< Числа 31 >

1 И рече Господь к Моисею, глаголя:
యెహోవా “మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోండి.
2 отмсти месть сынов Израилевых от Мадианитов, и последи приложишися к людем своим.
ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు” అని మోషేకు చెప్పాడు.
3 И рече Моисей к людем, глаголя: вооружите от вас мужы и ополчитеся пред Господем на Мадиама, отдати отмщение от Господа Мадиаму:
అప్పుడు మోషే “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి పోయి వారికి యెహోవా విధించిన ప్రతిదండన చేయండి.
4 тысящу от племене и тысящу от племене, от всех племен сынов Израилевых, послите ополчитися.
ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుండి వెయ్యిమంది చొప్పున యుద్ధానికి పంపండి” అని ప్రజలతో అన్నాడు.
5 И сочтоша от тысящ Израилевых, по тысящи от племене, дванадесять тысящ вооруженых на брань.
ఆ విధంగా గోత్రానికి వెయ్యి మంది చొప్పున, ఇశ్రాయేలీయుల మొత్తం సైన్యంలో నుండి పన్నెండు వేల మంది యుద్ధ వీరులను సిద్ధం చేశారు.
6 И посла я Моисей тысящу от племене и тысящу от племене с силою их, и Финееса сына Елеазарова сына Аарона жерца: и сосуды святыя, и трубы знаменныя в руках их.
మోషే వారిని, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసుతో పంపించాడు. అతనికి పరిశుద్ధమైన కొన్ని వస్తువులు, యుద్ధంలో ఊదటానికి బాకాలు పంపాడు.
7 И ополчишася на Мадиама, якоже повеле Господь Моисею, и избиша весь мужеск пол:
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపేశారు.
8 и царей Мадиамских убиша вкупе с язвеными их, и Евина и Рокома, и Сура и Ура и ровока, пять царей Мадиамлих: и Валаама сына Веорова убиша мечем с язвеными их:
వారు కాక మిద్యాను రాజులు, ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే ఐదుగుర్ని చంపారు. బెయోరు కొడుకు బిలామును కత్తితో చంపేశారు.
9 и плениша жен Мадиамлих и имения их, и скоты их и вся притяжания их, и силу их плениша:
వారు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని, వారి పశువులు, గొర్రెలు, మేకలు అన్నిటిని, వారి సమస్తాన్ని దోచుకున్నారు.
10 и вся грады их, яже во обитаниих их, и веси их пожгоша огнем,
౧౦వారి పట్టణాలు, కోటలు అన్నిటిని తగలబెట్టారు.
11 и взяша весь плен их и вся корысти их, от человека до скота:
౧౧వారు మనుషులను గాని పశువులను గాని మిద్యానీయుల ఆస్తి అంతటినీ కొల్లగొట్టారు.
12 и приведоша к Моисею и ко Елеазару жерцу и ко всем сыном Израилевым плен и корысти и имение в полк, во аравоф Моавль, иже есть у Иордана при Иерихоне.
౧౨తరువాత వారు దానంతటినీ, చెరపట్టిన వారిని మోయాబు మైదానాల్లో యెరికో దగ్గర యొర్దాను పక్కన విడిది చేసి ఉన్న మోషే, యాజకుడు ఎలియాజరు దగ్గరికి, ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరికి తీసుకు వచ్చారు.
13 И изыде Моисей и Елеазар жрец и вси князи сонма в сретение им вне полка.
౧౩అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు, సమాజ నాయకులంతా విడిది బయటికి వారికి ఎదురు వెళ్ళారు.
14 И разгневася Моисей на надзирателей силы, тысященачалников и стоначалников идущих от ополчения брани.
౧౪అప్పుడు మోషే యుద్ధం నుండి వచ్చిన సహస్రాధిపతులు, శతాధిపతుల పైన కోపపడ్డాడు.
15 И рече им Моисей: вскую жив остависте весь женск пол?
౧౫అతడు వారితో “మీరు మిద్యాను స్త్రీలను ఎందుకు బతకనిచ్చారు?
16 Тыя бо быша сыном Израилевым, по словеси Валаамлю, еже отступити и презрети слово Господне Фогора ради, и бысть язва в сонме Господни:
౧౬బిలాము సలహా ప్రకారం పెయోరు విషయంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఎదురు తిరిగేలా చేసింది వారే కదా! అందుచేత యెహోవా మన సమాజంలో తెగులు పుట్టించాడు కదా.
17 и ныне избийте всяк мужеск пол во всяком возрасте, и всяку жену, яже позна ложе мужеско, избийте:
౧౭కాబట్టి మీరు మగ పిల్లలందరినీ మగవారితో సంబంధం ఉన్న ప్రతి స్త్రీనీ చంపండి.
18 и всяк возраст женск, яже не познаша ложа мужеска, живых оставите я:
౧౮మగవారితో సంబంధం లేని ప్రతి ఆడపిల్లను మీ కోసం బతకనీయండి.
19 и вы станите вне полка седмь дний: всяк убивый душу и прикоснувыйся убиеному да очистится в третий день и в день седмый, вы и плен ваш:
౧౯మీరు ఏడు రోజులు విడిది బయట ఉండాలి. మీలో మనిషిని చంపిన ప్రతివాడూ, చనిపోయిన వారిని తాకిన ప్రతివాడూ, మీరు, మీరు చెరగా పట్టుకొచ్చిన వారు, మూడో రోజున, ఏడో రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి.
20 и всяку одежду, и всяк сосуд кожан, и всяко соделаное от козличины, и всяк сосуд древян очистите.
౨౦మీరు మీ వస్త్రాలను, చర్మంతో, మేక వెండ్రుకలతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను అన్నిటినీ శుద్ధి చేయాలి.”
21 И рече Елеазар жрец к мужем силы приходящым от ополчения ратнаго: сие оправдание закона, еже заповеда Господь Моисею:
౨౧అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధానికి వెళ్ళిన సైనికులతో “యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
22 кроме сребра и злата, и меди и железа, и касситера и олова,
౨౨‘అగ్నితో చెడిపోని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, వీటితో చేసిన వస్తువులన్నిటినీ
23 всяка вещь, яже пройдет сквозе огнь, и (огнем) очистится, но и водою очищения очистится: и вся, елика аще не пройдут сквозе огнь, да пройдут сквозе воду:
౨౩మంటల్లో వేసి తీయడం ద్వారా శుద్ధి చేయాలి. వాటిని పాపపరిహార జలంతో కూడా శుద్ధి చేయాలి. అగ్నితో చెడిపోయే ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయాలి.
24 и исперите ризы вашя в день седмый, и очиститеся: и по сих внидете в полк.
౨౪ఏడో రోజు మీరు మీ బట్టలు ఉతుక్కొని శుద్ధి అయిన తరవాత విడిదిలోకి రావచ్చు.’” అన్నాడు.
25 И рече Господь к Моисею, глаголя:
౨౫యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు,
26 возмите сочисление корыстей плена от человека до скота, ты и Елеазар жрец и князи отечеств сонма,
౨౬“నువ్వూ యాజకుడు ఎలియాజరు సమాజంలోని పూర్వీకుల వంశాల నాయకులు మీరు చెరగా పట్టుకున్న మనుషులను, పశువులను లెక్కబెట్టి రెండు భాగాలు చేయండి.
27 и разделите корысти между воины ходившими на брань и между всем сонмом,
౨౭సైన్యంగా యుద్ధానికి వెళ్ళిన వారికి సగం, మిగిలిన సర్వసమాజానికి సగం పంచిపెట్టండి.
28 и отлучите дань Господу от людий военных ходивших на брань, едину душу от пяти сот, от человек и от скотов, и от волов и от овец и от ослят,
౨౮యుద్ధానికి వెళ్ళిన సైనికులపై యెహోవా కోసం పన్ను వేసి, ఆ మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగభాగంలో నుండి తీసుకుని
29 и от половины их да возмете, и даси Елеазару жерцу начатки Господни:
౨౯యెహోవాకు అర్పణగా యాజకుడు ఎలియాజరుకు ఇవ్వాలి.
30 и от половины сынов Израилевых да возмеши едино от пятидесяти человек, и от волов и от овец, и от ослят и от всех скотов, и даси я левитом, иже стрегут стражбы в скинии Господни.
౩౦అదే విధంగా మిగిలిన ఇశ్రాయేలీయుల సగంలో నుండి మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో, అన్ని రకాల జంతువుల్లోనుండి 50 కి ఒకటి చొప్పున తీసుకుని యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇవ్వాలి.”
31 И сотвори Моисей и Елеазар жрец, якоже повеле Господь Моисею.
౩౧యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా మోషే, యాజకుడు ఎలియాజరు చేశారు.
32 И бысть множество плена, егоже плениша мужи воинстии, от овец шесть сот седмьдесят пять тысящ,
౩౨ఆ సైనికులు దోచుకున్నది గాక మిగిలింది
33 и волов седмьдесят две тысящы,
౩౩6, 75,000 గొర్రెలు లేక మేకలు,
34 и ослов шестьдесят едина тысяща,
౩౪72,000 పశువులు, 61,000 గాడిదలు,
35 и душ человеческих от женска полу, яже не познаша ложа мужеска, всех душ тридесять две тысящы:
౩౫32,000 మంది మగవారితో సంబంధం లేని స్త్రీలు ఉన్నారు.
36 и бысть половина часть ходивших на брань, от числа овец триста тридесять седмь тысящ и пять сот:
౩౬అందులో సగం యుద్ధానికి వెళ్ళిన వారి వంతు, గొర్రె మేకలు 3, 37, 500. వాటిలో యెహోవాకు చెందిన పన్ను 675. పశువుల్లో సగం 36,000.
37 и бысть дань Господу от овец шесть сот седмьдесят пять:
౩౭వాటిలో యెహోవా పన్ను 72.
38 и волов тридесять шесть тысящ, и дань Господу седмьдесят и два:
౩౮గాడిదల్లో సగం 30, 500.
39 и ослов тридесять тысящ пять сот, и дань Господу шестьдесят един:
౩౯వాటిలో యెహోవా పన్ను 61.
40 и душ человеческих шестьнадесять тысящ, и дань от сих Господу тридесять две души.
౪౦మనుషుల్లో సగం 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32 మంది.
41 И даде Моисей дань Господу, участие Божие Елеазару жерцу, якоже повеле Господь Моисею.
౪౧యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా అతడు యెహోవాకు చెందాల్సిన అర్పణను యాజకుడు ఎలియాజరుకు ఇచ్చాడు.
42 От половины сынов Израилевых, ихже раздели Моисей от мужей военных:
౪౨మోషే సైనికుల నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగంలో నుండి లేవీయులకు ఇచ్చాడు.
43 и бысть половина от сонма, от овец триста и тридесять седмь тысящ и пять сот:
౪౩3, 37, 500 గొర్రె మేకలు,
44 и волов тридесять шесть тысящ:
౪౪36,000 పశువులు, 30, 500 గాడిదలు,
45 ослов тридесять тысящ и пять сот:
౪౫16,000 మంది మనుషులు సమాజానికి రావలసిన సగం.
46 и человечих душ шестьнадесять тысящ:
౪౬మోషే ఆ సగం నుండి మనుషుల్లో, జంతువుల్లో,
47 и взя Моисей от половины сынов Израилевых, едино от пятидесяти, от человек и от скотов, и даде я левитом стрегущым стражбы скинии Господни, якоже повеле Господь Моисею.
౪౭50 కి ఒకటి చొప్పున తీసి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన విధంగా యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇచ్చాడు.
48 И приидоша к Моисею вси поставленнии над тысящами силы, тысященачалники и стоначалники,
౪౮అప్పుడు సైన్యంలో వేలమందికి, వందల మందికి అధిపతులు మోషే దగ్గరికి వచ్చి
49 и рекоша к Моисею: отроцы твои взяша сочтение от мужей воинских, иже суть у нас, и никтоже погибе от них:
౪౯“నీ సేవకులైన మేము మా కింద ఉన్న సైనికులందరినీ లెక్కపెట్టాం. మొత్తానికి ఒక్కడు కూడా తగ్గలేదు.
50 и принесохом дар Господу, муж еже обрете, сосуд злат и обручие, и гривну и перстень, и усерязи и чепь златую, умолити о нас пред Господем.
౫౦కాబట్టి యెహోవా సన్నిధిలో మా కోసం ప్రాయశ్చిత్తం కలిగేలా మాలో ప్రతి ఒక్కడికి దొరికిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు యెహోవాకు అర్పణ తెచ్చాం” అని చెప్పారు.
51 И взя Моисей и Елеазар жрец злато от них, всяк сосуд соделан.
౫౧మోషే, యాజకుడు ఎలియాజరు ఆ బంగారు నగలను వారి నుండి తీసుకున్నారు.
52 И бысть всего злата участие, еже отлучися Господу, шестьнадесять тысящ и седмь сот и пятьдесят сикль от тысященачалников и от стоначалников.
౫౨వేలమందికి, వందల మందికి అధిపతులైన నాయకులు యెహోవాకు అర్పించిన బంగారం మొత్తం 16, 750 తులాలు.
53 И мужи воинстии плениша кийждо себе.
౫౩ఆ సైనికుల్లో ప్రతివాడూ తన మట్టుకు తాను దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు.
54 И взяша Моисей и Елеазар жрец злато от тысященачалников и от стоначалников и внесоша е в скинию свидения, в память сынов Израилевых пред Господем.
౫౪అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు వేలమందికి, వందల మందికి అధిపతుల దగ్గర తీసుకున్న బంగారాన్ని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంలో ఉంచారు.

< Числа 31 >