< Псалтирь 77 >

1 В конец, о Идифуме, псалом Асафу. Гласом моим ко Господу воззвах, гласом моим к Богу, и внят ми.
ప్రధాన సంగీతకారుని కోసం, యెదూతూను అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన. నేను బిగ్గరగా దేవునికి మొరపెడతాను, నేను దేవుణ్ణి పిలుస్తాను, నా దేవుడు నా మాట వింటాడు.
2 В день скорби моея Бога взысках рукама моима, нощию пред ним, и не прельщен бых: отвержеся утешитися душа моя.
నా కష్ట సమయంలో నేను ప్రభువును వెతికాను. రాత్రంతా నేను నా చేతులెత్తి ప్రార్థించాను, నా ప్రాణం ఓదార్పు పొందడం లేదు.
3 Помянух Бога и возвеселихся, поглумляхся, и малодушствоваше дух мой.
నా వేదనలో నేను దేవుణ్ణి గుర్తు చేసుకున్నాను, నీరసించిపోయి నేను ఆయన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. (సెలా)
4 Предваристе стражбы очи мои: смятохся и не глаголах.
నువ్వు నా కళ్ళు తెరచి ఉంచుతున్నావు. నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను.
5 Помыслих дни первыя, и лета вечная помянух, и поучахся:
గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను,
6 нощию сердцем моим глумляхся, и тужаше дух мой:
ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా నా హృదయంలో ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.
7 еда во веки отринет Господь и не приложит благоволити паки?
ప్రభువు శాశ్వతంగా నన్ను తోసివేస్తాడా? ఆయన ఇంకెన్నటికీ మళ్ళీ నా మీద దయ చూపడా?
8 Или до конца милость Свою отсечет, сконча глаголгол от рода в род?
ఆయన కృప ఎప్పటికీ రాదా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నేరవేరదా?
9 Еда забудет ущедрити Бог? Или удержит во гневе Своем щедроты Своя?
దేవుడు కనికరించడం మరచిపోయాడా? ఆయన కోపం దయకు అడ్డుపడిందా? (సెలా)
10 И рех: ныне начах, сия измена десницы Вышняго.
౧౦ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను.
11 Помянух дела Господня: яко помяну от начала чудеса Твоя,
౧౧అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను.
12 и поучуся во всех делех Твоих, и в начинаниих Твоих поглумлюся.
౧౨నీ పనులన్నిటినీ నేను తలంచుకుంటాను. వాటిని మననం చేసుకుంటాను.
13 Боже, во святем путь Твой: кто Бог велий, яко Бог наш?
౧౩దేవా! నీ మార్గం పవిత్రం. మన గొప్ప దేవునికి సాటి అయిన దేవుడెవరు?
14 Ты еси Бог творяй чудеса: сказал еси в людех силу Твою,
౧౪నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు.
15 избавил еси мышцею Твоею люди Твоя, сыны Иаковли и Иосифовы.
౧౫నీ గొప్ప బలంతో నీ ప్రజలకు-యాకోబు యోసేపుల సంతతికి విజయాన్నిచ్చావు. (సెలా)
16 Видеша Тя воды, Боже, видеша Тя воды и убояшася: смятошася бездны.
౧౬దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి.
17 Множество шума вод: глас даша облацы, ибо стрелы Твоя преходят.
౧౭మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి.
18 Глас грома Твоего в колеси, осветиша молния твоя вселенную: подвижеся и трепетна бысть земля.
౧౮నీ ఉరుముల మోత సుడిగాలిలో మోగింది. మెరుపులు లోకాన్ని వెలిగించాయి. భూమి వణికి కంపించింది.
19 В мори путие Твои, и стези Твоя в водах многих, и следы Твои не познаются.
౧౯సముద్రంలో నీ దారి వెళ్ళింది. ప్రవాహాల్లోగుండా నీ దారి మళ్ళింది. అయితే నీ కాలిముద్రలు కనబడలేదు.
20 Наставил еси яко овцы люди Твоя рукою Моисеовою и Ааронею.
౨౦మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.

< Псалтирь 77 >