< Књига о Јову 20 >

1 А Софар Намаћанин одговори и рече:
అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు చెప్పాడు,
2 Зато ме мисли моје нагоне да одговорим, и зато хитим.
నువ్వు అలా చెప్పినందువల్ల నాలో కలిగిన ఆత్రుత నీకు తగిన జవాబు చెప్పాలని తొందర చేస్తున్నది.
3 Чуо сам укор који ме срамоти, али ће дух из разума мог одговорити за ме.
నన్ను అవమానపరిచే నింద నీ నుండి వినవలసి వచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురిగొల్పుతున్నది.
4 Не знаш ли да је тако од како је века, од како је постављен човек на земљи.
ఆదిలో మనుషులు భూమి మీద నివసించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా?
5 Да је слава безбожних за мало и радост лицемерова за час?
దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వితం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది.
6 Да би му висина допрла до неба, и глава се његова дотакла облака,
వాళ్ళ గొప్పదనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి, మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకుని తిరగవచ్చు.
7 Нестаће га за свагда као кала његовог; и који га видеше рећи ће: Куда се деде?
అయితే వాళ్ళ మలం లాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు “వాళ్ళంతా ఏమయ్యారు?” అని అడుగుతారు.
8 Као сан одлетеће, и неће се наћи, и ишчезнуће као ноћна утвара.
కల లాగా వాళ్ళు కరిగి పోయి మళ్ళీ కనబడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదరిపోతారు.
9 Око које га је гледало неће више, нити ће га више видети место његово.
వాళ్ళను చూసిన కళ్ళు ఇకపై వాళ్ళను చూడవు. అతని నివాసం అతన్నిక చూడదు.
10 Синови његови умиљаваће се сиромасима и руке ће његове враћати шта је отео.
౧౦వాళ్ళ సంతతి వాళ్ళు కనికరించమని దరిద్రులను వేడుకుంటారు. వారి చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చివేస్తారు.
11 Кости ће његове бити пуне греха младости његове, и они ће лежати с њим у праху.
౧౧వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్ళతో కలసి మట్టిలో నిద్రిస్తుంది.
12 Ако му је слатка у устима злоћа и крије је под језиком својим,
౧౨చెడుతనం వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. వాళ్ళ నాలుకల కింద దాన్ని దాచి ఉంచారు.
13 Чува је и не пушта је, него је задржава у грлу свом,
౧౩దాన్ని జాగ్రత్త చేసుకుని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు.
14 Ипак ће се јело његово претворити у цревима његовим, постаће у њему јед аспидин.
౧౪అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది.
15 Благо што је прождрао избљуваће, из трбуха његова истераће га Бог.
౧౫వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడే వాళ్ళ కడుపులోనుండి కక్కివేసేలా చేస్తాడు.
16 Јед ће аспидин сисати, убиће га језик гујињи.
౧౬వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కోరలు వాళ్ళను చంపివేస్తాయి.
17 Неће видети потока ни река којима тече мед и масло.
౧౭తేనెధారలు, వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు.
18 Вратиће муку, а неће је појести; према благу биће промена, и неће се радовати.
౧౮వాళ్ళు సంపాదించిన ఆస్తి మేరకు కష్టాలు పెరుగుతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా అనుభవించకుండానే తిరిగి అప్పగిస్తారు.
19 Јер је тлачио и остављао убоге, куће је отимао и није зидао.
౧౯వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు.
20 Јер није никада осетио мира у трбуху свом, ни шта му је најмилије неће сачувати.
౨౦వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒక దానితోనైనా తమను తాము కాపాడుకోలేరు.
21 Ништа му неће остати од хране његове. Зато не може добро његово трајати.
౨౧వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అందువల్ల వాళ్ళ క్షేమ స్థితి నిలబడదు.
22 Кад се испуни изобиље његово, тада ће бити у невољи; све руке невољних удариће на њ.
౨౨వాళ్ళు మితిలేని సంపాదన కలిగి ఉన్న రోజుల్లో ఇబ్బందులకు గురౌతారు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళందరూ వాళ్ళపై దాడి చేస్తారు.
23 Кад би напунио трбух свој, послаће на њ Бог јарост гнева свог, и пустиће је као дажд на њега и на јело његово.
౨౩వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది.
24 Кад стане бежати од оружја гвозденог, прострелиће га лук бронзани.
౨౪ఇనప ఆయుధం నుండి తప్పించుకొనేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహాల్లోకి దూసుకుపోతుంది.
25 Стрела пуштена проћи ће кроз тело његово, и светло гвожђе изаћи ће из жучи његове; кад пође, обузеће га страхоте.
౨౫ఆ బాణం వాళ్ళ దేహాలను చీల్చివేసి శరీరం నుండి బయటకు వస్తుంది. దాన్ని బయటకు తీసినప్పుడు కాలేయం తుత్తునియలు అవుతుంది. మరణభయం వాళ్ళ మీదికి వస్తుంది.
26 Све ће таме бити сакривене у тајним местима његовим; прождреће га огањ нераспирен, и ко остане у шатору његовом зло ће му бити.
౨౬వాళ్ళ ధన సంపదలు చీకటిమయం అవుతాయి. ఎవ్వరూ రాజేయకుండానే అగ్ని లేచి వాళ్ళను మింగివేస్తుంది. వాళ్ళ గుడారాల్లో మిగిలినదాన్ని అది కాల్చివేస్తుంది.
27 Откриће небеса безакоње његово, и земља ће устати на њ.
౨౭వాళ్ళ దోషాలకు ఆకాశం సాక్షిగా నిలబడుతుంది. భూమి వారిపై తిరగబడుతుంది.
28 Отићи ће летина дома његовог, расточиће се у дан гнева његовог.
౨౮వాళ్ళ ఇళ్ళకు చేరిన సంపాదన కనబడకుండా పోతుంది. దేవుని ఉగ్రత దినాన అదంతా నాశనమౌతుంది.
29 То је део од Бога човеку безбожном и наследство од Бога за беседу његову.
౨౯దేవుని దగ్గర నుంచి దుష్టులైన మనుషులకు ప్రాప్తించేది ఇదే. దేవుడు వాళ్ళకు నియమించే వారసత్వం ఇదే.

< Књига о Јову 20 >