< Oseas 13 >

1 Cuando Efraím hablaba, todos tenían temor: fue ensalzado en Israel: mas pecó en Baal, y murió.
ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయం కలిగింది. అతడు ఇశ్రాయేలు వారిలో తనను గొప్ప చేసుకున్నాడు. తరువాత బయలు దేవుణ్ణి బట్టి అపరాధియై అతడు నాశనమయ్యాడు.
2 Y ahora añadieron a su pecado, e hicieron para sí vaciadizo de su plata según su entendimiento: ídolos, obra de artífices todo ello, de los cuales ellos mandan a los hombres que sacrifican, que besen los becerros.
ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. అదంతా నిపుణులు చేసే పనే. “వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు.
3 Por tanto serán como la niebla de la mañana, y como el rocío de la madrugada que se pasa: como el tamo que la tempestad lanza de la era, y como el humo que sale por la ventana.
కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా, పెందలకడ ఆరిపోయే ప్రాతఃకాలపు మంచులాగా ఉంటారు. కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టే పొట్టులాగా, పొగ గొట్టంలో గుండా వెళ్ళిపోయే పొగలాగా ఉంటారు.
4 Mas yo soy Jehová tu Dios desde la tierra de Egipto: por tanto no conocerás otro Dios fuera de mí, no otro salvador si no a mí.
మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప నీవు ఏ దేవుడినీ గుర్తించ కూడదు. నేను తప్ప వేరే రక్షకుడు లేడు.
5 Yo te conocí en el desierto, en tierra de sequedades.
మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్నెరిగిన వాణ్ణి నేనే.
6 En sus pastos se hartaron, hartáronse, y ensoberbecióse su corazón, por esta causa se olvidaron de mí.
తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చి పోయారు.
7 Por tanto yo seré para ellos como león, como tigre que asecha cerca del camino.
కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనయ్యాను. చిరుత పులి దారిలో పొంచి ఉన్నట్టు నేను వారిని పట్టుకోవడానికి పొంచి ఉంటాను.
8 Como oso que ha perdido los hijos los encontraré, y les romperé las telas de su corazón; y allí los tragaré como león: bestia del campo los despedazará.
పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను. ఆడసింహం మింగివేసినట్టు వారిని మింగివేస్తాను. క్రూరమృగాల్లాగా వారిని చీల్చివేస్తాను.
9 Echóte a perder, o! Israel, tu idolatría: mas en mí está tu ayuda.
ఇశ్రాయేలూ, నీ మీదికి వచ్చి పడేది నీ నాశనమే. నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివయ్యావు.
10 ¿En dónde está tu rey, para que te guarde con todas tus ciudades? ¿y tus jueces, de los cuales dijiste: Dáme rey, y príncipes?
౧౦నీ రాజు ఏడి? నీ పట్టణాల్లో నీకు సహాయం చేయకుండ నీ రాజు ఏమైపోయాడు? “రాజును అధిపతులను నా మీద నియమించు” అని నీవు మనవి చేశావు గదా?
11 Díte rey en mi furor, y le quité en mi ira.
౧౧కోపంతో నీకు రాజును నియమించాను. క్రోధంతో అతణ్ణి తీసి పారేశాను.
12 Atada está la maldad de Efraím: su pecado está guardado.
౧౨ఎఫ్రాయిము దోషం పోగుపడింది. అతని పాపం పోగుపడింది.
13 Dolores de mujer de parto le vendrán: es un hijo ignorante, que de otra manera no estuviera tanto tiempo en el rompimiento de los hijos.
౧౩ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన కలుగుతుంది. ప్రసవం సమయంలో బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు.
14 De la mano del sepulcro los redimiré, de la muerte los libraré. ¡O muerte! yo seré tu mortandad; y seré tu destrucción, ¡o sepulcro! Arrepentimiento será escondido de mis ojos. (Sheol h7585)
౧౪అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా? మృత్యువు నుండి వారిని రక్షిస్తానా? ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా. పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా. నాకు కనికరం పుట్టదు. (Sheol h7585)
15 Porque él fructificará entre los hermanos: vendrá el solano, viento de Jehová, subiendo de la parte del desierto, y secarse ha su vena, y secarse ha su manadero: él saqueará el tesoro de todas las alhajas de codicia.
౧౫ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా, తూర్పు గాలి వస్తుంది. యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది. అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోతాయి. ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి. అతని బావిలో నీరు ఉండదు. అతని శత్రువులు అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని కొల్లగొడతారు.
16 Samaria será asolada porque se rebeló contra su Dios: caerán a cuchillo: sus niños serán estrellados, y sus preñadas serán abiertas.
౧౬షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక, ప్రజలు కత్తివాత కూలుతారు. వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు. గర్భవతుల కడుపులు చీరేస్తారు.

< Oseas 13 >