< లూకః 1 >

1 ప్రథమతో యే సాక్షిణో వాక్యప్రచారకాశ్చాసన్ తేఽస్మాకం మధ్యే యద్యత్ సప్రమాణం వాక్యమర్పయన్తి స్మ
ఘనులైన తియొఫిలా,
2 తదనుసారతోఽన్యేపి బహవస్తద్వృత్తాన్తం రచయితుం ప్రవృత్తాః|
మొదటి నుంచీ కళ్ళారా చూసిన వాక్య సేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలా మంది పూనుకున్నారు.
3 అతఏవ హే మహామహిమథియఫిల్ త్వం యా యాః కథా అశిక్ష్యథాస్తాసాం దృఢప్రమాణాని యథా ప్రాప్నోషి
కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు కచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటిని మొదటి నుండీ పరిశోధించి కూలంకషంగా తెలుసుకున్న నేను నీ కోసం
4 తదర్థం ప్రథమమారభ్య తాని సర్వ్వాణి జ్ఞాత్వాహమపి అనుక్రమాత్ సర్వ్వవృత్తాన్తాన్ తుభ్యం లేఖితుం మతిమకార్షమ్|
వాటన్నిటినీ క్రమపద్ధతిలో రాయడం మంచిదని నాకు అనిపించింది.
5 యిహూదాదేశీయహేరోద్నామకే రాజత్వం కుర్వ్వతి అబీయయాజకస్య పర్య్యాయాధికారీ సిఖరియనామక ఏకో యాజకో హారోణవంశోద్భవా ఇలీశేవాఖ్యా
యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు.
6 తస్య జాయా ద్వావిమౌ నిర్దోషౌ ప్రభోః సర్వ్వాజ్ఞా వ్యవస్థాశ్చ సంమన్య ఈశ్వరదృష్టౌ ధార్మ్మికావాస్తామ్|
వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు.
7 తయోః సన్తాన ఏకోపి నాసీత్, యత ఇలీశేవా బన్ధ్యా తౌ ద్వావేవ వృద్ధావభవతామ్|
అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.
8 యదా స్వపర్య్యానుక్రమేణ సిఖరియ ఈశ్వాస్య సమక్షం యాజకీయం కర్మ్మ కరోతి
జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా
9 తదా యజ్ఞస్య దినపరిపాయ్యా పరమేశ్వరస్య మన్దిరే ప్రవేశకాలే ధూపజ్వాలనం కర్మ్మ తస్య కరణీయమాసీత్|
యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది.
10 తద్ధూపజ్వాలనకాలే లోకనివహే ప్రార్థనాం కర్తుం బహిస్తిష్ఠతి
౧౦ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు.
11 సతి సిఖరియో యస్యాం వేద్యాం ధూపం జ్వాలయతి తద్దక్షిణపార్శ్వే పరమేశ్వరస్య దూత ఏక ఉపస్థితో దర్శనం దదౌ|
౧౧ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు.
12 తం దృష్ట్వా సిఖరియ ఉద్వివిజే శశఙ్కే చ|
౧౨జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు.
13 తదా స దూతస్తం బభాషే హే సిఖరియ మా భైస్తవ ప్రార్థనా గ్రాహ్యా జాతా తవ భార్య్యా ఇలీశేవా పుత్రం ప్రసోష్యతే తస్య నామ యోహన్ ఇతి కరిష్యసి|
౧౩అప్పుడా దూత అతనితో, “జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు.
14 కిఞ్చ త్వం సానన్దః సహర్షశ్చ భవిష్యసి తస్య జన్మని బహవ ఆనన్దిష్యన్తి చ|
౧౪అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది. అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు.
15 యతో హేతోః స పరమేశ్వరస్య గోచరే మహాన్ భవిష్యతి తథా ద్రాక్షారసం సురాం వా కిమపి న పాస్యతి, అపరం జన్మారభ్య పవిత్రేణాత్మనా పరిపూర్ణః
౧౫అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు.
16 సన్ ఇస్రాయేల్వంశీయాన్ అనేకాన్ ప్రభోః పరమేశ్వరస్య మార్గమానేష్యతి|
౧౬ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు.
17 సన్తానాన్ ప్రతి పితృణాం మనాంసి ధర్మ్మజ్ఞానం ప్రత్యనాజ్ఞాగ్రాహిణశ్చ పరావర్త్తయితుం, ప్రభోః పరమేశ్వరస్య సేవార్థమ్ ఏకాం సజ్జితజాతిం విధాతుఞ్చ స ఏలియరూపాత్మశక్తిప్రాప్తస్తస్యాగ్రే గమిష్యతి|
౧౭తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్ళించి, అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు. తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు” అన్నాడు.
18 తదా సిఖరియో దూతమవాదీత్ కథమేతద్ వేత్స్యామి? యతోహం వృద్ధో మమ భార్య్యా చ వృద్ధా|
౧౮దేవదూతతో జెకర్యా, “ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు” అన్నాడు
19 తతో దూతః ప్రత్యువాచ పశ్యేశ్వరస్య సాక్షాద్వర్త్తీ జిబ్రాయేల్నామా దూతోహం త్వయా సహ కథాం గదితుం తుభ్యమిమాం శుభవార్త్తాం దాతుఞ్చ ప్రేషితః|
౧౯దూత, “నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు.
20 కిన్తు మదీయం వాక్యం కాలే ఫలిష్యతి తత్ త్వయా న ప్రతీతమ్ అతః కారణాద్ యావదేవ తాని న సేత్స్యన్తి తావత్ త్వం వక్తుంమశక్తో మూకో భవ|
౨౦నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు” అని అతనితో అన్నాడు.
21 తదానీం యే యే లోకాః సిఖరియమపైక్షన్త తే మధ్యేమన్దిరం తస్య బహువిలమ్బాద్ ఆశ్చర్య్యం మేనిరే|
౨౧ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు.
22 స బహిరాగతో యదా కిమపి వాక్యం వక్తుమశక్తః సఙ్కేతం కృత్వా నిఃశబ్దస్తస్యౌ తదా మధ్యేమన్దిరం కస్యచిద్ దర్శనం తేన ప్రాప్తమ్ ఇతి సర్వ్వే బుబుధిరే|
౨౨అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.
23 అనన్తరం తస్య సేవనపర్య్యాయే సమ్పూర్ణే సతి స నిజగేహం జగామ|
౨౩అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరవాత ఇంటికి వెళ్ళి పోయాడు.
24 కతిపయదినేషు గతేషు తస్య భార్య్యా ఇలీశేవా గర్బ్భవతీ బభూవ
౨౪ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు.
25 పశ్చాత్ సా పఞ్చమాసాన్ సంగోప్యాకథయత్ లోకానాం సమక్షం మమాపమానం ఖణ్డయితుం పరమేశ్వరో మయి దృష్టిం పాతయిత్వా కర్మ్మేదృశం కృతవాన్|
౨౫ఆమె, “దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు” అనుకుంది.
26 అపరఞ్చ తస్యా గర్బ్భస్య షష్ఠే మాసే జాతే గాలీల్ప్రదేశీయనాసరత్పురే
౨౬ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో
27 దాయూదో వంశీయాయ యూషఫ్నామ్నే పురుషాయ యా మరియమ్నామకుమారీ వాగ్దత్తాసీత్ తస్యాః సమీపం జిబ్రాయేల్ దూత ఈశ్వరేణ ప్రహితః|
౨౭దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ.
28 స గత్వా జగాద హే ఈశ్వరానుగృహీతకన్యే తవ శుభం భూయాత్ ప్రభుః పరమేశ్వరస్తవ సహాయోస్తి నారీణాం మధ్యే త్వమేవ ధన్యా|
౨౮ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, “అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు” అని పలికాడు.
29 తదానీం సా తం దృష్ట్వా తస్య వాక్యత ఉద్విజ్య కీదృశం భాషణమిదమ్ ఇతి మనసా చిన్తయామాస|
౨౯ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా,
30 తతో దూతోఽవదత్ హే మరియమ్ భయం మాకార్షీః, త్వయి పరమేశ్వరస్యానుగ్రహోస్తి|
౩౦దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది.
31 పశ్య త్వం గర్బ్భం ధృత్వా పుత్రం ప్రసోష్యసే తస్య నామ యీశురితి కరిష్యసి|
౩౧ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
32 స మహాన్ భవిష్యతి తథా సర్వ్వేభ్యః శ్రేష్ఠస్య పుత్ర ఇతి ఖ్యాస్యతి; అపరం ప్రభుః పరమేశ్వరస్తస్య పితుర్దాయూదః సింహాసనం తస్మై దాస్యతి;
౩౨ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.
33 తథా స యాకూబో వంశోపరి సర్వ్వదా రాజత్వం కరిష్యతి, తస్య రాజత్వస్యాన్తో న భవిష్యతి| (aiōn g165)
౩౩ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు. (aiōn g165)
34 తదా మరియమ్ తం దూతం బభాషే నాహం పురుషసఙ్గం కరోమి తర్హి కథమేతత్ సమ్భవిష్యతి?
౩౪మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది.
35 తతో దూతోఽకథయత్ పవిత్ర ఆత్మా త్వామాశ్రాయిష్యతి తథా సర్వ్వశ్రేష్ఠస్య శక్తిస్తవోపరి ఛాయాం కరిష్యతి తతో హేతోస్తవ గర్బ్భాద్ యః పవిత్రబాలకో జనిష్యతే స ఈశ్వరపుత్ర ఇతి ఖ్యాతిం ప్రాప్స్యతి|
౩౫ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.
36 అపరఞ్చ పశ్య తవ జ్ఞాతిరిలీశేవా యాం సర్వ్వే బన్ధ్యామవదన్ ఇదానీం సా వార్ద్ధక్యే సన్తానమేకం గర్బ్భేఽధారయత్ తస్య షష్ఠమాసోభూత్|
౩౬పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల.
37 కిమపి కర్మ్మ నాసాధ్యమ్ ఈశ్వరస్య|
౩౭దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.
38 తదా మరియమ్ జగాద, పశ్య ప్రభేరహం దాసీ మహ్యం తవ వాక్యానుసారేణ సర్వ్వమేతద్ ఘటతామ్; అననతరం దూతస్తస్యాః సమీపాత్ ప్రతస్థే|
౩౮అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.
39 అథ కతిపయదినాత్ పరం మరియమ్ తస్మాత్ పర్వ్వతమయప్రదేశీయయిహూదాయా నగరమేకం శీఘ్రం గత్వా
౩౯ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది.
40 సిఖరియయాజకస్య గృహం ప్రవిశ్య తస్య జాయామ్ ఇలీశేవాం సమ్బోధ్యావదత్|
౪౦
41 తతో మరియమః సమ్బోధనవాక్యే ఇలీశేవాయాః కర్ణయోః ప్రవిష్టమాత్రే సతి తస్యా గర్బ్భస్థబాలకో ననర్త్త| తత ఇలీశేవా పవిత్రేణాత్మనా పరిపూర్ణా సతీ
౪౧ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది.
42 ప్రోచ్చైర్గదితుమారేభే, యోషితాం మధ్యే త్వమేవ ధన్యా, తవ గర్బ్భస్థః శిశుశ్చ ధన్యః|
౪౨“స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది.
43 త్వం ప్రభోర్మాతా, మమ నివేశనే త్వయా చరణావర్పితౌ, మమాద్య సౌభాగ్యమేతత్|
౪౩నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!
44 పశ్య తవ వాక్యే మమ కర్ణయోః ప్రవిష్టమాత్రే సతి మమోదరస్థః శిశురానన్దాన్ ననర్త్త|
౪౪నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు.
45 యా స్త్రీ వ్యశ్వసీత్ సా ధన్యా, యతో హేతోస్తాం ప్రతి పరమేశ్వరోక్తం వాక్యం సర్వ్వం సిద్ధం భవిష్యతి|
౪౫ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు” అంది.
46 తదానీం మరియమ్ జగాద| ధన్యవాదం పరేశస్య కరోతి మామకం మనః|
౪౬అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.
47 మమాత్మా తారకేశే చ సముల్లాసం ప్రగచ్ఛతి|
౪౭ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.
48 అకరోత్ స ప్రభు ర్దుష్టిం స్వదాస్యా దుర్గతిం ప్రతి| పశ్యాద్యారభ్య మాం ధన్యాం వక్ష్యన్తి పురుషాః సదా|
౪౮నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.
49 యః సర్వ్వశక్తిమాన్ యస్య నామాపి చ పవిత్రకం| స ఏవ సుమహత్కర్మ్మ కృతవాన్ మన్నిమిత్తకం|
౪౯
50 యే బిభ్యతి జనాస్తస్మాత్ తేషాం సన్తానపంక్తిషు| అనుకమ్పా తదీయా చ సర్వ్వదైవ సుతిష్ఠతి|
౫౦ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది.
51 స్వబాహుబలతస్తేన ప్రాకాశ్యత పరాక్రమః| మనఃకుమన్త్రణాసార్ద్ధం వికీర్య్యన్తేఽభిమానినః|
౫౧ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు.
52 సింహాసనగతాల్లోకాన్ బలినశ్చావరోహ్య సః| పదేషూచ్చేషు లోకాంస్తు క్షుద్రాన్ సంస్థాపయత్యపి|
౫౨బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు
53 క్షుధితాన్ మానవాన్ ద్రవ్యైరుత్తమైః పరితర్ప్య సః| సకలాన్ ధనినో లోకాన్ విసృజేద్ రిక్తహస్తకాన్|
౫౩ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.
54 ఇబ్రాహీమి చ తద్వంశే యా దయాస్తి సదైవ తాం| స్మృత్వా పురా పితృణాం నో యథా సాక్షాత్ ప్రతిశ్రుతం| (aiōn g165)
౫౪
55 ఇస్రాయేల్సేవకస్తేన తథోపక్రియతే స్వయం||
౫౫అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి, వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.” (aiōn g165)
56 అనన్తరం మరియమ్ ప్రాయేణ మాసత్రయమ్ ఇలీశేవయా సహోషిత్వా వ్యాఘుయ్య నిజనివేశనం యయౌ|
౫౬మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది.
57 తదనన్తరమ్ ఇలీశేవాయాః ప్రసవకాల ఉపస్థితే సతి సా పుత్రం ప్రాసోష్ట|
౫౭ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది.
58 తతః పరమేశ్వరస్తస్యాం మహానుగ్రహం కృతవాన్ ఏతత్ శ్రుత్వా సమీపవాసినః కుటుమ్బాశ్చాగత్య తయా సహ ముముదిరే|
౫౮అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు.
59 తథాష్టమే దినే తే బాలకస్య త్వచం ఛేత్తుమ్ ఏత్య తస్య పితృనామానురూపం తన్నామ సిఖరియ ఇతి కర్త్తుమీషుః|
౫౯వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా
60 కిన్తు తస్య మాతాకథయత్ తన్న, నామాస్య యోహన్ ఇతి కర్త్తవ్యమ్|
౬౦తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది.
61 తదా తే వ్యాహరన్ తవ వంశమధ్యే నామేదృశం కస్యాపి నాస్తి|
౬౧అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని,
62 తతః పరం తస్య పితరం సిఖరియం ప్రతి సఙ్కేత్య పప్రచ్ఛుః శిశోః కిం నామ కారిష్యతే?
౬౨“వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు.
63 తతః స ఫలకమేకం యాచిత్వా లిలేఖ తస్య నామ యోహన్ భవిష్యతి| తస్మాత్ సర్వ్వే ఆశ్చర్య్యం మేనిరే|
౬౩అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు.
64 తత్క్షణం సిఖరియస్య జిహ్వాజాడ్యేఽపగతే స ముఖం వ్యాదాయ స్పష్టవర్ణముచ్చార్య్య ఈశ్వరస్య గుణానువాదం చకార|
౬౪వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు.
65 తస్మాచ్చతుర్దిక్స్థాః సమీపవాసిలోకా భీతా ఏవమేతాః సర్వ్వాః కథా యిహూదాయాః పర్వ్వతమయప్రదేశస్య సర్వ్వత్ర ప్రచారితాః|
౬౫అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు.
66 తస్మాత్ శ్రోతారో మనఃసు స్థాపయిత్వా కథయామ్బభూవుః కీదృశోయం బాలో భవిష్యతి? అథ పరమేశ్వరస్తస్య సహాయోభూత్|
౬౬జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు.
67 తదా యోహనః పితా సిఖరియః పవిత్రేణాత్మనా పరిపూర్ణః సన్ ఏతాదృశం భవిష్యద్వాక్యం కథయామాస|
౬౭అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు,
68 ఇస్రాయేలః ప్రభు ర్యస్తు స ధన్యః పరమేశ్వరః| అనుగృహ్య నిజాల్లోకాన్ స ఏవ పరిమోచయేత్|
౬౮“ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.
69 విపక్షజనహస్తేభ్యో యథా మోచ్యామహే వయం| యావజ్జీవఞ్చ ధర్మ్మేణ సారల్యేన చ నిర్భయాః|
౬౯తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.
70 సేవామహై తమేవైకమ్ ఏతత్కారణమేవ చ| స్వకీయం సుపవిత్రఞ్చ సంస్మృత్య నియమం సదా|
౭౦మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు. దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు. ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను, అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు. (aiōn g165)
71 కృపయా పురుషాన్ పూర్వ్వాన్ నికషార్థాత్తు నః పితుః| ఇబ్రాహీమః సమీపే యం శపథం కృతవాన్ పురా|
౭౧
72 తమేవ సఫలం కర్త్తం తథా శత్రుగణస్య చ| ఋతీయాకారిణశ్చైవ కరేభ్యో రక్షణాయ నః|
౭౨
73 సృష్టేః ప్రథమతః స్వీయైః పవిత్రై ర్భావివాదిభిః| (aiōn g165)
౭౩
74 యథోక్తవాన్ తథా స్వస్య దాయూదః సేవకస్య తు|
౭౪మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.
75 వంశే త్రాతారమేకం స సముత్పాదితవాన్ స్వయమ్|
౭౫
76 అతో హే బాలక త్వన్తు సర్వ్వేభ్యః శ్రేష్ఠ ఏవ యః| తస్యైవ భావివాదీతి ప్రవిఖ్యాతో భవిష్యసి| అస్మాకం చరణాన్ క్షేమే మార్గే చాలయితుం సదా| ఏవం ధ్వాన్తేఽర్థతో మృత్యోశ్ఛాయాయాం యే తు మానవాః|
౭౬ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.
77 ఉపవిష్టాస్తు తానేవ ప్రకాశయితుమేవ హి| కృత్వా మహానుకమ్పాం హి యామేవ పరమేశ్వరః|
౭౭
78 ఊర్ద్వ్వాత్ సూర్య్యముదాయ్యైవాస్మభ్యం ప్రాదాత్తు దర్శనం| తయానుకమ్పయా స్వస్య లోకానాం పాపమోచనే|
౭౮
79 పరిత్రాణస్య తేభ్యో హి జ్ఞానవిశ్రాణనాయ చ| ప్రభో ర్మార్గం పరిష్కర్త్తుం తస్యాగ్రాయీ భవిష్యసి||
౭౯మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది. ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.”
80 అథ బాలకః శరీరేణ బుద్ధ్యా చ వర్ద్ధితుమారేభే; అపరఞ్చ స ఇస్రాయేలో వంశీయలోకానాం సమీపే యావన్న ప్రకటీభూతస్తాస్తావత్ ప్రాన్తరే న్యవసత్|
౮౦ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.

< లూకః 1 >