకు ఏమైనా లంచం ఇస్తాడేమోనని ఆశపడి, అతణ్ణి మాటిమాటికీ పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు.
Přitom pak nadál se, že jemu Pavel dá peníze, aby jej propustil, pročež i tím častěji, povolávaje ho, mluvíval s ním.
27 ౨౭ రెండు సంవత్సరాల తరువాత ఫేలిక్సుకు బదులుగా పోర్కియస్ ఫేస్తు గవర్నరుగా వచ్చాడు. అప్పుడు ఫేలిక్సు యూదుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని, పౌలును చెరసాల్లోనే విడిచిపెట్టి వెళ్ళాడు.
Po dvou pak letech měl po sobě náměstka Felix Porcia Festa, a chtěje se zalíbiti Židům Felix, nechal Pavla v vězení.

< అపొస్తలుల కార్యములు 24 >